Watermelon seeds benefits for female fertility:
ఈ ఆర్టికల్ లో మనం Watermelon seeds మహిళలలో వచ్చే గర్భధారణ సమస్యలకు, ఇంకా ఇతరత్రా గర్భసంచి సమస్యలకి ఎలా ఉపయోగపడతాయో ఎలా మన ఆహారంలో చేయించుకోవాలో తెలుసుకుందాం.
మొదటగా మనం వాటర్ మిలన్ సీడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం
Table of Contents
What is Watermelon seeds in telugu

మనం సాధారణంగా Watermelon లేదా తెలుగులో పుచ్చకాయ ఎండాకాలంలో తినడం అందరికీ అలవాటే. ఇవి ఎండ తాపం నుంచి మనకి ఉపశమనం లభిస్తాయి. పుచ్చకాయ తినేటప్పుడు మనం వాటిలోని గింజలను పడేస్తూ ఉంటాము. కానీ పుచ్చకాయ వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో అంతకంటే ఎక్కువ మేలు ఈ పుచ్చకాయ గింజల వల్ల జరుగుతుంది. Watermelon seeds ని తెలుగులో పుచ్చకాయ గింజలు లేదా పుచ్చ గింజలు లేదా పుచ్చ గింజల పప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.ఈ పుచ్చకాయ గింజలు పుచ్చకాయ నుండి తీసుకొని వాటిని బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత వాటిని మన ఆహారంలో చేర్చుకోవచ్చు.
సాధారణంగా అందరూ ఈ పుచ్చకాయ గింజలు సూపర్ మార్కెట్లో కొంటూ ఉంటారు. ఇంట్లో వీటిని తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. బయట కొనడం వల్ల కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంది. కాకపోతే మిగతా వాటితో చూసుకుంటే మాత్రం ఖర్చు తక్కువే. సాధారణంగా ఒక కేజీ పుచ్చకాయ పప్పు 200 నుండి 250 రూపాయల వరకు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తో చూసుకుంటే ఇది చాలా తక్కువ.
Types of watermelon seeds
watermelon seeds ( పుచ్చ గింజల పప్పు ) మనకి రెండు రకాలుగా లభిస్తాయి
- Black watermelon seeds
- .White watermelon seeds
రెండు కూడా ఒకటే పుచ్చకాయలు లభిస్తాయి. పుచ్చకాయ లో కొన్ని పుచ్చకాయలు విత్తనాలు ఉండవు. అలాంటి పుచ్చకాయల్లో మెత్తగా, మృదువుగా తెలుపు రంగులో కొన్ని విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పరిపక్వం చెందినటువంటి విత్తనాల. వీటిని మనం నాటినట్లయితే వీటి నుండి మొక్కలు పెరగవు.
ఇంకా బ్లాక్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవి మొత్తం పరిపక్వత చెందిన విత్తనాలు. వీటిని గనక మనం మట్టిలో నాటినట్లయితే మనకి మొక్కలు వస్తాయి.
Watermelon seeds Benefits for female fertility
Watermelon seeds benefits For female Fertility: ఇప్పుడున్న జీవనశైలి వలన మహిళల్లో చాలా రకాలైనటువంటి గర్భధారణ సమస్యలు వస్తున్నాయి. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి తినే ఆహారం వారి యొక్క గర్భధారణను నిర్ణయిస్తుంది. ఈ కలుషితమైనటువంటి వాతావరణ మరియు ఆహారపు అలవాట్ల వలన గర్భధారణ చాలా కష్టమైపోతుంది. అందువల్లనే వీధికి ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉండడం అలవాటైపోయింది. నిత్యం మంచి వ్యాయామం మరియు మంచి ఆహారపు అలవాట్లు పాటించడం వలన ఎలాంటి సమస్యలు రాకుండా మహిళలు తమ గర్భసంచిని కాపాడుకోవచ్చు.
అలాంటి సమయంలో సహజంగా లభించే పుచ్చకాయ గింజలు మంచి పరిష్కారంగా మారవచ్చు. ఇవి మన వంటగదిలో ఉండే సాధారణమైన పదార్థమే అయినా, ఇందులో ఉన్న పోషకాల వల్ల మహిళల ఫెర్టిలిటీపై మంచి ప్రభావం చూపుతుంది.

1. Balancing Hormones
పుచ్చకాయ గింజల్లో ( Watermelon Seeds) ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయి. నెలసరి చక్రాలు రెగ్యులర్‌గా ఉండేందుకు ఇది చాలా అవసరం.
