Kalonji Seeds Benefits గురించి ఈ ఆర్టికల్లో క్లుప్తంగా తెలుసుకుందాం.
Table of Contents
What is Kalonji Seed?
Nigella Seeds ని తెలుగులో కలోంజి సీడ్స్ లేదా నల్ల జీలకర్ర అంటారు.
Kalonji Seeds మన వంటకాలకి ప్రత్యేకమైన రుచిని, సువాసనని ఇస్తాయి. ఈ నల్ల జీలకర్ర లో విటమిన్స్, ఫైబర్స్ , ప్రోటీన్స్ లాంటి పోషకాలు చాలా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి చాలా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ కలోంజి గింజలు చర్మానికి వచ్చే రకరకాల సమస్యలను తగ్గిస్తాయి. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తాయి. మనం ప్రతిరోజు ఈ నల్ల జీలకర్రను మన ఆహారంలో వాడటం వలన మన లైఫ్ స్టైల్ లో కచ్చితంగా మార్పు వస్తుంది.

Nutrition Values:నిగెళ్ల గింజల పోషక విలువలు తెలుసుకుందాం
పోషక పదార్థం | 100 గ్రా (సగటు) |
---|---|
ఎనర్జీ | 345 kcal |
ప్రొటీన్ | 16.7 గ్రా |
కొవ్వులు | 22.3 గ్రా |
కార్బోహైడ్రేట్లు | 44.2 గ్రా |
ఫైబర్ | 10.5 గ్రా |
క్యాల్షియం | 630 మి.గ్రా |
ఐరన్ | 18.1 మి.గ్రా |
మెగ్నీషియం | 265 మి.గ్రా |
పొటాషియం | 810 మి.గ్రా |
జింక్ | 7.5 మి.గ్రా |
విటమిన్ A | 20 IU |
విటమిన్ C | 1 మి.గ్రా |
విటమిన్ E | 3.3 మి.గ్రా |
How to Use? ఎలా వాడాలి?
కొంచెం సేపు స్టవ్ మీద వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. ఇంకా వంటలలో ఈ పొడిని వాడటం వల్ల వంటకి రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది.
Top 10 Kalonji Seeds Benefits: ఆరోగ్య ప్రయోజనాలు
- ఈ నిగెళ్ల గింజల(Nigella Seeds)ను వినియోగించడం ద్వారా జీర్ణక్రియ శుభ్రం అవుతుంది. ఏమైనా అజీర్తి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి
- బ్లడ్ ప్రెషర్ ని తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది.
- మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రకరకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది
- మన చర్మం మీద మొటిమలను తగ్గిస్తుంది. ఇంకా చర్మం మీద ముడతలను పోగొట్టి చర్మం ఆరోగ్యంగా కనబడేలా చేస్తుంది.
- చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
- బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది
- రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
- మన గుండెకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తగ్గిస్తుంది.
- మానసిక ఒత్తిడిని తగ్గించి మన మెమరీ పవర్ కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది
- సాధారణంగా వచ్చి జలుబు గొంతు నొప్పి అంటే చిన్న చిన్న ఆరోగ్యసమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Kalonji Seeds For Hair? జుట్టు ఆరోగ్యం కోసం

నిగెళ్ల గింజ(kalonji for hair)లను జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా వాడుతారు. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇంకా కొత్త జుట్టు పెరగడానికి ఉపయోగపడతాయి. వీటిని ఈ గింజల నుండి నూనెను తీసి ఆ నూనెను మన తలకి మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. ఇంకా జుట్టులో ఉన్న చుండ్రు సమస్య తగ్గుతుంది. వీటిని ఇంకా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టుకు కూడా అవసరమైన పోషణ అందుతుంది.
Kalonji Seeds for Weight Loss: బరువు తగ్గడం

