Jonnalu Benefits In Telugu: జొన్నలు millet (Sorghum) మన తెలుగు ప్రాంతంలో ప్రముఖమైన చిరుధాన్యం. పూర్వ కాలం నుండి మనం వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము.
ప్రాచీన కాలం నుండి జొన్నల వినియోగం ఎక్కువగా ఉండేది. జొన్నలులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా అపారమైనవి.
Table of Contents

మనదేశంలో ఏదైనా ఆహారం అది అందరూ తినేది అని అనగానే నేను జొన్నలు అని చెప్తాను. ఎందుకంటే దీనిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. దీనిని చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా ఎవరైనా తినవచ్చు. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. దీనిని రవ్వగా చేసి లేదా పిండిగా చేసి లేదా అన్నం లాగా రొట్టె లాగా ఎలా అయినా తినవచ్చు. జొన్నలు తింటే సన్నగా అవుతారు అనుకుంటారు, దానికంటే దీని తినడం వల్ల మనము బలంగా అవుతాము.

వరి అన్నము మన శరీరంలో చెడు దోషాలను పెంచితే ఈ జొన్నలు మాత్రం ఆ చెడు దోషాలను తగ్గిస్తాయి. వరి కేజీ మనకి 50 నుండి 60 రూపాయల వరకు 50 నుండి 50 రూపాయల వరకు దొరుకుతుంది కానీ జొన్నలు మాత్రం కేజీ 80 నుండి 100 రూపాయలు అవుతుంది. అందువల్ల కూడా జొన్నల వాడకం తక్కువగా ఉంది. జొన్నలను చాలామంది తింటారు కానీ వరి ధాన్యం తిన్నంత నా తినరు. జొన్నలను తక్కువగా వాడటం వలన వీటిని ఇతరత్రా వినియోగాలకు పశుగ్రాసానికి వినియోగిస్తున్నారు.
జొన్నల పోషక విలువలు (100 గ్రాముల)
పోషకం | మోతాదు (100 g) |
---|---|
శక్తి | 329 కిలోకేలరీలు |
కార్బోహైడ్రేట్లు | 72.6 గ్రాములు |
ప్రోటీన్ | 10.6 గ్రాములు |
కొవ్వులు | 3.5 గ్రాములు |
ఫైబర్ | 6.7 గ్రాములు |
క్యాల్షియం | 25 మిల్లీగ్రాములు |
మ్యాగ్నీషియం | 165 మిల్లీగ్రాములు |
ఫాస్ఫరస్ | 289 మిల్లీగ్రాములు |
పోటాషియం | 363 మిల్లీగ్రాములు |
విటమిన్ B1 | 0.35 మిల్లీగ్రాములు |
విటమిన్ B2 | 0.14 మిల్లీగ్రాములు |
నియాసిన్ (B3) | 2.1 మిల్లీగ్రాములు |
జొన్నల పోషక విలువలు