నెలసరి సరిగ్గా రావడానికి ఇది చాలా అవసరం ఉదాహరణకు పని ఒత్తిడి వలన చెడు ఆహార పూలమాల వలన మన హార్మోన్లు వాటి సమతుల్యాన్ని కోల్పోతాయి దాని వలన గర్భధారణలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతినిత్యం ఈ గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వలన గర్భధారణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
2. Watermelon Seeds Benefits for Healthy Uterus
పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన గర్భసంచి (యూటరస్) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన గర్భాన్ని పొందడానికి గర్భసంచి ఆరోగ్యం చాలా అవసరం.
రోజు గుప్పెడం పుచ్చకాయ గిన్నెలు తీసుకోవడం వలన వాటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్ మన గర్భసంచిలో ఉండే చెడు ఆక్సిడెంట్ ని బయటికి పంపించేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
3. Watermelon Seeds Benefits for improving Hemoglobin
గర్భధారణకు ముందు శరీరంలో ఐరన్ మరియు జింక్ లాంటి ఖనిజాలు చాలావరకు అవసరం. ఇవి పుచ్చకాయ గింజల్లో సహజంగా లభిస్తాయి. ఐరన్ రక్త హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తుంది. జింక్ రిప్రొడక్షన్ ఫంక్షన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
4. Improving Egg Quality
గర్భధారణ విషయంలో ఎగ్ క్వాలిటీ అనగా అండం యొక్క నాణ్యత అనేది చాలా ముఖ్యం శిశువు ఎదుగుదల అనేది ఈ అండం యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది మన శరీరరోగ్యం బాగుంటే ఆరోగ్యకరమైన అండంలు విడుదలవుతాయి పుచ్చకాయ గిన్నెలో ఉండేటువంటి ప్రోటీన్లు విటమిన్లు అండం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అందువలన గర్భధారణ అవకాశం దొరుకుతుంది తర్వాత శిశువు యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది
5. Energy Boosting
పుచ్చకాయ గింజలు మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని అందిస్తాయి. బలహీనంగా ఉండేవారు ఈ పుచ్చకాయ గింజలను తరచూ తీసుకోవడం వల్ల అలసట మరియు శక్తి అలసట తగ్గి శక్తివంతులుగా తయారవుతారు. వీటిలో ఉండే ప్రోటీన్, మెగ్నీషియం లాంటి మూలకాలు శరీరాన్ని బలంగా చేస్తాయి మహిళలు గర్భధారణ నాకు ముందు శరీరం ఆ బలంగా ఉండడం అవసరం.
How to eat watermelon seeds
1. పొడి చేసి తినడం (Roasted Watermelon Seeds):
- తరబూజా గింజలను సేకరించండి.
- నీటితో బాగా కడిగి, విత్తనాల పై పొట్టు పూర్తిగా పొడి అయ్యేలా ఎండబెట్టండి.
- తరువాత గిన్నెలో కొంచెం నెయ్యి లేదా నూనె వేసి, గింజలను 2–3 నిమిషాలు వేయించండి.
- కొద్దిగా ఉప్పు వేసి నేరుగా తినవచ్చు లేదా స్నాక్స్‌లా వాడవచ్చు.
2. పచ్చిగా తినడం (Raw Watermelon Seeds):
- తరబూజ తిన్న తరువాత, గింజలను తీసి నెమ్మదిగా చవ్వుతూ తినవచ్చు.
- కానీ ఇవి బయట కవచంతో (shell) ఉంటే అవి జీర్ణానికి కాస్త కష్టంగా ఉండవచ్చు.
- ఎక్కువగా తినకూడదు — రోజుకు 1 టీస్పూన్ (చిన్న స్పూన్) చాలిపోతుంది.
3. పౌడర్‌గా తయారుచేసి వాడటం(Watermelon Seeds Powder)
- ఎండబెట్టిన గింజలను మిక్సీ లో వేసి పొడి చేయండి.
- ఆ పొడిని:
- పాలలో కలిపి తాగవచ్చు
- స్మూతీ లేదా సలాడ్‌లలో కలిపి వాడవచ్చు
మీకు వేయించి తినడం ఇష్టం అయితే, కొద్దిగా మిరియాల పొడి లేదా జీడి పప్పుతో కలిపి స్నాక్స్‌గా చేసుకోవచ్చు.
మీరు ఎలా తినాలని అనుకుంటున్నారు – పొడి చేసి లేదా రా గింజలేనా?
వాటర్‌మెలన్ (పుచ్చకాయ) గింజలు పోషకాలు అధికంగా ఉండే చాలా ఆరోగ్యకరమైనవి. అయితే, అధికంగా తీసుకున్నప్పుడు కొంతమంది మహిళలకు కొన్ని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి క్రింది విధంగా ఉన్నాయి:
Watermelon Seeds Side Effects For Females
- అధిక కాలరీలు: ఎక్కువగా తినితే శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా బరువు చూసుకునే మహిళలకు ప్రాస్నగా మారుతుంది.
