Proso Millet In Telugu: ఈ ఆర్టికల్ లో ప్రోసోమిలేట్ గురించి ఎక్కడ పండుతుంది? ఎలా తినాలి? ఎలాంటి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది?తెలుసుకుందాం.
Table of Contents
What is mean by Proso millet?
ప్రోసో చిరుధాన్యం (Proso) తెలుగులో “బరగు” లేదా “వరిగలు” లేదా “వరగు” అంటారు. ఇవి పసుపు రంగులో కొంచెం పరిమాణం పెద్దగా ఉంటాయి. ఇది ప్రత్యేకంగా ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారంలో ఉపయోగించబడుతుంది. దీనిలో ఎక్కువగా పోషక పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలుంటాయి.ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. Proso చిరుధాన్యాన్ని రక రకాల వంటలలో ఉపయోగించవచ్చు.
ఈ వరిగలను మన భారతదేశంలో, ఇంకా శ్రీలంకలో విరివిగా పండిస్తున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే కోస్తాంధ్ర ప్రాంతంలో ఇంకా గిరిజనులు నివసించే ఎత్తైన ప్రదేశాల్లో వీటిని పండిస్తున్నారు. వీటిని పండించడానికి ఇసుక నేలలు, ఎర్ర రేగడి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వీటిని పండించడానికి నీరు నిల్వ ఉండే ప్రాంతాలు అనుకూలంగా ఉండవు.
Proso In Telugu Nutrition

వరిగలలో 3 నుండి 4 % ఫైబర్ ఉంటుంది. ఇతర మిల్లెట్లతో పోల్చినప్పుడు వీటిలో ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.
పోషకతత్త్వం | పరిమాణం (100 గ్రా) |
---|---|
కేలోరీలు | 350-370 కేలోరీలు |
ప్రోటీన్ | 10-12 గ్రాములు |
కార్బోహైడ్రేట్లు | 70-75 గ్రాములు |
ఫైబర్ | 5-8 గ్రాములు |
ఫాట్ | 3-5 గ్రాములు |
ఖనిజాలు | ఉప్పు, మాగ్నీషియం, కాంసియం, ఐరన్, జింక్ |
వరిగలు ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits)

Skin problems
మనలో చాలామందికి రకరకాలైనటువంటి చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనం కలగడానికి తప్పకుండా మనం ఈ వరిగలని నిత్యం తీసుకుంటూ ఉండాలి. మన పూర్వీకులు అమ్మమ్మలు, తాతమ్మలు వీళ్ళ చర్మం చాలా బాగుండేది. కానీ ఇప్పుడు వాతావరణ కాలుష్యం, సూర్య రష్మి వల్ల మన చర్మానికి రకరకాల అయినటువంటి వ్యాధులు వస్తున్నాయి. అలాగే చర్మం మీద వయసు ఛాయలు బాగా కనిపిస్తున్నాయి. తక్కువ వయసున్న వారు కూడా ముసలి వారిలాగా కనిపిస్తున్నారు. ఈ వరిగలను తినడం వల్ల మన చర్మం మీద వచ్చే ముడతలను తగ్గిస్తాయి. తొందరగా ముడతలు రాకుండా చూస్తాయి. కొంతమందికి చర్మం పొడిబారి పొట్టు రాలుతూ ఉంటుంది. ఎండకి వెళ్లడం వల్ల చాలామందికి బెందులు రావడం, గోకుడు, మంట ఇలాంటివన్నీవస్తూ ఉంటాయి. ఇలాంటివారు కూడా వరిగల నుంచి ఉపశమనం పొందుతారు.
Nerves damage:
ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి నరాల బలహీనతల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ నరాల బలహీనత వల్ల పక్షవాతం రావడం, మెమరీ లాస్, మానసిక ఇబ్బందులు వస్తున్నాయి. మన నరాల పట్టుత్వం పెరగాలంటే ఈ వరిగలను సరియైన పద్ధతిలో తీసుకోవాలి వీటిని తీసుకోవడం వల్ల నరాలలో ఏవైనా సమస్యలు ఉన్న, ఏవైనా అడ్డంకులు ఉన్న అన్ని తొలగిపోయి సరిగ్గా పనిచేస్తాయి.
