Ragi Java Benefits in Telugu:
ఈ ఆర్టికల్ లో రాగి జావ ఎలా తయారు చేస్తారు? ఉపయోగాలు ఏమిటి ? పోషకాలు ఏంటి ? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అన్నీ కూడా తెలుసుకుందాం
Table of Contents
మనకి తెలిసినంతవరకు రాగి జావ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎవరైనా దీనిని తాగవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. రాగి జావా తాగడం వల్ల మన శరీరం ఉక్కులా తయారవుతుందని అందరూ అంటుంటారు. అది నిజమే.
Ragi Java Benefits In Telugu: రాగి జావ ఉపయోగాలు

1. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
- రాగిజావలో 12% ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
- దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం మన రక్తపోటును పెరగకుండా చేస్తాయి.
- దీనిలో పాలి ఫినాల్స్ లాంటి ఆంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని స్ట్రెస్ ని ఒత్తిడిని తగ్గిస్తుంది.
2. బరువు తగ్గడం
- రాగి జావా తాగడం వల్ల మన శరీరానికి తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ అందుతుంది.
- దీనిలో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది అందువల్ల ఇది తాగినప్పుడు పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
- ఆకలి వేయదు. ఈ విధంగా ఇది మన బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది.
3. అజీర్తి
- ఇంతకుముందే చెప్పుకున్న విధంగా రాగులలో ఉండే అధిక ఫైబర్ మన జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది.
- అజీర్తి సమస్యలు రాకుండా చేస్తుంది.
- దీనివల్ల మలబద్ధకం ఉన్నవారు చాలా ఉపయోగపడతారు
4. ఎముకల ఆరోగ్యం
- రాగులులో ఉన్న క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎముకలను బలంగా చేస్తాయి.
- మనం చిన్నపిల్లలకి రాగిజావని ఆరు నెలల తర్వాత డైట్ లో చేర్చవచ్చు.
- చిన్నప్పటి నుంచి దీనిని పిల్లలకి అలవాటు చేయడం వల్ల ఎముకలు బలంగా పెరుగుతాయి.
5. గాయాలు మానడానికి
రాగులలో ఉండే విటమిన్ఈ గాయాలను తొందరగా తగ్గడానికి పనిచేస్తుంది. చర్మానికి మరియు జుట్టుకి ఒక సహజ రక్షణ లాగా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం ఉంటుంది . ఇది రక్త ప్రసరణ జరగడానికి మరియు జుట్టు బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది.
Ragi Java Nutrients:రాగి జావా యొక్క పోషక విలువలు
పోషక విలువ | 100 గ్రా |
---|---|
కేల్షియం | 350 మి.గ్రా |
ఐరన్ | 3.9 మి.గ్రా |
ప్రోటీన్ | 7.3 గ్రా |
ఫైబర్ | 15.5 గ్రా |
విటమిన్ B1 (థియమిన్) | 0.29 మి.గ్రా |
విటమిన్ B2 (రిబోఫ్లావిన్) | 0.09 మి.గ్రా |
విటమిన్ B3 (నియాసిన్) | 1.0 మి.గ్రా |
పోటాషియం | 408 మి.గ్రా |
మ్యాగ్నీషియం | 137 మి.గ్రా |
క్యాలరీస్ | 336 కేలరీ |
How to Prepare Ragi Java?

రాగి జావను సాధారణంగా రాగి పిండి నుండి తయారుచేస్తారు. రాగులను పొడి చేసి రాగి పిండి తయారు చేస్తారు. రాగులు చాలా చిన్నచిన్న గింజలుగా కనిపించే సిరిధాన్యం. చూడటానికి ముదురు గోధుమ రంగు లో ఉంటాయి. ఇవి భారతదేశం మరియు ఆఫ్రికాలో బాగా పెంచుతారు. వీటిలో మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు రాగిజావని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి -2 టేబుల్ స్పూన్లు
- నీరు -2 కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- యాలకుల పొడి – చిటికెడు
తయారీ విధానం:
- మొదటగా రాగులన్ని ఎండబెట్టి రాగి పిండి తయారు చేసుకోవాలి.
- తర్వాత ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
- బాగా మరిగిన తర్వాత రెండు లేదా మూడు టీ స్పూన్లు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా కలపాలి.
- రాగి పిండి చిక్కబడే వరకు ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి.
- రాగి పిండి చిక్కబడే వరకు ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి.
- అంతే ఇంకా రాగి జావ రెడీ అయిపోతుంది.
- బరువు తగ్గాలనుకునే వారు రాగిజావలో నీరు తప్ప ఏమీ వేయకూడదు.
- ఆరోగ్యం కోసమైతే ఒక కప్పు పాలను కలిపి కొంచెం బెల్లం వేసి రాగి జావను తాగడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి.
ఈ రాగిజావను రోజు ఒక గ్లాస్ తాగవచ్చు.
షుగర్ ఉన్నవారు ఉన్నవారు రాగి జావ ఎలా తాగాలి?