- జీర్ణ సమస్యలు: అధిక మొత్తంలో తినితే కడుపు నొప్పి, అపచయం, వాయువు వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
- అలర్జీ: కొంతమందికి పుచ్చకాయ గింజలలో ఉండే ప్రోటీన్లకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల చర్మం కురుపులు, ఉబ్బసం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
- ప్రెగ్నెన్సీలో జాగ్రత్త: గర్భిణీ స్త్రీలు అధికంగా తీసుకోవడం వల్ల హార్మోనల్ సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి.
- బీపి ఉన్నవారికి: ఇవి పొటాషియం అధికంగా కలిగి ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు అధికంగా తీసుకుంటే వైద్య సూచన తప్పనిసరిగా తీసుకోవాలి.
How many seeds can we eat daily?
- రోజుకు 1 టేబుల్ స్పూన్ (10-15 గింజలు) మితంగా తినటం మంచిది.
- మన శరీరంలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉండాలి.
- ఏదైనా రియాక్షన్ ఉంటే వెంటనే తినడం ఆపడం మంచిది
మీరు ప్రత్యేకంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
మీకు ఇంకా ఆరోగ్య సంబంధిత సమాచారం కావాలా?
Conclusion
Watermelon seeds benefits For female Fertility: ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలా రకాల ఆర్టిఫిషియల్ మందులను వాడుతున్నారు. చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు. వీటన్నిటిని వల్ల ఎంతో కొంత దుష్ప్రభావం ఉంటుంది. అందువలన సహజంగా మనకు ప్రకృతిలో దొరికే ఈ వాటర్ మిలన్ సీడ్స్ ని ప్రతినిత్యం మన ఆహారంలో చేర్చుకోవడం వలన ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మెరుగవుతుంది. మహిళల్లో వచ్చే అధిక బరువు సమస్య మరియు గర్భధారణ సమస్యలు సహజంగా మెరుగవుతాయి. పుచ్చకాయ గింజలతో పాటు మనకి అవిస గింజలు, మెంతులు ఇంకా చాలా రకాల గింజలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటాయి
FAQ
1. పుచ్చకాయ గింజలు ఫెర్టిలిటీకి సహాయపడతాయా?
అవును, పుచ్చకాయ గింజలు మహిళల ఫెర్టిలిటీని సహజంగా మెరుగుపరిచే ఆహారాల్లో ఒకటి. వీటిలో జింక్, ఫోలేట్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటంతో, అండాశయాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గర్భధారణకు అనుకూలమైన హార్మోన్ స్థాయులను కాపాడుతుంది.
2. గర్భధారణకు ఫోలేట్ ఎలా సహాయపడుతుంది?
ఫోలేట్ అనేది B గ్రూప్‌కు చెందిన విటమిన్. ఇది గర్భధారణకు ముందు శరీరాన్ని ఆరోగ్యంగా తయారుచేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అండం విడుదల (ఓవ్యూలేషన్) సరిగ్గా జరిగేందుకు ఇది అవసరం. అలాగే గర్భంలో శిశువు సక్రమంగా ఎదగడానికి ఫోలేట్ ఎంతో కీలకం. పుచ్చకాయ గింజలు సహజంగా ఫోలేట్‌ను అందించగలవు.
3. పుచ్చకాయ గింజలు హార్మోన్ల సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తాయి?
పుచ్చకాయ గింజల్లో ఉం ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడతాయి. హార్మోన్ అసమతుల్యత వల్ల వచ్చే మాసిక ధర్మ సమస్యలు, అండాశయ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
4. యూటరస్ ఆరోగ్యానికి పుచ్చకాయ గింజల పాత్ర ఏమిటి?
పుచ్చకాయ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా లైకోపిన్, గర్భసంచి కణజాలాన్ని రక్షించడంలో సహాయపడతాయి. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించటం ద్వారా గర్భసంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గర్భధారణకు అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
5. ఫెర్టిలిటీ మెరుగుపడేందుకు Watermelon Seeds ఎంత పరిమాణంలో తినాలి?
పుచ్చ గింజల పప్పు ఫెర్టిలిటీ కోసం రోజుకు 1 టేబుల్ స్పూన్ (సుమారు 10–15 గింజలు) మితంగా తినడం చాలు. వేయించి తినకుండా, మృదువుగా ఉడకబెట్టిన లేదా పచ్చిగానే తినడం మంచిది. మితికి మించితే జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి, సమతుల్యంగా తీసుకోవాలి.