Hemp Seeds Benefits| ఆరోగ్య ప్రయోజనాలు

Hemp Seeds Benefits గురించి ఏ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Table of Contents

What are Hemp Seeds?

Hemp Seeds Benefits| What are Hemp seeds| uses | hair | weight Loss

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని మించింది లేదు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోజు మనం తినే ఆహారంలో గింజలను తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సాధారణంగా మనం రోజు జీడిపప్పు, బాదం, వాల్నట్స్ లాంటి వాటినే తింటుంటాము. కానీ మనం కచ్చితంగా తినాల్సిన గింజలు మరొకటి ఉన్నాయి. అవే జనపనార గింజలు.

ఈ గింజలను తినడం వలన చర్మానికి, జుట్టుకి, గుండె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఈ జనపనార గింజల్లో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్ ఉండటంతో మన శరీరానికి కావలసిన పోషణను అందిస్తాయి. డాక్టర్స్ ఈ గింజలను తప్పకుండా మన డైట్ లో చేర్చుకోవాలని చెప్తున్నారు.

జనపనారు గింజలను సరైన మోతాదులో తీసుకోవడం వలన వాటిలో ఉన్న పోషక విలువలు మనకు మన శరీరానికి అందుతాయి.

Nutritional Values

పోషకంవిలువ (ప్రతి 100 గ్రాములు)
కెలొరీలు553 కిలోకాలరీలు
ప్రోటీన్31.6 గ్రాములు
కొవ్వులు48.8 గ్రాములు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్8,700 మి.గ్రా
ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్28,700 మి.గ్రా
కార్బోహైడ్రేట్8.7 గ్రాములు
ఫైబర్4.0 గ్రాములు
విటమిన్ E0.6 మి.గ్రా
ఐరన్7.95 మి.గ్రా
మెగ్నీషియం700 మి.గ్రా
కాల్షియం70 మి.గ్రా

Hemp Seeds Uses

Hemp Seeds Uses
  1. ఈ జనపనార గింజలు ప్రోటీన్స్ చాలా ఉంటాయి.
  2. ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీఆసిడ్స్ లతో బ్యాలెన్స్ కలిగి ఉంటాయి.
  3. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  4. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ తాపీగా సాఫీగా జరగడానికి సహాయపడతాయి.
  5. కొలెస్ట్రాల్ని తగ్గించి లెవెల్స్ ని మెయింటైన్ చేయడంలో ఉపయోగపడతాయి.
  6. హార్మోన్స్ ఇన్ బాలన్స్ అవ్వకుండా చూస్తాయి.
  7. వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
  8. మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తాయి.
  9. కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
  10. మొత్తం మీద మన శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తాయి.

Top 5 Hemp Seeds Benefits

Hemp seeds in Telugu| weight loss | Hair |skin

Hemp Seeds For Weight Loss:

జనపనార విత్తనాలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి వీటిలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఫైబర్ ఆకలిని తగ్గించి మనం తక్కువగా తినేలాగా చేస్తాయి తినే పరిమాణం తగ్గినప్పుడు మన శరీరంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి ఇంకా శరీరానికి అవసరమైన పోషకాలను అందించి కొవ్వులను తగ్గిస్తాయి జీనక్రియనే శుభ్రపరచి శరీరంలో శక్తిని పెంచుతాయి ఈ విధంగా మన శరీర బరువును తగ్గిస్తాయి.

చర్మం

Hemp సీడ్స్ మన ఆరోగ్యాన్ని మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్రను పోషిస్తాయి. వీటిలో ఉండే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ చర్మాన్ని సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వయసు వల్ల వచ్చే ముడుతలను కొంతమేరకు తగ్గిస్తాయి. మన చర్మానికి తేమను అందించి పొడి మారడాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి.

