Little Millet In Telugu:ఆరోగ్య ప్రయోజనాలు

Little Millet In Telugu:

ఈ ఆర్టికల్ లో మనం లిటిల్ మిల్లెట్ ఏ అవయవాలను శుద్ధి చేస్తుంది? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? ఎలా తినాలి ? ఎక్కడ పండుతుంది? పోషక విలువల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

What is Little millet In Telugu ?

Little millet in telugu: what is it?

Little millets ని తెలుగులో ‘సామలు‘(Samalu) అంటారు. మిల్లెట్స్ ని సాధారణంగా సిరిధాన్యాలు మరియు చిరుధాన్యాలు గా విభజిస్తారు. Little Millets సిరిధాన్యాలలో ఒకటి. సిరి ధాన్యాలలో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి ధాన్యాలు ఉంటాయి.

లిటిల్ మిల్లెట్ అన్ని మిల్లెట్లలో కల్లా చాలా చిన్న మిల్లెట్. దీనిని ఆఫ్రికన్ మిల్లెట్ (African millet) అని కూడా అంటారు. సామలలో 10% ఫైబర్ ఉంటుంది. ఇది ఒక గడ్డి లాగా పెరుగుతుంది. చూడడానికి గోధుమ రంగులో ఉంటుంది మరియు ఏ రుచి లేకుండా ఉంటుంది. ఒకవేళ తెల్లగా ఉన్నట్లయితే అది పాలిష్ చేసినటువంటి సామలు. పాలిష్ చేసిన సామల కన్నా పాలిష్ చేయని సామలు ఆరోగ్యానికి మంచిది.

Little millet plants: సామలను ఎక్కడ పండిస్తారు?

లిటిల్ మిల్లెట్ కు చాలా తక్కువ నీరు అవసరం అవుతుంది. లిటిల్ మిల్లెట్ ఆఫ్రికాలో ఒక గడ్డి లాగా పెరుగుతూ ఉంటుంది. మన దేశంలో ఇది ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండుతుంది. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉంటుంది.ఈ ధాన్యాన్ని పండించడం కోసం మీకు దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్ లేదా సీడ్స్ షాపులకు వెళ్లవచ్చు. ఆన్‌లైన్ లో కూడా ఇలాంటి సీడ్స్ దొరుకుతాయి. అలాగే స్థానిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా కొనుక్కోవచ్చు.

Little millet Benefits for Reproductive organs

ఇప్పుడు మనం సామలు ఏ అవయవాలను శుద్ధి చేసిందో తెలుసుకుందాం. సామలు మన జననాంగాలను (reproductive organs) శుద్ధి చేసి సరిగ్గా పనిచేసేలాగా చేస్తాయి. ఈ సామలను మనం తినడం వల్ల మన జనరేషన్ కాకుండా మనకు పుట్టబోయే పిల్లల జనరేషన్ కూడా ఆరోగ్యంగా ఏ సమస్యలు లేకుండా పుడతారు.

ఈ మధ్యకాలంలో పిల్లలను కనడానికి చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మన జీవనశైలి వల్ల మన ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా మార్పులు జరుగుతున్నాయ. సహజంగా జరగాల్సిన రీప్రొడక్షన్ అనేది హాస్పిటల్స్ లో మెడిసిన్స్ తో చేయాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నీ తగ్గి సహజంగా పిల్లల్ని గణాలంటే మనం మన ఆహారంలో తప్పకుండా ఈ సాములను చేర్చుకోవాలి.

మహిళల్లో వచ్చే పీసీఓడీ ప్రాబ్లం, పురుషులలో వచ్చే స్పెర్మ్ కౌంట్ తగ్గడం లాంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా సామలను రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఎలా బరువు తగ్గడంలో సహాయపడతాయి?

ప్రస్తుతం ఊబకాయ సమస్య అందర్నీ వేధిస్తుంది. బరువు తగ్గడానికి నిత్యం సామలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది. వీటిలో ఉండే అధికమైన ఫైబర్ తొందరగా ఆకలి వేయకుండా చూస్తుంటే అందువల్ల మనం ఎక్కువ తినలేము. అందుకే తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. అందువల్ల శరీరంలోని కొవ్వు కరిగి weight loss అవుతారు.

