Fast Weight Loss Tips with millets: బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. కానీ మరి కొంతమంది ఏమి తినకుండా కూడా బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు పెరగడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య పాత రోజులతో చూసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం తిన్న ఆహారంకి తగ్గ వ్యాయామం లేకపోవడం. మన శరీరానికి తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ ఉంటే మనం అందంగా కనిపించడమే కాదు మన ఆరోగ్య చాలా వయసు పెరుగుతున్నది కొద్ది రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధుల బారిన పడకూడదు అంటే మాత్రం తప్పకుండా మన శరీర బరువును బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.
Table of Contents
ఆరోగ్యంగా ఉంటూ మన శరీరానికి తగ్గ బరువును బరువు ఉండాలంటే మనం ఏం తినాలి? ఏం తినడం వల్ల ఈ ప్రయోజనాలు మనకు కలుగుతాయి ఈ నేపథ్యంలో ఈ మధ్య చాలా మంది ఆరోగ్యమైన డైట్ కోసం చూస్తున్నారు. దానికి తోడు చాలామంది డాక్టర్లు చిరుధాన్యాలను(మిల్లెట్స్) మన డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలని చెప్తున్నారు.

సరియైన ఆహార నియమాలు మరియు ప్రతిరోజు వ్యాయామం మన ఆరోగ్యాన్ని కాపాడుతూ బరువు పెరగకుండా కూడా చూస్తాయి. ఈ ఆర్టికల్ లో డైట్ ప్లాన్ మరియు వ్యాయామం పాటించి ఫాస్ట్ గా లావు తగ్గాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం.
బరువు పెరిగితే మధుమేహం, హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, లివర్ సమస్యలు కూడా రావచ్చు. వీటన్నింటిని తప్పించేందుకు, కచ్చితంగా diet plan అవసరం. ఒక నెలలో ఐదు కేజీల బరువు తగ్గడం సులభం కాదు.సరైన ఆహారం మరియు జీవనశైలితో ఈజీగా తగ్గించవచ్చు. వ్యాయామం మరియు జాగ్రత్తగా తినడం అవసరం.ఇక్కడ ఆరోగ్యం చెడిపోకుండా వెయిట్ లాస్ అవ్వడం చాలా ముఖ్యం.
తొందరగా బరువు తగ్గాలంటే ఏ మిల్లెట్ తినాలి?
మనకి రకరకాల చిరుధాన్యాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క చిరుధాన్యం ఒక్కొక్క పనిని సమర్థవంతంగా చేస్తుంది. ఒక్కొక్క మన శరీరంలోనే ఒక్కొక్క భాగాన్ని శుద్ధి చేస్తుంది. మనం బరువు తగ్గాలంటే కొన్ని చిరుధాన్యాలను రెగ్యులర్ ప్రతినిత్యం మానినట్లయితే మనకి ఉపయోగముంటుంది వీటిలో ముఖ్యంగా జొన్నలు, రాగులు మరియు కొర్రలు చాలా ముఖ్యమైనవి.
జొన్నలు
దాదాపుగా అందరికీ తెలిసినచిన్న చిరుధాన్యాలు ఈ జొన్నలు. మనం తాగుతరాలుగా జొన్న రొట్టె ఎక్కువ మంది తింటారు. జొన్నలతోటి జొన్న అన్నం కూడా చేసుకుని తింటారు. జొన్నలలో ఎక్కువగా పీచు పదార్థం, ఐరన్ కంటెంట్ ఉంటుంది. జొన్నలు తినడం వలన మన శరీరంలో బలహీనంగా ఉన్నవారు చాలా బలంగా తయారవుతారు, అలా అని బరువు పెరుగుతారని కాదు. అదనపు కొవ్వు నిల్వలు కరిగిపోతాయి.
