Finger Millet In Telugu:
ఈ ఆర్టికల్ లో ఫింగర్ మిల్లెట్ వల్ల కలిగే లాభాలు ఆరోగ్య ప్రయోజనాలు ఎవరు వాడాలి, ఎంత వాడాలి అని తెలుసుకుందాం.
Table of Contents
Finger Millet In Telugu:
తెలుగులో ఫింగర్ మిల్లెట్ ని రాగులు అని అంటారు. రాగులు ఒక ముఖ్యమైన చిరుధాన్యం(Millet). ఇది ఎక్కువ పోషక విలువలున్న ఆహారపదార్థం.
రాగుల లోprotein, fiber, మరియు calcium వంటి అనేక పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు.రాగుల లో ఉండే పోషక విలువలు, వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.

Nutrients: రాగులలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏమిటి?
- ప్రొటీన్ (Protein): ఇది శరీరానికి అవసరమైన ప్రధాన పోషక పదార్థం. రాగులలో ఉన్న ప్రొటీన్ కండరాల నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.
- ఫైబర్ (Fiber): రాగుల్లో ఉన్న ఫైబర్(Fiber) జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇది అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
- కాల్షియం (Calcium): రాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో అవసరం.
- ఐరన్ (Iron): రాగులు రక్తహీనత (Anemia) సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
పోషకం | 100 గ్రా రాగులో ఉండే మోతాదు |
---|---|
కాల్షియం (Calcium) | 344 mg |
ప్రోటీన్ (Protein) | 7.3 g |
ఫైబర్ (Fiber) | 3.6 g |
కార్బోహైడ్రేట్లు (Carbohydrates) | 72 g |
ఫాస్‌ఫరస్ (Phosphorus) | 283 mg |
ఐరన్ (Iron) | 3.9 mg |
మెగ్నీషియం (Magnesium) | 137 mg |
పోటాషియం (Potassium) | 408 mg |
Finger Millet Health Benefits: రాగుల ఆరోగ్య ప్రయోజనాలు

1. Weight Loss:బరువు తగ్గించడం
రాగుల్లో ఉండే ఫైబర్ నెమ్మదిగా ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. ఇంకా ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది. అందుకే ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
2. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది
డయాబెటిస్ ఉండే వారికి రాగులు చాలా ఉపయోగపడతాయి. రాగులు శరీరంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అందువల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు చాలా వరకు తగ్గిపోతాయి.
3. ఎముకల దృఢత్వం
పూర్వకాలంలో ముసలి వాళ్ళ అయిపోయాక ఎముకల సమస్యలు, మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసు తక్కువ ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
రాగుల్లో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అస్టియోపోరోసిస్ లాంటి ఎముకల సమస్యలు తగ్గిపోతాయి. ముందు జాగ్రత్తగా రాగులను మనం మన ఆహారంలో చేర్చుకుంటే ఎముకలకు సంబంధించినటువంటి ఏ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
4. అజీర్తి సమస్యలు
మనం తినే తిండి వల్ల నా పొట్టలో అరుగుదల తగ్గిపోయి ఏది తిన్నా గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. రాగులలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అన్ని జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
5. రాగుల ప్రయోజనాలు
రాగులు డయాబెటిస్, రక్తహీనత, ఎముకల సమస్యలు ఉండేవారికి మంచి ఆహారం. ఈ Millet శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ చిరుధాన్యాన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఫాలో అవొచ్చు.
అందుకే, ఫింగర్ Millet మనం రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉపయోగించాల్సిన చిరుధాన్యం. దీంట్లో పొటాషియం, ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం. మీ ఆరోగ్యం కోసం రాగులను ఆహారంలో వాడటం ఎంతో మంచిది.
