Flax Seeds Uses In Telugu: మనము ఈ ఆర్టికల్ లో ఫ్లాక్స్ సీడ్స్ వాటిలో ఉండే పోషకాలు, వాటిని ఎలా తినాలి? ఎలా ఉపయోగపడతాయి? ఏవైనా దుష్ప్రభావం ఉన్నాయా? అన్ని వివరంగా తెలుసుకుందాం.
ఫ్లాక్స్ సీడ్స్‌ను(Flax Seeds) రోజూ తీసుకుంటే మలబద్ధకం, డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండెకు సంబంధ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను చాల వరకు నివారించవచ్చును. వీటిని మన ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. మన ఆరోగ్యానికి మంచి చేసే అనేక రకాల Seeds (విత్తనాలు) ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినటువంటి విత్తనాలు Flax Seeds , Chia seeds, Hemp Seeds, Cumin Seeds, etc.
Table of Contents
What is the Telugu name for flax seeds?

Flax Seeds ను తెలుగులో అవిసె గింజలు అంటారు. ఈ అవిసె గింజలు చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో(Ayurveda) ఉపయోగించబడుతున్నాయి. ఈ గింజల్లో ఔషధ గుణాలతో పాటు చాలా పోషక విలువలు కూడా ఉంటాయి. వీటిలో లిగ్నాన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్(Fiber), ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలను సరైన మోతాదులో తీసుకోవడం వలన ప్రమాదకరమైన వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.
ఫ్లాక్స్ సీడ్స్ ముఖ్య పోషక విలువలు
పోషక పదార్థం | పరిమాణం (100 గ్రా.) |
---|---|
కాలరీలు | 534 kcal |
ప్రోటీన్ | 18 గ్రా. |
కొవ్వులు | 42 గ్రా. (ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో) |
ఫైబర్ | 27 గ్రా. |
మ్యాగ్నీషియం | 392 మిగ్రా. |
Flax Seeds Uses In Telugu:

Top 5 Health Benefits of Flax Seeds: ఆరోగ్య ప్రయోజనాలు
- గుండె ఆరోగ్యం: అవిస గింజలలో ముఖ్యంగా ఉన్నటువంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు లిగ్నాన్స్ గుండె సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
- కొలెస్ట్రాల్ : అవిస గింజలలో ఉండే పీచు పదార్థం మన రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి బయటికి పంపించి ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది.
- జీర్ణక్రియ : మనం నిత్యం రకరకాల ఆహారాలు తింటూ ఉంటాము. వీటివల్ల మన శరీరంలో అనేక రకాలైన టాక్సిన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ అవిసె గింజల్లోనే పీచు పదార్థం మన శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడే అవకాశం ఉంది.
- రక్తపోటు నియంత్రణ: అవిసె గింజలలోని పోషకాలు మన రక్తపోటును క్రమబద్ధం చేసి మనకు భవిష్యత్తులో రక్తపోటు సమస్య రాకుండా చూస్తుంది.
- బరువు తగ్గడం: వీటిలో ఉండే పోషకాలు వలన మనకి ఆరోగ్యంతో పాటు అదనపు కొవ్వు కూడా కరిగిపోతుంది.
Flax Seeds Benefits For Female
ప్రత్యేకంగా మహిళలకి ఈ అవిస గింజలను తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.
హార్మోన్ల సమతుల్యత
మహిళల్లో హార్మోన్స్ ఇమ్బాలన్స్ వలన చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. రుతుక్రమం సరిగ్గా రాకపోవడం, నీటి బుడగల సమస్య, గర్భసంచిలో పాలిప్స్ ఏర్పడడం, రకరకాల గడ్డలు ఏర్పడడం, ఇంకా అతి ఎక్కువగా రక్తస్రావం పెరగడం, ఇలాంటి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉన్న లిగ్నాన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ స్థాయిలను క్రమబద్ధం చేస్తాయి. ప్రతినిత్యం అవిసగించడం నేరుని తాగడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది.
