Kodo Millet in telugu Benefits:
ఈ ఆర్టికల్ లో అసలు కోడో మిల్లెట్ అంటే ఏమిటి?
దానిలో ఉండే పోషకాలు, ఉపయోగాలు, ఎలా వండాలి?
ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎలా అధిగమించాలి అన్ని తెలుసుకుందాం.
Table of Contents
ప్రతి ఒక్కరూ ఈ అరికల గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్స్ కి ఇది ఒక వరం లాగా చెప్పవచ్చు.
కోడో మిల్లెట్ ని తెలుగులో అరికెలు( Arikelu) అని అంటారు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో దీనిని రకరకాలపేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ అరికలతో మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
Kodo Millet అంటే ఏమిటి?

కోడో మిల్లెట్ మనకి ఉన్న ఐదు పాజిటివ్ మిల్లెట్స్ లో ఇది ఒక మిల్లెట్.అరికలతో పాటు కొర్రలు, ఉదలు, అందుకొర్రలు మరియు సామలు కూడా సిరిధాన్యాలు. తెలుగు లో ఈ ధాన్యాన్ని అరికెలు అని అంటారు. కోడో మిల్లెట్ రుచికి కొంచెం వగరు, చేదు కలగలిపి ఉంటుంది . దీనిని మన భారత దేశంలో వందల ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు. దీనిలో చాలా మంచి ఆంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా ఆంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి.
కోడి మిల్లెట్ చాలా తక్కువ నీటితో పెరిగే చిరుధాన్యం. అందువల్ల దీన్ని తక్కువగా నీరు దొరికే చోట ఇంకా ఎడారి ప్రాంతాల్లో పెంచుతుంటారు. మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో పండిస్తున్నారు. రాగులు, జొన్నలు వంటి మిల్లెట్స్ తో పోలిస్తే కోడో మిల్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అరికలలో 9% ఫైబర్ ఉంటుంది.ఇది ఎరుపు మరియు గులాబీ రంగులో ఉంటుంది.
Kodo Millet Nutrients:పోషక విలువలు
కోడో మిల్లెట్ చాలా పోషకాలను అందిస్తుంది. దీనిలో పీచు పదార్థం, ఖనిజాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
పోషక పదార్థం | పరిమాణం (100 గ్రా) |
---|---|
శక్తి (కాలొరీలు) | 309 kcal |
ప్రోటీన్ | 8.3 గ్రాములు |
కొవ్వు | 3.6 గ్రాములు |
పీచు పదార్థం | 9 గ్రాములు |
కార్బోహైడ్రేట్లు | 66.6 గ్రాములు |
కాల్షియం | 27 మిల్లీగ్రాములు |
ఐరన్ | 0.5 మిల్లీగ్రాములు |
మాగ్నీషియం | 188 మిల్లీగ్రాములు |
ఫాస్ఫరస్ | 188 మిల్లీగ్రాములు |
పొటాషియం | 195 మిల్లీగ్రాములు |
సోడియం | 4 మిల్లీగ్రాములు |
విటమిన్ B3 | 1.2 మిల్లీగ్రాములు |
Kodo మిల్లెట్‌లో అధికంగా పీచు(Fiber), ప్రోటీన్ మరియు ఖనిజాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన(Healthy) ఆహారంగా పరిగణించబడుతుంది.
Top 10 Health Benefits Of Kodo Millet :ఆరోగ్య ప్రయోజనాలు
- అరికలు మొత్తం మీద రక్త సంబంధిత సమస్యల నివారణకి చాలా మంచిది. మనకి మన శరీరంలో రక్తం మన బోన్ మారో(bone marrow) నుంచి తయారవుతుంది. బోన్ మారో ని కూడా శుభ్రం చేసే శక్తి ఈ అరికలలో ఉంది.
- ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గిస్తుంది. శరీరంలో వచ్చే ఎలర్జీలను తగ్గిస్తుంది.
- కోడో మిల్లెట్లో ఫినాలిక్ ఆసిడ్స్ ఉండడం వలన ఇవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. మైగ్రేన్ తలనొప్పిని ఇంకా ఆస్తమా నీ కూడా తగ్గిస్తాయి
- వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- వీటిలో ఉండే పీచు జీర్ణ వ్యవస్థలో ఏవైనా సమస్యలు ఉంటే తగ్గిస్తాయి. కడుపులో మంట, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలను తగ్గిస్తాయి.
- బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా లాభం పొందుతారు.
- కడుపు ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాయి.
