Barnyard Millet In Telugu Uses:
తెలుగులో బార్న్‌యార్డ్ మిల్లెట్ ని ఊదలు(Udalu) అని అంటారు.
Table of Contents
ఊదలని జపనీస్ మిల్లెట్ అని కూడా అంటుంటారు. సిరి ధాన్యాలలో ఊదలు కూడా ఒకటి.
ఈ సిరి ధాన్యం రుచికి చాలా తియ్యగా ఉంటుంది.
ఊదలు దీనిని ఎక్కువగా ఆసియా ఖండంలోనే పండిస్తారు. మన దేశంలోని ఉత్తరాఖండ్‌లో ఈ ఊదలను ఎక్కువగా పండిస్తారు. అలాగే తమిళనాడులోని పర్వత ప్రాంతాలలో కూడా వీటిని పండించడం జరుగుతుంది.

దీనిలో 10% పీచు పదార్థం ఉంటుంది . చూడటానికి కొంచెం లేత గోధుమ రంగు లో ఉంటుంది. సామలు ఊదలు చూడడానికి దాదాపు ఓకే లాగా అనిపిస్తాయి. మనం వీటిని వండకముందు మాత్రమే గుర్తుపట్టగలము. వండిన తర్వాత గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది.
To know more about millets read the article” Top 12 types of millets” in English.
ఈ ఊదలతో తయారైన ఆహారం చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకా సులభంగా కూడా జీర్ణమవుతుంది. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, మరియు ఫైబర్ వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఊదలు తినడం వలన ఆరోగ్యానికి కలిగే మేలును ఇప్పుడు తెలుసుకుందాం.
ఊదలు మిల్లెట్లలో పోషక విలువలు: (Nutrition Values in Barnyard Millets in Telugu)
పోషకతత్వం | పరిమాణం (100 గ్రాములకు) |
---|---|
కలరీస్ | 350 కేలారీ |
ప్రోటీన్ | 11-12 గ్రాములు |
కార్బోహైడ్రేట్లు | 70-75 గ్రాములు |
ఫైబర్ | 8-10 గ్రాములు |
తైలాలు | 2-3 గ్రాములు |
కాల్షియం | 30-40 మిల్లిగ్రాములు |
ఐరన్ | 10-15 మిల్లిగ్రాములు |
మాగ్నీషియం | 100-120 మిల్లిగ్రాములు |
ఫాస్ఫరస్ | 60-70 మిల్లిగ్రాములు |
విటమిన్ B1 | 0.2-0.3 మిల్లిగ్రాములు |
విటమిన్ B2 | 0.1-0.2 మిల్లిగ్రాములు |
Health Benefits & Barnyard Millets in Telugu Uses
ఊదలతో కాలేయం పదిలం
లివర్ అనేది మన శరీరంలోనే అతి పెద్ద గ్రంధి. ఇది మన శరీరంలోని అన్ని రకాల పనులను, ముఖ్యంగా జీర్ణక్రియ జరగడానికి, పోషకాలను నిల్వ చేయడం లాంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. లివర్ ముఖ్యమైన సమస్యల్లో హెపటైటిస్ వ్యాధి ఒకటి. ఇది వైరస్ కారణంగా వచ్చింది వ్యాధి వీటిలో హెబరైటిస్ ఏసి మరియు డి ఉంటాయి. ఇంకా లివర్లో జాండీస్, క్యాన్సర్స్ మరియు ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఊదలలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యల నుండి కాపాడుతాయి.
ఊదలలో ఉండే పీచు పదార్థం కాలేయంలోని టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఫ్యాటీ లివర్ సమస్య బాగా కొవ్వు పేరుకుపోయిన వాళ్లకి వస్తుంది. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు ల్ని కరిగించడానికి ఊదలు ఉపయోగపడతాయియి. ఊదలలో ఉండే ఐరన్,మెగ్నీషియం లివర్ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆల్కహాల్ తగడం వల్ల లివర్లో చాలా సమస్యలు వస్తాయి. ఇంకా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కూడా లివర్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వీటి నుంచి కూడా ఊదలు ఉపయోగపడతాయి.
