Types Of Millets In Telugu: మిల్లెట్స్ (Millets) ని తెలుగులో చిరుధాన్యాలు(Chiru dhanyalu) లేదా సిరిధాన్యాలు(siri dhanyalu) అని అంటుంటారు. ఈ ధాన్యాలు చూడటానికి మాత్రం చాలా చిన్న గింజలు . కానీ ఆరోగ్యానికి చాలా మంచివి.
For more Information About Millets in English read this article.
Table of Contents
మిల్లెట్స్ లో ఇంకా చాల రకాలు ఉంటాయి. ఈ ఆర్టికల్ లో వాటి గురించి చాలా వివరంగా తెలుసుకుందాం.
Types Of Millets In Telugu:చిరుధాన్యాలు-సిరిధాన్యాలు
Chiru dhanyalu- చిరుధాన్యాలు అంటే ముఖ్యంగా ఐదు రకాలయిన మిల్లెట్స్. రాగి, ఆరికెలు, వరిగ, అండు కొర్రలు, సజ్జలు.
Siri dhanyalu-సిరిధాన్యాలు లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొర్రలు, సామలు, ఊదలు లాంటి ధాన్యాలు ఈ రకానికి చెందినవి.
What is Millet? మిల్లెట్ అంటే ఏమిటి?
మనకి తెలిసిన ఆహార ధాన్యాలలో మిల్లెట్స్ చిన్న గింజలు లేదా విత్తనాల(seeds) గా కన్పించే గడ్డిపంటలు .ప్రపంచవ్యాప్తంగా వీటిని ఆహారానికి, పశుగ్రాసానికి పండిస్తారు.
వీటిని సాగు చేయడానికి చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకే నీరు లేని పేద దేశాలకు ఇవి వరప్రసాదం.
List Of Types Of Millets in Telugu: చిరుధాన్యాలు పేర్లు
English Name | Telugu Name | Classification |
---|---|---|
Finger Millet | రాగులు (Ragulu) | Chiru Dhanyalu |
Pearl Millet | సజ్జలు (Sajjalu) | Chiru Dhanyalu |
Foxtail Millet | కొర్రలు (Korralu) | Siri Dhanyalu |
Little Millet | సామలు (Samalu) | Siri Dhanyalu |
Kodo Millet | ఆరికెలు (Arikalu) | Siri Dhanyalu |
Barnyard Millet | ఊదలు(Udalu) | Siri Dhanyalu |
Proso Millet | వరిగ (Variga) | Chiru Dhanyalu |
Brown top Millet | అండు కొర్రలు (Andu Korrulu) | Siri Dhanyalu |
Sorghum (Great Millet) | జొన్నలు (Jonnalu) | Chiru Dhanyalu |
Teff Millet | తెల్ల రాగులు (Tella Ragulu) | Siri Dhanyalu |
Guinea Millet | సారకలు (Sarakalu) | Chiru Dhanyalu |
Fonio Millet | ఫోనియో (Foniyo) | Siri Dhanyalu |
Nutritional Values:పోషక విలువలు
Millet | Calories | Protein | Carbohydrates | Fiber | Calcium | Iron |
---|---|---|---|---|---|---|
Finger Millet | 336 | 7.6 g | 72.6 g | 3.6 g | 344 mg | 3.9 mg |
Pearl Millet | 378 | 11.6 g | 67.0 g | 1.2 g | 42 mg | 8.0 mg |
Foxtail Millet | 350 | 12.3 g | 60.0 g | 8.0 g | 31 mg | 2.8 mg |
Little Millet | 319 | 7.7 g | 66.0 g | 7.6 g | 17 mg | 8.0 mg |
Kodo Millet | 321 | 8.3 g | 65.0 g | 5.0 g | 35 mg | 0.8 mg |
Barnyard Millet | 310 | 11.2 g | 65.0 g | 9.0 g | 15 mg | 9.2 mg |
Proso Millet | 356 | 12.5 g | 65.0 g | 2.8 g | 13 mg | 2.0 mg |
Browntop Millet | 340 | 8.0 g | 68.0 g | 4.0 g | 19 mg | 5.0 mg |
Sorghum | 329 | 10.6 g | 72.6 g | 6.7 g | 34 mg | 4.0 mg |
Types of Millets in Telugu: Millets names In Telugu and English
క్రింద Millets names In Telugu and English తెలుగులో, ఇంగ్లీషులో మరియు ఎలా ఉంటాయో చూడండి.