రాగి జావ షుగర్ ఉన్న వారికి మంచిదేనా? అంటే అవునని చెప్పొచ్చు. కాదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాగిజావ కూడా మన రైస్ లాగానే కార్బోహైడ్రేట్. ఇది తాగగానే మన రక్తంలోని చక్కర స్థాయిని పెంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్నవాళ్లు ఒక పద్ధతిలో తాగడం వల్ల ప్రయోజనం పొందుతారు. దీనిని వ్యాయామం చేసే ముందు ఒక గ్లాస్ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా షుగర్ డౌన్ అయినప్పుడు లేదా మధ్యాహ్న సమయాల్లో ఈ రాగిజావను తీసుకోవచ్చు. అంతేకానీ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవడం వల్ల చక్రస్థాయిలో కచ్చితంగా పెరుగుతాయి. అందువల్ల దీనిని ఉదయాన్నే తీసుకోవడం మానేయాలి.
రాగి అంబలి ఎలా తయారు చేస్తారు?
రాగి జావ తయారు చేసిన తర్వాత దాన్ని పులిసేలా చేస్తే దానిలో పోషిక విలువలు చాలా బాగా పెరుగుతాయి. పులిసిన రాగిజావలో మజ్జిగ కలిపి తీసుకుంటే దానిని రాగి అంబలి అంటారు. రాగిజావ కన్నా కూడా రాగి అంబలిలో పూర్తి పోషక విలువలు ఉంటాయి. ఈ రాగి అంబలిని తీసుకోవడం వల్ల మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. రాగి జావ యొక్క అన్ని పోషకాలు మన శరీరానికి అందాలంటే దానిని పులిసిన మజ్జిగతో కలిపి తాగితే చాలా చాలా మంచిది. రాగి అంబలి ఎండాకాలం మనకి బాగా చలువ చేస్తుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
Ragi java Side Effects
- దీనివల్ల కొంతమందికి అలర్జీలు రావచ్చు.
- డయాబెటిస్ పేషంట్స్ దీన్ని ఒక క్రమ పద్ధతిలో చాలా మితంగా తీసుకోవాలి.
- బరువు పెరగాలని ఉండేవారు కూడా మితంగానే తీసుకోవాలి.
- కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్లు తాగకపోవడమే మంచిది.
Conclusion
రోజు ఒక క్రమ పద్ధతిలో రాగిజావ తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంతగా మారుతుందో చెప్పలేము. దీనిని తప్పకుండా చిన్నప్పటినుంచి పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి. దీనిని తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ బాగా పడుతుంది. అన్న శరీరంలోని చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి మంచి ఫ్యాక్టరీ ఆపేరి మన గట్ హెల్త్ బెటర్ అవుతుంది. అజీర్తి సమస్యలు, రక్తహీనత, ఎముకల సమస్యలు,కాలేయ సమస్యలు అన్నీ కూడా తగ్గి మన ఆరోగ్యం మెరుగవుతుంది.
ఏ ఆహారమైన తగిన పద్ధతిలో తీసుకుంటే దాని పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. ఎలా పడితే అలా తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు అందవు. ఇంకా వాటి వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏ ఆహారాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Frequently Asked Questions
1. Ragi java అంటే ఏమిటి?
మరిగే నీటిలో రాగి పిండిని వేసి కలిపి రాగి జావ తయారు చేస్తారు. అవసరమైన వాళ్ళు దీనిని పాలతో గానే మజ్జిగతో కానీ తీసుకోవచ్చు. కొంచెం బెల్లం కూడా వేయవచ్చు.
3. ఫింగర్ మిల్లెట్ ని తెలుగు లో ఏమంటారు?
ఫింగర్ మిల్లెట్ ని తెలుగులో రాగులు అని అంటారు.
4. Finger Millet యొక్క పోషకాలు ఏమిటి?
ఐరన్, క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్ మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి.
5. Ragulu తినడం వల్ల ఏమి లాభం?
రాగులు ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి. దీనిని విధంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం అజీర్తి సమస్యలు ఉన్నవారు చాలా ఉపయోగపడతారు.
6. రాగి జావా ఎలా తీసుకోవాలి?
రాగిజావని ఒకటి లేదా రెండు గ్లాసులు తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు వాటర్ తో తీసుకుంటే మంచిదే. లేకపోతే పాలు బెల్లం తో తీసుకోవచ్చు.
7. రాగిజావ రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుందా?
అవును, ragula లో ఉన్న పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
8. బరువు తగ్గించడంలో సహాయపడుతుందా?
అవును, ragulu తక్కువ కాలరీలు కలిగి ఉండటంతో పాటు ఎక్కువ ఫైబర్ ఉన్నది. కాబట్టి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
9.రాగి జావా ఎవరు తీసుకోవద్దు?
అలర్జీ సమస్య ఉన్నవాళ్లు మరియు కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు రాగి జావా తీసుకోకపోవడం మంచిది.
10.పిల్లలకి రాగి జావా ఎలా ఇవ్వాలి?
రాగిజావ పాలు పోసి కొంచెం బెల్లం ముక్క వేసి తినడానికి రుచిగా చేయవచ్చు ఇలా పిల్లలకి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు ఇంకా అన్ని రకాల పోషకాలు పిల్లలకు ఎదిగే వయసు నుంచి అందుతాయి.
11. రాగి పిండిని ఎలా తయారు చేస్తారు?
రాగి పిండి రాగి గింజలను పొడిచేసి తయారుచేస్తారు. రాగి పిండిలో కేల్షియం, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాగి పిండి ఉపయోగించి ఇడ్లీ, దోశ లను తయారుచేయవచ్చు. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది.
12. రాగి జావ మరియు రాగి అంబలి రెండు ఒకటేనా?
రాగిజావని అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగవచ్చు. రాగి అంబలి అంటే రాగిజావ తయారుచేసి ఒక నైట్ మొత్తం ఫన్మెంటేషన్ కోసం బయట ఉంచాలి. ఉదయాన్నే దానిలో మజ్జిగ కొంచెం ఉప్పు వేసి తీసుకోవాలి.
Read Also
We have Different Types of Millets