జొన్న రవ్వతో రుచికరమైన ఉప్మా

కావాల్సిన పదార్థాలు:
- జొన్న రవ్వ – 1 కప్పు
- నీరు – 2.5 కప్పులు
- నెయ్యి లేదా నూనె – 1 టేబుల్ స్పూన్
- సెనగపప్పు – 1 టేబుల్ స్పూన్
- మినపప్పు – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – 1/2 టీస్పూన్
- జీలకర్ర – 1/2 టీస్పూన్
- కరివేపాకు – కొన్ని రెబ్బలు
- ఉల్లిపాయ – 1
- కారంపొడి – 1/2 టీస్పూన్
- మిరపకాయలు – 2
- ఇంగువ – చిటికెడు
- ఉప్పు – రుచికి తగినంత
- కొత్తిమీర
తయారీ విధానం:
- జొన్నలను బాగా కడుక్కొని దానిని ఎండబెట్టి బాగా ఎండాక మిక్సర్ గ్రైండర్ లో రవ్వలాగా వేసుకోవాలి.
- ఒక కప్పు జొన్న రవ్వని తీసుకొని ఒక పాన్ మీద నెయ్యి లేదా నూనె వేసి దోరగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- ఒక పాన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి.
- తర్వాత దానిలో కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- దాంట్లో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు, ఇంగువ కొద్దిగా కారంపొడి వేసి మరిగించుకోవాలి.
- మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్నా జొన్న రవ్వని వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టాలి.
- రవ్వ మెత్తగా ఉడికాక పైన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేయాలి.
రాగులు
రాగులలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వలన మలబద్ధక సమస్య తీరుతుంది. అజీర్తి సమస్యలు తగ్గుతాయి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రెండు టీ స్పూన్ల రాగి పిండితో రాగి జావ చేసుకొని తాగడం వలన మనకీ తక్కువ క్యాలరీలు అందుతాయి మరియు మంచి న్యూట్రియన్స్ దొరుకుతాయి. దీనివలన బరువు తొందరగా తగ్గుతాం.
రాగి మాల్ట్ తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు
- నీరు – 1 కప్పు
- పాలు – 1 కప్పు
- బెల్లం లేదా తేనె – రుచికి తగినంత
- యాలకుల పొడి
తయారీ విధానం:
- మొదటగా మనం రాగి పిండిని తయారు చేసుకోవాలి.
- రాగులను ఎండబెట్టుకొని పొడిగా చేసి రాగి పిండి తయారవుతుంది.
- ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలు ఒక కప్పు నీరు వేసి బాగా మరిగించాలి .
- నీటిలో రాగి పొడిని వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి.
- ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు మరిగించా మరిగిన తర్వాత బాగా చిక్కబడుతుంది.
- దాంట్లో పాలు కొంచెం బెల్లం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసి కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
- బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పాలు పోయకుండా ఉంటే మంచిది.
- వేడిగా లేదా చల్లగా తాగొచ్చు.
కొర్రలు
రోజు మనం తినే తెల్లని వరి అన్నానికి బదులు చాలామంది ఇప్పుడు కొర్రలను ఆహారంలో వాడుతున్నారు. ఈ కొర్రలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పీచు పదార్థం, తక్కువ క్యాలరీలు వలన మనం తక్కువ తినగలుగుతాము. దాని వలన బరువు తగ్గుతాము. వీటిలో ఇంకా అన్ని రకాల న్యూట్రియన్స్ ఉన్నాయి. ఇవి మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణ చేస్తాయి. వీటిని ఎలా తినాలో ఎలా వండుకోవాలో చూద్దాం.
కొర్రల అన్నం వండే విధానం
కావాల్సిన పదార్థాలు:
- కొర్రలు – 1 కప్పు
- నీరు – 2 కప్పులు
- ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం:
- మొదటగా కొర్రల్ని ఒకటి లేదా రెండు సార్లు బాగా కడిగి ఒక రెండు గంటల వరకు నానబెట్టాలి.
- ఒక ఫ్యాన్ తీసుకొని తగినంత నీరు పోసి ఉప్పు వేసి కలుపుకోవాలి.
- బాగా నీరు మరిగిన తర్వాత ఈ నానబెట్టి కొర్రలను వేసి బాగా కలపాలి. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది
- బయట కూడా నానబెట్టడం వలన తొందరగానే ఉడుకుతుంది.
- నీరు మొత్తం ఇంకిపోయాక స్టవ్ ఆపేసి ఏదైనా మంచి కూరతో కానీ పప్పు చారుతో గాని తింటే చాలా బాగుంటుంది.
