Fenugreek Seeds Health Benefits

fenugreek seeds Health Benefits

Fenugreek Seeds Health Benefits: సాధారణంగా మన ఇంట్లో పోపుల పెట్టెలో మెంతులు(Fenugreek Seeds ) తప్పకుండా ఉంటాయి. మెంతులను మనం ప్రతి రోజు ఏదో ఒక వంటలో కచ్చితంగా వాడుతూనే ఉంటాము. పొడిగా చేసి లేదా గింజలుగా ఊరగాయల్లో, చారు, పులుసు, పోపులు, దోశలలో రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. మెంతులు (Menthulu) రుచిని పెంచడమే కాదు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.

మెంతులలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.ఆయుర్వేదంలో మెంతులను ఎన్నో శతాబ్దాలుగా ఔషధంగా వాడుతున్నారు. వీటిలో ఫోలిక్‌ యాసిడ్‌, కాపర్‌, పొటాషియం(K), క్యాల్షియం(Ca), ఐరన్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలు, విటమిన్లు A, B6, C, K ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరానికి చాలా అవసరం.

Fenugreek Seeds చాలా ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఈ మెంతులు డయాబెటిస్(మధుమేహం ) తగ్గించడానికి వాడతారు. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గేలా చేస్తాయి. ఇంకా ఈ మెంతులు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి.

మెంతులను పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడంలో కూడా ప్రముఖంగా ఉపయోగిస్తారు.

అందుకే ఈ మెంతులను మన రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Nutritional Values:మెంతి గింజల పోషక విలువలు (100 గ్రా)

పోషక పదార్థంవిలువ
కేలోరీస్323 kcal
ప్రోటీన్23.0 g
కొవ్వులు6.41 g
కార్బోహైడ్రేట్స్58.35 g
ఫైబర్25.0 g
సోలuble ఫైబర్4.0 g
విటమిన్ A0 IU
విటమిన్ C3.0 mg
విటమిన్ B60.6 mg
ఫోలేట్57 μg
క్యాల్షియం176 mg
ఐరన్3.7 mg
మాగ్నీషియం191 mg
ఫాస్ఫరస్296 mg
పోటాషియం770 mg
జింక్2.5 mg
కాపర్0.64 mg
మాంగనీస్1.2 mg

Fenugreek Seeds Health Benefits

fenugreek seeds Health Benefits

మెంతులను నానబెట్టి తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Fenugreek Seeds Health Benefits: Methi Water

డయాబెటిస్ కంట్రోల్

రోజు ఒక టీ స్పూన్ మెంతులను తీసుకొని నానబెట్టి ఆ వాటర్ ని తాగడం వలన మనకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. శరీరంలోని గ్లూకోస్ ని బ్యాలెన్స్ చేసి మధుమేహాన్ని (డయాబెటిస్) నియంత్రించడానికి సహాయపడతాయి.

డైజేషన్

మెంతి వాటర్ తీసుకోవడం వలన మన జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది. ఇలా చేయడం వలన మలబద్ధకం సమస్య తగ్గి అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది.

అధిక బరువు నియంత్రించడం

మెంతులలో ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఈ ఫైబర్ ఆకలిని తగ్గించి తక్కువ తినేలా చేస్తాయి. ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇంకా బరువు((Weight Loss) కూడా తగ్గుతారు.

పాల ఉత్పత్తిని పెంచడం

కొంతమంది గర్భిణీ స్త్రీలలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ మెంతులను తీసుకోవడం వల్ల పాలు పడటం ఎక్కువ అవుతుంది.

చర్మ ఆరోగ్యం

ఈ మెంతులు మన శరీరంలోని రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. దీనివల్ల మన చర్మ ఆరోగ్యం పెరుగుతుంది. చర్మం మీది మచ్చలు తగ్గి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

బలాన్నిపెంచడం

ఈ మందులు చూడ్డానికి చాలా చిన్నగా కనిపించినా కూడా ఒక టీ స్పూన్ మెంతులు కూడా మనకి చాలా బలానిస్తాయి

హార్మోన్స్ బ్యాలెన్స్

మహిళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెంతులు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ ప్రాబ్లం, మోనోపోజ్ సింప్టమ్స్ కూడా తగ్గిస్తాయి.

