Indian Spices Names | Health Benefits

ఈ ఆర్టికల్ లో మనం Indian Spices Names తెలుగులో మరియు ఇంగ్లీషులో తెలుసుకుందాం మరియు వాటి యొక్క ముఖ్యమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా అవగాహన పెంచుకుందాం.

What are Spices Called In Telugu

Spices ను తెలుగులో సాధారణ భాషలో ‘సుగంధ ద్రవ్యాలు‘ లేదా ‘మసాలాలు‘ లేదా ‘మసాలా దినుసులు‘ అని పిలుస్తూ ఉంటారు. వీటిని మనం వంటలలో వాడడం వలన మన వంటలకు సహజంగా రుచిని, మంచి సువాసనను మరియు మంచి రంగును ఇచ్చే దినుసులు. మన భారతీయ వంటలలో ఈ మసాలా దినుసులు లేకుండా మనం ఊహించలేము. వీటికి మన మంటలను ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది.

కూరలు, పప్పులు, చట్నీలు, బిర్యానీ వంటి ప్రతి వంటలో ఏదో ఒక మసాలా తప్పనిసరిగా వాడుతాం. మనం ప్రతిరోజు సాధారణంగా చేసేటి వంటలైనటువంటి పప్పు, రోటి పచ్చడి, ఇలా వీటిలో కూడా ఏదో ఒక సుగంధ ద్రవ్యాన్ని మనం తప్పకుండా వాడుతూనే ఉంటాము. కేవలం రుచి ఒక్కటే కాదు, వాసన ఒకటే కాదు ఆరోగ్యపరంగా కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మసాలాలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.

Table of Contents

What is the Spices Meaning?

Spices అంటే ఆహారానికి రుచి, సువాసన, కారంగా లేదా తీయగా మార్పు తెచ్చే సహజ ద్రవ్యాలు. ఇవి విత్తనాలు, బెరుకు, చెక్క, వేర్లు లేదా ఆకుల నుండి లభిస్తాయి. భారతదేశంలో పురాతన కాలం నుంచే మసాలాలను ఔషధాల్లా కూడా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో చాలా మసాలాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

List of Indian Spices Names in Telugu And English

Indian spices names in english and telugu
Indian spices Names in English and Telugu

List of Indian Spices Names in Telugu And English ద్వారా ప్రతి మసాలా యొక్క తెలుగు మరియు ఇంగ్లీష్ పేర్లు తెలుసుకొని వంటలో సులభంగా ఉపయోగించుకోవచ్చు.

క్రమ సంఖ్యతెలుగు పేరుEnglish Name
1అల్లంGinger
2వెల్లుల్లిGarlic
3ఆవాలుMustard Seeds
4జీలకర్రCumin Seeds
5షాహీ జీరాCaraway Seeds
6స్టార్ అనీస్ (అనాస పువ్వు / చక్ర పువ్వు)Star Anise
7యాలకులుCardamom
8దాల్చిన చెక్కCinnamon
9మిరియాలుBlack Pepper
10తెల్ల మిరియాలుWhite Pepper
11బిర్యానీ ఆకుBay Leaf
12కరివేపాకుCurry Leaves
13గసగసాలుPoppy Seeds
14మెంతులుFenugreek Seeds
15ధనియాలుCoriander Seeds
16వాముAjowan (Carom Seeds)
17సోంపుFennel Seeds
18నల్ల జీలకర్రNigella Seeds
19లవంగాలుCloves
20జాజికాయNutmeg
21జాపత్రిMace
22కుంకుమపువ్వుSaffron
23ఇంగువAsafoetida (Hing)
24కర్పూరంCamphor
25కల్పాసి (రాయి పువ్వు)Stone Flower
26ఎండు మిరపకాయDry Red Chilli
27పసుపుTurmeric
List of Indian Spices Names in Telugu and English

Daily Use Spices Names

మనం ప్రతిరోజు సాధారణంగా వాడే మసాలా దినుసులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని అందరికీ తెలిసినవే.