జుట్టును రక్షించడానికి

జుట్టు ఆరోగ్యం కోసం చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీడ్ని చేకూరుస్తాయి. దీనిలో ఉండే తేమ తలను పొడిబారకుండా చేస్తాయి. జుట్టు కుదుల్ల బలహీనతను తగ్గిస్తాయి. జుట్టు మెత్తగా, బలంగా, పట్టులా ఉండేలాగా చేస్తాయి.

PMS (premenstrual syndrome)తగ్గించడానికి

ఈ జనపనార గింజల్లో లినోలెనిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి పీఎంఎస్(PMS) లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి రుతుక్రమాన్ని సక్రమంగా వచ్చేలాగా చేస్తాయి. రుతుక్రమ సమస్యలైన మానసిక ఒత్తిడి, నొప్పి, వాపు వంటి లక్షణాలను తగ్గిస్తాయి.

Side Effects

ఎంత మంచి ఆహారమైనా అతిగా తీసుకున్నప్పుడు దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ జనపనార విత్తనాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా జీర్ణక్రియలు సమస్యలు, మలబద్ధకం లేకపోతే అతి సారం రావడం జరుగుతుంది. వీటివల్ల కొంతమందికి ఎలర్జీ కూడా వస్తుంది. తగిన మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం అవసరం.

జనపనార విత్తనాలను ఎలా తినాలి?

జనపనార గింజలను మన ఆహారంలో రకరకాలుగా వాడొచ్చు వీటితో కలపడం ద్వారా హెల్దీ పానీయాలను తయారు చేసుకోవచ్చు. సలాం తినేటప్పుడు వాటిపై వీటి పొడిని చల్లుకొని తింటే రుచిగాను పౌష్టికంగానూ ఉంటుంది వీటితో దోసెలు చట్నీలు లేదా కూరలను కూరలలో పొడిగా వేసి తినవచ్చు మన రోజు ఆహారంలో వీటిని వేడి చేయకుండా తింటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు తక్కువగా తినడం కూడా చాలా అవసరం.

FAQ

1. జనపనార గింజలు అంటే ఏమిటి?

జనపనార మొక్క నుంచి జనపనార గింజలు వస్తాయి ఇవి గింజలు రకానికి చెందిన ఆహార పదార్థాలు వీటిని మనం ప్రతిరోజు తినవచ్చు

2.జనపనార గింజల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, చర్మం, జుట్టు మరియు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

3. జనపనార గింజలు తినడం వలన బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుందా?

అవును, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి..

4. Hemp సీడ్స్ ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?

వీటిని స్మూతీల్లో, సలాడ్‌లలో, చట్నీ లేదా దోసె లాగా చేసుకుని తినొచ్చు..

5. జనపనార గింజలను ప్రతిరోజు తీసుకోవచ్చా?

అవును. వీటిని సరైన మోతాదులో ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

6. జనపనార గింజలను ఎవరు తినకూడదు?

ఎలర్జీ ఉన్నవారు గర్భవతులు పాలిచ్చే తల్లులు తినే ముందు వైద్యుని సలహా తీసుకోవడం అవసరం.

7. జనపనార గింజలు చర్మం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?

ఇవి మన శరీరానికి తేమని అందించి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి చర్మం మీద వచ్చే పిగ్మెంటేషన్ ఇంకా ముడతలను తగ్గిస్తాయి

8. జనపనార గింజలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి?

ఇది జుట్టుకు కావలసిన పోషకాలను అందించి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తాయి

9. జనపనార గింజలు శరీరంలో కొవ్వును పెంచుతాయా?

ఇవి మనకి ఆరోగ్యమైన కొవ్వులను అందిస్తాయి ఇంకా చెడు కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

10. జనపనార గింజలను ఎలా నిల్వ చేసుకోవాలి?

వీటిని చల్లగా ఇంకా గాలి తగలనే ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా గాజు డబ్బాలో లేదా ప్లాస్టిక్ కవర్స్ లో ఉంచవచ్చు.

Scroll to Top