Kidney problems:
మనం తాగే నీటి వల్ల మరియు మన ఆహార అలవాట్ల వల్ల మన మూత్రశంలో రాళ్లు తయారవుతూ ఉంటాయి. ఇంకా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వల్ల మంట వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు వరిగలను తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.
Muscle development :
ఇతర మిల్లెట్లతో పోల్చి చూసినప్పుడు ఈ వరిగల్లో చాలా ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి. మన కండరకణజాలం ఏర్పడాలంటే మంచి మాంసకృతులు కావాలి. ఇవి కండరాలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
Blood Circulation:
మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పని చేయాలంటే మొదటగా అవయవాలకి రక్తప్రసరణ సరిగ్గా జరగాలి. ఈ రక్తప్రసరణలో ఏవైనా అడ్డంకులు ఉంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి. దీనిలోని ఐరన్ మరియు ఇతర ఖనిజాల రక్తప్రసరణ సాఫీగా జరిగేలాగా చూస్తాయి.
How to Cook Proso Millet? Recipes
ప్రోసో మిల్లెట్‌ను వివిధ రకాల వంటకాల్లో (Dishes) ఉపయోగించవచ్చు.
- రొట్టెలు (Flatbreads):ప్రోసో పిండి ఉపయోగించి రొట్టెలు తయారుచేయవచ్చు.
- పులావ్ (Pulao): ప్రోసో millets పులావ్ లేదా బిర్యానీ వంటి వంటకాలు చేయవచ్చు.
- సూప్‌లు (Soups): సూప్‌లలో వాడవచ్చు.
1. Proso millet Roti

Ingredients
- ప్రొసో మిల్లెట్ – 1 కప్పు
- ఉప్పు
- నీరు
Preperation
- వరిగలను మొదటగా వర్గాలను తీసుకొని బాగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి.
- బాగా ఎండిన తర్వాత వాటిని గ్రైండర్ లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి.
- తర్వాత ఇలా తయారవుతుంది.
- వరిగపిండిని తీసుకొని కొంచెం నీళ్లు కలుపుతూ పిండిని ముద్దలాగా చేయాలి.
- ఒక పది నిమిషాలు ఒక తడి బట్టని కప్పి ఉంచి అలా వదిలేయాలి.
- కలిపిన పిండిని ఉండలుగా చేసుకొని చపాతీ కర్రతో లేదా ప్రెస్సింగ్ మిషన్తో రొట్టెల్లాగా చేసుకోవాలి.
- ఈ రొట్టెలను మంచిగా దోరగా పాన్ మీద వేయించుకోవాలి కాల్చుకోవాలి .
- మనకి కావాలంటే నూనె వేసుకోవచ్చు లేదా నూనె వేయకుండా తినొచ్చు.
- ఇలా కాల్చిన రొట్టెలను మంచి కూరగాయల కర్రీతో తినవచ్చు.
2. ప్రొసో మిల్లెట్ పులావ్ (Proso Millet Pulao)

Ingredients
- ప్రొసో మిల్లెట్ – 1 కప్పు
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర – 1/2 టీస్పూన్
- పచ్చిమిరపకాయలు
- ఉల్లిపాయ
- క్యారెట్ – 1 (సన్నగా తరిగినది)
- పచ్చి బీన్స్ – 1/2 కప్పు
- ఎలాచీ
- దాల్చినచెక్క
- ఉప్పు
- నీరు
Preperation
- ఒక కప్పు వరిగలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు గంటలు నీటిలో నానబెట్టుకోవాలి.
- ఒక కుక్కర్లో తగినంత నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి.
- తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
- వీటిలో మన ఇష్టమైనటువంటి కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. ఎక్కువగా క్యారెట్ బీన్స్ వేస్తూ ఉంటారు.
- అన్నిటిని బాగా కలిపి మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి.