  • పసుపు
  • ఆవాలు
  • మెంతులు
  • గసగసాలు
  • కరివేపాకు
  • ధనియాలు
  • సోంపు

పైన ఇచ్చినటువంటి మసాలా దినుసులు ప్రతి ఇంట్లో వంట గదిలో తప్పకుండా నిత్యం ఉండేవి. వీటిని ప్రతి వంటకంలో తప్పకుండా వాడతారు దాదాపుగా పసుపు లేకుండా భారతీయ వంటకాలు ఏవి ఉండవు ఆవాలు పోపు గింజలుగా వాడుతారు మెంతులు మెంతిపొడి పచ్చళ్లలో వాడతారు. కరివేపాకు తాలింపు లోనూ ధనియాలు లేదా ధనియాల పొడిని కూరలలో చివరగా వాడుతారు. ముఖ్యంగా సోంపును తిన్న తర్వాత తిన్నది అరగడానికి ఇంకా మన నోరు వాసన రాకుండా ఉండడానికి వాడతారు.

Biryani Spices Names List

Biryani Spices
Biryani Spices

ఈ మసాలాలు లేకపోతే బిర్యానీకి ఆ అసలైన వాసన రాదు.

  • యాలకులు
  • లవంగాలు
  • దాల్చిన చెక్క
  • బిర్యానీ ఆకు
  • షాహీ జీరా
  • స్టార్ అనీస్
  • జాజికాయ
  • జాపత్రి
  • మిరియాలు

మనం ఏ బిర్యానీ చేసిన కూడా ఆ రుచి వాసన రావాలంటే ఖచ్చితంగా పైన పేర్కొన్నటువంటి మసాలాలు వాడాల్సిందే వీటిని పొడిచేసి వాడుకోవచ్చు లేదా నేరుగా వాడుకోవచ్చు

Health Benefits of Indian Spices

Health Benefits of Indian spices

1. అల్లం (Ginger)

అల్లం ముఖ్యంగా మనకి తరచుగా వచ్చేటువంటి జలుబుని, దగ్గు ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనిని మనం ప్రతిరోజు వంటల్లో వాడటం వలన మన జీర్ణ క్రియ అనేది మెరుగుపడే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా తగ్గుతాయి. వాంతులు ఉన్నప్పుడు వీటిని ఆహారంలో చేసుకోవడం మంచిది. దీనిని మనం ప్రతిరోజు అలవాటు చేసుకున్నట్లయితే మన శరీరం యొక్క రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అల్లం చూడటానికి లేత గోధుమ రంగులో ఉంటుంది దీని రుచి కొంచెం కారంగా మరియు తీపి కలిసినట్లుగా ఉంటుంది

2. వెల్లుల్లి (Garlic)

వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది ఎందుకంటే వెల్లుల్లి వల్ల మనకి మన శరీరానికి ఆరోగ్యపరంగా అన్ని ఉపయోగాలు ఉన్నాయి.

వెల్లుల్లి తినడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జలుబు, దగ్గు వీటికి ఉపశమనంగా ఉంటుంది. మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నిత్యం ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి తీసుకోవడం వలన మన గుండె యొక్క ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

వెల్లుల్లి చూడడానికి తెల్లని గుణంగా ఆయిల్ పాయలుగా ఉంటుంది ఒక గడ్డలు అనేక చిన్న చిన్న రెబ్బలుగా ఉంటాయి వాటిపైన పొట్టు తీసి లోపల ఉన్న వెల్లుల్లిని మనం వాడుకోవాలి డివిటి వాసన చాలా బలంగా మరియు రుచి కొంచెం కారంగా ఉంటుంది.

3. ఆవాలు (Mustard Seeds)

ఆవాలు మామూలుగా మనం తాలింపులో వాడుతాము. తాళింపులో ఆవాలని వేసినప్పుడు వేడికి అవి వాటి నుంచి మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు నూనెలోకి విడుదల అవుతాయి. ఇవి మన జీర్ణశక్తిని మెరూపరుస్తాయి అంతేకాకుండా వీటిని ఎక్కువగా తిన్నట్లయితే కొంచెం శరీరంలో వేడి పెరుగుతుంది. ఇవి చూడడానికి చిన్న చిన్న బూడిద రంగు గింజలుగా ఉంటాయి.

