Pumpkin Seeds Benefits

Pumpkin Seeds Benefits ని తెలుగు లో తెలుసుకుందాం.

Pumpkin Seeds In Telugu

Pumpkin Seeds Benefits In Telugu

తెలుగు లో Pumpkin Seeds ని గుమ్మడి గింజలు అని అంటారు. ఈ గుమ్మడి గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కాన్సర్, గ్యాస్ట్రిక్ , ప్రోస్టేట్, సమస్యల నుంచి రక్షణ ఉంటుంది. ఈ గింజల వల్ల మహిళలకు మరియు పురుషులకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఈ గింజ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటానికి చాల ఉపయోగ పడుతుంది.

Nutritional Values

పోషక విలువ (100 గ్రా)పరిమాణం
కాలరీలు559 kcal
ప్రోటీన్30 గ్రా
కొవ్వులు49 గ్రా
కార్బోహైడ్రేట్లు11 గ్రా
ఫైబర్6.5 గ్రా
పొటాషియం809 మి.గ్రా
ఫాస్ఫరస్1233 మి.గ్రా
మెగ్నీషియం592 మి.గ్రా
కాపర్1.3 మి.గ్రా
మెంగనీస్4.5 మి.గ్రా
Pumpkin Seeds Benefits: Nutritional Values

గుమ్మడి గింజలు ప్రయోజనాలు

Pumpkin Seeds Benefits In Telugu

Cancer

గుమ్మడి గింజల్లో ఉన్న కెరొటిన్‌ , విటమిన్‌ ఇ లాంటి యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్లకు వ్యతిరేకంగా రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా, మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. నెలసరి నిలిచిన మహిళలలో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గించడంలో గుమ్మడి గింజలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Diabetes

షుగర్‌ పేషెంట్స్‌కు ఈ గింజలు మంచి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలలో యాంటీడయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడికాయ seeds లలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, అనే పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి.

Weight Loss

Pumpkin Seeds Benefits In Telugu| Weight loss

ఈ గింజలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన తక్కువ సమయంలో పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. అలాగే, ఇవి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండటంతో శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. రోజూ మితంగా గుమ్మడి గింజలను తీసుకోవడం బరువు నియంత్రణకు మంచి చేస్తుంది.

Benefits for male

గుమ్మడి గింజలు పురుషుల ఆరోగ్యానికి ఒక గొప్ప వరం.

  1. ప్రోస్టేట్ ఆరోగ్యం – గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉండడం వలన ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
  2. స్పెర్మ్ నాణ్యత – వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు వీర్య కణాల నాణ్యతను మెరుగుపరచి, పురుషుల ఫెర్టిలిటీకి మంచి చేస్తాయి.
  3. టెస్టోస్టిరోన్ స్థాయిలను మెరుగుపరచడం : ఈ గింజలు హార్మోన్ల సమతుల్యానికి ఉపయోగపడతాయి, ప్రత్యేకంగా టెస్టోస్టిరోన్ స్థాయిలను సహజంగా పెంచడంలో ఉపయోగపడతాయి.
  4. మెరుగైన నిద్ర – వీటిలోని ట్రిప్టోఫాన్ మరియు మెగ్నీషియం మంచి నిద్ర కోసం అవసరమైనవి, ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

Benefits for female

గింజలు మహిళలకు ప్రత్యేకంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి:

  1. హార్మోన్ల సమతుల్యత : Gummadi గింజలలోని ఫైటోఎస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచి, సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
  2. ఎముకల ఆరోగ్యం – మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకల బలాన్ని పెంచడంలో మంచి చేస్తాయి.
  3. జుట్టు మరియు చర్మ ఆరోగ్యం – గుమ్మడి గింజలలో జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతాయి.
  4. హృదయ ఆరోగ్యం – గుమ్మడి గింజలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  5. నిద్రను మెరుగుపరచడం – ఇందులోని ట్రిప్టోఫాన్ మంచినిద్ర కోసం ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Pumpkin Seeds Benefits for Hair