How To Use? రాగులను ఉపయోగించే విధానాలు:
రాగి పిండి (Ragi Flour)
రాగి పిండి తయారు చేయడానికి మొదటగా రాగులను తీసుకొని బాగా కడిగి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత రాగులను గ్రైండర్లో వేస్తే వేసి మెత్తటి పౌడర్ లాగా చేసి నిల్వ ఉంచుకోవాలి. రాగి పిండి వంటలో రొట్టెలు, ఇడ్లి, దోశలు వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చు.
బయట సూపర్ మార్కెట్లో రాగిపిండి దొరుకుతుంది. మనకి తీరిక సమయం లేకపోతే రాగి పిండిని తెచ్చుకొని రకరకాల వంటల్లో ఉపయోగించుకోవచ్చు కానీ వీలు కుదిరితే మాత్రం రాగులను తీసుకుని వాటి నుంచి రాగి పిండి తయారు చేసుకోవడం ఉత్తమమైన పని.
రాగి జావ (Ragi Malt)
రాగి జావ మంచి ఎర్నర్జీ డ్రింక్ (Energy Drink) గా వాడవచ్చు. రాగి జావా అనేది రాగి పిండితో చేసే మంచి బలమైన జావ. దీనిని నీటితో చేయవచ్చు లేదా మజ్జిగతో తాగవచ్చు లేదా పాలు, బెల్లం కలిపి కూడా చేయవచ్చు. రాగి జావా మజ్జిగతో తీసుకున్నప్పుడు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా బయటికి వెళ్లిపోయి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది.
రాగి Roti
ఇవి స్నాక్ (Snack) గా తీసుకోవడానికి చాలా మంచి ఆహారం. రాగి రొట్టె ఇది రాగి పిండితో చేసే బలమైన రాగి రొట్టెను అన్ని రొట్టెలు చేసే విధంగానే చేసుకోవచ్చు. రాగి రొట్టెతో పాటు మంచి బలమైన కూరగాయ కూరలతో తింటే చాలా బాగుంటుంది.
Finger Millet Recipes
1. రాగి సంకటి

కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి – 1 కప్పు
- బియ్యం – 1/4 కప్పు
- నీరు – 3 కప్పులు
- ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
- ఒక పాత్రలో 3 కప్పుల నీరు తీసుకొని మరిగించండి.
- నీరు మరిగిన తర్వాత అందులో బియ్యం వేసి ఉడకనివ్వండి.
- బియ్యం సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలపండి.
- రాగి పిండిని ఒక చిన్న గిన్నెలో నీటితో కలిపి ఒక ముద్ద లాగా చేయాలి.
- బియ్యం పూర్తిగా ఉడకగానే అందులో రాగి ముద్దను నెమ్మదిగా వేసి కలుపుతూ ఉండాలి.
- మంట మిడ్ లేదా లో తక్కువగా ఉంచి నిరంతరం కలుపుతూ ఉండండి.
- రాగి పిండి బాగా కలసి చిక్కగా మారే వరకు గరిట తో కలుపుతూ ఉండాలి.
- సంకటి గట్టిపడే దశకు రాగానే గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా నూనె లేదా నీటితో చల్లారనివ్వండి.
- రాగి సంకటిని ముద్దగా చేసుకొని చికెన్ కూర, మటన్ కూర లేదా పెరుగు తో కలిపి తినచ్చు.
డయాబెటిస్ ఉన్నవారికి ఈ సంకటి ఆరోగ్యకరమైన ఆహారం. రాగి సంకటైనా, రాగి జావైనా ఏదైనా కూడా తక్కువగా తీసుకున్నప్పుడు దాని ఫలితం మనకు ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గుదామని తగ్గుదామని చెప్పి ఎక్కువగా రెండు మూడు గ్లాసులు రాగి జావ తాగితే మాత్రం ఎక్కువ క్యాలరీలు మనకి మన శరీరానికి అందుతాయి. అందువల్ల రాగిసంకటి మితంగా తీసుకోవాలి రాగి జావ కూడా ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు రాగిజావనే ఒక గ్లాస్ కి మించి తాగకపోవడం మంచిది.
