Health benefits of andu korralu| Weight Loss

Health benefits of andu korralu for Weight loss: Brown Top Millet (Andu korralu in English) ని తెలుగు లో అండు కొర్రలు అంటారు.

అండు కొర్రలు ఒక సిరిధాన్యం (Positive Millet). ఇతర సిరిధాన్యాలు కొర్రలు, ఉదలు, అరికలు, సామలు.

అండు కొర్రలు(Brown Top Millet) మన ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాల్సిన ఒక విలువైన చిరుధాన్యం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పర్యావరణానికి కూడా చాలా అనుకూలం.

వంటకాల్లో దీనిని ఉపయోగించడం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయి. ఇది గ్లూటెన్-ఫ్రీగా ఉండటం వలన డయాబెటిక్ లు కూడా తినవచ్చు. అద్భుతమైన రుచి, పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలతో వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ఉత్తమం.

అండు కొర్రలలో 12.5% పీచు పదార్థం ఉంటుంది. ఇది ఇప్పటికీ కూడా అమెరికాలోని పొలాల్లో గడ్డి లాగా పెంచుతారు. ఇది వాళ్ళు తినకుండా పశువులకి పక్షులకి గడ్డిలాగా వేస్తారు. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు. ఇది చూడడానికి పైన గోధుమ రంగులో ఉండడం వలన బ్రౌన్ టాప్ మిల్లెట్ అని వచ్చింది.

Is Andu Korralu same as Korralu?

Health benefits of andu korralu for Weight loss
  • Foxtail Millet (Korralu)చూడటానికి పొడవాటి మరియు మృదువైన గింజలు ఉంటాయి. ఫాక్స్‌టెయిల్ మిల్లెట్ ప్రోటీన్, పీచు, మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఫాక్స్‌టెయిల్ మిల్లెట్ సాధారణంగా పప్పు, కీర, మరియు బియ్యంతో వంటకాల్లో ఉపయోగిస్తారు.
  • బ్రౌన్‌టాప్ మిల్లెట్ చిన్న, ఆకుపచ్చ పసుపు రంగు గింజలు ఉంటాయి. ఇది తేలికపాటి మరియు సాంప్రదాయమైన ధాన్యం. బ్రౌన్‌టాప్ మిల్లెట్ కూడా ప్రోటీన్ మరియు పీచుతో పాటు విటమిన్ బి, ఐరన్, మరియు మెగ్నీషియం వంటి పోషకాలు అందిస్తుంది. బ్రౌన్‌టాప్ మిల్లెట్ ముఖ్యంగా నడుగు, పూరి, మరియు ఇతర ఆహారాల్లో ఉపయోగిస్తారు. బ్రౌన్‌టాప్ మిల్లెట్ తేలికపాటి భూభాగంలో ఎక్కువగా పెరుగుతుంది.

అండు కొర్రల వలన కొర్రల వల్ల కలిగే లాభాలు అన్ని కలుగుతాయి మరియు వాటితో పాటు కాన్సర్ గుణాలు కూడా తగ్గుతాయి.

Brown Top Millet Uses:

  1. ఇప్పుడున్న జీవన శైలి వలన అందరికీ మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్ లాంటివి ఎక్కువయ్యాయి. అండు కొర్రలు తినడం వల్ల ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి.
  2. ఇంకా చాలా మంది మలబద్దక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే శరీరంలోని మలినాలు బయటికి వెళ్ళకుండా శరీరంలోనే ఉండి కొత్త కొత్త వ్యాధులను వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. ఈ సమస్య తీవ్రతరం అయితే మన ద్వారం ద్వారా మలద్వారం ద్వారా రక్తం పడడం, గుల్లలుగా రావడం, పైల్స్, ఫిషర్స్ లాంటి సమస్యలు రావడం చివరికి ఆపరేషన్ దారితీస్తుంది. వీటిని రాకుండా చేయాలంటే చేయాలను చిరుధాన్యాలు తప్పకుండా తినాలి. ఈ సమస్య తగ్గాలంటే పీచు పదార్థాలు తినాలి. ఈ అండ్ కొర్రలు తినడం వల్ల మనకి కావాల్సిన ఫైబర్ అందుతుంది దాని ద్వారా జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గి మలబద్ధకం కూడా తగ్గుతుంది.
  3. అండు కొర్రలులో ఆంటీ యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి వీటిని క్రమ పద్ధతిలో నిత్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ యొక్క గుణాలను తగ్గిస్తాయి

Health Benefits of Brown Top millets

Brown Top millet for Weight loss

ప్రస్తుతం భారతదేశంలో ఊబకాయ సమస్య పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకీ బరువు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే, ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలని చాలామంది డైటీషియన్లు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అలాగే రోగాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువలన, ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్తుంటారు.