- నీటిలో తగినంత ఉప్పు, ధనియా పౌడర్, చాలా తక్కువ మసాలా, గరం మసాలా వేసి బాగా నీటిని మరగనివ్వాలి.
- మరిగిన నీటిలో నానబెట్టినటువంటి వరిగలను వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేయాలి.
- రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.
- తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
Side Effects
ఈ వరిగలలో గైట్రోజెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒకవేళ మనం వరిగలను ఎక్కువగా తీసుకున్నట్లయితే హైపో థైరాయిడిజం అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇంకా వరిగెలలో పైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆంటీ న్యూట్రియంట్ లాగా పనిచేస్తుంది. దీని వల్ల మనం తీసుకునే మంచి ప్రోటీన్స్ ని న్యూట్రియన్స్ ని మన శరీరంలో శరీరం గ్రహించకుండా చేస్తుంది.
Frequently Asked Questions
What is Proso Millet?
సాధారణంగా మిల్లెట్ అనగానే ఎవరైనా వరిగలు అనుకుంటారు. ఇక్కడ Proso Millet ని తెలుగులో వరిగలు, బరగు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
వరిగలలో ఎలాంటి పోషకాలు ఉంటాయి?
వరిగలలో పాలిఫినల్స్అ, న్ని రకాలైన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, లెసిథిన్, పోలిక్ యాసిడ్ నియాసిన్ లాంటి మంచి పోషకాలు ఉన్నాయి.
వరిగలను ఎలా వండుకోవాలి?
వరిగలను మామూలుగా మనం వరి ధాన్యం వండుకున్నట్లు వండుకోవచ్చు. వరిగ అన్నం, ఇడ్లీ , రోటి, కిచిడి, దోశ ఇలాంటి అన్ని రకాల వంటలు చేయవచ్చు. వరిగలను వండుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవడం చాలా అవసరం.
వరిగలు డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవచ్చా?
తప్పకుండా తీసుకోవచ్చు. చిరుధాన్యాలు అన్నీ కూడా సరియైన పద్ధతిలో తినడం వల్ల డయాబెటిస్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది.
వరిగలు ఎక్కడ దొరుకుతాయి?
చిరుధాన్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాక వీటిని పండించడం అమ్మడం కూడా చాలా వరకు పెరిగింది. ఇవి మనకు దగ్గరలోనే సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి.
ఈ Proso మిల్లెట్ ని ఎలా నిల్వ చేసుకోవాలి?
ఈ వరిగలను తేమ లేని చోట, తక్కువ తేమ ఉన్న చోట నిలువ చేసుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటాయి.
వరిగలను రోజు తినవచ్చా?
వరిగలను వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం మంచిది. అది కూడా మితంగా తినాలి. ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రమాదం ఉంది.
వరిగలు ఏయే వ్యాధులను తగ్గిస్తాయి?
వరిగలు ముఖ్యంగా మానసిక ఒత్తిడి లను నివారిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధులు మరియు కిడ్నీ సంబంధమైన వ్యాధులు, పిత్తాశయంలో ఏర్పడే రాళ్లు వీటిని తగ్గిస్తాయి.
Conclusion
మన జీవనశైలి ప్రభావం అందరూ కూడా ఒత్తిడిని అధిగమిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు .ఉద్యోగం చేసే వారికి చేయని వారికి ఏం చేసినా కూడా ఒత్తిడి అనేది కామన్ అయిపోయింది. ఈ ఒత్తిడి వల్ల మనకు తెలియకుండానే అనేక రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నాము. ఈ ఒత్తిడి తగ్గాలంటే మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవడం మంచిది. చిరుధాన్యాలలో వరిగలు ఈ ఒత్తిడిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ ఒత్తిడి వల్ల వచ్చే డిప్రెషన్ ని తగ్గిస్తాయి. నరాలను, ఎముకలను, కండరాలను అభివృద్ధి చేస్తాయి. మనకి వరిగెల వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒక ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవడం మంచిది. దీనివల్ల అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని తిన్న రోజులలో కొంచెం నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
Read Also
We have Different Types of Millets