Top 3 Arikelu Benefits| రక్తాన్ని శుద్ధి చేయాలంటే అరికలు తినాల్సిందే

Arikelu Benefits: ప్రాంతాన్ని బట్టి అరికలను రకరకాల పేర్లతో పిలుస్తారు. దీనిని ఇంగ్లీషులో కోడో మిల్లెట్ (Kodo Millet ) అంటారు. వీటిలో అనేక రకాల వ్యాధులను తగ్గించే ఔషధ గుణాలు చాలా ఉంటాయి.

Arikelu Benefits

అరికెలు ఆరోగ్యానికి మంచిదా?

చిరుధాన్యాల గురించి మనం విన్నట్లయితే అరికెలను తప్పకుండా ఎప్పుడో ఒకసారి మనం వినే ఉంటాము. ఈ చిరుధాన్యాలలో అరికలు అనేవి చాలా ముఖ్యమైనవి. అన్ని చిరుధాన్యాలు ధాన్యాలలో లాగానే వీటిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. అరికలు మనకు చేసే మేలు అంతా, ఇంత కాదు. ఈ అరికలను రోజు వాడటం వలన రక్తహీనత తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు బలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ వయసు వారైనా ఈ అరికలను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు కానీ ఒక పద్ధతిలో తినడం చాలా ముఖ్యం.

Arikelu Benefits-nutrition

Arikelu Millet Benefits: ఆరోగ్య ప్రయోజనాలు:

అన్నీ సిరి ధాన్యాలలో లాగానే దీనిలో కూడా మంచి ఫైబర్, ప్రోటీన్లు, పోషక విలువలు, ఐరన్ చాలా ఉన్నాయి. ఇవి మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా అరికల వలన కొన్ని అవయవాలు శుద్ధి అవుతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అరికల వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకొని కొన్ని రోజులపాటు తినడం వలన మంచి ఫలితాలు వస్తాయి.

1. అరికలు రక్తశుద్ధికి ఎలా ఉపయోగపడతాయి?

రక్తం మన శరీరంలో ప్రతి అవయవం నుండి ఆక్సిజన్ ని, పోషకాలను ఇంకొక అవయవానికి చేరవేస్తుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్ ను మన ఊపిరితిత్తుల ద్వారా ఇతర భాగాలకు తీసుకెళ్లి కార్బన్డయాక్సైడ్ ని తిరిగి ఊపిరితిత్తుల వరకు తీసుకొస్తాయి. ఇవి మన శరీరంలోని అన్ని రకాల పోషకాలను అవసరమైన భాగాలకు అందిస్తుంది. మన శరీరాన్ని అన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ ల నుంచి రక్షిస్తుంది. ఇలాంటి రక్తం శుద్ధంగా లేక పోతే మన శరీరంలో అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మనం మన రక్తాన్ని శుద్ధి చేసుకోవడం వల్ల శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ అరికలలో ఉండే మంచి గుణం ఏంటంటే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అరికలలో ఉండే పొట్టు మరియు పీచు పదార్థంం రక్తం ఏర్పడడానికి కారణం అయ్యే మూల మజ్జం శుభ్రం చేస్తుంది. అరికెలను రోజు తీసుకోవడం వలన ఏ రోజుకు ఆ రోజు ఈ ఎముక అనేది శుద్ధి అవుతుంది మొత్తం పల్చబడి మన శరీరం మొత్తం అన్ని అవయవాలకి సరఫరా అవుతుంది. ఇలా శుభ్రపడిన రక్తం అన్ని అవయవాల గుండా వెళుతూ ఏమైనా రక్తనాళాలు అడ్డంకులు ఉన్నా కూడా తొలగిస్తూ వేరే ఏమైనా టాక్సిన్స్ ఉన్నా వాటిని కూడా తొలగిస్తూ శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. అందువలన మనం అరిగలను ప్రతి వారం ఒక మూడు రోజులు తప్పకుండా తినాలి. రక్తం శుద్ధి అవడం వలన మన చర్మం లోపల నుంచి చాలా ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. మూత్రశయం శుభ్రపడుతుంది మరియు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

2. నిద్రలేమిని అరికడుతుంది

మన శరీరంలో వచ్చే చాలా రకాల వ్యాధులకు నిద్రలేమి ఒక ముఖ్యమైన కారణం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాల సమస్యలు. అవి శరీరంలో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు లేదా ఆఫీస్ లల్లో కావచ్చు. సమస్య ఏదైనా మన మెదడు ఒత్తిడికి గురి అవుతూనే వస్తుంది. ఈ ఆలోచనల వల్ల రాత్రి నిద్ర పట్టడానికి చాలామంది టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. ఈ సమస్యని మనం అరికలతో తగ్గించుకోవచ్చు.

అరికలతో(kodo millet) లేదా ఆకులతో మంచి కషాయం తర్వాత తయారు చేసుకొని వారానికి మూడుసార్లు తీసుకున్నట్లయితే ఈ నిద్రలేమి సమస్య దాదాపు తగ్గిపోతుంది.

Arikelu Benefits

3. అరికలు బరువు తగ్గడానికి మరియు పెరగడానికి

బరువు పెరగడానికి మరియు బరువు తగ్గడానికి (weight loss)కూడా అరికలు ఉపయోగపడతాయి. ఎలా అనుకుంటున్నారా? కొంతమందికి బరువు తగ్గడమే కాదు బరువు పెరగడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది అరికెలతో సాధ్యమవుతుంది.

అరికలను వారానికి మూడుసార్లు మరియు ఇతర చిరుధాన్యాలను రోజుకు ఒకటి చొప్పున నాలుగు రోజులు మొత్తం ఏడు రోజులు ఈ సిరి ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇలాగా ఒక ఆరు నెలలు నుండి 8 నెలలు చేసినట్లయితే మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. లావుగా ఉన్న వారు చాలా సన్నబడతారు. అదేవిధంగా ఇదే పద్ధతిలో ఒక ఆరు నెలలు తిన్నట్లయితే చాలా సన్నగా ఉన్నవారు బలం పెరిగి లావుగా మారుతారు. ఇదే చాలా సన్నగా ఉన్న వారికి బలాన్ని ఇచ్చి లావుగా చేస్తుంది. అదే లావుగా ఉన్నవారికి అనవసరమైన కొవ్వును కరిగించేలా చేస్తుంది. ఇదే అరికలలో ఉండే గొప్పగుణం.

Recipe: అరికల కషాయం (Kodo Millet Kashayam)

Arikelu Benefits :అరికల కషాయం (Kodo Millet Kashayam)

అవసరమైన పదార్థాలు:

  • అరికలు, అరికల ఆకులు
  • నీరు-2 కప్పులు
  • యాలకులు-1 లేదా 2
  • అల్లం- చిన్న ముక్క
  • తేనె

తయారీ విధానం:

  1. అరికలను లేదా ఒక గుప్పెడు అరికెల ఆకులను తీసుకొని నీటిలో వేసి 15 నిమిషాలు బాగా మరిగించాలి.
  2. నీటిలో ఒక చిన్న ముక్క యాలకులు వేసుకోవాలి.
  3. ఇవి బాగా మరిగిన తర్వాత సగానికి సగం నీరు తగ్గిపోతుంది.
  4. కావాలనుకుంటే కొంచెం తేనె వేసి కలుపుకోవచ్చు.
  5. అంతే అరికల కషాయం సిద్ధమైనట్లే.
  6. ఈ కషాయం ఆరోగ్యానికి మంచిది. రోజూ ఉదయాన్నే తాగితే శరీరంలో మంచి మార్పులు వస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • రక్తంలో టాక్సిన్స్ బయటికి పంపించబడతాయి.
  • జీర్ణ వ్యవస్థ సుప్రబడుతుంది.
  • శరీరంలో సహజంగా శక్తి పెరుగుతుంది.