అండు కొర్రలు కూడా మనం రోజు తినే వరి అన్నం లాగా వండుకుని తినే ఆహారం. దీనిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని కొద్ది మోతాదులో తినగానే మనకి పీచు పదార్థం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల దీనిని మనం తినాలన్నా కూడా ఎక్కువగా తినలేము. బరువు తగ్గాలనుకునేవారు మితంగా ఈ అండు కొర్రలు ఏదైనా కూరగాయల కూరతో తీసుకున్నట్లయితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఒకవేళ వరి అన్నం లాగా దీనిని కూడా ఎక్కువ మోతాదులో తిన్నట్లయితే బరువు తగ్గలేము. మనం ఏ చిరుధాన్యం తీసుకున్నా కూడా దానిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎలా తినాలో తినే పద్ధతిలో తిన్నట్లయితే బరువు కచ్చితంగా తగ్గుతాము. వీటిని తినడం వల్ల మనకి అరుగుదల బావుంటుంది, మలబద్ధకం సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి, ఇంకా ఇంకా వీటిలో ఉండే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతాయి. వీటిని తినడం వల్ల మనం ఆరోగ్యంగా బరువును తగ్గవచ్చు.

Brown Top millet for Diabetes: మధుమేహం నివారణకు అండు కొర్రలు

మధుమేహం అనేది దీర్ఘకాలిక కారణాల వలన వచ్చే వ్యాధి. దీనిని రివర్స్ కూడా చేయొచ్చు అని ఈ మధ్య చాలా మంది నిరూపిస్తున్నారు. మన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం ఈ రెండు మధుమేహానికి కానమవుతాయి కారణమవుతాయి. మన ఆహారపు అలవాట్లు మార్పులు మరియు నిత్య వ్యాయామం కచ్చితంగా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.

అండు కొర్రలు తినడం వల్ల ఇంతకుముందు చెప్పినట్లు దీనిలో ఉన్న పీచు పదార్థం నెమ్మదిగా జీర్ణమయ్యేలాగా చూస్తుంది. జీర్ణమయ్యాక కూడా గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలోకి విడుదల అయ్యేలాగా చూస్తున్నాం. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి తొందరగా పెరగదు. ఇంకా వీటిలో ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలోనే చక్కర స్థాయి అంత తొందరగా పెరగనివ్వదు.

వీటిని తింటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తగినంత నీరు తాగుతూ ఉన్నట్లయితే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Brown Top millet Nutritional Value Per 100g

Health benefits of andu korralu for weight loss: Nutrients
పోషక పదార్థంవిలువ
కేలరీలు378 కిలోకాలరీలు
ప్రోటీన్9.7 గ్రాంలో
కొవ్వులు4.5 గ్రాంలో
కార్బోహైడ్రేట్లు72.8 గ్రాంలో
పీచు (ఫైబర్)12.5 గ్రాంలో
కాల్షియం31 మిల్లిగ్రాములు
ఐరన్3.6 మిల్లిగ్రాములు
పొటాషియం268 మిల్లిగ్రాములు
మాగ్నీషియం82 మిల్లిగ్రాములు
విటమిన్ B1 (థియామిన్)0.30 మిల్లిగ్రాములు
విటమిన్ B2 (రిబోఫ్లావిన్)0.17 మిల్లిగ్రాములు
Nutrion of Andu Korralu

ఈ పట్టిక బ్రౌన్‌టాప్ మిల్లెట్ యొక్క ప్రధాన పోషక విలువలను సూచిస్తుంది. ఇవి ఆహారానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి..

How to Cook Brown Top Millet?

Health benefits of andu korralu for Weight loss-how to cook?

Ingredients

  • 1 కప్పు అండు కొర్రలు
  • 2 కప్పులు నీరు
  • ఉప్పు
  • నూనె

Method

  1. అండు కొర్రలను బాగా కడగండి.
  2. ఆ తర్వాత కొద్దిసేపు నీటిలో నానపెట్టండి.
  3. ఒక పాన్‌ను కొంచెం వేడిచేయండి.
  4. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి .
  5. నూనె వేడైన తర్వాత అండు కొర్రలను వేసి బాగా కలపండి.
  6. ఇప్పుడు రెండు కప్పులు నీరు మరియు ఉప్పు వేసి బాగా కలపండి.
  7. నీరు మరిగినంక మంటను తక్కువ చేసి మూత పెట్టండి.
  8. 15-20 నిమిషాలు వరకు ఉడకనివ్వండి.
  9. వంట పూర్తయిన తర్వాత, దాన్ని మిక్స్ చేసి, నిమ్మరసం లేదా కొత్తిమీరతో అలంకరించండి.

