What is the meaning of Brazil Nuts in Telugu?
బ్రెజిల్ నట్స్ తెలుగులో (Brazil nuts in telugu) ‘బ్రెజిల్ గింజలు‘ లేదా ‘బ్రెజిల్ విత్తనాలు'(brazil seeds) అని అంటూ ఉంటారు.
మనం రోజూ తినే ధాన్యాలు(grains), చిరుధాన్యాలతో(millets) పాటు బ్రెజిల్ నట్స్ కూడా తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి.
బ్రెజిల్ నట్స్ తెలుగులో ఉపయోగాలు, వాటి గుణాలు, పోషక విలువల గురించి తెలుసుకుందాం.
Table of Contents
ఈ నట్స్ లేదా గింజలు ప్రాముఖ్యం పొందినప్పుడు ఎక్కువగా ఇవి బ్రెజిల్ దేశం నుంచి ఉత్పత్తి చేస్తూ ఉండేవారు. అందువలన ఈ గింజలకి బ్రెజిల్ నట్స్ లేదా బ్రెజిల్ గింజలు అని పేరు వచ్చింది. ఈ గింజలు ‘బెర్లొటియా’ అనే చెట్టు నుండి మనకు లభిస్తాయి. ఈ చెట్టు యొక్క పనులలో ఉండే గింజలు ఎండిన తర్వాత బ్రెజిల్ గింజలుగా ఏర్పడతాయి.
బ్రెజిల్ నట్స్ లో నట్ పేరు ఉంది. కానీ నిజానికి ఇవి నట్స్ కాదు. ఇవి పండులో ఉన్నటువంటి గింజలు లేదా విత్తనాలు.
Brazil Nut is it Nut or seed?
| లక్షణం | వివరణ |
|---|---|
| వర్గం | విత్తనం (Seed) |
| పేరు | నట్ అని పిలుస్తారు కానీ ఇది గింజ |
| వృద్ధి | చెట్టుపై పెరిగే ఫలంలో ఉంటాయి |
Common Names of Brazil Nuts
| Language | Name |
|---|---|
| ఇంగ్లీష్ | Brazil Nuts |
| తెలుగు | బ్రెజిల్ గింజలు |
| హిందీ | ब्राजील नट्स |
| తమిళం | பிரேசில் நட்டுகள் |
| కన్నడ | ಬ್ರೆಜಿಲ್ ಬೀಜಗಳು |
Nutrients in100g Brazil Nuts In Telugu
| పోషకం | పరిమాణం |
|---|---|
| శక్తి (Calories) | 659 kcal |
| ప్రొటీన్ | 14.3 g |
| కొవ్వు (Healthy Fat) | 67.1 g |
| కార్బోహైడ్రేట్స్ | 11.7 g |
| Fiber | 7.5 g |
| సెలెనియం (Selenium) | 1917 µg (3485% RDA) |
| మగ్నీషియం | 376 mg |
| కాల్షియం | 160 mg |
| ఐరన్ | 2.43 mg |
| జింక్ | 4.06 mg |
| విటమిన్ E | 5.65 mg |
ఒక్క బ్రెజిల్ గింజలో రోజుకు కావలసిన సెలెనియం మొత్తం ఉంటుంది!
Top 10 Benefits Of Brazil Nuts In Telugu
1. Female Fertility
Brazil Nuts For female fertility: బ్రెజిల్ నట్స్‌లో ప్రతి గింజలో సుమారుగా 68 నుండి 91 మైక్రోగ్రాములు సెలీనియం ఉంటుంది. ఒక మనిషికి ఈరోజుకు ఎంత సెలీనియం అయితే కావాలో అంతకన్నా కూడా మొత్తం ఎక్కువ. సెలీనియం మన శరీరంలో కణాలను, కణజాలాన్ని రక్షిస్తుంది.