Fast Weight Loss Tips:
తొందరగా బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకోవడమే కాకుండా ఇంకా కొన్ని రకాల నియమాలను పాటించడం వల్ల చాలా తొందరగా తగ్గుతారు.

మంచి ఆహారపుఅలవాట్లు
- రోజు తాజా కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా తినాలి.
- ఆహారంలో తెల్లని రైస్ తగ్గించి మిల్లెట్స్ ని వాడుకోవాలి. ఊదలు, కొర్రలు లాంటివి ఉంటాయి.
- గింజలు ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. మెంతి గింజలు, అవిస గింజలు, చియా గింజలు తప్పకుండా వాడాలి.
- నూనెలు, మైదా,ఉప్పు వీలైనంత తక్కువగా వాడాలి.
- క్రమం తప్పకుండా రోజు వ్యాయామం చేయాలి.
- కనీసం నెలకి రెండు సార్లు ఫాస్టింగ్ చేయాలి.
- మంచి నిద్ర పోవాలి.
సరిపడా నీళ్లు తాగాలి
ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం చాలా అవసరం. మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. సరే పడేంత నీళ్లు తాగడం వల్ల బరువు కూడా తగ్గుతాం. ఇంకా మన శరీరంలోని అవయవాలు వాటి పనులు సరిగ్గా జరిగేలాగా చేస్తాయి. నీరు తాగడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.
వ్యాయామం చేయాలి

మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా వ్యాయామం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుంది.వాకింగ్ చేయడం అన్ని వయసుల వారికి మంచిది.బరువు తగ్గడానికి మాత్రం వాకింగ్ రన్నింగ్ చాలావరకు ఉపయోగముంటుంది. అయితే కచ్చితంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. నా పర్సనల్ అనుభవం ప్రకారం స్కిప్పింగ్ చేయడం వలన చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
బరువు తగ్గడానికి పద్ధతులు
బరువు తగ్గడానికి చాలామంది చాలా పద్ధతులు అనుసరిస్తారు.
- ఒకటి మూడు పూటలా తింటూ మంచి ఆహారం వ్యాయామం చేయటం.
- రెండు ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ .దీనిలో రోజు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారాన్ని తినడం. దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. మనం తినేదానికి చేసే పనికి బ్యాలెన్స్ చేసుకోవాలి తక్కువ పని చేస్తున్నప్పుడు తక్కువగా తినడమే బెటర్. రోజు రెండుసార్లు తిని మిగతా టైం అంతా ఉపవాసం ఉండడం వల్ల మన బరువు మన కంట్రోల్ లో ఉంటుంది. ఈ కాలంలో చాలామంది రెండు సార్లు తినడం అలవాటు చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఒక్కసారి తినడం అలవాటు చేసుకుంటున్నారు,
- పైన చెప్పిన విధంగా ఏడు రోజుల డైట్ ప్లాన్ పాటించడం వల్ల మొత్తం శరీర బరువు తగ్గుతుంది. దానితోపాటు పొట్ట బరువు కూడా తగ్గుతుంది. ప్రత్యేకంగా పొట్ట బరువు తగ్గాలంటే డైట్ తో పాటు కొన్ని వ్యాయామాలు చేయడం అవసరం.ఏం చేసినా ఎలా చేసినా ఇన్స్టంట్ గా బరువు తగ్గడం అనేది చాలా ప్రమాదకరం. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నెమ్మదిగా బరువు తగ్గడమే శ్రేయస్కరం. రోజువారి జీవితంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మన బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది.
Conclusion
మనం ఏం తిన్నా కూడా బరువు పెరగకూడదు అనుకుంటే దానికి తగ్గ వ్యాయామం కచ్చితంగా చేయాలి. మన ఆహారంలో మంచి ఆహార మంచి కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, విత్తనాలు, ఆకుకూరలు అన్నీ చేర్చుకోవాలి . క్రమం తప్పని వ్యాయామం సరిపడా నీరు మంచి నిద్ర బరువు తగ్గడానికి పరోక్షంగా ఉపయోగపడతాయి.