Conclusion

మన ప్రకృతిలో లభించే సిరి ధాన్యాలు మనకి వరమనే చెప్పవచ్చు. ప్రతి ఒక సిరి ధాన్యం ఒక్కొక్క అవయవానికి ఆరోగ్యానికి ఇస్తుంది. ఈ సిరి ధాన్యాలతో రకరకాల కషాయాలు తయారు చేసుకుని నిత్య జీవితంలో వాడటం వలన మనకి వచ్చే వ్యాధులు తగ్గిపోతాయి. ముందు జాగ్రత్తగా రాకుండా ఉండాలంటే ఈ సిరి ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అరికలు ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేసే మన శరీరాన్ని వ్యాధులు రాకుండా అధిగమించడానికి ఉపయోగపడుతుంది. దీనిని రోజు మనకు నచ్చిన విధంగా ఆహారం చేసుకోవచ్చు లేదా దీనితో కషాయాలు కూడా తయారు చేయవచ్చు.

మన దేశంలో ఆరోగ్యపరంగా చాలా విజ్ఞానం దాగి ఉంది. కానీ దానిని కాదని పిజ్జాలు బర్గర్లు ఇలాంటి ఆహారానికి అలవాటు పడి లేనిపోని వ్యాధులను కొన్ని తెచ్చుకుంటున్నారు. దేశంలో హాస్పిటల్స్ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఇవన్నీ తగ్గాలంటే మనం మన దేశ సంస్కృతిని, సాంప్రదాయ ఆహారాలని, మన ఆహార పద్ధతులను తిరిగి అవలంబించడం నేర్చుకోవాల్సిందే.

Frequently asked Questions?

1. అరికలు అని వేటిని అంటారు

అరికలు ప్రాచీన కాలం నుండి ఆహారంలో భాగంగా కానీ ఇప్పటి జనరేషన్ వారికి చాలా మందికి తెలియకపోవచ్చు చిరుధాన్యాలలో చాలా ముఖ్యమైన ధాన్యం ఈ అరికలు ఇది ముఖ్యంగా మన రక్తాన్ని శుభ్రపరచడానికి మరియు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

2. అరికెలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అరికలు చక్కెర వ్యాధిని అరికట్టడానికి, రక్తంలోని టాక్సిన్స్ ని తొలగించడానికి, బరువు తగ్గడానికి, నిద్రలేమికి ఉపయోగపడుతుంది.

3. డయాబెటిస్ ఉన్నవారు అరికెలు తినవచ్చా?

అవును. ఈ అరికెల్లో ఉండే తక్కువ గ్లైజామిక్ ఇండెక్స్ అనేది మన రక్తంలోనికి గ్లూకోస్ ని చాలా నెమ్మదిగా రిలీజ్ అయ్యేలాగా చేసి మన డయాబెటిక్ పేషంట్ కి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

4. అరికెలను ఎలా వండాలి?

అరికలను ఎలా వండినా కూడా ముందు నానబెట్టుకోవడం ముఖ్యం. వీటితో అన్నం కిచిడి పొంగలి దోశలు కషాయాలు చేసుకోవచ్చు.

5. అరికలను ఏ వయసు వారైనా తినవచ్చా?

చిరుధాన్యాలు అందరికీ మంచివే కానీ వీటిని ఎక్కువగా పరిమితి లేకుండా తిన్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా మితంగా రవ్వలాగా లేదా పొడి లాగా చేసి ఆహారంలో చేరిస్తే అచీతి సమస్యలు రాకుండా ఉంటాయి.

6. అరికలు ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు?

ఏ చిరుధాన్యాల నైనా కూడా తేమ తక్కువగా ఉన్నచోట మరియు చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే 6 నెలల నుండి ఒక సంవత్సరం దాకా ఉంటాయి.

7. అరికెలు మాంసాహారంతో కలిపి తినవచ్చా?

అవును తప్పకుండా తినవచ్చు. అరికెలు మాంసాహారంతో పాటు పచ్చిమిర్చి, కూరగాయలతో కూడా కలిపి తినవచ్చు.

8. అరికెలు రోజుకు ఎంత తినాలి?

అరికలు రోజుకి ఒక 50 గ్రాములు తిన్నా కూడా మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు కన్నా ఎక్కువగా తినకపోవడం మంచిది.

Read Also

We have Different Types of Millets

Scroll to Top