నిగెళ్ల గింజలు అధిక బరువును కూడా తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బాలన్స్ చేసి శరీరంలోని ఫ్యాట్ ని కరిగేందుకు సహాయం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఈ గింజల పొడిని కలిపి తాగడం వల్ల మన శరీర బరువు తగ్గి తగ్గుతుంది. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. అందువల్ల మనం ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గుతుంది. ఈ గింజలలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి.
Kalonji Seeds For Skin: చర్మ ఆరోగ్యానికి
కలోంజీ గింజలు చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, మరియు యాంటీ పారాసిటిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ గుణాలు చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కలోంజీ మొటిమలు, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. డైట్‌లో కలోంజీ గింజలను చేర్చడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మన చర్మానికి ఒక వరం అనే చెప్పాలి. ఈ గింజలలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. సాధారణ చర్మ సమస్యలైన మొటిమలు, దద్దుర్లు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్ ను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇవి రోజు డైట్ లో చేర్చడం వల్ల మన చర్మ ఆరోగ్యం పెరుగుతుందని కొన్ని రకాల పరిశోధనలు వెల్లడించాయి.
Thyroid: థైరాయిడ్ సమస్యల కోసం
థైరాయిడ్ అనేది జీవక్రియకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసి విడుదల చేసే ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంధి. ఇది సరిగా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు ఏర్పడతాయి. డైట్‌లో కలోంజీ గింజలను చేర్చడం ద్వారా థైరాయిడ్ పనితీరును మెరుగుపరచుకోవచ్చు. కలోంజీ విత్తనాలు TSH స్థాయిలను తగ్గించడంలో, థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటాయని కొన్ని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి అవసరమైన హార్మోన్ల ని విడుదల చేస్తుంది. ఇది ఎక్కువైనా తక్కువైనా మన శరీరానికి సమస్యలు వస్తాయి. కలోంజీ గింజలను మన ఆహారంలో తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది. TSH లెవెల్స్ తగ్గించి థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది.
Nigella Seeds Benefits for Women: మహిళల కోసం
- హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడం
నిగెళ్ల గింజలు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి రుతుక్రమ సమస్యలు ఏమైనా ఉన్నా తగిస్తాయి. - చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి
చర్మం మీద ముడతలు తగ్గిస్తాయి మొటిమలు తగ్గిస్తాయి. - జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి
నిగెళ్ల గింజలు జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు రావడానికి దోహదపడతాయి. - స్ట్రెస్ ని తగ్గిస్తుంది
కలోంజీ గింజలు ఒత్తిడిని తగ్గించి చురుకుగా ఉండేలా చేస్తుంది. - ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది
నిగెళ్ల గింజలలోని యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల పళ్ళు గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. - బరువు తగ్గించడం
ఈ గింజలు మెట్టబాలిజాన్ని బ్యాలెన్స్ వేసి వెయిట్ లాస్ లో ఉపయోగపడతాయి. - స్కిన్ రాషెస్ ని తగ్గిస్తాయి
నిగెళ్ల గింజలు చర్మ మీద దద్దుర్లు, సోరియాసిస్ తగ్గిస్తాయి - గుండె పదిలం
కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను కాపాడుతుంది. - థైరాయిడ్
థైరాయిడ్ వల్ల మహిళలలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఇర్రేగులర్ పీరియడ్ సమస్య ఉంటుంది .థైరాయిడ్నీ కంట్రోల్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి - డైజెషన్
డైజేషన్ ప్రొబ్లెంస్ ని తగ్గిస్తుంది.
Frequently Asked Questions:
1. Nigella seeds అంటే ఏమిటి?
నిగెళ్ల గింజలు (కలోంజీ) చూడటానికి చిన్న నల్లటి గింజలు. వీటిని నల్ల జీలకర్ర అంటారు. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
2. నిగెళ్ల గింజలను ఎలా వాడుకోవాలి?
నిగెళ్ల గింజలను నేరుగా అలానే తినవచ్చు. లేదా వేయించి పొడి చేసి వంటల్లో వాడొచ్చు. ఇంకా గింజల నుంచి నూనె తీసి చర్మానికి, జుట్టుకి మసాజ్ చేసుకోవచ్చు.
3. నిగెళ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
ఈ గింజలు చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి , హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
4. నిగెళ్ల గింజలు మన మెదడు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
నిగెళ్ల గింజలు మన మెదడు పదును పదునుగా పని చేయడానికి, మతిమరుపు తగ్గడానికి, ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయి.
5. నిగెళ్ల గింజల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుందా?
ఈ గింజలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మొటిమలు తగ్గిస్తాయి. ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
6. కలోంజీ గింజలలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి?
కలోంజీ గింజలలో అన్ని రకాల విటమిన్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం.
7. నిగెళ్ల గింజలు బరువు తగ్గించడంలో ఎలా సహాయపడతాయి?
నిగెళ్ల గింజలు మన శరీరంలోని కొవ్వును కరిగేలా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు
8. నిగెళ్ల గింజలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉపయోగించవచ్చా?
కచ్చితంగా వాడవచ్చు. ఈ గిన్నెలో థైరాయిడ్ గ్రంధిని మెరుగుపరుస్తాయి. హార్మోన్స్ ని బ్యాలన్స్ చేస్తాయి.
9. నిగెళ్ల గింజలు మహిళలకి ఎలా ఉపయోగం?
నిగెళ్ల గింజలు స్త్రీలకి చాలా చాలా ఉపయోగం. ముఖ్యంగా చర్మానికి బరువు తగ్గడానికి జుట్టు కోసం పీరియడ్ సమస్యలకి.
10. నిగెళ్ల గింజల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
ఇవే కాదు, ఏదైనా ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే.
వీటిని ఎక్కువగా వాడటం వల్ల కచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. కనుక వైద్యుల సలహాతో తక్కువ వాడటం వల్ల ఆరోగ్యానికి ఉపయోగం.