అండు కొర్రలను వేరే వేరే వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.

దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నాయా?

అండు కొర్రలను తిన్నప్పుడు కొంతమందికి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది మరియు అతిగా తిన్నప్పుడు ఇతర ధాన్యాలతో కలిపి తిన్నప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా సమస్యలు రావచ్చు.

Frequently Asked Questions

1. మధుమేహ రోగులకు అండు కొర్రలు మంచివా?

అవును. అండు కొర్రలు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారం. ఇవి రక్తంలో చక్కెరలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే మధుమేహ రోగులకు మంచివిగా భావిస్తారు.

2. అండు కొర్రలను ఎలా వంటలో ఉపయోగించాలి?

అండు కొర్రలను ఉప్మా, కిచిడి లాంటి వంటకాలలో ఉపయోగించవచ్చు. మొలకెత్తిన కొర్రలను సలాడ్లలో కూడా కలిపి తినవచ్చు.

3. అండు కొర్రలు ప్రతిరోజు తినవచ్చా?

అవును.అండ్ కొర్రలను ప్రతిరోజు తినవచ్చు. కానీ వీటివల్ల ఏవైనా అజీర్తి సమస్యలు ఉన్నాయా, అలర్జీలు ఉన్నాయా పరిశీలించుకోవడం ముఖ్యం. వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం మంచిది. వీటితో పాటు ఏ సిరి ధాన్యాలు కలపకుండా ఈ యొక్క ధాన్యాన్నే ఆహారం గా తీసుకోవడం మంచిది. ఒక వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే తినడం ఆరోగ్యకరంగా ఉంటుంది.

4. అందుకొర్రలతో పోలిస్తే కొర్రల (Foxtail Millet) లాభాలు ఏమిటి

అండుకొర్రలు (Brown Top Millet) మరియు కొర్రలు (Foxtail Millet) రెండూ సీరీధాన్యాలు (Siridhanyalu) లో భాగం. అయితే కొర్రలు ప్రొటీన్, మినరల్స్ ఎక్కువగా అందిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా కొర్రలు ఉపయోగపడతాయి. ఎక్కువ శక్తి అవసరమైనవారికి కొర్రలు మంచి ఎంపిక

5. ఉదలు (Barnyard Millet) మరియు అందుకొర్రలు – ఏది ఆరోగ్యానికి మంచిది

ఉదలు (Barnyard Millet) మరియు అందుకొర్రలు రెండూ సీరీధాన్యాలలో ఉంటాయి. ఉదలు అధిక ఫైబర్ కలిగి ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరం. అందుకొర్రలు తేలికగా జీర్ణమవుతుంది మరియు రోజువారీ ఆహారంలో కలిపి తినడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి మిల్లెట్ కు ప్రత్యేకమైన లాభాలు ఉంటాయి, అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

Conclusion

అండు కొర్రలు(Brown Top Millet) తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ప్రతి రోజు అతిగా తిన్నట్లయితే కచ్చితంగా దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ చిరుధాన్యమైన ఏ ఆహారమైన మితంగా ఔషధంగా తిన్నట్లయితే దాని గుణాలు మన వ్యాధిని తగ్గిస్తాయి. ఈ అండు కొర్రలను వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం మంచిది. ఇంకా ఈ అండు కొర్రలు వల్ల వచ్చే గుణాలు ఒక వ్యాధిని తగ్గిస్తాయి అనుకుంటే, ఆ వ్యాధి తగ్గడానికి అండు కొర్రలు మాత్రమే తీసుకోండి. కానీ ఈ అండుకొరలని వేరే ధాన్యాలతో కలిపి తీసుకున్నట్లయితే మనకి వ్యాధి అనేది కచ్చితంగా తొందరగా తగ్గదు.

మనకి ఒక్కొక్క చిరుధాన్యం తినడం వల్ల ఒక్కొక్క అవయవంశుద్ధి అవుతుంది, ఒక్కొక్క వ్యాధి తగ్గుతుంది. మన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా , మన వ్యాధి దృష్ట్యా మనం ఏ చిరుధాన్యం తినాలో దానిని కన్సిస్టంట్ గా కొన్ని రోజులు తినడం వల్ల మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఆహారాన్ని మనం ఔషధం లాగా వాడుకోవాలి, కానీ అందరూ ఆహారాన్ని అతిగా తిని దాని ఔషధ గుణాలు మన శరీరం గ్రహించకుండా చేస్తున్నారు. దీనిని గుర్తు పెట్టుకున్నట్లయితే ఏ ఆహారం అయినా మితంగా తిన్నప్పుడు అది మనకి ఔషధం లాగా పని చేస్తుంది.

Read Also

Some other types of millets

Scroll to Top