Health Benefits & Use of Millets in Telugu
ఆరోగ్య లాభాలు: Health Benefits
- న్యూట్రిషన్: మిల్లెట్స్ లో ఎక్కువగా విటమిన్స్, ఖనిజాలు, మరియు ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇవి శరీరానికి కాల్షియం, ఐరన్, మరియు జింక్ లాంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.
- బ్లడ్ ప్యూరిఫికేషన్: మిల్లెట్స్ లోని ఐరన్ రక్తప్రసరణను పెంచుతుంది. ఎనీమియాని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- Weight Loss: మిల్లెట్స్ లోని ఫైబర్ శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తొందరగా ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- డయాబెటిస్: మిల్లెట్స్ లోని న్యూట్రియెంట్స్, నొర్తోటెన్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడతాయి. అందువల్ల షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది
- అజీర్ణం: మిల్లెట్స్ లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. తద్వారా అజీర్ణాన్ని తగ్గిస్తుంది.
Recipes:వంటలలో ఎలా ఉపయోగించాలి?
- మిల్లెట్స్ తో అన్నం వండొచ్చు. చపాతీలు, దోశలు ఇంకా ఉప్మా కూడా చేయొచ్చు. వీటితో చేసిన వంటలు చాలా రుచిగాను ఇంకా ఆరోగ్యాన్ని అందిస్తాయి. మిల్లెట్స్ ని ఉపయోగించి ఆరోగ్యంగా వండుకోవడం మన చేతుల్లోనే ఉంది.
- మిల్లెట్స్ తో ఎనర్జీ డ్రింక్ చేసుకోవచ్చు.
- కొంతమంది వీటిని ఉపయోగించి స్మూతీస్ కూడా తయారు చేస్తారు.
- వీటిని నానబెట్టి సలాడ్స్ లో కూడా ఉపయోగించవచ్చు
- కొన్ని రకాల కేకులను కూడా తయారు చేసుకోవచ్చు
- మిల్లెట్ ను పశువులకు కూడా ఆహారంగా వేయొచ్చు. వీటి చెట్ల గడ్డిని పశువులకు ఆహారంగా మంచిగా పనికొస్తుంది. ఈ ఆహారం పశువులకు చాలా బలాన్నిస్తాయి
Millets Benefits For Weight Loss: ఎలా బరువు తగ్గొచ్చు?
- మిల్లెట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది .అందుకే ఇది కొంచెం తినగానే మన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి తగ్గి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
- అన్పించి ఆకలి తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- మిల్లెట్స్ లో ప్రోటీన్స్ ఇంకా న్యూట్రియన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరానికి తొందరగా శక్తి వస్తుంది. ఎక్కువ సేపు శరీరానికి అలసట రాకుండా చూస్తాయి.
- మిల్లెట్స్ లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎక్కువ తిన్నా కూడా మనం బరువు పెరగకుండా ఉంటాం.
- వీటిలో ఉన్న పోషకాలు మన మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడతాయి. మన శరీరంలోని కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడతాయి.
- మిల్లెట్స్ ని డ్రింక్ లా చేసి తాగడం ద్వారా శరీరంలోని ఫ్యాట్ తగ్గి బరువు కంట్రోల్ లో ఉండడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు Intermittent Fasting ప్రాముఖ్యం లోకి వస్తుంది. ఇంటర్మీటెంట్ పాస్టింగ్ చేస్తూ మిల్లెట్స్ ని మన ఆహారంలో చేర్చడం ద్వారా బరువు తగ్గడం తో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
Millets For Diabetes: డయాబెటిస్ తగ్గించడంఎలా సాధ్యమవుతుంది?
షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన మిల్లెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్ తప్పకుండా కొర్రలు, ఊదలు, జొన్నలు, సజ్జలు ను తమహారంలో చేర్చుకోవాలి.
షుగర్ వ్యాధి ఒకసారి మొదలైతే మాత్రం మనం జీవితాంతం డైట్ ని జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతూ వస్తోంది. మరి ఇలాంటి షుగర్ వ్యాధిని నియంత్రించాలంటే కొన్ని ముఖ్యమైన ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు మాత్రమే కాకుండా ఎక్సర్ సైజ్(exercises) , యోగా ఇలాంటివి రోజువారి జీవితంలో అలవాటు చేసుకోవాలి. డాక్టర్స్ చెప్పే దాని ప్రకారం తప్పకుండా మనం ఒక ఐదు రకాల మిల్లెట్స్ ని ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇప్పుడు ఆ మిల్లెట్స్ ఏమిటో తెలుసుకుందాం.