మెనోపాజ్ సమస్యలతో సహాయం
ప్రతి మహిళా తన జీవితంలో మెనోపాజ్ దశని అతిగామించాల్సిందే. మోనోపోజ్ అనగా 45 నుండి 55 సంవత్సరాల లోపు మహిళలు రుతుస్రావం ఆగిపోతుంది. ఈ ఆగిపోయే సమయంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అతి రక్తస్రావం, మానసిక సమస్యలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడి మెనోపాజ్ దశ సాఫీగా జరిగిపోవాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ అవిసె గింజలను మహిళలు ఆహారంలో తీసుకోవాలి.
చర్మ ఆరోగ్యం
అందంగా కనపడాలంటే దానిలో 75% చర్మ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది చర్మం ఆరోగ్యంగా స్పష్టంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అవిస గింజలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి. ముందుగా చెప్పినట్లుగా అవిస గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన జన్మానికి మంచి తేమను అందించి తొందరగా ముడతలు రాకుండా మరియు వచ్చిన ముడతల్ని కూడా తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి.
How to eat Flax Seeds:

ఫ్లాక్స్ సీడ్స్ తినే విధానాలు
- పొడిగా దంచి: Flax Seedsను పొడిగా చేసి స్మూతీలు(Smoothies), పళ్ళ రసం(Juices) లేదా పెరుగు లో కలిపి తినవచ్చును. పొడి రూపంలో తినడం వలన శరీరానికి వీటి పోషకాలు త్వరగా అందిస్తుంది.
- పచ్చిగా లేదా వేపి: కొన్ని ఫ్లాక్స్ సీడ్స్‌ను పచ్చిగా లేదా స్వల్పంగా వేడి చేసి స్నాక్స్‌గా కూడా తినవచ్చు. ఇది తేలికగా చాలా జీర్ణమవుతుంది.
- రొట్టెలలో కలిపి: పిండి చేసేటప్పుడు Flax Seeds పొడిని కొద్దిగా కలిపి చపాతీలు, దోసలు చేయవచ్చు.
- సలాడ్‌లో: ఫ్లాక్స్ సీడ్స్‌ను సలాడ్‌లపై చల్లి తింటే కూడా మంచి క్రంచ్ తో పాటు పోషక విలువలు కూడా అందుతాయి.
- పానీయాలలో: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ పొడిని కలుపుకొని తాగవచ్చు.
అవిసె గింజలు ఎప్పుడు తినాలి?
అవిసె గింజలు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు, దాంట్లో ఏ సమస్య రాదు. ఉదయాన్నే కానీ, మధ్యాహ్నం కానీ లేదా రాత్రి సమయంలో కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం అవిస గింజల్ని ఎన్ని రకాలుగా అయినా మన ఆహారంలో చేసుకోవచ్చు. వీటిని ఏవైనా స్మూతీస్ చేసుకుని దాంట్లో కలుపుకోవచ్చు లేదా పెరుగులో కలిపి తినవచ్చు లేదా పొడిగా చేసి దోశలలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా అయినా వాడుకోవచ్చు.
అవిస గింజలని రాత్రి మొత్తం ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగడం వలన మంచి రోజు నాలుగు ఉంటాయి మనం ఉదయం టీ లేదా కాఫీ తాగే బదులు ఈ అవిసె గింజల నీళ్లను తాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.
మనం పరిగడుపున తీసుకునే అవిసె గింజల వలన మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నీళ్లలో ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా అన్ని రకాల జుట్టుకి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తొలగించి మనకు కొత్త జుట్టు పెరగడానికి తోడ్పడతాయి మరియు మలబద్దక సమస్య తీరుతుంది.
ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?
- అవిసె గింజల్లో ఉండే ఎక్కువ ఫైబర్ కారణంగా కొంతమందికి పొట్టలో నొప్పి వాంతులు మరియు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన వీటిని తీసుకునే ముందు నానబెట్టి తీసుకోవడం మంచిది లేదా వేయించి పొడి చేసుకుని వాడుకోవడం మంచిది.
- వీటివల్ల చర్మం మీద దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఇవి కొద్ది కొద్దిగా మన శరీరానికి అలవాటు చేయడం మంచిది. ముందుగా చాలా తక్కువ మోతాదులో మన శరీరం ఎలాంటి సమస్య లేకుండా ముందుగా మనం చాలా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి సమస్య లేనట్లయితే క్రమమైన పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
- ఈ అవిస గింజలలో మన రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. అందువల్ల బిపి సమస్య ఉన్నవారు వీటిని తినే ముందు లేదా తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.
