మోత్ బీన్స్ (Moth Beans in Telugu) మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్, ఐరన్, ఫైబర్‌లతో నిండివుంటాయి. రోజువారీ ఆహారంలో చేర్చితే శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతాయి.
What is Moth Beans In Telugu Called?
Moth Beans In Telugu Name: మోత్ బీన్స్‌ని తెలుగులో ‘మట్కి పప్పు (Matki Dal)’ లేదా ‘మోత్ పప్పు‘అని అని పిలుస్తూ ఉంటారు.
వీటిని ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో పండిస్తూ ఉంటారు వీటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇవి చూడడానికి గోధుమ రంగులో ఉంటాయి. మోత్ బీన్స్ పప్పు(lentils) రకానికి చెందినది..
Table of Contents
10 Health Benefits Of Moth Beans In Telugu
1. ఆరోగ్యకరమైన శరీర బరువు కోసం
ఆరోగ్యంగా బరువు పెరగడానికి ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. వాటిలో పప్పులు చాలా ముఖ్యమైనవి. మోత్ బీన్స్ ఈ పప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వలన మన కండరాల బలం ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది శరీరానికి కావాల్సిన అంత శక్తిని కూడా అందిస్తుంది. ప్రతినిత్యం వ్యాయామం చేసే వాళ్ళు ఈ పప్పును తినడం వలన తగినంత శక్తి లభించి మన శరీరం దృఢంగా ఉంటుంది.
2. మంచి అరుగుదల కోసం
అరిగించుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న జీవనశైలి వలన జీర్ణవ్యవస్థలో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటున్నాయి. ఇవి లేకుండా మన కడుపు చాలా తేలికగా ఉండాలంటే ఈ పప్పును ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం.
మోత్ బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ చాలా తేలికగా జరుగుతుంది. మలబద్ధక సమస్య ఉండనే ఉండదు. మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యంగా మారతాయి. ఇతరత్రా జీర్ణ సంబంధమైన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి.
3. బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది
బరువు తగ్గడానికి చాలామంది ఆహారం తినడం తగ్గిస్తూ ఉంటారు. కానీ దాని వలన మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అందవు. అందువలన మంచి ఆహారం తీసుకున్న మన శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గుతాము.
మోత్ బీన్స్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పును తినడం వలన మన ఆకలిని తగ్గిస్తుంది. శరీరంలోని కొవ్వు తగ్గి కండబలం పెరుగుతుంది.
4. గుండెను పదిలంగా ఉంచుకోవడానికి
పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన మన రక్తపోటు అనేది నియంత్రణలో ఉంటుంది.
మోత్ బీన్స్‌లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన మన రక్తపోటు అనేది నియంత్రించబడుతుంది. అందువలన మన గుండెకి ఒత్తిడి పెరగకుండా తగిన స్థాయిలో ఉంటుంది. దీని వలన గుండెకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని తగ్గిపోతాయి.
5. చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే
మన చర్మం అందంగా ఉండాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మంచి ఆహారం తినడం వలన చర్మం లోపల నుంచి ఆరోగ్యం మెరుగుతుంది.
మోత్ బీన్స్‌లో విటమిన్ B మరియు ప్రోటీన్ ఉండడం వల్ల చర్మం లోని కొత్త కణాలు ఏర్పడడం చాలా మెరుగవుతుంది. అందువలన చర్మంలో కాంతి మృదుత్వం పెరిగి ముడతలు కూడా తగ్గుతాయి. చర్మం అనేది సహజంగా కాంతివంతంగా తయారవుతుంది
6. రోగ నిరోధక శక్తి పెరగడానికి
మోత్ బీన్స్‌లో ఇనుము మరియు జింక్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి చాలావరకుపెరుగుతుంది. మన శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు అయినటువంటి జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రాకుండా ఉంటాయి..
7. డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరం
మోత్ బీన్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ స్థాయిని సంతులనం చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆలోచన లేకుండా దీన్ని సురక్షితంగా తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర పెరగకుండా నియంత్రిస్తూ ఉంటుంది.
8. ఎముకల బలానికి సహాయం చేస్తుంది
మోత్ బీన్స్‌లో కాల్షియం మరియు మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకల జాయింట్ల దగ్గర తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. మన వయసు పెరిగినా కూడా ఎముకలు బలంగా ఉంటాయి.
9. కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు
చెడు ఆహారపు అలవాట్లు వలన మన రక్తంలోనే చెడు కొవ్వు పదార్థాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. వీటి వలన రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి.
మోత్ బీన్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తనాళాలు మూసుకుపోకుండా కాపాడుతాయి. హృదయానికి రక్తప్రవాహం సజావుగా సాగుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. కొన్ని రోజుల తర్వాత మన హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
10. మానసిక బలం కోసం
మానసిక బలం అనేది మన శరీరం యొక్క ఆరోగ్యం మరియు మన పరిసరాల పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది.
మోత్ బీన్స్‌లో విటమిన్ B ఎక్కువగా ఉండటం వలన మన నాడీ వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది. దీని వలన మన శరీరంలో నాడీ వ్యవస్థ పై ఒత్తిడి అనేది తగ్గుతుంది అందుకే మన మెదడు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
Moth Beans Nutrition Values Per 100gms
| పోషకం | పరిమాణం |
|---|---|
| కాలరీలు | 343 kcal |
| ప్రోటీన్ | 23 g |
| కార్బోహైడ్రేట్లు | 61 g |
| కొవ్వు (Fat) | 1.6 g |
| ఫైబర్ | 5 g |
| ఇనుము | 4 mg |
| కాల్షియం | 150 mg |
| పొటాషియం | 1200 mg |
Moth Beans | Matki Dal Uses
- మోతు బీన్స్ ని సూప్స్, సాలడ్‌లు, కర్రీల్లో ఉపయోగిస్తారు.
