Pearl Millet In Telugu Benefits| Sajjalu| Weight Loss

Pearl Millet In Telugu: సజ్జలను ఇంగ్లీషులో పెరల్ మిల్లెట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకి ఒక సంజీవని అని చెప్పవచ్చు. దీనిలో చాలా రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి.

Table of Contents

Pearl Millet / Bajra Millet Meaning In Telugu

పెరల్ మిల్లెట్ లేదా బాజ్రాను తెలుగులో సజ్జలు అని అంటారు.

ఇది పూర్వ కాలంలో భారతదేశంలో ప్రత్యేకంగా సాగు చేసిన పంటగా ప్రసిద్ధి చెందింది. సజ్జలో అధికంగా ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలను అధిగమించడానికి, సజ్జలను ఆహారంలో చేర్చడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇది రొట్టెలు మరియు వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఒక గొప్ప ఎంపిక!

మనం రోజు తినే ఆహారాల విషయానికొస్తే ముఖ్యంగా బియ్యం, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, గోధుమలు ఇలాంటివి వాడుతూ ఉంటాం. మనం బియ్యం, ఇంకా కొర్రలు వీటితో పోల్చినప్పుడు మనకు తక్కువ ఖర్చులో లభించే రాగులు, సజ్జలు, జొన్నలు. వీటిలో కూడా సజ్జల విషయానికొస్తే సజ్జలు మనకి చాలా బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలుఉన్నవాళ్లు ఈ సజ్జలను వాడడం వల్ల చాలా ఉపయోగాలు పొందుతారు. సజ్జనలో అమైనోఆసిడ్స్ ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి దోహదపడతాయి.

Pearl Millet In telugu

సజ్జలను ఒక్క మాటలో చెప్పాలంటే సంతులిత ఆహారం. సజ్జలు, జొన్నలు లాంటి ఆకులను కలిగి ఉంటుంది. అలాగే ఇవి రెండు రకాలు ఉంటాయి. నాటు సజ్జలు, హైబ్రిడ్ సజ్జలు. ఇవి సాధారణంగా అరగడానికి మూడు గంటల సమయం పడుతుంది. అంటే ఇవి తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఇంకా వేరే ఏవి తినాలని అనిపించదు.ఇవి తెలుపు, గోధుమ రంగు మిశ్రమంలో ఉంటాయి.

Pearl Millet In Telugu- Nutrition

Pearl Millet In Telugu

ఇక్కడ 100 గ్రాముల సజ్జల (పెర్ల్ మిల్లెట్) పోషకాహార పట్టిక:

పోషకంపరిమాణం
కేలరీలు378 కేల్
ప్రోటీన్11.6 గ్రాములు
కార్బోహైడ్రేట్లు67.2 గ్రాములు
ఆహార ఫైబర్8.5 గ్రాములు
కొవ్వు4.2 గ్రాములు
ఐరన్3.0 మిగ్రామ్
కాల్షియం8 మిగ్రామ్
మ్యాగ్నీషియం100 మిగ్రామ్
ఫాస్ఫరస్281 మిగ్రామ్
పొటాషియం433 మిగ్రామ్
జింక్2.0 మిగ్రామ్
ఫోలేట్85 µg
విటమిన్ B1 (థియామిన్)0.3 మిగ్రామ్
విటమిన్ B3 (నియాసిన్)1.1 మిగ్రామ్
Pearl MIllet In Telugu

What are the Health Benefits of Pearl Millet ?

Pearl Millet in Telugu Benefits

సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు మిల్లెట్ తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. చలికాలంలో సజ్జల తో రోటీ లేదా ఖిచ్డీని చాలా మంది ఇష్టంగా తింటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ మిల్లెట్‌ను తినడం ద్వారా మెటబాలిజం మెరుగుపడుతుంది, తద్వారా ఊబకాయం తగ్గుతుంది. అంతేకాదు, మిల్లెట్ తినడం ద్వారా మరింత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే, తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. ఇప్పుడు సజ్జల ప్రయోజనాలను తెలుసుకుందాం!

1. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టండి

మన ఆహారపు అలవాట్ల వలన పొట్టలో గ్యాస్టిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యల విషయానికి వస్తే అల్సర్లు, కడుపులో మంట, గ్యాస్ ఫార్మ్ అవ్వడం ఇలా చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కచ్చితంగా సజ్జలను తినాల్సిందే. సజ్జలు ఉడికించినప్పుడు దానిలో ఆల్కలైన్ ప్రభావం స్వభావం పెరుగుతుందని నిరూపితమైంది. ఈ ఆల్కలైన్ మన కడుపులోకి వెళ్ళినప్పుడు మన కడుపులో ఉన్నటువంటి ఆసిడ్ స్వభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పొట్టలో మంట గ్యాస్టిక్ సమస్యలు తగ్గుతాయి.