2. రాగి రొట్టె

కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి – 1 కప్పు
- ఉల్లి తరుగు
- కరివేపాకు
- కొత్తిమీర
- ఉప్పు
తయారీ విధానం:
- రాగి పిండి, ఉల్లి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు ఒక గిన్నెలో వేసి బాగా కలపండి.
- కొద్దికొద్దిగా నీరు వేసి గట్టిగా ముద్దలా కలపండి.
- ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
- ఒక్కొక్క ఉండ తీసుకుని చపాతి చేసినట్లుగా చేయాలి.
- దానిపైన రొట్టెలను మంచిగా కాల్చుకోవాలి
- అవసరమైతే కొంచెం నూనె వాడవచ్చు
- వేడి వేడి రొట్టెలను ఏదైనా కూరతో తినవచ్చు,
Frequently Asked Questions
ఫింగర్ మిల్లెట్ అంటే ఏమిటి?
ఫింగర్ మిల్లెట్ అంటే రాగులు. ఇవి ఒక చిరుధాన్యం. ఎక్కువగా పోషకాలు కలిగి ఉంటాయి.
రాగులు ఆరోగ్యానికి మంచివినా?
అవును. రాగులు కల్షియం, ప్రొటీన్, మరియు ఫైబర్ వంటి పోషకాలతో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.
రాగులు తీసుకోవడం వల్ల ఏమి ప్రయోజనాలు ఉంటాయి?
రాగులు ఎముకల గట్టితనం, బరువు తగ్గడం, చక్కెర స్థాయిలు తగ్గించడం, జీర్ణవ్యవస్థ మెరుగుదల వంటి బెనిఫిట్స్ కలిగిస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు రాగులు తినవచ్చా?
అవును. రాగులు బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండ తినవచ్చు.
రాగులు ఎలా వాడాలి?
రాగులతో రొట్టెలు, దోశలు, ఇడ్లి, రాగి జావ, బిస్కెట్లు లాంటి వంటకాలు వండుకోవచ్చు.
రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుందా?
అవును, రాగుల్లో అధికంగా కల్షియం ఉంటుంది, ఇది ఎముకల బలానికి చాలా అవసరం.
చిన్న పిల్లలకు రాగులు మంచివా?
అవును. రాగులు పిల్లల హెల్త్కి మంచివి. ఇది వారికీ కావాల్సిన పోషకాలు అందిస్తుంది.
రాగులు రోజు తీసుకోవచ్చా?
రోజు రాగిజా రాగులను మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ఒకరోజు రాగి జావాలో చేసుకోవచ్చు ఒకరోజు రాగి రొట్టెలా చేసుకోవచ్చు. మరొక రోజు రాగి సంగటి చేసుకోవచ్చు. ఏదైనా గాని ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువగా తినేయకూడదు.
Ragulu తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుందా?
అవును. రాగుల్లో ఉన్న ఫైబర్ ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
Ragulu ఎక్కడ దొరుకుతాయి?
రాగులు చాలా సులభంగా సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, మరియు ఆన్‌లైన్ ద్వారా కొనవచ్చు.
Conclusion
రాగులనేవి ఎప్పటినుంచో మన ఆహారంలో భాగమై ఉన్నాయి. ఈ రాగులు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన అందానికి కూడా పనిచేస్తాయి. ఈ రాగులను కచ్చితంగా మనము మన ఆహారంలో ఎలా అయినా తీసుకోవడం మంచిది. ఈ రాగులతోటి మనం మొలకలు కూడా చేసుకుని తినవచ్చు నాగుల కంటే కూడా రాగుల వల్ల వచ్చే మొలకల్లో ఇంకా మంచి పోషక విలువలు ఉంటాయి. రాగి జావా మన వంటికి చలువ చేస్తుంది. చిన్న పిల్లలకు రాగి జావా అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. చివరగా ఉక్కు లాంటి శరీరం కావాలంటే కచ్చితంగా రాగులను తినాల్సిందే.