- మోతు బీన్స్ ని మొలకలు కట్టి పొద్దున అల్పాహారంగా తీసుకోవచ్చు.
- మోతు బీన్స్ దోసె, చాట్ లేదా సాంబార్‌లలో కలిపి రుచిగా తినవచ్చు.
- రోటీలు లేదా చపాతీల్లో కలిపి వాడవచ్చు.
Matki Dal | Moth Beans Sprouts In Telugu
- ఒక కప్పులో మోత్ బీన్స్ తీసుకొని ఒక కప్పులో రెండు లేదా మూడు సార్లు బాగా కడుక్కోవాలి.
- తరువాత 6 నుండి 8 గంటల వరకు వాటిని నానబెట్టుకోవాలి..
- తర్వాత నీటిని వంపేసి ఆరబెట్టుకోవాలి.
- తరువాత ఒక తడిగుడ్డలో కట్టేసి 24 గంటల వరకు మూసి ఉంచాలి.
- తర్వాత తీసి చూసినట్లయితే మొలకలు రావడం జరుగుతుంది.
- వీటిని సలాడ్, కర్రీ లేదా సూప్‌లో ఉపయోగించవచ్చు.
మోత్ బీన్స్మొ లకల రూపంలో తీసుకుంటే పోషక విలువలు మోత్ బీన్స్ పెరుగుతాయి.
Simple Moth Beans Curry
పదార్థాలు:
- మోత్ బీన్స్ – 1 కప్పు (మొలకలు వేసినవి)
- ఉల్లిపాయ – 1
- టమాటా – 1
- మిరపపొడి, పసుపు, ఉప్పు – తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 tsp
- నూనె – 1 tsp
తయారీ విధానం:
- ఒక కుక్కర్ లో తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి.
- తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత టమాటా ముక్కలు మసాలాలు వేసి బాగా కలపాలి.
- రెండు నిమిషాలు అయిన తర్వాత మొలకలు వేసి బాగా కలపాలి.
- చివరగా కొంచెం ధనియాల పొడి వేసి దించుకోండి.
FAQ OF Moth Beans In Telugu
1. మోత్ బీన్స్ అంటే ఏమిటి?
మోత్ బీన్స్(Matki Dal) అనేది ఒక రకమైన పప్పు ధాన్యం. దీన్ని తెలుగు లో మోత్ పప్పు అంటారు. ఇది చిన్నగా, గోధుమ రంగులో ఉండి ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతారు.
2. మోత్ బీన్స్ తినడం వల్ల ఏమి లాభం?
మోత్ బీన్స్ తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. దీని లోని పోషకాలు శరీరానికి శక్తి ఇస్తాయి.
3. మోత్ బీన్స్‌లో ఉన్న ముఖ్యమైన పోషకాలు ఏవి?
మోత్ బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మరియు మగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు.
4. బరువు తగ్గాలనుకునే వారు మోత్ బీన్స్ తినవచ్చా?
అవును, మోత్ బీన్స్ బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది. దీని లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి శరీర కొవ్వును నియంత్రిస్తుంది.
5. మోత్ బీన్స్‌ను ఎలా వండాలి?
మోత్ బీన్స్‌ను ముందుగా నానబెట్టి ఉడికిస్తే సులభంగా వండవచ్చు. దానితో కూర, సూప్ లేదా సలాడ్ తయారు చేయవచ్చు. మొలకలు వచ్చాక తింటే ఇంకా ఆరోగ్యకరం.
6. డయాబెటీస్ ఉన్నవారు మోత్ బీన్స్ తినవచ్చా?
అవును, తినవచ్చు. మోత్ బీన్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారం.
7. పిల్లలు మోత్ బీన్స్ తినవచ్చా?
అవును, పిల్లలకు కూడా మోత్ బీన్స్ చాలా ఉపయోగకరం. ఇది శరీర బలం పెంచుతుంది మరియు ఎదుగుదలలో సహాయపడుతుంది. సూప్ లేదా చాటుగా ఇచ్చినప్పుడు తినడం సులభం.
8. మోత్ బీన్స్ తినడం చర్మానికి ఉపయోగమా?
అవును, చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ B మరియు ప్రోటీన్ ఉండడం వల్ల చర్మ కణాల పునరుత్పత్తి జరుగుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.
9. మోత్ బీన్స్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయా?
సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఎక్కువగా తింటే గ్యాస్ లేదా ఉబ్బరం కలగొచ్చు. కాబట్టి మితంగా తినడం మంచిది.
10. రోజూ మట్కి పప్పు తినవచ్చా?
అవును, రోజూ తినవచ్చు కానీ పరిమిత మోతాదులో. వారానికి 3–4 సార్లు తింటే సరిపోతుంది. ఇతర పప్పులతో మారుస్తూ తింటే మరింత పోషకంగా ఉంటుంది.
11. మిల్లెట్స్ మరియు మోత్ బీన్స్ మధ్య తేడా ఏమిటి?
మిల్లెట్స్ అనేవి గింజల రకం ధాన్యాలు కాగా, మోత్ బీన్ ఒక పప్పు వర్గానికి చెందింది. అయినప్పటికీ రెండింటి లోనూ ఫైబర్, ప్రోటీన్, మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.