ఉదాహరణకి మనం మంట మీద నీరు పోస్తే చల్లారిపోతుంది. యాసిడ్ కి కొంచెం నీళ్లు చేరిస్తే వాడికి ఘాటు తగ్గిపోతుంది. అలాగే మనం సజ్జలను తినడం వల్ల ఆమ్ల స్వభావం(యాసిడ్ )స్వభావం తగ్గి కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో వచ్చే ఎసిడిటీ, కడుపులో పూత ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. మన జీర్ణసంచి పొర ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి రావు. ఇలా తక్కువ ఖర్చులో పొట్టలోని అన్ని రకాల సమస్యలను తగ్గించండి.

2. రక్తంలోని కొవ్వు మంచులా కరుగుతుంది

పీచు అధికంగా ఉండటంతో ఇది రక్తంలోనే చెడు కొలెస్ట్రాల్ ని దక్కించడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఉండే మెగ్నీషియం పొటాషియం లాంటి పోషకాలు మన రక్తపోటును పెరగకుండా ఉపయోగపడతాయి

3. చర్మ ఆరోగ్యానికి

ఈ సజ్జలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫినాలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలతో పోరాడటంలో యాంటీ-ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ మధ్య ఉన్న పరిస్థితుల వల్ల తినే ఆహారాల వల్ల వృద్ధాప్యం తొందరగా వస్తుంది.వయసు తక్కువ ఉన్నారు కూడా వారి వయసుకు తగ్గట్టు కాకుండా కనిపిస్తున్నారు. చిన్న పిల్లలలో కూడా తొందరగా చర్మం మీద ముడతలు మొదలవుతున్నాయి. ఇలా యవ్వనంలో వచ్చే ముడతలను తగ్గించడానికి తినాలి.

4. శరీర బలహీనతలను తగ్గిస్తుంది

చాలామంది చూడడానికి మాత్రం చాలా బలంగా ఉంటారు, కానీ లోపల ఏ పని చేయాలన్నా కూడా తొందరగా అలసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు సజ్జలను తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని రకాల పోషకాలు అంది, రోగనిరోధక శక్తి పెరిగి అలసట తగ్గుతుంది. చిన్నపిల్లలు కూడా బలంగా.తయారవుతారు. ఈ సజ్జలను తినడం వలన శరీరానికి తక్షణ అందుతుంది.

5. Sajjalu for Weight Loss: ఊబకాయానికి చెక్

pearl millet in telugu-obesity

పెర్ల్ మిల్లెట్, బరువు తగ్గడానికి( Weight Loss) చాలా సహాయపడతాయి. ఈ ధాన్యం ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పొట్ట తృప్తిని అందించడం వల్ల అహారం తక్కువగా తీసుకోవడం సులభం. మిల్లెట్‌ లోని తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కాబట్టి, ఇది మధుమేహానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పంటలో అధిక ప్రోటీన్ ఉండటంతో కండరాల వృద్ధికి మద్దతు ఇస్తుంది. కాలొరీలు తగ్గించుకోవడానికి ఇష్టమైన వంటకాలు తయారు చేసుకోవడానికి సజ్జలు ఉపయోగపడతాయి. చలికాలంలో ఈ మిల్లెట్‌ను వాడటం వల్ల శరీరాన్ని ఉష్ణంగా ఉంచడమే కాకుండా, పొట్టలో మట్టుపెట్టుకోవడాన్ని నిరోధిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం కావడంతో, శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను వారి ఆహారంలో చేర్చడం చాలా మంచిది.

6. Diabetes : చక్కెర వ్యాధి నియంత్రణ

సజ్జలు (పెర్ల్ మిల్లెట్) మధుమేహం ఉన్నవారికి అనుకూలమైన ఆహారంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండటం వల్ల, వీటి తింటే రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం ఉండదు. సజ్జలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు పొట్ట నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాక, మిల్లెట్‌లోని ప్రోటీన్ మృదువైన గ్లూకోజ్ విడుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సజ్జలను వారి ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసుకోవచ్చు. అలాగే, వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం సాధ్యమవుతుంది. అందువల్ల, సజ్జలు మధుమేహం నిర్వహణలో ఒక గొప్ప ఎంపిక!