- రక్తం తక్కువగా ఉన్నవారు రక్తహీనతతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాలి.
- కోడో మిల్లెట్‌లో ఉన్న ప్రోటీన్ మరియు మెగ్నీషియం కండరాల బలాన్నిపెంచుతాయి.
- మహిళలలో ఉండే హార్మోన్ల సమస్యలను తగ్గిస్తాయి. PCOD మరియు PCOS సమస్యలను తగ్గిస్తాయి.
డయాబెటిస్ ని ఎలా నియంత్రిస్తుంది?
100 గ్రాముల అరికెలలో 65 గ్రాముల వరకు కార్బోస్ ఉంటాయి. అదే 100 గ్రాముల వరి అన్నంలో 77 గ్రాముల వరకు కార్బోసుంటాయి. ఈ అరికల్లో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల చక్కెర నెమ్మదిగా రక్తంలోకి విడుదలవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం వల్ల చక్కెర చాలా తొందరగా రక్తంలోకి విడుదలవుతుంది.
మరి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర చాలా తొందరగా రక్తంలోకి విడుదలయి షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. మన పరిశోధనల ప్రకారం అరికలు మన శరీరంలోనే బీటా కణాలను ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ ఇన్సులిన్ పెరగడం వల్ల మన శరీరంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే ఎక్కువ ఫైబర్ విడుదలైన చక్కెర నెమ్మదిగా రక్తంలో కలిసేలాగా చేస్తుంది. ఈ విధంగా అరికెల్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు ఫైబర్ రెండు రకాలుగా షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.
డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడైనా వరి అన్నం తినాలనుకున్నప్పుడు దాని బదులుగా ఈ అరికెలను కొంచెం మితంగా తినడం మంచిది. ఈ వీటిని కూడా ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకంటే వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అందువల్ల ఈ అరికలను షుగర్ వ్యాధి రానివారు ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది అలాగే షుగర్ వ్యాధి వచ్చిన వారు దానిని కంట్రోల్ చేయడానికి మంచిది తినడం మంచిది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
అరికల్లో మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరమైన నయాసిన్ (Vitamin B3) పుష్కలంగా ఉంటుంది. నయాసిన్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా గుండె మరియు రక్తనాళాలలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది.
అరికల్లో ఉండే మెగ్నీషియం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం రక్తనాళాలను విస్తరింపజేసి, రక్తప్రసరణ సజావుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ముఖ్యమైన భూమిక వహిస్తుంది.
ఈ రెండు ముఖ్యమైన పోషకాల సమ్మేళనంతో అరికలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. క్రమంగా అరికలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మొత్తంగా చూస్తే అరికలు గుండె ఆరోగ్యానికి మిత్రంగా నిలిచి, ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇస్తుంది.
బరువు తగ్గడం(Weight Loss)లో సహాయపడుతుంది
సాధారణంగా చిరుధాన్యాలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అరికల్లో కూడా ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. అరికలు తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ధాన్యం తినగానే కడుపు నిండిన భావన కలిగి, ఆకలి తగ్గిస్తుంది.
దీని వల్ల ఎక్కువగా తినకుండా నియంత్రణ సాధించగలుగుతాము. అందువల్ల అరికలు రోజువారీ ఆహారంలో చేర్చడం శరీర బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Kodo Millet Recipes
అరికలతో ఇడ్లీ, దోస, ఉప్మా, ఖిచిడీ వంటి రుచికరమైన వంటకాలు(Recipes) తయారుచేయచ్చు.
1. అరికెల ఉప్మా

కావాల్సిన పదార్థాలు:
- అరికెలు -1 కప్పు
- నీరు – 2.5 కప్పులు
- ఉల్లిపాయ-1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
- క్యారెట్ -1 (తురుముకోవాలి)
- పచ్చిమిర్చి- 2
- అల్లం -1 చిన్న ముక్క (తురుముకోవాలి)
- మినప్పప్పు -1 టీస్పూన్
- సెనగపప్పు -1 టీస్పూన్
- కరివేపాకు- కొద్దిగా
- మెంతులు -1/4 టీస్పూన్
- మిరియాల పొడి -1/4 టీస్పూన్
- నువ్వుల నూనె -2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు-తగినంత
తయారీ విధానం:
- మొదటగా అరికలను తీసుకొని శుభ్రంగా రెండు లేదా మూడుసార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టడం మంచిది.
- ఒక పాన్ తీసుకొని 2 టీ స్పూన్స్ నూనె వేయాలి.
