Table of Contents
Little millet In Telugu ?తెలుగులో
Little millets ని తెలుగులో ‘సామలు‘ అంటారు. మిల్లెట్స్ ని సాధారణంగా సిరిధాన్యాలు మరియు చిరుధాన్యాలు గా విభజిస్తారు. Little Millets సిరిధాన్యాలలో ఒకటి.
సిరి ధాన్యాలలో, అండు కొర్రలు, సామలు, ఊదలు, ఫోనియో వంటి ధాన్యాలు ఉంటాయి.
Little millet plants: సామలను ఎక్కడ పండిస్తారు?
లిటిల్ మిల్లెట్ కు చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. ఇది ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండుతుంది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉంటుంది.
ఈ ధాన్యాన్ని పండించడం కోసం మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్ లేదా సీడ్స్ షాపులకు వెళ్లవచ్చు. ఆన్‌లైన్ లో కూడా ఇలాంటి సీడ్స్ దొరుకుతాయి. అలాగే స్థానిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా కొనుక్కోవచ్చు.
Is Little Millet good for health?
లిటిల్ మిల్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.
Little Millet Uses?
- లిటిల్ మిల్లెట్ల్ లో ఉన్న పీచు పదార్థం(Fiber) తగ్గిస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే మలబద్దక సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది. మలబద్ధకం తగ్గితే మన శరీరంలో చాలా వ్యాధులు రాకుండా అధిగమించవచ్చు.
- Little MIllet హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంకా బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ లాంటి తీవ్రమైన వ్యాధులు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
- వీటిలో ఫైబర్ ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అందువల్ల డయాబెటిస్ పేషెంట్స్ కి ఇది ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు ఇది బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. నియాసిన్ గ్లూకోస్ ని తగ్గిస్తుంది.
- సామల్లో ఉండే మెగ్నీషియం మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- వీటిలో ఉండే ఫాస్ఫరస్ బరువు పెరగకుండా చూస్తుంది. ఇంకా కొత్త కణాలు పెరగడానికి దోహదం చేస్తుంది.
- శరీరంలోని వ్యక్తపదార్థాలను బయటికి పంపించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- వీటిలో గ్లూటన్ ఉండదు. అందుకని గ్లూటన్ అండ్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం.
- ఏవైనా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఉంటే వాటి నుండి సామలు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తమా ఉన్నవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
- వీటిలో టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్, మరియు కెరటెనాయిడ్స్ ఉంటాయి ఇవి శరీరంలో ఎన్నిటి ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. అవి విటమిన్ ఏ గా కూడా మారుతాయి అందుకే ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
- టోకోఫెరోల్స్ మరియు టోకోట్రైనాల్స్ విటమిన్ E లా పనిచేస్తాయి. ఇవి నరాలు, కండరాలు, మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇవి ఎర్ర రక్త కణాలను రక్షిస్తాయి. గుండె జబ్బులు రావడం మరియు వృద్ధాప్య లక్షణాలు చూపకుండా కాపాడతాయి.
సామలు కేజీ 100 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది మంచి ఆరోగ్యం కోసం అంత మాత్రం ఖర్చు చేయడం పెద్ద కష్టమేమీ కాదు మరీ అన్నంతో పోలిస్తే దానిలో సగం తిన్న ఈ అన్నం సరిపోతుంది కాబట్టి ఖర్చు గురించి ఆందోళన ఆందోళన పడాల్సిన అవసరం లేదు రోజుకో పూట సామలు తినవచ్చు.
సామలను వేసవిలో తినడం వల్ల మన శరీరానికి చలువ చేస్తాయి. చలికాలంలో అయితే కొర్రలు లను ఎక్కువగా తింటారు. సామలతో కిచిడి ,ఉప్మా ఇంకా కేక్స్ లాంటి వంటకాలు కూడా చేయవచ్చు.
సామలను ఎలా అయినా వండి తినవచ్చు ఎలా వండినా సులభంగా జీర్ణం అవుతాయి అయితే డాక్టర్స్ వారానికి మూడు నాలుగు రోజులు తీసుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు.
Nutrition Values:పోషక విలువలు (100 gm)
- కాలోరీస్: 100-120 కాలోరీలు
- ప్రోటీన్: 4-5 g
- ఫైబర్: 7-9 g
- కార్బోహైడ్రేట్లు: 20-25 g
- వాష్పతీ (ఫ్యాట్): 1-2 g
- విటమిన్లు: విటమిన్ B కాంప్లెక్స్ (B1, B2, B3) అధికంగా ఉంటాయి.
- ఖనిజాలు: మాంగనీస్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, కేల్షియం, ఇనుము మరియు జింక్.
Weight Loss: బరువు తగ్గడానికి
ప్రస్తుతం ఊబకాయ సమస్య అందర్నీ వేధిస్తుంది. బరువు తగ్గడానికి నిత్యం సామలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. వీటిలో ఉండే అధికమైన ఫైబర్ తొందరగా ఆకలి వేయకుండా చూస్తుంటే అందువల్ల మనం ఎక్కువ తినలేము. అందుకే తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. అందువల్ల శరీరంలోని కొవ్వు కరిగి వెయిట్ లాస్ అవుతారు.
గుండె ఆరోగ్యానికి సామలు
మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం సామలను కచ్చితంగా మన ఆహారంలో చేర్చుకోవాల్సిందే. వీటిలో ఉండే పొటాషియం ఫైబర్ మెగ్నీషియం లాంటి ఖనిజాలు బ్లడ్ ప్రెషర్ ని పెరగకుండా అదుపులో ఉంచుతాయి. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరు పోకుండా చేస్తాయి అందువల్ల గుండెకు సంబంధమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే తగ్గిస్తాయి. వీటిని తింటే మన గుండె సేఫ్ అనిని మాత్రం చెప్పవచ్చు
మనకు తెలిసిన సిరి ధాన్యాలలో సామలు చాలా ముఖ్యమైనవి. పూర్వకాలం సామలను ఎక్కువగా తినేవారు. కానీ వాడకం చాలా తగ్గింది. తెల్లని వరి బియ్యం వాడుకలోకి వచ్చాక వీటిని వాడడం తగ్గించారు. ఇప్పటి ప్రజలకి సామలు చాలా వరకు తెలియదు. ఇప్పుడిప్పుడే వీటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నిజం చెప్పాలంటే వీటితో చాలా రకాల వంటలు చేయవచ్చు. సాధారణంగా వరి బియ్యంతో చేసే దోసెలు, ఉప్మా అన్నం లాంటి వంటలు వీటితో కూడా చేయవచ్చు.
Little millets (లిటిల్ మిల్లెట్స్) గురించి ఇంకా తెలుసుకోవాలంటే సామలు హెల్త్ బెనిఫిట్స్ ఆర్టికల్ ని చదవండి.