కోలెస్ట్రాల్‌ను నియంత్రించడం

మెంతులను కోలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులోని సోల్యూబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో ఉపయోగపడుతుంది. నానబెట్టిన మెంతులు జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇవి హృదయ ఆరోగ్యం కాపాడటానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ మెంతులు తీసుకోవడం వల్ల కోలెస్ట్రాల్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చు.

నానబెట్టిన మెంతులు సాధారణ మెంతులతో పోలిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. ఇప్పుడు ఈ అద్భుతమైన మెంతులను మీ ఆహారంలో చేర్చుకొని, ఆరోగ్యంగా ఉండడానికి మేలు చేసుకోండి!

FAQ:

  1. Menthulu ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
    జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం, రక్తపోటును నియంత్రించడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, కొలెస్ట్రాల్‌ ను క్రమబద్ధీకరించడం, బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
  2. ఇంకా ఏ గింజలలో మెంతి గింజల లాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
    Sesame గింజలు, Flax సీడ్స్ కూడా మెంతి గింజల లాగా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి.
  3. నానబెట్టిన మెంతులను ఎందుకు తీసుకోవాలి?
    మెంతులను నానబెట్టడం వలన వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి. ఇవి రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి.
  4. మెంతి గింజలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే సమయంలో తీసుకోవచ్చా?
    పాల ఉత్పత్తిని పెంచడానికి గర్భిణీ స్త్రీలు ఈ మెంతులను తీసుకుంటారు. ఇవి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  5. డయాబెటిస్ పేషెంట్స్ మెంతులను ఎలా తీసుకుంటే మంచిది?
    ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున మెంతి వాటర్ ని తీసుకోవడం వల్ల షుగర్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
  6. సాధారణంగా ఎవరైనా మెంతులను ఎలా తీసుకోవాలి?
    రాత్రి పడుకునే ముందు ఒకటి నుండి రెండు స్పూన్ల మెంతులను నానబెట్టి ఉదయం ఆ గింజలను తీసుకోవడం చాలా మంచిది. అలా కాకుండా మెంతి గింజలను పొడిగా చేసి కూడా తీసుకోవచ్చు.
  7. బరువు తగ్గడానికి మెంతులు ఉపయోగపడతాయా?
    అవును. మెంతి గింజలు ఆకలిని తగ్గించి, మేటబాలిజం ను వేగవంతం చేసి బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
  8. మెంతి గింజల పొడిని చర్మానికి వాడవచ్చా?
    మెంతి గింజల పొడిని చర్మానికి వాడకూడదు. ఒకటి స్పూన్ మెంతి గింజల పొడిని ఒక గ్లాసు వాటర్ లో కలిపి రోజు తాగడం వలన చర్మ సమస్యలు దూరం అవుతాయి.
  9. రక్తపోటు తగ్గించడంలో సహాయపడతాయా?
    అవును. రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హైపర్‌టెన్షన్‌ను క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడతాయి.
  10. ఎన్ని రోజులు మెంతులు తీసుకోవాలి?
    నానబెట్టిన మెంతులను ప్రతి రోజు ఉదయం తీసుకోవడం మంచిది. మీరు కనీసం 2 నుండి 3 వారాల పాటు తీసుకోవడం వల్ల ఫలితాలను పొంద వచ్చును.
  11. పురుషులకి మరియు మహిళలకు ఉపయోగపడతాయా?
    అవును. Menthulu పురుషులకి, మహిళలకు సమానంగా ఉపయోగపడతాయి. ఇవి హార్మోన్ల బ్యాలెన్స్‌ చేసి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

Scroll to Top