మూత్రాశయ ఆరోగ్యానికి ఊదలు
మూత్రశ్యంలో మూత్రం నిల్వ చేయబడుతుంది. వీటిలో వచ్చే సమస్యల విషయానికి వస్తే ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI), తరచూ మూత్ర విసర్జన, మూత్రం మీద కంట్రోల్ లేకపోవడం ఇలాంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఊదలని తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలన్నీ తగ్గించవచ్చు.
ముఖ్యంగా ఆంటీ బ్యాక్టీరియాల్ లక్షణాల వలన UTI రాకుండా చేయవచ్చు. ఇంకా దీంట్లో ఉండే పీచు మూత్రంలో ఖనిజాలను కరిగేలా చేసి రాళ్లు ఏర్పడకుండా చూసుకుంటాయి. వీటిలో ఉండే పోషకాలు ఏవైనా చెడు పదార్థాల ఉంటే బయటికి పంపిస్తా పంపిస్తాయి.

ఊదలు బరువు తగ్గించడానికి
ఊదలు తక్కువ కాలరీలు కలిగిన ధాన్యాలు, కాబట్టి బరువు తగ్గడానికి(Weight Loss) ఉపయోగపడతాయి. 100 గ్రాములు ఉదలలో దాదాపుగా 350 క్యాలరీల శక్తి లభిస్తుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది.అందువల్ల మనం కొంచెం ఊదలతో చేసిన ఆహారం తినగానే ఆకలి తగ్గిపోయి పొట్ట నిండుగా ఉన్నట్లు మనకి తృప్తిగా ఉంటుంది.అందువల్ల మన శరీరానికి తక్కువగా కలరీలు అందుతాయి మరియు ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. దీనివల్ల పొట్టలో ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతూ వస్తుంది మరియు వీటిని ఆహారంలో చేర్చుకుంటూ సరైన పద్ధతిలో వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే బరువు తగ్గడం అంతా కష్టమేమీ కాకపోవచ్చు
జుట్టుకు ఊదలు కలిగించే మేలు
ఉదలలో ఉన్న పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు మరియు ఆహారఫైబర్ జుట్టు నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి. ఉదలలోని ఐరన్ మరియు మాగ్నీషియం జుట్టు వృద్ధికి మరియు శక్తివంతంగా ఉండడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ ధాన్యాన్ని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల జుట్టు పుడక, పలచగా కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా జుట్టు మెరుగు పొందడంతో పాటు, దృఢంగా, పొడవుగా పెరుగుతుంది.
ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా కూడా జుట్టు రాలిపోతుందనే ఎక్కువగా చెప్తూ ఉన్నారు. జుట్టు పెరగాలంటే షాంపూలు వాడడం వలన, బయట ఇంకా ఏమైనా ప్యాక్ వేయడం వలన వేయడం వలన ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు. మన శరీరం లోపల నుంచే జుట్టుకు మంచి పోషణ అందితే జుట్టు బలంగా పొడవుగా పెరుగుతూ ఉంటుంది. తొందరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది. ఈ ఉదలలో జుట్టును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు చాలా ఉన్నాయి. ఉదలలో ఐరన్, మెగ్నీషియం జుట్టు బలంగా పెరగడానికి దోహదపడతాయి.
చర్మ ఆరోగ్యానికి
మనకు తెలిసి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలని కోరుకొని వారు ఎవరు ఉండరు. వాతావరణ కాలుష్యం వలన, ఎండ వలన చర్మానికి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ ఉదలని తినడం వలన మొటిమలు మరియు చర్మ ఎలర్జీలు దాదాపుగా తగ్గిపోతాయి. వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ని తొలగిస్తాయి. అందువలన చర్మం శుభ్రపడుతుంది, మంచి తేమ అందుతుంది. చర్మంలో మెరుపు వస్తుంది.
చక్కర వ్యాధికి
దాదాపు అన్ని సిరి ధాన్యాలలో గ్లైజమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలోనే గ్లూకోస్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఈ ఊదలలో ఉండే ఫైబర్ ఫైబర్ గ్లూకోస్ ని రక్తం లోకి నెమ్మదిగా విడుదల చేసి అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. దీనివల్ల చక్కర స్థాయి ఒక స్థిరమైన లెవెల్లో ఉంటుంది. చక్కెర వ్యాధి నియంత్రణకు దీనిని మితంగా నిత్యం తీసుకుంటూ ఉండాలి.