మధుమేహం వలన బాధపడే వారికి మిల్లెట్స్ నిజంగా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. 2023 ఇయర్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా గుర్తింపు పొందడం ద్వారా వాటి ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఈ ధాన్యాలలో ఎక్కువ పీచు మరియు తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలోని చక్ర స్థాయిని క్రమంగా నియంత్రణలో ఉంచడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తాయి.
శాస్త్రవేత్తలు మిల్లెట్స్ సగటు గ్లైసెమిక్ ఇండెక్స్ 52.7గా ఉంది అని చెప్తున్నారు. ఇది రోజు మనం తినే బియ్యం, పాలిష్ చేసిన గోధుమల కంటే సుమారు 30 పర్సట్ ఎక్కువ. దాని అర్థం మిల్లెట్స్ తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. అదేవిధంగా మిల్లెట్స్ గ్లైసెమిక్ సూచిక బార్లీ వంటి ఆహారపదార్థాల కంటే తక్కువ. గ్లైసెమిక్ సూచిక ద్వారా ఏ ఆహారపదార్థం రక్తంలో చక్కెర స్థాయిని ఎంతమేరకు, ఎంతకాలం వరకు పెంచుతుందో తెలుసుకోవచ్చు. మిల్లెట్స్ కంటే బియ్యం, గోధుమ, మొక్కజొన్నలో గ్లైసెమిక్ సూచిక అధికంగా ఉండడం వలన అవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచే అవకాశముంది.
Millets Benefits: చిరుధాన్యాలు వాటి ఉపయోగాలు
Finger Millet (రాగులు)
రాగులు లో కాల్షియం మరియు ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఎముకల(bones) బలం కోసం ఎంతో మంచి చేస్తాయి. రక్తహీనతను తగ్గించడంలో మరియు శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం.
Barnyard Millet Uses: (ఊదలు )
ఊదలు చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. చక్కెర స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి తక్కువ కెలోరీలు కలిగి, బరువు తగ్గాలనుకునేవారికి ఉపయోగపడుతుంది. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వుంటాయి.
ఈ చిరుధాన్యంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. డయాబెటిస్ మరియుగుండె సంబంధమైన వ్యాధిగ్రస్తులకి మంచి ఆహారం.
Foxtail Millet Benefits: కొర్రలు
కొర్రలు పీచు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగాగా ఉంటాయి. బీపీటు, షుగర్ ని కంట్రోల్ చేయడం లో సహాయపడతాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు చాలా మంచివి. ఇవి మన రక్తంలోని చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గోధుమలు బియ్యానికి బదులుగా కొర్రలను మన ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
Kodo Millet Benefits: అరికలు ఉపయోగాలు
అరికలు శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి. కొవ్వు తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా పీచు కలిగి, ఆహారాన్ని త్వరగా జీర్ణము అయ్యేలా చేస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి.
Little Millet Benefits: సామలు ఉపయోగాలు
సామలు పీచు అధికంగా ఉండి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండి, మధుమేహం ఉన్నవారికి అనుకూలం. ఇవి శరీరానికి తక్కువ కలోరీలతో శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
Sorghum Millet Uses: జొన్నలు ఉపయోగాలు
జొన్నలు ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయి.
జొన్నలు మన రక్తంలోని చక్కెరను ఫాస్ట్ గా పెరగకుండా చూస్తాయి. వీటిలో కూడా అధిక పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.ఇవి కొలెస్ట్రాల్ ని బరువును కూడా తగ్గిస్తాయి
Proso Millet Uses: వరగులు ఉపయోగాలు
Proso Millet(వరగులు) పీచు ఎక్కువగా ఉండి, క్లోమగ్రంధి ఆరోగ్యానికి మంచివి. ఇవి తక్కువ కాలోరీలు కలిగి, శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిల్వచేయడంలో దోహదం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యముగా చేస్తాయి.
