Phool Makhana In Telugu meaning
Phool Makhana In Telugu: ‘ఫూల్ మఖానా’ లేదా ‘ఫాక్స్ నట్స్(Fox nuts)’ ను తెలుగులో ‘తామర గింజలు‘ అని పిలుస్తూ ఉంటారు.ఈ మఖానా మనకి తామర చెట్టు నుండి వచ్చే విత్తనాలు లేదా గింజలు.అందువలన వీటిని ‘లోటస్ సీడ్స్'(Lotus Seeds) అని కూడా పిలుస్తారు.
ఫూల్ మఖానా ని దోరగా వేయించి మనం ఆహారంగా తీసుకున్నట్లయితే మంచి పోషకాలు మనకు అందుతాయి. ఇవి మనం ఆహారంగా తీసుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేకమైన ఆహారంగా కూడా మనం అప్పుడప్పుడు తినవచ్చు.
తామర గింజలు(Phool Makhana In Telugu) చూడటానికి గోధుమ మరియు తెలుపు రంగు కలయికలో ఉంటాయి. ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్న గింజలు. ఖర్చు ఎక్కువ అయినప్పటికీ వీటిలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
ముఖ్యంగా దీనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది క్యాల్షియం, మెగ్నీషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా రకరకాల పోషకాలు ఉంటాయి వీటిని ముఖ్యంగా పిల్లలకి పెట్టడం వలన వారి ఎదుగుదలకు సహాయపడతాయి.
Benefits of Phool Makhana:ఈ ఫుల్ ముఖానాలో ఉండే మెగ్నీషియం వలన మన రక్తపోటు అనేది తగ్గించడానికి మరియు బ్లడ్ ప్రెషర్ పెరగకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా లివర్ డిటాక్సిఫికేషన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
Phool Makhana పోషకాల పరంగా చూస్తే మనకి చియా, ఫ్లాక్స్ లాంటి విత్తనాల లాగానే ఎక్కువగా ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. అయితే వాటితో పోలి చూసినప్పుడు మఖాన అనేది చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం.
ఒక గుప్పెడు మఖాన తినడం వలన మనకి తొందరగా శక్తి లభిస్తుంది.
మనకి తామర పూలు, తామర చెట్లు అందరికీ తెలుసు కానీ వాటి గింజలను తింటారని మాత్రం చాలా మందికి తెలియదు ఈ మధ్యకాలంలో వీటివాటకం పెరుగుతూ వస్తుంది తామర చెట్టు నుంచి వచ్చే గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వలన మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వీటిని స్నాక్స్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు
Table of Contents
Top 10 Benefits Of Phool Makhana
Benefits Of phool makhana: ఫూల్ మఖానా ఆరోగ్యానికి అనేక లాభాలను అందించే ఒక పోషకాహార ఆహారం. దీనిలో ఉన్న విటమిన్లు, మినరల్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి.
1. ఎముకల దృఢత్వం కోసం – క్యాల్షియం
మనకందరికీ తెలిసిన విషయమేమిటంటే దంతాలు, ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాల్షియం అనేది పాలల్లోనే ఎక్కువగా ఉంటుంది అనేది అందరూ అపోహ కానీ క్యాల్షియం దొరికే ఆహార పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి. దానిలో మఖానా ఒకటి.
మఖానా(Makhana) లో ప్రతి 100 గ్రాములలో సుమారు 60 మిల్లీగ్రాములు క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు మరియు దంతాలకు బలం ఇచ్చే ముఖ్యమైన మినరల్. వృద్ధుల్లో ఒస్టియోపోరోసిస్ను నివారించడంలో సహాయపడుతుంది. మఖాన తీసుకోవడం వల్ల మనకి కావాల్సినటువంటి క్యాల్షియం అనేది కొంత వరకు మనకు లభిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు పైబడిన వారికిక్యాల్షియం ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎముకలు మరియు దంతాలకు బలం ఇచ్చే ముఖ్యమైన పోషకాహారం.
వృద్ధుల్లో ఒస్టియోపోరోసిస్ వలన ఎముకలు ఫ్రాక్చర్ అవడం, విరగడం తరచూ చూస్తూ ఉంటాం. అందువలన వృద్ధులు క్రమం తప్పకుండా మఖానను తమ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉపయోగం.