గుండె ఆరోగ్యానికి సామలు

మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం సామలను కచ్చితంగా మన ఆహారంలో చేర్చుకోవాల్సిందే. వీటిలో ఉండే పొటాషియం ఫైబర్ మెగ్నీషియం లాంటి ఖనిజాలు బ్లడ్ ప్రెషర్ ని పెరగకుండా అదుపులో ఉంచుతాయి. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరు పోకుండా చేస్తాయి అందువల్ల గుండెకు సంబంధమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే తగ్గిస్తాయి. వీటిని తింటే మన గుండె సేఫ్ అని మాత్రం చెప్పవచ్చు

మనకు తెలిసిన సిరి ధాన్యాలలో సామలు చాలా ముఖ్యమైనవి. పూర్వకాలం సామలను ఎక్కువగా తినేవారు. కానీ వాడకం చాలా తగ్గింది. తెల్లని వరి బియ్యం వాడుకలోకి వచ్చాక వీటిని వాడడం తగ్గించారు. ఇప్పటి ప్రజలకి సామలు చాలా వరకు తెలియదు. ఇప్పుడిప్పుడే వీటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నిజం చెప్పాలంటే వీటితో చాలా రకాల వంటలు చేయవచ్చు. సాధారణంగా వరి బియ్యంతో చేసే దోసెలు, ఉప్మా అన్నం లాంటి వంటలు వీటితో కూడా చేయవచ్చు.

Little millets (లిటిల్ మిల్లెట్స్) గురించి ఇంకా తెలుసుకోవాలంటే సామలు హెల్త్ బెనిఫిట్స్ ఆర్టికల్ ని చదవండి.

Little Millet Uses?

Little millet in telugu-uses
  1. లిటిల్ మిల్లెట్ల్ లో ఉన్న పీచు పదార్థం(Fiber) మలబద్దక సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది. మలబద్ధక సమస్య ఉంటే మన శరీరంలో అది వంద రోగాలకు కారణమవుతుంది. అందువల్ల మలబద్దకం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
  2. Little MIllet హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంకా బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ లాంటి తీవ్రమైన వ్యాధులు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
  3. వీటిలో ఫైబర్ ఎక్కువ, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అందువల్ల డయాబెటిస్ పేషెంట్స్ కి ఇది ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. ఇది బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. నియాసిన్ గ్లూకోస్ ని తగ్గిస్తుంది.
  4. సామల్లో ఉండే మెగ్నీషియం మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  5. వీటిలో ఉండే ఫాస్ఫరస్ బరువు పెరగకుండా చూస్తుంది. ఇంకా కొత్త కణాలు పెరగడానికి దోహదం చేస్తుంది.
  6. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి పంపించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  7. వీటిలో గ్లూటన్ ఉండదు. అందుకని గ్లూటన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం.
  8. ఏవైనా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఉంటే వాటి నుండి సామలు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తమా ఉన్నవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
  9. వీటిలో టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్, మరియు కెరటెనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడతాయి. అవి విటమిన్ ఏ గా కూడా మారుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
  10. టోకోఫెరోల్స్ మరియు టోకోట్రైనాల్స్ విటమిన్ E లా పనిచేస్తాయి. ఇవి నరాలు, కండరాలు, మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇవి ఎర్ర రక్త కణాలను రక్షిస్తాయి. గుండె జబ్బులు రావడం మరియు వృద్ధాప్య లక్షణాలు చూపకుండా కాపాడతాయి.

సామలు కేజీ 100 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది మంచి ఆరోగ్యం కోసం అంత మాత్రం ఖర్చు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరీ అన్నంతో పోలిస్తే దానిలో సగం తిన్న ఈ అన్నం సరిపోతుంది కాబట్టి ఖర్చు గురించి ఆందోళన ఆందోళన పడాల్సిన అవసరం లేదు రోజుకో పూట సామలు తినవచ్చు.

సామలను వేసవిలో తినడం వల్ల మన శరీరానికి చలువ చేస్తాయి. చలికాలంలో అయితే కొర్రలు లను ఎక్కువగా తింటారు. సామలతో కిచిడి ,ఉప్మా ఇంకా కేక్స్ లాంటి వంటకాలు కూడా చేయవచ్చు. సామలను ఎలా అయినా వండి తినవచ్చు ఎలా వండినా సులభంగా జీర్ణం అవుతాయి అయితే డాక్టర్స్ వారానికి మూడు నాలుగు రోజులు తీసుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు.