4. జీలకర్ర (Cumin Seeds)

జీలకర్ర ముఖ్యంగా ఆవాలు తో పాటుగా తాలింపులో ఉపయోగిస్తాము. జీలకర్ర తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు ముఖ్యంగా కడుపుబ్బరంగా ఉండడాన్ని తగ్గిస్తుంది. ప్రతినిత్యం జీలకర్ర నీళ్లు తాగినట్లయితే మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నట్లయితే తగ్గిపోతాయి.

జీలకర్ర చూడడానికి ముదురు గోధుమ రంగులో సన్నగా కొంచెం పొడవుగా చాలా చిన్నగా ఉంటాయి.

5. షాజీరా (Caraway Seeds)

షాజీరా చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది. ఇది ప్రతినిత్యం తీసుకోవడం తీసుకోవడం వలన మన జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం అతిగా తీసుకున్నప్పుడు ఇది సులభంగారగడానికి ఉపయోగపడుతుంది. ఇది కడుపులో జీర్ణం కావడానికి అవసరమయ్యే ఆమ్లాలు విడుదల అవడానికి సహకరిస్తుంది.

6. స్టార్ అనీస్ (Star Anise)

స్టార్ అనీస్ ని తెలుగులో నక్షత్ర పువ్వు లేదా అనాసపువ్వు అని పిలుస్తూ ఉంటారు. ఇది మన వంటలకు చాలా మంచి సువాసనను అనుభూతిని కలిగిస్తాయి. రుచి, వాసనే కాకుండా వీటి వలన మన ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు తగ్గడానికి ఉపయోగపడతాయి మరియు జీర్ణ క్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడతాయి. వీటిని మసాలా కూరలు లేదా ముఖ్యంగా బిర్యానీ లో వాడుతూ ఉంటారు.

7. యాలకులు (Cardamom)

యాలకులు మన నోటి దుర్వాసన రాకుండా తగ్గిస్తాయి. వీటిని ప్రతినిత్యం తీసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అరుగుదలనే పెంచుతుంది. ఇంకా వీటిని మసాలా కూరల్లో మరియు కొన్ని రకాల స్వీట్లు కూడా ఉపయోగపడతాయి.

8. దాల్చిన చెక్క (Cinnamon)

దాల్చిన చెక్కని ప్రతినిత్యం తీసుకోవడం వలన మధుమేహం నియంత్రణలోకి వస్తుంది మరియు రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది.

9. మిరియాలు (Black Pepper)

మిరియాలు రుచికి చాలా కారంగా ఉంటాయి. వీటిని మనం వంటకాలలో ఎండుమిర్చికి బదులుగా కూడా వాడుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మనకి దగ్గును జలుబును తగ్గించడంలో ఉపయోగపడతాయి. మన శరీరం యొక్క మెటబాలిజంన్ని పెంచుతాయి.

10. తెల్ల మిరియాలు (White Pepper)

తెల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

11. బిర్యానీ ఆకు (Bay Leaf)

బిర్యానీ ఆకు ముఖ్యంగా మనం వండుకునే బిర్యానీలో తప్పకుండా వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి ముఖ్యంగా అజీర్తి సమస్యను పరిష్కరిస్తాయి.

12. కరివేపాకు (Curry Leaves)

కరివేపాకు ముఖ్యంగా మన యొక్క జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన వంటలకి ఒక రకమైనటువంటి మంచి రుచిని అందిస్తుంది. ఇవి మన జీర్ణ క్రియను పెరుగుపరిచి రక్తంలో చక్కని నియంత్రిస్తుంది.

13. గసగసాలు (Poppy Seeds)

గసగసాలు మన వంటలలో వాడినట్లయితే మన నిద్రలేమి సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా చిన్నగా ఉన్నప్పటికీ మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

14. మెంతులు (Fenugreek Seeds)

మెంతులు ముఖ్యంగా మధుమేహం తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన మెంతుల నీళ్లను తాగినట్లయితే మన రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. మరియు జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. ఇంకా ఇవి జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

15. ధనియాలు (Coriander Seeds)

ధనియాలు చూడడానికి చిన్నగా గుణంగా ఉంటాయి. ఇవి లేత గోధుమ రంగులో కొంచెం గరుకుగా ఉంటాయి. వీటి నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది.ధనియాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. మూత్ర సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.