2. కండపుష్టి కోసం – ప్రోటీన్
మన శరీరం దృఢంగా ఉండాలన్న, కండబలం పెంచుకోవాలన్న ప్రోటీన్ ఎంతో అవసరం.
100 గ్రాముల మఖానాలో 9.7 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఇది మన కండరాలను పెంచడానికి ఏవైనా సమస్యలు ఉంటే సరి చేయడానికి ఈ పోషక పదార్థం ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాయామం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అలాంటివారికి ఈ మఖాన అనేది ఒక మంచి ప్రోటీన్ స్నాక్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు.
3. గుండె ఆరోగ్యం కోసం– పొటాషియం & తక్కువ కొవ్వు
మన శరీరం యొక్క రక్తపోటు అనేది సాధారణ స్థితిలో నియంత్రణలో ఉండాలంటే మనకి కావాల్సినంత పొటాషియం తీసుకోవడం చాలా అవసరం. అనేది సోడియం స్థాయిలను నియంత్రిస్తుంది మరియు మీ మన శరీరంలో గుండెలో వచ్చే వ్యాధులను వ్యాధులను తగ్గిస్తుంది.
మఖానాలో పొటాషియం సుమారు 500 మిల్లీగ్రాములుఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
అదేవిధంగా ఇందులో తీసుకుంటే కేవలం 0.5 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం కాబట్టి రక్తనాళాలు బ్లాక్స్ఏ ర్పడకుండా చూసుకుంటుంది. వీటివలన గుండెపోటు వచ్చే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
4. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ – కార్బోహైడ్రేట్స్
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన రక్తంలోని చక్కర స్థాయిలు తొందరగా పెరగవు. కార్బోహైడ్రేట్స్ చాలా నెమ్మదిగా రక్తంలోకి గ్రహించబడతాయి.
మఖానాలో 76.9 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వలన రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి అనుకూలం.
5. హిమోగ్లోబిన్ పెరగడానికి – ఐరన్
మనకి శరీరంలో ఆక్సిజన్ మంచిగా సరఫరా కావాలన్నా రక్తహీనత తగ్గాలన్న కూడా ఐరన్ అనేది చాలా ఉపయోగపడుతుంది.
100 గ్రాముల మఖానాలో 1.4 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తహీనత (అనీమియా) నివారణకు ఉపయోగపడుతుంది. శరీరంలోని హిమోగ్లోబిన్న పెంచుతుంది . అందువలన మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది.
6. మానసిక ఆరోగ్యం కోసం– మెగ్నీషియం
మనకి శరీరారోగ్యమైనది మానసిక స్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన జీవన శైలి వలన మన జీవన శైలి వలన ఒత్తిడి అనేది చాలా పెరుగుతుంది. అందువలన ఆ రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మన ఒత్తిడిని తగ్గించడానికి మెగ్నీషియం అనేది మంచి మూలకం.
మఖానాలో 67 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది మన నరాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది. ఇంకా మన మానసిక మానసికంగా ఏవైనా సమస్యలు ఉంటే, సమస్యలు ఉంటే ఒత్తిడిని తగ్గించడానికి మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.
7. జీర్ణవ్యవస్థకు మంచిది – ఫైబర్
మన జీర్ణ వ్యవస్థ అనేది మన శరీరంలోని అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణం అవుతుంది. మన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవడం వలన చాలావరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
మఖానాలో 7.6 గ్రాములు ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ధకం సమస్యని రాకుండా చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది.
8. త్వరగా శక్తి రావడం కోసం– కేలరీలు + కార్బోహైడ్రేట్స్
మనకి తక్షణం శక్తి వచ్చేందుకు మనం రకరకాల ఆర్టిఫిషియల్ గా డ్రింక్స్ తాగుతూ ఉంటాము.అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆర్టిఫిషియల్ ఎనర్జీయేటింగ్ తాగడం వలన వాటిలో కలిపినటువంటి కెమికల్స్ వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువలన వాటిని తాగకుండా తొందరగా శక్తి రావడానికి మఖాన మంచి ప్రత్యామ్నాయం.
100 గ్రాముల మఖానాలో సుమారు 350 కేలరీలు మరియు 76.9 గ్రాముల కార్బోహైడ్రేట్స ఉంటాయి. వ్యాయామం చేయడానికి ముందు లేదా ప్రయాణం చేసిన తర్వాత తీసుకోవడం ఎలా మన శరీరానికి తొందరగా శక్తి అనేది లభిస్తుంది.