Recipes-సజ్జ రొట్టి తయారీ విధానం:

Pear millet in telugu| sajja roti
  1. సజ్జలను తీసుకొని బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి.
  2. తర్వాత సజ్జలను మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.
  3. ఒక కప్పు పౌడర్ తీసుకొని దానిలో గోరువెచ్చని నీళ్లు పోసి ముద్దుల కలుపుకోవాలి.
  4. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ కర్రతో రొట్టె లాగా చేసుకోవాలి.
  5. ఆ రొట్టెలను ఒక కాలుతున్న పెనం మీద వేసి మంచిగా కాల్చుకోవాలి.
  6. కాలిన తర్వాత మంచి కూరగాయల కూరతో తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.

Frequently Asked Questions

What is Bajra millet In Telugu?

సజ్జలు (Bajra Millet) ఒక చిరుధాన్యానికి సంబంధించిన ఆహారం. పూర్వకాలం నుండి సజ్జల్ని మన ఆహారంలో వినియోగిస్తున్నాము. సజ్జలు చౌకగా దొరికే సజ్జలు చౌకగా దొరికే బలమైన ఆహారం.

సజ్జలు ఎందుకు ఆరోగ్యకరమని పరిగణిస్తారు?

సజ్జలలో మంచి పీచు పదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ అనేక రకాల పోషక విలువలు ఉంటాయి. ఇది మనకి బలాన్ని ఇచ్చి, బలహీనతలను తగ్గిస్తుంది.

సజ్జలలో ఎంత కేలరీలు కలిగి ఉంటాయి?

సజ్జలు 100 గ్రాములకు సుమారు 378 కేలరీలు కలిగి ఉంటాయి.

సజ్జలను తింటే బరువు తగ్గించడంలో సహాయపడుతాయా?

అవును, ఖచ్చితంగా . వీటిలో ఉండే అధిక పీచు పదార్థం మరియు తక్కువ గ్లైజమేకి ఇండెక్స్ వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి సజ్జలు మంచిదా?

సజ్జలు మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక, ఎందుకంటే అవి రక్త చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

సజ్జలు ఎలా వండాలి?

సజ్జలను రవ్వగా పట్టించి సజ్జలను రవ్వగా పట్టించిగా చేసుకోవచ్చు లేదా సజ్జలను దోష పిండి లాగా రుబ్బుకుని వాడుకోవచ్చు లేదా దోషాలతో రొట్టెలా చేసుకోవచ్చు.

సజ్జలను రోజుకు ఎంత తినాలి?

ప్రతి రోజుకు 30 నుండి 50 గ్రాముల సజ్జలను తీసుకోవడం మంచిది.

సజ్జలు చర్మ ఆరోగ్యానికి ఎలాగా ఉపకరిస్తాయి?

సజ్జల్లో ఆంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ఇది మనకి వచ్చే వివిధ రకాల సమస్యల నుండి మనల్ని కాపాడతాయి.

సజ్జలు చిన్నపిల్లలకు ఆహారంలో పెట్టవచ్చా?

చాలామంది పిల్లలు బలహీనంగా ఉంటారు. పిల్లలు రక్తం బాగా రావడానికి బలంగా మారడానికి ఉపయోగకరంగా ఉంటాయి. సజ్జలను చిన్నపిల్లలకి ఆహారంగా పెట్టడం వలన వారు మానసిక మానసికంగానూ, శారీరకంగానూ బాగా ఎదుగుతారు. కానీ చిన్నపిల్లలకు సజ్జలను ఆహారంగా పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి సజ్జలను పొడిగా చేసి వాటిని ఆహారంలో వాడినట్లయితే ఎలాంటి అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

సజ్జలను ఎలా నిల్వ చేయాలి?

సజ్జలను గాలి తగలని చోట, తేమ తక్కువగా ఉండి, చల్లని ప్రదేశాల్లో నిల్వ చేయవచ్చు.

Conclusion

సాధారణంగా సజ్జలు చాలామందికి తెలుసు. కొంతవరకు సజ్జల గురించి అందరికీ అవగాహన ఉండటం నిజమే కానీ వాటి యొక్క నిజమైన ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. వీటి వలన ఎన్నో రకాల సమస్యల గురించి మనం ఉపశమనం ఉండవచ్చు. సజ్జలను ముందుగా క్యాన్సర్ రాకుండా, బహిష్టు సమస్యలు ఉన్నవారు, చక్రవ్యాధి ఉన్నవారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు తప్పకుండా తమ ఆహారంలో చేర్చుకోవాలి.

Read Also

Some other millets are

Scroll to Top