ధనియాలని దోరగా వేయించి పొడిగా చేసి పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ దనియాలపొడిని అన్ని వంటలలో పచ్చళ్లలో ఉపయోగించవచ్చు.

16. వాము (Ajowan / Carom Seeds)

వాము ప్రతినిత్యం తీసుకోవడం వలన మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అందరూ చెప్తూ ఉంటారు. ఇది నిజంగా నిజమే.

వాము తినడానికి కొంచెం కారంగా ఉంటుంది. కానీ దాని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ రోజు చిటికెడు వాముని నోట్లో వేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కడుపు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాంతులు తగ్గడానికి గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

17. సోంపు (Fennel Seeds)

సోంపు చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది.

నోటిని శుభ్రపరచుకోవాలంటే మనం సోంపు కచ్చితంగా తినాల్సిందే మనం ఆహారం తిన్న తర్వాత కొంచెం సోంపుని నోట్లో వేసుకుని నమ్మినట్లయితే మన నోటి దుర్వాసన తగ్గుతుంది మరియు ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

18. నల్ల జీలకర్ర (Nigella Seeds)

నల్ల జీలకర్ర మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దీనిని నేరుగా ఆహారంగా తీసుకోవచ్చు మరియు జుట్టు ఆరోగ్యానికి నూనెలో కలిపి కూడా వాడుకోవచ్చు.

నల్ల జీలకర్ర మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇది చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీటిని జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగిస్తారు.

19. లవంగాలు (Cloves)

లవంగాలు అనేవి మనకు తరచూ వినేటువంటి మసాలా దినుసులు. వీటిని ముఖ్యంగా మనం బిర్యానీలో వాడుతూ ఉంటాము. ఇది చాలా ఘాటుగా ఉంటాయి. వీటివలన చెడు బ్యాక్టీరియా అనేది నశించి మన జీన వ్యవస్థను జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇంకా వీటిని దంతాల నొప్పిని తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఇది ఒక సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడుతుంది.

20. జాజికాయ (Nutmeg)

జాజికాయని చాలా తక్కువ మోతాదులో మనం వాడుకోవాలి. ఇది ముఖ్యంగా మన నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది .మానసిక ఆరోగ్యాన్ని పెంపుదిస్తుంది మన మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

21. జాపత్రి (Mace)

జాపత్రిని ముఖ్యంగా బిర్యానీలో వాడుతూ ఉంటారు. ఇది బిర్యానీకి మంచి రుచిని సువాసనని అందిస్తుంది. దీని వాడటం వలన మన జీర్ణక్రియ చాలా చురుకుగా పనిచేసి అజీర్తి సమస్య తగ్గుతూ వస్తుంది వీటిని కొన్ని రకాల తీపి తినుబండారాల్లో కూడా వాడుతూ ఉంటారు.

22. కుంకుమపువ్వు (Saffron)

కుంకుమపువ్వు ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పాలలో చిటికెడు కలుపుకుని తాగడం వలన గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది మరియు మానసిక ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గిస్తుంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది.

23. ఇంగువ (Asafoetida / Hing)

ఇంగువ రుచి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని మనం పప్పులు లేదా పచ్చళ్ళలో లేదా పొంగలి చేసినప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. దీని చాలా తక్కువ మోతాదులో వాడాలి.

24. కర్పూరం (Camphor)

కర్పూరం ముఖ్యంగా మనం మన పూజా కార్యక్రమంలో శుభం కలగడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేయడంలో మరియు దుర్వాసనను తొలగించడంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వీటిని మనకి జలుబు తగ్గించడానికి లేదా ముక్కు బ్లాక్ అయినప్పుడు తగ్గించడానికి వీటిని ఆవిరిలో వేసి ఆవిరి పడుతూ ఉంటారు.

25. కల్పాసి / రాయి పువ్వు (Stone Flower)

కల్పాసి ని రాతి పువ్వు లేదా రాయి పువ్వు అని పిలుస్తూ ఉంటారు. దీనిలో మంచి ఆంటీ బ్యాక్టీరియల్ మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ముఖ్యంగా బిర్యానీలో మంచి వాసన రుచి కోసం వాడుతారు. ఇది మా యొక్క ఆహారానికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచిని మరియు వాసనని అందిస్తుంది. ఇది చాలా తక్కువ మోతాదులో వాడేనా కూడా దీని యొక్క ప్రత్యేకత మనకి వంటలలో తెలుస్తుంది.

26. ఎండు మిరపకాయ (Dry Red Chilli)

మనం భారతీయ వంటలలో కారం కోసం ఈ ఎండు మిరపకాయలను వాడుతాము. ఎండు మిరపకాయలను ఎండబెట్టి పొడిగా చేసి వాటిని మనం కూరలలో వాడుకోవచ్చు. ఇది మనం శరీరం యొక్క మెటమాలిజాన్ని పెంచుతుంది. వీటిని తగిన మోతాదులో వాడుకుంటే ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఎక్కువగా వాడితే మాత్రం కడుపులో మంట వస్తుంది.

ఎండు మిరపకాయలు చూడడానికి ఎరుపు రంగులో ఉంటాయి.

27. పసుపు (Turmeric)

పసుపు ఒక సహజ సిద్ధమైనయాంటీబయటిక్ లా ఉపయోగపడుతుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ప్రతిరోజు మన వంటకాలలో పసుపును వినియోగించవచ్చు మరియు ఇది మన చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

పసుపు కొమ్ములని ఎండబెట్టి పొడిగా చేసి మన వంటల్లో వాడుకుంటారు ఇది పసుపుపచ్చని రంగులో ఉంటుంది.

How to Store Spices

మసాలాలను ఎప్పుడూ గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి. తేమ, సూర్యకాంతి పడని ప్రదేశంలో ఉంచాలి. పొడి మసాలాలను ఎక్కువకాలం నిల్వ చేయకుండా చిన్న పరిమాణాల్లో కొనడం మంచిది. సంపూర్ణ మసాలాలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

Whole Spices vs Powder Spices

సంపూర్ణ మసాలాలు అంటే పూర్తిగా ఉన్న మసాలాలు. ఉదాహరణకు జీలకర్ర, యాలకులు, లవంగాలు. పొడి మసాలాలు అంటే గ్రైండ్ చేసి తయారు చేసినవి. సంపూర్ణ మసాలాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొడి మసాలాలు త్వరగా వాసన కోల్పోతాయి. అయితే వంట సౌలభ్యం కోసం చాలామంది పొడి మసాలాలనే ఎక్కువగా వాడతారు.

Frequently Asked Questions (FAQ)

1. మసాలా దినుసులు అంటే ఏమిటి?

మసాలా దినుసులు అనేవి మన ఆహారానికి మంచి రుచి, వాసన, రంగు ఇవ్వడానికి ఉపయోగించే గింజలు, పొడులు లేదా ఆకులు. ఉదాహరణకు ధనియాలు, జీలకర్ర, మిరియాలు.

2. రోజూ మసాలాలు తినడం ఆరోగ్యానికి మంచిదా?

అవును వీటిని తగినంత మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి మన జైన క్రియను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వీటిని ఎక్కువగా తీసుకున్నట్లయితే కడుపులో మంట లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

3. పొడి మసాలాలు మరియు గింజల మసాలాల్లో ఏది మంచిది?

గింజల రూపంలో ఉన్న మసాలాలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. అవసరమైనప్పుడు పొడి చేసుకుంటే రుచి మరియు వాసన చెక్కుచెదరకుండా ఉంటుంది.

4. Indian Spices Names లో ముఖ్యమైనవి ఏమిటి?

ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క వంటి మసాలాలు ముఖ్యమైనవి.

Conclusion

భారతీయ సుగంధ ద్రవ్యాలు(Indian Spices) మన వంటలకు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. సరైన మోతాదులో, సరైన విధంగా మసాలాలు వాడితే ఆహారం రుచిగా ఉండటంతో పాటు శరీరానికి మేలు చేస్తుంది. ఇవిలో ఉన్న సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రోజువారీ ఆహారంలో మసాలాలను సమతుల్యంగా చేర్చడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని సులభంగా కొనసాగించవచ్చు.

Scroll to Top