9. క్యాన్సర్ ని తగ్గించడానికి – యాంటీఆక్సిడెంట్లు
ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది చాలా సాధారణంగా అయిపోయింది. మనం తినే ఆహారంలో కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. అందువలన రకరకాల క్యాన్సర్ అనేవి క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే మనం మన శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
మఖానాలో సహజంగా ఉండే ఫ్లావనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఇవి కేన్సర్, మరియు తొందరగా వచ్చే వృద్యాప్యం తదితర సమస్యల నుంచి రక్షణ కలిగిస్తాయి.
10. నిద్రలేమిని తగ్గించడానికి – మెగ్నీషియం
మనం తినే ఆహారం మన శరీరానికి మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మన నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రలేమి సమస్యల వలన మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
నిద్రలేమి సమస్యలను పోగొట్టాలంటే మఖానాలను తినడం వలన ఉపయోగం ఉంటుంది. మెగ్నీషియం మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది.
ఇవి మఖానా తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు.వీటిని తినేటప్పుడు తక్కువ నూనె తక్కువ ఉప్పు వేసి ఆహారం తీసుకోవడం మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Phool Makhana Nutrients per 100gms
| పోషకం (Nutrient) | పరిమాణం (100 గ్రాములకి సగటుగా) | లాభాలు (Benefits) |
|---|---|---|
| కేలరీలు (Calories) | సుమారు 350 కేలరీలు | శక్తిని ఇస్తుంది, తక్కువ కొవ్వు తత్వం ఉంటుంది |
| ప్రోటీన్ (Protein) | 9.7 గ్రాములు | కండరాల అభివృద్ధి కోసం అవసరం |
| కొవ్వు (Fat) | 0.5 గ్రాములు | తక్కువ కొవ్వుతో ఆరోగ్యానికి మంచిది |
| కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) | 76.9 గ్రాములు | శరీరానికి తాత్కాలిక శక్తిని అందిస్తుంది |
| ఫైబర్ (Fiber) | 7.6 గ్రాములు | జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది |
| కాల్షియం (Calcium) | 60 మిల్లీ గ్రాములు | ఎముకల ఆరోగ్యం కోసం అవసరం |
| ఐరన్ (Iron) | 1.4 మిల్లీ గ్రాములు | రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది |
| మెగ్నీషియం (Magnesium) | 67 మిల్లీ గ్రాములు | నరాల శ్రేయస్సు, గుండె ఆరోగ్యం |
| ఫాస్ఫరస్ (Phosphorus) | 200 మిల్లీ గ్రాములు | శక్తి ఉత్పత్తి, సెల్ రిపేర్ |
| పొటాషియం (Potassium) | 500 మిల్లీ గ్రాములు | రక్తపోటు నియంత్రణలో సహాయం |
Color, Size, and Other Characteristics of Makhana
| లక్షణం (Quality) | వివరాలు (Description) |
|---|---|
| రంగు (Color) | తెలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి |
| పరిమాణం (Size) | ఇవి కొంచెం చూడడానికి పాప్‌కార్న్(popcorn) లాగా ఉంటాయి |
| ఆకారం (Shape) | గుండ్రంగా, దాదాపుగా గుండ్రని ఆకారంలో ఉంటాయి |
| గట్టితనము (Texture) | చాలా తేలికగా, పొడిగా ఉంటాయి |
| రుచి (Taste) | సాధారణంగా రుచిలేని, వేయించినసాధారణంగా ఏ రుచి ఉండదు కొంచెం వేయించినప్పుడు క్రిస్పీగా తయారవుతాయి. |
| పోషక విలువలు (Nutrients) | ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి |
| ఉపయోగం (Usage) | ఉపాహారం, పూజలలో నైవేద్యంగా, ఆరోగ్యకరమైన స్నాక్‌గా వాపిల్లలకి స్నాక్స్ లాగా తొందరగా శక్తినిచ్చే ఆహారం లాగా ఉపయోగిస్తారు. |
Common Names of Makhana
ఫూల్ మఖానా న్ని మనం రకరకాల పేర్లతో పిలుస్తాము. అన్ని భాషల్లో ఎలా పిలుస్తారు కింద పట్టికలో చూద్దాం
| భాష (Language) | సాధారణ పేరు (Common Name) |
|---|---|
| తెలుగు (Telugu) | ఫూల్ మఖానా, తామర గింజలు |
| హిందీ (Hindi) | फुल मखाना (Phool Makhana) |