Nutrition Facts:పోష విలువలు (100 gm)

  1. కాలోరీస్: 100-120 కాలోరీలు
  2. ప్రోటీన్: 4-5 g
  3. ఫైబర్: 7-10 g
  4. కార్బోహైడ్రేట్లు: 20-25 g
  5. వాష్పతీ (ఫ్యాట్): 1-2 g
  6. విటమిన్లు: విటమిన్ B కాంప్లెక్స్ (B1, B2, B3) అధికంగా ఉంటాయి.
  7. ఖనిజాలు: మాంగనీస్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, కేల్షియం, ఇనుము మరియు జింక్.

Little millet Recipes

మనం మిల్లెట్స్ తో చాలా రకాల వంటలు(Healthy Recipes) చేయవచ్చు.

1.సామ అన్నం

Little millet in telugu: sama rice recipe

Ingredients

  • లిటిల్ మిల్లెట్ -1 కప్పు
  • నీళ్లు -2 కప్పులు

How to cook?

  1. లిటిల్ మిల్లెట్ ని తీసుకుని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.
  2. తర్వాత స్టౌ వెలిగించి మనం వరి బియ్యం అన్నం వండుకున్నట్లే వండుకోవాలి.
  3. తగినన్ని నీళ్లు పోసినట్లయితే గంజి ఒంపాల్సిన పనిలేదు .
  4. మనం ముందుగా నానబెట్టుకున్నట్లయితే తొందరగా ఉడుకుతాయి.
  5. లేకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది .
  6. ఉడికిన తర్వాత నీ ఇల్లు మొత్తం ఆవిరైపోయి ఉండేదాకా ఉంచాలి.
  7. తర్వాత స్టవ్ బంద్ చేసి మనకు నచ్చిన కూరగాయలతో కూర చేసుకుని తినవచ్చు.

2. లడ్డు రెసిపీ

Little millet in telugu: laddu recipe

Ingredients

  • లిటిల్ మిల్లెట్- 1 కప్పు
  • జీడి పప్పు – 1/4 కప్పు
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • పంచదార – 1 కప్పు
  • ఎలకలు – 2
  • కొబ్బరి- 1/4 కప్పు

How to cook?

  1. లిటిల్ మిల్లెట్ ను వాడే ముందు బాగా శుభ్రం చేసుకోవడం అవసరం.
  2. ఏమైనా మట్టి లాంటివి ఉంటే కడగడం మంచిది.
  3. తర్వాత పాన్ లో వేసి ఒక ఐదు నిమిషాలు నీరు మొత్తం ఆవిరయ్యేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక గిన్నెలో పాన్ లో వేసి దాంట్లో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  5. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి చక్కెర కరిగేదాకా కలపాలి.
  6. మనం వేయించి పక్కకు పెట్టుకున్న మిల్లెట్ ని జీడిపప్పు కొబ్బరి పొడిని యాలకుల పొడిని వేసి బాగా కలపాలి.
  7. చక్కెర పాకంలో బాగా కలిపిన తర్వాత ఒక ఉండలాగా తయారవుతుంది.
  8. గట్టిగా అయ్యాక స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నచిన్న లడ్డు లాగా చేసుకోవాలి.

Conclusion

పురుషులు, మహిళలు హార్మోన్లత వల్ల ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, ఇన్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లు, వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నవాళ్లు సామలను తప్పకుండా తినాలి. అలా అని చెప్పి ఈ యొక్క సామలనే తినడం వల్ల మన మొత్తం శరీరం ఆరోగ్యం బాగుపడదు. ఒక వారంలో ఒక మూడు రోజులు సామలు తిని మిగతా రోజుల్లో ఇతర సిరి ధాన్యాలను తినడం సరైన పద్ధతి. ఎప్పుడూ కూడా ఒకటే ఆహారాన్ని అతిగా తినడం మంచిది కాదు. ఏదైనా కూడా పరిమితిలోనే తినాలి. మనం తినే ఆహారంలో అన్ని రకాల పదార్థాలు, పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి.

Read Also

Read some other seeds like millets

Scroll to Top