జొన్నలు లో ప్రోటీన్, విటమిన్‌లు, ఖనిజ లవణాలు మరియు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. జొన్నల్లో ప్రత్యేకించి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
జొన్నలలో పాలిఫినాల్స్ మరియు ఆంథోసయానిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన రక్తనాళాలలోనే చెడు కొలెస్ట్రాన్ని కరిగించి మంచి కొలెస్ట్రాలని పెంచుతాయి. ఈ జొన్నలలో పొటాషియం అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పొటాషియం అనేది మన రక్తపోటుని ఎక్కువగా అవ్వకుండా చూడడంలో ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ జొన్నలనే తినడం వలన మన రక్తనాళాల్లోనే సమస్యలన్నీ తీరి ఏవైనా అడ్డంకులు ఉన్న తొలగిపోయి మన గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.
ఊబకాయానికి చెక్ పెడుతుంది
జొన్నలలో పీచు పదార్థం చాలా ఎక్కువ. జొన్నలను తిన్నప్పుడు పీచు అరగడానికి చాలా సమయం పడుతుంది. దానివల్ల మన కడుపు నిండినట్లుగా అనిపించి మనం ఎక్కువగా కూడా తినలేము. దీనివల్ల అన్ని రకాల పోషకాలుమన శరీరానికి అంది తక్కువ క్యాలరీలు తినేలాగా చేస్తుంది. శరీరానికి తక్కువ క్యాలరీలు అందడం వలన మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కొనాలనేవి కరుగుతాయి. అందువల్ల మనం ఆరోగ్యంగా బరువు తగ్గుతాం.
ఆస్తమాని తగ్గిస్తుంది
ఆస్తమా అనేది శ్వాసకోశానికి ఒక రకమైన వ్యాధి. ఆస్తమా ఉన్న పేషెంట్స్ లో ఒక్కసారిగా ఊపిరి మెసలకుండా అవుతుంది. వాళ్లు దానికోసం ఆర్టిఫిషియల్ ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. ఈ జొన్నల్ని తినడం వల్ల దీంట్లో ఉండే ఆంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు వల్ల ఈ ఆస్తమా అనేది తగ్గుతుంది.
మధుమేహ నియంత్రణ
ఈ మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక జీవనశైలి వల్ల వచ్చే వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్లూటెన్ తక్కువగా ఉండే మరియు చక్కెర తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిదే. ఈ జొన్నలలో గ్లూటెన్ ఉండదు. మరియు దీని యొక్క గ్లయిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను పెరగనీయకుండా చేస్తాయి. అందువల్ల ఇంకా జొన్నలలో ఉండే పాలిఫిన్స్ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల ఉన్నవాళ్లు జొన్నలను తినడం వలన ఉపయోగం పొందుతారు.
గర్భిణీ స్త్రీలకు
సాధారణంగా గర్భిణీ స్త్రీలకు గర్భం దాల్చేముందే ఫోలిక్ యాసిడ్ని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఈ ఫోలిక్ ఆసిడ్ శిశు పిండం దశలో ఉన్నప్పుడే పిండం యొక్క మెదడు కణాలన్నీ ఫామ్ అవుతాయి. దానిలో ఏ లోపం రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోలిక్ యాసిడ్ అనేది తినే ఆహారంలో ఉండాలి. జొన్నలలో ఫోలేట్ ఉంటుంది. అది పిండం ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు తప్పకుండా గర్భం దాల్చేముందే ఈ జొన్నలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
జొన్నలతో జీర్ణవ్యవస్థ ప్రయోజనాలు
ప్రస్తుత జీవనశైలి వలన జీర్ణ సంబంధమైన సమస్యలు, ఇంకా రకరకాల అల్సర్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకు సైతం వస్తున్నాయి. మన జీర్ణసంచి శుభ్రం కావాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఆహార పదార్థాలు, మసాలాలు తక్కువ వాడాలి. ఈ జొన్నల్లో పీచు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఎక్కువగానే ఉంటుంది. ఈ జొన్నలను తిన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రం అవుతుంది, అల్సర్ తగ్గుతాయి మరియు మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.
Recipes:
1. జొన్న అన్నం

తయారు చేసే విధానం
- మొదటగా ఒక కప్పు జొన్నల్ని తీసుకుని బాగా దుమ్ము ధూళి పోయేలాగా కడిగి తగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి.
- ఒక రాత్రి మొత్తం నానబెట్టుకుంటే మంచిది.
- ఉదయం లేవగానే నానబెట్టిన నీళ్లను పంపేసి జొన్నల్ని పక్కకు పెట్టుకోవాలి.
- ఈ జొన్నలని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా రవ్వలాగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ జొన్న రవ్వని తీసుకొని ఒక గిన్నెలో వేసి తగినంత నీరు పోసి ఉడకనివ్వాలి.
- నీరంతా ఇంకెవరకూ జొన్న రవ్వ ఉడికి స్టవ్ మీద ఉంచాలి.
- మొత్తం నీరు ఆవిరైపోయాక స్టవ్ ఆపేసి ఏదైనా మంచి ఆరోగ్యకరమైన కూరగాయల కూరతో తిన్నట్లయితే కావాల్సినంత పీచు పదార్థం మన శరీరానికి అందుతుంది .
- మన శరీరానికి జొన్న అన్నం చాలా బలాన్నిస్తుంది. మలబద్ధకాన్ని తరిమికొడుతుంది
2. జొన్న రొట్టె

తయారు చేసే విధానం
- మొదటగా జొన్నలను కడిగి ఆరబెట్టి బాగా ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.
- ఇలా తయారైన ఒక కప్పు జొన్న పిండిని తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి.
- కలిపిన తర్వాత ఒక ముద్ద లాగా తయారు చేసుకోవాలి. ఒక పది నిమిషాలు ఒక తడి బట్టలు అలా ఉంచాలి.
- తర్వాత ఉండలుగా చేసుకోవాలి కలిపిన బిల్లును ఉండలుగా చేసుకోవాలి ఒక్కొక్క మొత్తం చపాతీ కర్రతో రొట్టెలాగా చేసుకోవాలి.
- ఒక్కొక్క రొట్టెను తీసుకుని పాన్ మీద బాగా కాల్చుకోవాలి.
- ఈ జొన్న రొట్టెలను సొరకాయ గాని వంకాయ గాని ఏదైనా కూరతో తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది.
Frequently Asked Questions
జొన్నలలో ప్రధాన పోషకాలు ఏమిటి?
జొన్నలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు (B1, B2, B3), ఖనిజాలు (క్యాల్షియం, మ్యాగ్నీషియం, పోటాషియం) చాలా ఎక్కువగా ఉంటాయి.
జొన్నలు గ్లూటెన్ ఫ్రీ ఆహారమా?
అవును. జొన్నలు చిరుధాన్యము, దీనిలో గ్లూటెన్ అనేది అసలు ఉండదు. అందువల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ఏవైనా అలర్జీలు ఉన్నవాళ్లు ఈజీగా తినొచ్చు.
జొన్నలు బరువు తగ్గడానికి ఉపయోగకరమా?
అవును.బరువు తగ్గడానికి ఒక పీచు పదార్థం అనేది ఒక ముఖ్యమైన కారణం. ఈ జొన్నలలో అది చాలా ఎక్కువగా ఉంటుంది. జొన్నలు తినడం బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
జొన్నలు మధుమేహం ఉన్నవారు తినవచ్చా?
అవును. జొన్నల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉండటం వలన జొన్నలను తిన్నప్పుడు గ్లూకోజ్ అనేది రక్తంలోకి చాలా నెమ్మదిగా విడుదలవుతూ చక్కర వ్యాధిని పెంచకుండా ఉంటుంది.
జొన్నలను గర్భిణులు తీసుకోవచ్చా?
అవును. గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పోషకాలు ఫోర్ ఎయిట్ మరియు ఐరన్ అనేవి జొన్నలలో అందువల్ల వీటి వలన గర్భిణీ స్త్రీలు మంచి ఉపయోగాన్ని పొందుతారు.
జొన్నలు ఎలా వండాలి?
జొన్నలను అన్నం, రవ్వ చేసి ఉప్మా, జావ , పిండితో రొట్టెలను చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న పిల్లలకి జొన్నలను తినిపించాలంటే కొంచెం రవ్వలాగా చేసి లేదా మెత్తటి పౌడర్ లాగా చేసి రకరకాల పదార్థాలు వాళ్ళకి పెట్టవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల్లో అరిగేశక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా అలా పెట్టడం అవసరం.
పిల్లలు జొన్నలను తినవచ్చా?
అవును. జొన్నలలో ఉండే ప్రోటీన్ మరియు ఇతరత్న పోషకాలు పిల్లలు బాగా ఎదగడానికి పనికి వస్తాయి. బలహీనంగా ఉన్న పిల్లలు బలంగా మారుతారు. చిన్నపిల్లలకి జొన్నలను పేలాలు లాగా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు మారాం చేయకుండా తింటారు.
జొన్నల వినియోగం ఎలా చేయాలి?
జొన్నలను మనం రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు. సాధారణంగా జొన్న రొట్టెలు, జొన్న అంబలి, జొన్న ఉప్మా వంటి వంటకాలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి సులభంగా తయారు చేయవచ్చు. ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి.
Conclusion
మొత్తానికి జొన్నలు అనేవి చాలా బలాన్ని ఇచ్చే చిరుధాన్యపు ఆహారం. వీటిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇప్పుడు జీవన శైలిలో చాలామంది ఈ జొన్న రొట్టెలు చేసుకోలేక ఈ వాడకం కూడా చాలా బాగా తగ్గించేశారు. ఇంకొక మంచి విషయం జొన్న రొట్టెలు చేసి అమ్మ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నారు. ఈ జొన్న రొట్టెలు చేసే వారి దగ్గర కొనుక్కొని తినడం మనకి ఆరోగ్యమూ లభిస్తుంది మరియు వాళ్ళకి ఉపాధి కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము.
Read Also
We have Different Types of Millets