| తమిళం (Tamil) | தவிடு மொட்டைகள் (Thavitu Mottai) |
| కన్నడ (Kannada) | ಕಮಲ ಬೀಜಗಳು (Kamala Beeja) |
| మలయాళం (Malayalam) | താമര വിത്തുകൾ (Thamara Vithukal) |
| బంగ్లా (Bengali) | মাখানা (Makhana) |
| గుజరాతీ (Gujarati) | મખાણા (Makhana) |
| మరాఠీ (Marathi) | मखाना (Makhana) |
| ఉర్దూ (Urdu) | پھول مکھانہ (Phool Makhana) |
| ఇంగ్లీష్ (English) | Fox Nuts / Lotus Seeds |
| చైనీస్ (Chinese) | 莲子 (Liánzǐ) |
Phool makhana uses in Telugu
- మఖనాను పిల్లలకు స్నాక్ గా ఇవ్వడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని వేయించి కొద్దిగా ఉప్పు కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి తినడం వలన రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
- వ్రతాలు, ఉపవాసాలు చేసినప్పుడు మరియు వ్యాయామం చేసినప్పుడు మనకి త్వరగా శక్తి అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఈ మఖాన తీసుకోవడం వలన తొందరగా శక్తి లభిస్తుంది.
- డైట్ చేసే వారికి తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్, హై ఫైబర్ ఆహారం కావాలంటే మఖాన ఉపయోగపడుతుంది.
- ఈ మఖానా ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు.
- మఖనా రక్తంలోనే చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అందువలన,డయాబెటిస్ పేషెంట్స్ ప్రతినిత్యం తీసుకోవచ్చు.
Phool Makhana Recipe In Telugu
పదార్థాలు:
- పూల్ మఖానా – 1 కప్పు
- నెయ్యి (గీ) – సుమారు 1 టీస్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం:
- మొదటగా ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించండి.
- మఖానా గింజలను వేసి దోరగా వేయించుకోండి.
- ఒకటి లేదా రెండు టీ స్పూన్ టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి.
- తగినంత వేసి ఉప్పు వేసి వేయించుకోండి.
- మఖాన గింజలు క్రిస్పీగా కరకరలాడే వరకు వేయించుకోండి.
- తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోండి.
Phool Makhana Maasala Gravy Curry
అవసరమైన పదార్థాలు:
- ఫూల్ మఖానా – 1 కప్పు
- ఉల్లిపాయలు – 2
- టమాటాలు – 2
- కాజూ – 10-12
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- పచ్చి మిరపకాయ – 1
- పసుపు – 1/4 టీస్పూన్
- కారం – 1 టీస్పూన్
- ధనియా పొడి – 1 టీస్పూన్
- గరం మసాలా – 1/2 టీస్పూన్
- పెరుగు లేదా ఫ్రెష్ క్రీం – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్చికం)
- నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి తగినంత
- కొత్తిమీర – అలంకరణ కోసం
తయారీ విధానం:
- మొదటగా మనం ఒక పాన్ తీసుకొని మఖాన వేసి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనెను వేసి బాగా వేయించాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి.
- దోరగా వేయించిన మఖానాను ఒక బౌల్ లోకి తీసుకుని పక్కకి పెట్టుకోవాలి
- ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడు నుంచి 8 దాకా జీడిపప్పు లేదా క్యాష్ గింజలను వేసి ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగి దానిని కూడా వేయాలి. ఇంకా వాటిలో ఒక టమాట, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి వీలైతే కొంచెం వాటర్ నీరు కూడా పోసుకోవచ్చు.
- పాన్ స్టవ్ మీద పెట్టుకొని తగినంత నూనె వేసి దానిలో పోపు గింజలు కొంచెం కసూరి మేతి వేసి వేయించుకోవాలి.కొంచెం పసుపు మరియు మెత్తగా పేస్ట్ గా అలా చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
- పచ్చివాసన పోయేదాకా బాగా కలిపి తర్వాత వాటిలో దానిలో దోరగా వేయించుకున్న మకానాను వేసుకోవాలి.
- వీలైతే కొంచెం నీళ్లు పోసుకుని ఒక పది నిమిషాల వరకు ముగించుకోవాలి.
- తర్వాత తగినంత ఉప్పు కారం మరియు గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
- పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం చింతపండు రెక్కలను కూడా వేసి బాగా మరిగించుకోవాలి
- అంతే ఇంకా గుమగుమలాడే మఖాన గ్రేవీ మసాలా కర్రీ రెడీ అవుతుంది.
- చివరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవచ్చు.
- ఈ మసాలా కర్రీ ని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
FAQ
1. పూల్ మఖానా అంటే ఏమిటి?
పూల్ మఖానా అనగా తామర చెట్టు యొక్క గింజలు లేదా విత్తనాలు ఇవి మనకి తామర చెట్టు నుండి లభిస్తాయి. వీటిని లోటస్ లేదా లోటస్ విత్తనాలు అని కూడా అంటారు.
2. మఖానా ఆరోగ్యానికి మంచిదా?
మఖానాలో చాలా తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది మరియు ప్రోటీన్ కూడా లభిస్తుంది అందువలన ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది.
3. మఖానా మధుమేహులకు మంచిదా?
మఖానాలో చాలా తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అందువలన ఇది ఎక్కువ చక్కెర విడుదల కాకుండా నియంత్రణ చేస్తుంది డయాబెటిస్ పేషెంట్స్ కి చాలా ఉపయోగం
4. మఖానా గుండె ఆరోగ్యం కోసం ఎలా సహాయపడుతుంది?
మఖానాలో ఎక్కువ మోతాదులో పొటాషియం , మెగ్నీషియం మరియు సోడియం తక్కువ సోడియం ఉంటుంది. అందువలన రక్తపోటు నియంత్రణకి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి.
5. మఖానా వృద్ధాప్య లక్షణాలను తగ్గించగలదా?
మఖానాలో ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసుతో వచ్చే వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇంకా రకరకాల క్యాన్సర్లను కూడా రాకుండా తగ్గిస్తాయి.
6. మఖానా జీర్ణవ్యవస్థకు ఎలా ప్రయోజనకరం?
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మఖానాలో అధిక ఫైబర్ ఉంటుంది. మఖానా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ శుభ్రపడి మలబద్ధక సమస్య మరియు గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి.
7. మఖానా ఏవిధంగా వంటలలో ఉపయోగించవచ్చు?
మఖానాలో దోరగా వేయించుకుని తినవచ్చు లేదా కొన్ని రకాల సలాడ్స్ లో వాడుకోవచ్చు.
8. మఖానా అధికంగా తినడం వల్ల ఏమైనా హానిగా ఉండవా?
ముఖానాలో పొటాషియం ఉంటుంది. అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండ సమస్యలు వచ్చి ఆకాశం ఉంది, మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరంలోకి చేరుతాయి. బరువు పెరిగే అవకాశం ఉంది.
9. ఆహారంలో దినసరి ఎంత మోతాదులో తీసుకోవాలి?
రోజుకు సాధారణంగా 40 నుండి 50 ముఖానా గింజలు తీసుకోవడం వలన మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
10. గర్భిణీ స్త్రీలకు ఇది ఉపయోగకరమా?
ముఖానా తగిన మోతాదులో తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
11. Phool Makhana మిల్లెట్స్ కంటే మంచిదా?
Phool Makhana లో చాలా తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ ప్రోటీన్ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మిల్లెట్స్ అనేవి కొంచెం నెమ్మదిగా జీర్ణం అవుతాయి ఎందుకంటే వీటిలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్ తో పోల్చి చూసినప్పుడు ముఖానా తేలికగా జీర్ణమవుతుంది.
Conclusion
తామర గింజల(Phool Makhana In Telugu) ను తినడం వలన మనకు సత్వరంగా శక్తి లభిస్తుంది మరియు మనకి కండరపుష్టి లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువలన క్యాన్సర్‌ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ని శరీరం నుంచి బయటికి పంపించి కాన్సర్ వచ్చే పరిస్థితిని తగ్గిస్తుంది. ప్రతిరోజు మనం ఒక గుప్పెడు తామర గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వలన ముఖ్యంగా పిల్లలకి పెట్టడం వలన మన ఆరోగ్యం అనేది చాలా వరకు మెరుగవుతుంది. అందువలన తప్పకుండా వీటిని ప్రతినిత్యం తీసుకోవడం మంచిది ఖర్చు కొంచెం ఎక్కువే కానీ ఆహార ప్రయోజనాల దృష్ట్యా తినడం మంచిది.