ఈ గింజలు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో జింక్, విటమిన్ E లాంటి యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన జుట్టు పెరగడానికి, దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి. నిత్యం గుమ్మడి గింజలను తీసుకోవడం జుట్టు రాలటంను తగ్గిస్తుంది.

pumpkin seeds benefits for Skin

ఇవి చర్మానికి చాలాఉపయోగకరమైనవి. వీటిలో యాంటీఆక్సిడెంట్, విటమిన్ E, ఫ్యాటి యాసిడ్ఉం డటంతో చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లోని పోషకాలు చర్మానికి తేమను అందించి, ముడతలు, వయస్సు సంకేతాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

గుమ్మడి గింజలు ఎలా తినాలి?

Pumpkin Seeds Benefits In Telugu

ఇవి ఆరోగ్యానికి చాలా మంచిని చేస్తాయి. వాటిని భోజనంలో, వేపించి తినడం, పొడిని ఉపయోగించడం, జ్యూస్‌లలో వేసి తాగడం చేయొచ్చు.

  1. గుమ్మడి గింజలను పొడిగా చేసి ప్రతి రోజు భోజనంలో చేర్చుకోవచ్చు.
  2. ఈ గింజలను వేయించి ఉప్పు కలిపి తీసుకోవచ్చు.
  3. ఈ గింజల పొడిని తీసుకుని పాకం లేదా బేకింగ్ చేయడంలో ఉపయోగించవచ్చు. అలాగే గింజలను బాగా ఆరబెట్టిన తరువాత పొడిగా చేసి చట్నీ, దోసె లేదా ఇతర వంటల్లో వాడుకోవచ్చు.

ఎన్ని తినాలి?

10 నుండి15 గింజలు రోజూ తినడం సరిపోతుంది.అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావొచ్చు. గుమ్మడి గింజలలోని పీచు దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

Frequently Asked Questions

  1. గుమ్మడి గింజలు ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
    గుమ్మడి గింజలలోఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
  2. ఇవి ఏ రోగాల నుంచి రక్షిస్తాయి?
    ఇవి కేన్సర్, గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
  3. మహిళలు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఏమి లాభం?
    ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గించడంలో సహాయపడుతుంది.
  4. ఈ గింజలు ఎలా తీసుకోవాలి?
    వీటిని వేపించి లేదా పొడిగా చేసి రుచికరమైన వంటలలో చేర్చుకోవచ్చు.
  5. పురుషులకు ఈ గింజలు ఎందుకు మంచివి?
    ఇవి పురుషుల ఆరోగ్యానికి మంచివి. ప్రోస్టేట్ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
  6. గుమ్మడి seeds ఎంత తినాలి?
    రోజుకు 10-15 గింజలు తీసుకోవడం సరిపోతుంది.
  7. గుమ్మడి seeds ను ఎక్కడ నుండి కొనాలంటే?
    అవి మార్కెట్లలో లేదా ఆర్గానిక్ స్టోర్లలో లభిస్తాయి.
  8. గింజలు వంటలో ఉపయోగించరా?
    ఇవి చట్నీ, సలాడ్, పచ్చడి, దోసె లో ఉపయోగించవచ్చు.
  9. గుమ్మడి గింజలను ఎలా నిల్వ చేయాలి?
    గుమ్మడి గింజలను చల్లగా, ఎండలో ఉంచి ఆరబెట్టి నిల్వ చేయవచ్చు.
  10. ఈ గింజలు తినడం వల్ల ఎలాంటి వైద్య సమస్యలు ఉంటాయా?
    అధిక మోతాదులో తీసుకుంటే వాయు సంబంధిత సమస్యలు, అంగీయం (ఉబ్బరం) వచ్చే అవకాశం ఉంటుంది.
Scroll to Top