- గర్భిణీ మరియు తల్లిపాలను ఇస్తున్న స్త్రీలు అవిసె గింజలను తిన్నప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది తప్ప వచ్చు. వీటి వలన గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, కచ్చితంగా వీటిని తినాలంటే ముందుగా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమమైన పని.
- వీటిని ఒకేసారి ఎక్కువగా తినడం వలన డయేరియాం అంటే సమస్య వచ్చే అవకాశం ఉంది.
FAQ
1. అవిసె గింజలు అంటే ఏమిటి?
అవిస గింజలు అవిసె మొక్క నుంచి వచ్చే చిన్న చిన్న గింజలు ముదురు, గోధుమ రంగులో ఉంటాయి వీటిలో మంచి ఫైబర్ లిగ్నన్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి.
2. అవిసె గింజలను ఎలా వాడతారు?
అవిసె గింజలను మనం మనకే నచ్చినట్లుగా ఎలా అయినా వాడుకోవచ్చును దీనిని పచ్చిగా ఉన్నట్లయితే నీటిలో నానబెట్టి ఆ నీళ్ళని తాగవచ్చు లేదా వీటిని వేయించి పొడి చేసి ఆ పొడిని కూరలలో సలాడ్లలో ఏవైనా స్ఫూర్తి చేసుకుని దాంట్లో కలుపుకోవచ్చు.
3. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
అవిసె గింజల్లో ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్ మరియు ఫైబర్ చాలా వరకు మేలు చేస్తాయి. అవిసె గింజలు హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తాయి, జుట్టు పెరగడానికి, లావు తగ్గడానికి, గర్భిణీ స్త్రీలకు, మహిళల్లో మోనోబాజీ సమస్యలు తగ్గడానికి, చిన్నపిల్లలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయి.
4. అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా?
అతి అనర్థాలకు చేయటం అని ఊరికే అనరు. మనం ఏ ఆహారం తీసుకున్న దేనినైనా గాని తక్కువ పరిమాణంలో మన ఆహారంలో చేర్చుకున్నట్లైతే ఎలాంటి సమస్యలు రావు. అవిసె గింజల్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉండడం వలన ఎక్కువగా తిన్నట్లయితే కచ్చితంగా సమస్యలు వస్తాయి.
5. బరువు తగ్గడానికి అవిసె గింజలు ఉపయోగపడతాయా?
మనం తిన్నప్పుడు మన ఆకలి తగ్గుతుంది మరియు వీటివల్ల తక్కువకి క్యాలరీలు మన శరీరానికి అందుతాయి. అందువల్ల బరువు తగ్గడం జరుగుతుంది.
6. అవిసె గింజలను ఎలా తినాలి?
అవిసె గింజలను వేయించి చల్లార్చుకుని మెత్తటి పొడి లాగా చేసుకుని మనకి నచ్చిన వంటకాలలో వాడుకోవచ్చు.
7. అవిసె గింజలు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయా?
అవిసె గింజలు గుండె జబ్బులు, డయాబెటిస్ మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉపయోగపడతాయి.
8. అవిసె గింజలు గర్భిణీ స్త్రీలు ఇవి తినవచ్చా?
సాధారణంగా అవిసె గింజల వలన గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కానీ వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏమైనా హార్మోన్ సమస్యలు రావచ్చు.
10. అవిసె గింజలను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన సమయం ఉందా?
సాధారణంగా అవిసె గింజలను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఉదయాన్నే పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగడం వలన కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటే ఆహారం తిన్న తర్వాత లేక సాయంత్రం వేళలో తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
11. అవిసె గింజల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి?
అవిసె గింజల వలన కొంతమందికి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. డయేరియా లేకపోతే గర్భిణీ స్త్రీలకు హార్మోన్స్ సమస్య రావచ్చు.
12. చిరుధాన్యాలలో అవిస గింజలు కూడా ఉన్నాయా
అవిసె గింజలు చిరుధాన్యానికి( మిల్లెట్స్ ) సంబంధించినవి కావు. ఇవి కూడా గింజలు, ఒక రకమైన విత్తనాలు.
13. అవిసె గింజలు మరియు క్వినోవా ఒకటేనా?
కాదు. అవిసె గింజలను ఇంగ్లీషులో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు.