Foxtail Millet In Telugu Benefits :
కొర్రలు అనేవి ఒక రకమైన చిరుధాన్యాలు.
వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచివి.
Table of Contents
What is Foxtail Millet?
కొర్రలు అనేవి చిరుధాన్యాలలోని ఒక రకం. ఇవి చిన్నచిన్నగింజలుగా ఉంటాయి.మన ఆరోగ్యానికి ఇవి మంచివి. ఇవి ఎక్కువగా పీచు, ప్రోటీన్, విటమిన్ లను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. తరచూ వాడటం వల్ల పొట్ట బరువు తగ్గడానికి మరియు శక్తి ని పొందడానికి ఇవి ఉపయోగపడతాయి.
Korralu ఎక్కడ పండిస్తారు?

ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ భారత్, చైనా, నేపాల్, మరియు కొరియా వంటి ఆసియా దేశాలలో ఎక్కువగా పండిస్తారు.
ఇవి పొడి ప్రాంతాల్లో కూడా చాలా సులభంగా పండుతాయి. దక్షిణ భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వీటిని విస్తృతంగా పండిస్తున్నారు. ఈ ధాన్యం తక్కువ నీటితో పండటం వల్ల రైతులు ఎక్కువగా పండిస్తుంటారు.
Foxtail millet Nutritional Values:కొర్రలు పోషక విలువలు
పోషక విలువ | 100 గ్రాముల కొర్రల్లో |
---|---|
కేలరీలు (Calories) | 355 kcal |
ప్రోటీన్ (Protein) | 12.3 గ్రా (g) |
కొవ్వు (Fat) | 4.3 గ్రా (g) |
కార్బోహైడ్రేట్లు (Carbohydrates) | 63.2 గ్రా (g) |
పీచు (Fiber) | 8 గ్రా (g) |
కాల్షియం (Calcium) | 31 మి.గ్రా (mg) |
ఐరన్ (Iron) | 2.8 మి.గ్రా (mg) |
విటమిన్ B1 (Vitamin B1) | 0.59 మి.గ్రా (mg) |
Foxtail millet in Telugu Health Benefits

బరువు తగ్గడానికి-Weight Loss
ఫాక్స్‌టైల్ మిల్లెట్ బరువు తగ్గడానికి( Weight Loss) చాలా మంచిది. ఇది ఎక్కువగా పీచును కలిగి ఉంటుంది. అందువల్ల పొట్ట నిండుగా ఉంటుంది. కొవ్వులు తక్కువగా ఉండడం వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. దీనితో పాటు మెటాబాలిజాన్ని పెంచుతుంది. ఇంకా అధిక శక్తిని అందిస్తుంది. దీనిని తరచూ ఉపయోగించడం వల్ల బరువు తగ్గడం చాలా సులభం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా దీనిని తీసుకోవడం మంచిది.
డయాబెటిస్
ఫాక్స్‌టైల్ మిల్లెట్ డయాబెటిస్‌కు చాలా మంచిది. ఇది తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను మితి పరిమాణంలో పెంచుతుంది. పీచు ఎక్కువగా ఉండటంతో, చక్కెర శోషణాన్ని మెల్లగా చేస్తుంది. ఇది ఇన్సులిన్ వ్యతిరేకతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజూ తీసుకోవడం, డయాబెటిస్‌ను కట్టడి చేయడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి ఉపకరిస్తుంది.
గర్భిణీ స్త్రీలకు
ఫాక్స్‌టైల్ మిల్లెట్ గర్భిణీ స్త్రీల కోసం మంచి ఆహార ఎంపిక. ఇది విటమిన్లు, మినరల్స్, మరియు పీచుతో నిండుగా ఉంటుంది, ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి అవసరమైనవి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండటంతో, రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ప్రోటీన్, కాల్షియం, మరియు ఐరన్ కలిగి ఉండటం వల్ల, శిశువు అభివృద్ధికి, అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
గాయాలు తగ్గడానికి
మనకి గాయాలు తగిలినప్పుడు అవి తొందరగా మారడానికి కొర్రలు బాగా ఉపయోగపడతాయి. ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు అవి తొందరగా హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గడానికి
గుండె సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఒకటి. మనం తినే ఆహారం వలన మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తయారు అవుతుంది. ఈ కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్ (HDL) కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్(LDL) ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యాన్ని కాపాడితే, చెడు కొలెస్ట్రాల మన రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడానికి ప్రేరేపిస్తున్నాయి. అందువల్ల మన గుండెలో అనేక రకాల సమస్యలు రావడం జరుగుతుంది . ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రావడానికి ఈ గడ్డలు కారణం అవుతాయి. అందువల్ల కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం ఎంతో అవసరం.
ఈ కొర్రలు ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సరిగ్గా పని చేయడానికి దోహదపడుతుంది. ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి కొర్రలు తినేటట్లయితే ఒక పద్ధతిని అవలంబించి కొన్ని రోజుల వరకు తినాలి. అప్పుడప్పుడు తిన్నట్లయితే సమస్య తగ్గదు ఏదైనా వ్యాధి తగ్గాలంటే నిత్యం వాటి వాడకం ఉండాలి.
Recipes: వండే విధానం

కొర్ర అన్నం
కావలసిన పదార్థాలు:
- కొర్రలు (Foxtail Millet) – 1 కప్పు
- నీళ్లు – 2 కప్పులు
- ఉప్పు తగినంత
తయారీ విధానం:
- మొదటగా ఒక కప్పు కొర్రలను తీసుకొని నీటితో రెండు మూడు సార్లు బాగా కడగాలి.
- కడిగిన కొర్రలలో రెండు కప్పుల నీళ్లు పోసి ఒక గిన్నెలో ఉంచి స్టవ్ మీద పెట్టాలి.
- కొంచెం సేపు అయిన తర్వాత తగినంత ఉప్పు వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
- మొత్తం నీళ్లు పోయాక ఒక రెండు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి.
- కొర్ర అన్నం వెజిటబుల్స్ కూర, పెరుగు, లేదా పప్పుతో తింటే రుచిగా ఉంటుంది.
- కొర్రలను వండే ముందు రెండు మూడు గంటలు నానబెడితే తొందరగా ఉడుకుతాయి.
Korra Dosa (Foxtail Millet Dosa)
కావలసిన పదార్థాలు:
- కొర్రలు (Foxtail Millet) – 1 కప్పు
- ఉప్పు – తగినంత
- మినపప్పు (Urad Dal) – ½ కప్పు
- మెంతులు (Fenugreek Seeds) – 1 టీస్పూన్
- నూనె
తయారీ విధానం:
- మొదటగా కొర్రలను బాగా కడిగి ఒక టీ స్పూన్ మెంతులను వేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి.
- నానబెట్టిన గొర్రెలను గ్రైండర్లో వేసి తగినంత నీళ్లు పోస్తూ మెత్తని పిండి గారు రుబ్బుకోవాలి.
- పిండిలో తగినంత ఉప్పు కలిపి 6 నుండి 8 గంటల పాటు ఉంచాలి.
- దీనివల్ల పిండి బాగా పులుస్తుంది.
- ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా దోశలు వేసుకోవాలి.
- వీటిని ఏదైనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Korralu Side Effects
కొర్రలు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి.అయినప్పటికీ. అయినా కూడా కొంతమందికి కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.
- కొర్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమందికి అరగకపోవచ్చు. అందువల్ల వారానికి ఒకటి లేదా రెండుసార్లు తగినంత మోతాదులో మాత్రమే తినాలి.
- థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు తక్కువగా తీసుకోవడం మంచిది.
- కొంతమందికి కొన్ని రకాలైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
Frequently Asked Questions
ఫాక్స్టైల్ మిల్లెట్ మరియు రాగి ఒకటేనా?
కాదు. ఫాక్స్టైల్ మిల్లెట్ ని తెలుగులో కొర్రలు ఉంటారు. ఫింగర్ మిల్లెట్ ని తెలుగులో రాగులు అంటారు.
కొర్రలు ఎవరు తినకూడదు?
కొర్రలను థైరాయిడ్ ఉన్నవాళ్లు, ఏమైనా అలర్జీలు ఉన్నవారు, అజీర్తి సమస్యలు ఉన్నవారు తక్కువ తినడం మంచిది.
What is the name of foxtail millet in Telugu?
ఫాక్స్ టెల్ మిల్లెట్ ని తెలుగులో కొర్రలు అని అంటారు. ఈ మధ్య చాలా మంది కొర్ర అన్నం తినడం మొదలుపెట్టారు. దీని ప్రాచుర్యం ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది.
What are the benefits of కొర్రలు?
కొర్రలను ముఖ్యంగా గాయాలు తగ్గడానికి, ఎముకల దృఢత్వానికి, బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి, గుండె ఆరోగ్యం కోసం వాడుతారు. బరువు తగ్గడానికి ఏ చిరుధాన్యాన్ని వాడిన ఉపయోగం ఉంటుంది.
కొర్రలు డయాబెటిస్ కి మంచిదా?
అవును. డయాబెటిస్ రోగులకి ఈ మిల్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి చాలా ఉపయోగం. ఒక నెల రోజుల వరకు కొర్రలతో అన్నం ని వండుకొని వారానికి మూడు లేదు నాలుగు సార్లు చొప్పున తినడం అలవాటు చేసుకోండి. నెల తర్వాత మీ షుగర్ ని చెక్ చేసుకోండి. కొర్రలను తినేటప్పుడు వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. తప్పకుండా చక్కెర వ్యాధి తగ్గుతూ వస్తుంది
ఫాక్స్టైల్ మిల్లెట్ చిన్నపిల్లలు తినవచ్చా?
మిల్లెట్లో పిల్లలకి ఉపయోగపరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇది పిల్లలకి చాలా బలమైన ఆహారం. ఇవి చిన్నపిల్లలకి కొంచెం మితంగా ఇవ్వడం చాలా అవసరం.
కొర్రలు ఎలా ఉండాలి?
కొర్రలతో అన్నం వండుకోవచ్చు. దోసెలు, కిచిడి, పొంగల్ చేసుకోవచ్చు. కొర్రలు ఒక్కటే వండుకోవడం మంచిది కొర్రలతో పాటు వేరే ఇతర రకాల సిరి ధాన్యాలు కలపకుండా ఉంటే మంచిది.
కొర్రలు చూడడానికి ఏ రంగులో ఉంటాయి?
కొర్రలు పసుపచ్చని రంగులో ఉంటాయి. పాలిష్ పట్టిన కొర్రలు తెలుపు రంగులో ఉంటాయి.
ఫాక్స్టైల్ మిల్లెట్ ఎక్కడ పండుతాయి?
కొర్రలను ప్రధానంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో పండిస్తారు . ఇప్పుడు మనం కొనడానికి మాత్రం అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి.
ఫాక్స్టైల్ మిల్లెట్ పరిగడుపున తినవచ్చా?
అవును. తప్పకుండా తినవచ్చు. పరిగడుపున తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఫాక్స్టైల్ మిల్లెట్ ను ఇండియాలో ఎలా పిలుస్తారు?
ఇండియాలో ఫాక్స్టైల్ మిల్లెట్ ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా పిలుస్తుంటారు. తెలుగు లో కొర్ర, తమిళంలో సేయరుకురింజి , హిందీలో కాంజీని, కన్నడలో మలయాళంలో Kuru, అంటారు.
ప్రతిరోజు కొర్రలను తినవచ్చా?
ప్రతిరోజు కొర్రలను తినవచ్చు. కానీ ఏవైనా సమస్యలు ఉన్నవారు వారానికి ఒకటి, రెండు సార్లు తినడం మంచిది. ఏదైనా కొత్త ఆహారం మన శరీరానికి పరిచయం చేసినప్పుడు మన శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయేమో చూసుకోవడం మంచిది. ఏ సమస్య లేకపోతే దాన్ని కొనసాగించవచ్చు ఒకవేళ ఏదైనా సమస్య అనిపిస్తే ఒకటికి రెండుసార్లు పరీక్షించుకొని తినడం ఉత్తమమైన పని
Read Also
Some other Types of Millets are