ఈ మధ్యకాలంలో మహిళలు పిల్లలు అనే విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు పిల్లలనే కాదు రుతుక్రమం మొదలైనప్పటి నుంచి మోనోపాజ్ దశ దాక ప్రతి దశలోనూ అనేక సమస్యలు తీస్తున్నారు ఇవన్నీ మనం మన యొక్క ఆహారపు అలవాట్లు వలన.బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం ముఖ్యంగా మహిళలు వచ్చే ఫెర్టిలిటీ సమస్యలకు చక్కటి పరిష్కారం.
2. Anti-aging
మనకి వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మీద చర్మం మీద ముడతలు కనబడడం ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం వల్ల వ్యాయామం లేకపోవడం మన వయసు తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ వయసు వారిలో కనిపిస్తూ ఉంటాం. వయసు మీద పడకుండా తొందరగా చర్మం అనేది వయసు బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
బ్రెజిల్ నెట్ లో ఉన్నటువంటి సెలీనియం పోషకాలు మరియు విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి హాని చేసేటటువంటి చెడు పదార్థాల నుండి రక్షిస్తాయి. మనం రోజుకు ఒక రెండు గింజలు తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అనేవి తొలగిపోతాయి. ఇవి ముఖ్యంగా మన కణాలు, మన చర్మం, మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తాయి వీటి వలన మనం తొందరగా వయసు పెరగకుండా చూస్తాయి.
3. Brazil Nuts for Thyroid gland
మన శరీరంలో థైరాయిడ్ గ్రంధి ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ థైరాయిడ్ గ్రంధి అనేది ఎక్కువగా ఉత్పత్తి చేసిన లేదా తక్కువగా ఉత్పత్తి చేసిన కూడా మనం శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ థైరాయిడ్ గ్రంధి అనేది సమతుల్యంగా ఉంటే మనకి ఏ సమస్యలు రావు. ఈ థైరాయిడ్ గ్రంధి అనేది సరిగ్గా పని చేయాలంటే సెలీనియం అనేటువంటి మూలకం చాలా అవసరం. ఇది బ్రెజిల్ నట్స్ లో పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గింజ తినడం వలన మన శరీరానికి కావాల్సినటువంటి మొత్తం సెలీనియం లభిస్తుంది. మరియు థైరాయిడ్ గ్రంధి అనేది బాగా పనిచేస్తుంది.
4. Brazil Nuts for Men’s Fertility
పురుషులలో ముఖ్యంగా శుక్రకణాల సంఖ్య అనేది ముఖ్యమైనటువంటి విషయం. సెలెనియం స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది. . ఇది డిఎన్ఏ ను రక్షిస్తుంది మరియు చాలా గర్భధారణకు చాలా అనుకూలంగా ఉంటుంది. పురుషులైనా సరే మహిళలు అయినా సరే ప్రతిరోజు ఒక బ్రెజిల్ గింజ తినడం వలన ప్రతి ఉత్పత్తి వ్యవస్థ కి చాలా మంచిది.
5. Good for heart
బ్రెజిల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన ఫ్యాట్లు ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్(HDL) ని పెంచుతూ చెడు కొలెస్ట్రాల్ని(LDL) బయటకు పంపిస్తాయి. ఒక మోస్తరు పరిమాణంలో తినడం గుండె సమస్యలను నివారించవచ్చు. అందులో 100 గ్రాముల నట్‌లో సుమారు 659 కిలోకలరీలు ఉంటాయి.
6. Improves Brain Function
ఈ మధ్యకాలంలో చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం వల్ల, సర్కులేషన్ సరిగా లేకపోవడం వలన, రక్తం గడ్డ కట్టడం లేక రక్తం చిక్కబడటం ఇలాంటి సమస్యలు ఏర్పడే బ్రెయిన్ స్ట్రోక్స్ కి కారణం అవుతున్నాయి. ఇంకా వయసుతో పాటు వచ్చే మతిమరుపు సమస్య కూడా ఎక్కువ అవుతుంది.