Pearl Millet Uses: సజ్జలు ఉపయోగాలు
సజ్జలు కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటాయి. రక్తహీనత నివారణ మరియు ఎముకల స్ట్రేంత్ కోసం ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి ఇవి చాలా వరకు మేలు చేస్తాయి. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.
ఈ చిరుధాన్యం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ట్రైగ్లిసరాయిడ్ల స్థాయిని తగ్గించి, డయాబెటిస్ని రాకుండా చేసే లక్షణం దీనిలో ఉంది. వీటితో వండిన ఆహారం మెల్లగా(slow) జీర్ణమవ్వడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలను స్టేబుల్ గా ఉంచుతుంది.
Brown Top Millet Uses: అండు కొర్రలు ఉపయోగాలు
అండు కొర్రలు పీచుతో సమృద్ధిగా ఉండి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇవి మధుమేహం మరియు ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. తక్కువ కలోరీలతో శరీర బరువును తగ్గించడంలో ఉపయోగపడతాయి. పేగుల ఆరోగ్యానికి మంచివి.
Teff Millet Uses: తెల్ల రాగులు ఉపయోగాలు
తెల్ల రాగులు పీచు, కాల్షియం, ఐరన్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకల బలం కోసం ఎంతో మంచి చేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోను , రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో, మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
రాగుల్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే రాగుల్లో కాల్షియమ్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. పీచు, మినరళ్, మరియు అమైనో యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
Top 10 millet producing states in India
భారతదేశంలో టాప్ 10 మిల్లెట్ల ఉత్పత్తి చేసే రాష్ట్రాలు
- కర్ణాటక
- రాజస్థాన్
- మహారాష్ట్ర
- ఉత్తర ప్రదేశ్
- హరియాణా
- గుజరాత్
- మధ్యప్రదేశ్
- తమిళనాడు
- ఆంధ్రప్రదేశ్
- ఒడిశా
ఈ రాష్ట్రాలు మిల్లెట్ల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి.
Frequently Asked Questions
- Millets లో ఎన్ని రకాలు ఉన్నాయి?
సుమారుగా చెప్పుకోదగినవి 10 రకాల ధాన్యాలు ఉన్నాయి. ముఖ్యంగా జొన్నలు, సామలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు వంటి రకాలు ఉన్నాయి. - గ్లూటెన్ ఫ్రీ ధాన్యాలు ఏమిటి?
జొన్నలు, రాగులు, మరియు కొర్రలు వంటి chiru ధాన్యాలు గ్లూటెన్ ఫ్రీగా ఉంటాయి.అందుకే గ్లూటన్ సెన్సిటివిటీ ఉన్నవారు వీటిని తినవచ్చు. - శరీర బరువు తగ్గడానికి ఏ ధాన్యాలు తినాలి?
జొన్నలు, రాగులు, మరియు కొర్రలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించడానికి ఉపయోగకరమైనవి. - డయాబెటిస్ ఉన్నవారు ఏ చిరుధాన్యాలు తింటే మంచిది?
షుగర్ ఉండేవారు గ్లైనమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే సామలు మరియు రాగులు తినొచ్చు. - గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఏ మిల్లెట్స్ తింటే మంచిది?
జొన్నలు మరియు కొర్రలలో గుండెకి మంచివైన యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. - ప్రెగ్నెన్సీ లో ఏ చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది?
రాగులు, జొన్నలు, మరియు సామలు పిండం పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. అందువల్ల గర్భిణులు వీటిని తీసుకోవచ్చు. - మన శరీరంలో బలం పెంచుకోవడానికి ఏ ధాన్యాలు తినాలి?
రాగులు మరియు అండు కొర్రలు లో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండటంతో వాటిని తినడం వలన బలం పెరుగుతుంది. - పిల్లలకు ఏ ధాన్యాలు పెట్టాలి?
పిల్లలపెరుగుదలకు రాగులు మరియు జొన్నలు ప్రోటీన్, కాల్షియం ఉపయోగకరమైనవి. - సాధారణంగా ధాన్యాలను ఎలా వండుకోవాలి?
సాధారణంగా వీటిని రొట్టెలు, ఉప్మా, పాయసం మరియు కిచిడి లాగా వండుకోవచ్చు. - అజీర్తి సమస్యలను తగ్గించాలంటే ఏ ధాన్యాలను తినాలి?
ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కొర్రలు మరియు సామలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
To know more about Millets in English please read the article ” Top 12 Different types of Millets“