- నూనె వేడెక్కాక దానిలో పోపు గింజలు మినప్పప్పు శనగపప్పు మెంతులు వేసి వేయించాలి.
- తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేసి మృదువుగా అవ్వే వరకు వేపాలి.
- తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి కలపాలి.
- తర్వాత క్యారెట్ ముక్కలు తగినంత ఉప్పు, మిరియాల పౌడర్ వేసి కలపాలి.
- క్యారెట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
- ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కాసేపు మరగనివ్వాలి.
- మరిగిన నీటిలో నానబెట్టిన అరికెలను వేసి కలిపి మూత పెట్టాలి.
- ఇలా ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
- నీరు మొత్తం ఇంకిపోయాక వేడివేడిగా ఏదైనా చట్నీ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
2. అరికెల పొంగల్:

కావాల్సిన పదార్థాలు:
- అరికెలు -1 కప్పు
- పెసరపప్పు -1/2 కప్పు
- నీరు -3 కప్పులు
- పచ్చిమిర్చి -2
- అల్లం -1 చిన్న ముక్క
- మిరియాలు -1/2 టీస్పూన్
- జీలకర్ర -1/2 టీస్పూన్
- కరివేపాకు -కొద్దిగా
- నెయ్యి -2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు -తగినంత
- జీడిపప్పు-ఆరు గింజలు
తయారీ విధానం:
- అరికలు మరియు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి.
- తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు గింజలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత మిరియాలు, కరివేపాకు, తురిమిన అల్లం పచ్చిమిర్చి, ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి.
- తర్వాత అందులో నానబెట్టినటువంటి అరికెలు పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత తగినన్ని నీరు ఉప్పు వేసి కలిపి కుక్క మూత పెట్టేయాలి.
- మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.
- తర్వాత కుక్కర్ మూత తీసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి వేడి వేడిగా వడ్డించుకోవాలి.
Conclusion
అరికలను రెగ్యులర్ గా మనం మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవి ముఖ్యంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడానికి, డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిని వారానికి మూడు లేదా నాలుగు సార్లు తినడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
Frequently Asked Questions
1. కోడో బియ్యం అంటే ఏమిటి?
కోడో మిల్లెట్(Kodo millet) అనేది చిరు ధాన్యం కుటుంబానికి చెందిన ఒక పంట. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.
2. కోడో మిల్లెట్ యొక్క పోషక విలువలు ఏమిటి?
కోడో మిల్లెట్ ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మరియు మాగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. కోడో మిల్లెట్ ఎలా ఉపయోగించాలి?
కోడో మిల్లెట్ పులావ్, రొట్టెలు, లేదా ఇడ్లీ వంటి వంటకాలలో ఉపయోగించవచ్చు.
4. కోడో బియ్యం రోగనిరోధక శక్తిని పెంచగలదా?
అవును. ఇది ఆహారంలో జంతు ప్రోటీన్లను తగ్గిస్తుంది. బలమైన ఆహారం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
5. అరికలు తినడానికి ఆరోగ్యకరమా?
అవును. అరికలు ఆరోగ్యకరమైన ఆహారం. ఇది గ్లూటెన్-ఫ్రీ మరియు డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది.
6. కోడో మిల్లెట్‌ను ఎలా వండాలి?
ముందుగా 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఉడికించి తినాలి.
7. కోడో మిల్లెట్ యొక్క చరిత్ర ఏమిటి?
కోడో మిల్లెట్ అనేది భారతదేశంలో ఎంతోకాలంగా పండించబడుతున్న పంట. పాత కాలం నుండి ఉపయోగపడుతుంది .
8. కోడో మిల్లెట్ విత్తనాలు ఎలా కొనాలి?
స్థానిక కూరగాయల మార్కెట్ లేదా ఆర్గానిక్ స్టోర్స్‌లో కోడో మిల్లెట్ విత్తనాలు కొనవచ్చు.
9. కోడో మిల్లెట్ ని పండించడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు కావాలి?
ఇవి చాలా ఎక్కువ నీటితో పెరిగే మొక్కలు. ఎలాంటి పరిస్థితులలో అయినా బాగా పెరుగుతాయి.
10. కోడో బియ్యాన్ని నానబెట్టి వండితే మంచిదా?
అవును. నానబెట్టడం వల్ల వేగంగా ఉడుకుతాయి. మనకి మొత్తం పోషకాలు అందుతాయి.
Read Also
We have Different Types of Millets