మన మెదడు సరిగ్గా ఉరుకుగా చురుకుగా పనిచేయాలంటే విటమిన్ ఇ మరియు మెగ్నీషియం మూలకాలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఇవి మన మెదడుకు శక్తిని ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇంకా దీనిలో ఉండే సెలీనియం మానసికంగా మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. మనం ఎప్పుడు ఉత్సాహంగా హుషారుగా ఉండేలాగా చేస్తాయి. వీటి వలన మన మతిమరుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది.
7. Supports Bones Strength
మన శరీరంలో ఎముకలు బలంగా ఉండడానికి ముఖ్యంగా మెగ్నీషియం అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్రెజిల్ నట్స్ లో మెగ్నీషియం – 100 గ్రాంలలో సుమారు 376 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా అవసరం. బ్రెజిల్ గింజలలో మెగ్నీషియంతో పాటు క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి కూడా ఎముకల బలానికి తోడ్పడతాయి రోజుకు మనం ఒకటి నుండి రెండు గింజలు తినడం వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి.
8.Good for Skin
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలంటే, విటమిన్ ఇ అనేది చాలా ముఖ్యం. బ్రెజిల్ నట్స్ లో ఈ విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మం లోని తేమను ఉంచి చర్మాన్ని పొడి మారకుండా మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తొందరగా ముడతలు పడకుండా తొందరగా వయసు మీద పడకుండా రక్షిస్తాయి.
9. Supports Immunity
మన శరీరం యొక్క ఆరోగ్యం అనేది రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనకి వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే మన శరీరం యొక్క రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. దీన్నే ఇమ్యూనిటీ ఆయనని కూడా అంటారు బ్రెజినెస్ లో ఉండే సెలీనియం జింక్, విటమిన్ ఈ, ఇలాంటి పోషకాలు అన్ని మన యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. మన శరీరం బయటి నుంచి వచ్చే వైరస్లను బ్యాక్టీరియాలను తట్టుకునేలా దూరంగా ఉండాలంటే ఈ ప్రజెంట్ నర్సరీ కచ్చితంగా తీసుకోవాలి.
10. Sugar Levels
మధుమేహం వ్యాధి ఉన్నవారికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ఎంత ముఖ్యం. ఈ పీచు అనేది రక్తంలోనికి చక్కెర తొందరగా విడుదల కాకుండా చూస్తూనే సో మనకి అనేక రకాల పీచు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో బ్రెజిల్ గింజలు కూడా ఒకటి. బ్రెజిల్ గింజలలో పైన ఉండే పొరలు లో పీచు అధికంగా ఉంటుంది. మనం ప్రతిరోజు వీటిని నానబెట్టుకొని ఒకటి లేదా రెండు గింజలు తిన్నట్లయితే ఫైబర్ లభిస్తుంది.
బ్రెజిల్ గింజలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం సమస్య ఉన్నవారు వీటిని ఒకటి నుంచి రెండు గింజలు ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది. దీనివల్ల. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది.
Side Effects of Brazil Nuts
| విషయం | వివరణ |
|---|---|
| అధిక సెలెనియం తీసుకుంటే | తలనొప్పి, వాంతులు, అలసట, జుట్టు పోవడం. |
| అధికంగా తినడం | బరువు పెరగవచ్చు – ఎక్కువ కేలరీల కారణంగా. |
| మితిమీరిన తీసుకోవడం | 1–2 గింజలు రోజుకి చాలవు. ఎక్కువ తినకూడదు. |
| అలెర్జీలు | కొన్ని మందికి నట్ అలెర్జీలు ఉండొచ్చు. జాగ్రత్త. |
How to eat Brazil Nuts In Telugu
- ఒకటి లేదా రెండు బ్రెజిల్ గింజలను తీసుకొని వాటిని నీటిలో రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. పొద్దున్నే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వాటిని మెత్తగా నమిలి తినవచ్చు.
- బ్రెజిల్ గింజ, ఇంకా హేజుల్ గింజలు, ఖర్జూరం, గుమ్మడి గింజలు, చియా గింజలు నానబెట్టి పొద్దున్నే స్మూతీ లాగా చేసుకుని పరిగడుపున తాగినట్లయితే శరీరానికి కావాల్సినటువంటి బలం పీచు పదార్థాలు అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి.
- చిన్నపిల్లలకు ఇవి ఇవ్వాలనుకుంటే వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వడం మంచిది. లేదా మెత్తని పౌడర్ లాగా చేసి రోజు పాలలో కలపడం వల్ల సులభంగా తాగవచ్చు.
FAQ
1. What are Brazil nuts made from?
బ్రెజిల్ నట్స్ అనేవి చెట్టు పండులో ఉండే గింజలు. ఇవి విత్తనాలే కానీ “నట్స్” అనే పేరుతో పిలుస్తారు.
2. Can I eat Brazil nuts every day?
అవును. బ్రెజిల్ నట్స్ ని రోజు తినవచ్చు. కానీ చాలా పరిమితంగా తినాలి. మనం ఎక్కువగా తిన్నట్లయితే సెలీనియం మోతదనేది ఎక్కువ అవుతుంది. అది మనకి మంచిది కాదు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు గింజలు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తినడం మంచిది కాదు.
3. Are Brazil nuts safe during pregnancy?
గర్భంతో ఉన్న స్త్రీలు బ్రెజిల్ నట్స్ ని తినవచ్చు. కాకపోతే తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. రోజు ఒకటి తిన్నప్పుడు ఎవరికైనా కూడా ఏ ప్రమాదం ఉండదు.
4. How many Brazil nuts is too much?
ప్రతిరోజు 3 బ్రెజిల్ నట్స్ కంటే ఎక్కువగా తిన్నట్లయితే సెలీనియం టాక్స్ సిటీకి దారి తీస్తుంది. అందువల్ల తినే పరిమాణం మూడు గింజలకు మించి ఉండకూడదు.
5. Do Brazil nuts help with fertility?
బ్రెజిల్ నట్స్ అనేవి మహిళల్లో మరియు పురుషుల్లో ఇద్దరిలో కూడా ఫెర్టిలిటీని పెంచుతాయి. ఏవైనా సమస్యలు కూడా వాటిని పరిష్కరిస్తాయి.
6. What is the best time to eat Brazil nuts?
ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తినడం మంచిది. అప్పుడు శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది.
7. Can children eat Brazil nuts?
అవును, చిన్న పిల్లలుబ్రెజిల్ నట్స్ ని తినవచ్చు కానీ వారికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జాగ్రత్తగా ఇవ్వడం మంచిది.
8. Do Brazil nuts cause weight gain?
మనము ఒకటి నుంచి రెండు గింజల కన్నా ఎక్కువ తినకూడదు. వచ్చే క్యాలరీలు చాలా తక్కువ. అందువలన మనం బరువు పెరిగే సమస్య లేదు.
9. Are Brazil nuts good for skin?
అవును. బ్రెజిల్ నట్స్ లో ఉండే విటమిన్ ఇ అనేది మన చర్మం లోనే మన చర్మానికి తేమని అందించి మన చర్మానికి మంచి నిగారింపులు తెస్తుంది. వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్ కు మనకి వృద్ధాప్యం తొందరగా రాకుండా చూస్తాయి.
10. Can I eat Brazil nuts with other dry fruits?
అవును, ఆల్మండ్, hazelnuts, వాల్‌నట్‌లతో కలిపి తినవచ్చు. కానీ మొత్తం మొత్తంలో మితంగా తినాలి.
Conclusion
బ్రెజిల్ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు (Benefits of Brazil nuts in Telugu) తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక గింజను తప్పకుండా చేర్చుకుంటే మనకి రోజు మొత్తం సరిపోయేటువంటి శరీరం ఉంటుంది. ఇది శరీరంలో అనేక రకాల ఉపయోగాలను అందిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు బ్రెజిల్ గింజలను ప్రజలు గింజలను ప్రతిరోజు తినటం చాలా మంచిది.