Barnyard Millet Side Effects
ఊదలను మితంగా తిన్నంతవరకు ఎలాంటి సమస్య రాదు. దీనిని ఎక్కువగా తీసుకుంటే దీనిలో ఉండే ఫైబర్ వలన ఏవైనా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే లేదా చిన్న పిల్లలకు ఈ ఊదలను ఆహారంగా పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం.
Recipes: ఊదలను ఎలా వండాలి?
ఊదలు ఉప్మా (Barnyard Millet Upma)

కావాల్సిన పదార్థాలు:
- ఊధలు (Barnyard Millet) -1 కప్పు
- నీరు -2 కప్పులు
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -2
- ఆవాలు – ½ టీస్పూన్
- జీలకర్ర – ½ టీస్పూన్
- కరివేపాకు
- ఉప్పు
- నూనె
తయారుచేసే విధానం:
- మొదటగా ఊధలని తీసుకొని బాగా శుభ్రంగా కడిగే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.
- ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి కూరగాయ దోరగా వేయించాలి.
- తర్వాత కరివేపాకు, రెండు కప్పుల రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి.
- తగ్గినంత ఉప్పు వేసి కలపాలి మీరు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన ఊదలను వేసే కలపాలి.
- పది నిమిషాలు ఉడికిన తర్వాత నీరు పూర్తిగా ఆవిరి అయిపోతుంది.
- తర్వాత ఉప్మాను వేడివేడిగా చట్నీతో సర్వ్ చేయాలి.
- మనకు ఇష్టమైతే క్యారెట్, టమాటా ,క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
- ఊదల ఉప్మాలో చాలా తక్కువ తక్కువ కాలరీలు మరియు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది.
- బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఆహారం.
Conclusion
ఊదలు చాలా తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంట. కానీ మన శరీరానికి మంచి బలాన్నిస్తుంది. మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన కాలేయ రోగాలు మరియు మూత్రాశయ రోగాలు మరియు క్యాన్సర్ తగ్గిపోతాయి.
Frequently Asked Questions?
బార్న్‌యార్డ్ మిల్లెట్ అంటే ఏమిటి?
బార్న్‌అంటే ఒక చిన్న ఫామ్ లో, పెరట్లో సులభంగా గడ్డి లాగా పెరిగే పంట. అందువలన దీనినిబార్న్‌యార్డ్ అని అంటుంటారు. దీనిని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు తెలుగులో ఊదలు అని అంటారు. ఇది సిరి ధాన్యాలలో ఒకటి. దీనితో శరీరానికి మంచి బలము మరియు పోషణ అందుతాయి.
ఊదలను ఎలా వండాలి?
మొదట ఊదలతో ఏ ఆహారం చేసే ముందు అయినా రెండు గంటలసేపు నానబెట్టుకుంటే మంచిది. అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటితో అన్నం వండుకోవచ్చు లేదా ఉప్మా, కిచిడి చేసుకోవచ్చు.
బార్న్‌యార్డ్ మిల్లెట్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
బార్న్‌యార్డ్ మిల్లెట్ ముఖ్యంగా లివర్సం బంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు గాల్ బ్లాడర్ లో ఏవైనా రాళ్లు ఏర్పడితే వాటిని కరిగిస్తుంది.
ఊదలను వంటకాలలో ఎలా ఉపయోగించవచ్చు?
బార్న్‌యార్డ్ మిల్లెట్‌ను పులుసు, సాంబారు, పావు, మరియు పులావ్‌లలో ఉపయోగించవచ్చు.
ఊదలు గ్లూటెన్-రహితమా?
అవును. బార్న్‌యార్డ్ మిల్లెట్ గ్లూటెన్-రహితమై ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు ఇది అనుకూలం.
ఊదలను ఎక్కువ కాలం నిలువ ఉంచవచ్చా?
తగినటువంటి వాతావరణ పరిస్థితి లేకపోతే ఊదలు ఎక్కువ కాలం నిలువ ఉండలేవు. వీటిని రిఫ్రిజిరేటర్ లో ఉంచడం మంచిది.
ఊదలు ఏ అవయవాలని శుద్ధి చేస్తుంది?
ఊదలు ముఖ్యంగా కాలేయం మరియు యూరినరీ గాల్ బ్లాడర్ సమస్యలను తగ్గిస్తుంది.