Pumpkin Seeds Benefits: ఈ ఆర్టికల్‌లో మనం గుమ్మడి గింజల గురించి, వాటి వల్ల కలిగే లాభాలను గురించి, దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.
Table of Contents
Pumpkin Seeds In Telugu

తెలుగు లో Pumpkin Seeds ని గుమ్మడి గింజలు అని అంటారు. సాధారణంగా మనం ఏదైనా చెట్టు తీసుకుంటే వాటి పండ్ల వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కానీ ఈ గుమ్మడి చెట్టు పండు వలనే కాకుండా గుమ్మడి పండులో ఉండే గింజల వలన కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ గుమ్మడి గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కాన్సర్, గ్యాస్ట్రిక్ , ప్రోస్టేట్, సమస్యల నుంచి రక్షణ ఉంటుంది. ఈ గింజల వల్ల మహిళలకు మరియు పురుషులకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ గింజ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటానికి చాల ఉపయోగ పడుతుంది.
Nutritional Values Of Pumpkin Seeds
పోషక విలువ (100 గ్రా) | పరిమాణం |
---|---|
కాలరీలు | 559 kcal |
ప్రోటీన్ | 30 గ్రా |
కొవ్వులు | 49 గ్రా |
కార్బోహైడ్రేట్లు | 11 గ్రా |
ఫైబర్ | 6.5 గ్రా |
పొటాషియం | 809 మి.గ్రా |
ఫాస్ఫరస్ | 1233 మి.గ్రా |
మెగ్నీషియం | 592 మి.గ్రా |
కాపర్ | 1.3 మి.గ్రా |
మెంగనీస్ | 4.5 మి.గ్రా |
గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు

క్యాన్సర్ రాకుండా చేస్తుంది
చాలా అపాయకరమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఈ మధ్య మన శరీరానికి రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, పేగులలో క్యాన్సర్, మలద్వారంలో క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ ఇలా చాలా రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటిని తొందరగా కనుక్కున్నట్లయితే బయటపడే అవకాశం ఉంటుంది. చివరి స్టేజ్‌లో కనుక్కోవడం వల్ల చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గుమ్మడి గింజల్లో ఉన్న కెరొటిన్ , విటమిన్ ఇ లాంటి యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్లకు వ్యతిరేకంగా రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా, మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. నెలసరి నిలిచిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గించడంలో గుమ్మడి గింజలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
షుగర్ వ్యాధికి మంచి మందు
మన భారతదేశం డయాబెటిక్ పేషెంట్స్ సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
షుగర్ పేషెంట్స్‌కు ఈ గుమ్మడి గింజలు మంచి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలలో యాంటీడయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి. గుమ్మడికాయ seeds లలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, అనే పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.
ఊబకాయులకి వరం

మనం బరువు తగ్గడం వలన మనం చూడడానికి అందంగా కనపడటమే కాకుండా మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అధిక బరువు వల్ల వచ్చే అనేక రకాలైన వ్యాధులనుండి మనం ఉపశమనం పొందవచ్చు.
ఈ గింజలు బరువు తగ్గడానికి( Weight Loss) ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండటం వలన తక్కువ తిన్న కూడా పొట్ట నిండినట్లు మనకు అనిపిస్తుంది. అలాగే, ఇవి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండటంతో శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. రోజూ మితంగా గుమ్మడి గింజలను తీసుకోవడం బరువు నియంత్రణకు మంచి చేస్తుంది.
What are the Benefits for male?
గుమ్మడి గింజలు పురుషుల ఆరోగ్యానికి ఒక గొప్ప వరం.
- ప్రోస్టేట్ ఆరోగ్యం: గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉండడం వలన ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
- స్పెర్మ్ నాణ్యత: వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు వీర్య కణాల నాణ్యతను మెరుగుపరచి, పురుషుల ఫెర్టిలిటీకి మంచి చేస్తాయి.
- టెస్టోస్టిరోన్ స్థాయిలను మెరుగుపరచడం: ఈ గింజలు హార్మోన్ల సమతుల్యానికి ఉపయోగపడతాయి, ప్రత్యేకంగా టెస్టోస్టిరోన్ స్థాయిలను సహజంగా పెంచడంలో ఉపయోగపడతాయి.
- మెరుగైన నిద్ర – వీటిలోని ట్రిప్టోఫాన్ మరియు మెగ్నీషియం మంచి నిద్ర కోసం తోడ్పడుతాయి. మంచి నిద్ర మంచి నిద్ర వలన మన శరీరంలోని సగానికి సమస్యలు తగ్గిపోతాయి. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
What are the Benefits for female?
గింజలు మహిళలకు ప్రత్యేకంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి:
- హార్మోన్ల సమతుల్యత : గుమ్మడి గింజలలోని ఫైటోఎస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచి, సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
- ఎముకల ఆరోగ్యం – మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకల బలాన్ని పెంచడంలో మంచి చేస్తాయి.
- జుట్టు మరియు చర్మ ఆరోగ్యం – గుమ్మడి గింజలలో జింక్, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతాయి.
- హృదయ ఆరోగ్యం – గుమ్మడి గింజలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- నిద్రను మెరుగుపరచడం – ఇందులోని ట్రిప్టోఫాన్ మంచినిద్ర కోసం ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Pumpkin Seeds Benefits for Hair
ఈ గింజలు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో జింక్, విటమిన్ E లాంటి యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన జుట్టు పెరగడానికి, దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి. నిత్యం గుమ్మడి గింజలను తీసుకోవడం జుట్టు రాలటంను తగ్గిస్తుంది.
Pumpkin Seeds Benefits for Skin
ఇవి చర్మానికి చాలాఉపయోగకరమైనవి. వీటిలో యాంటీఆక్సిడెంట్, విటమిన్ E, ఫ్యాటి యాసిడ్ఉం డటంతో చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లోని పోషకాలు చర్మానికి తేమను అందించి, ముడతలు, వయస్సు సంకేతాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
గుమ్మడి గింజలను ఎలా తినాలి?
ఇవి ఆరోగ్యానికి చాలా మంచిని చేస్తాయి. వాటిని భోజనంలో, వేపించి తినడం, పొడిని ఉపయోగించడం, జ్యూస్‌లలో వేసి తాగడం చేయొచ్చు.
- ఈ గుమ్మడి గుండెలను ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టి తర్వాత తినడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇంకా ఈ గుమ్మడి గుండాలను వేయించి పొడిగా చేసి రోజు వంటల్లో ఉపయోగించవచ్చు.
- ఈ గింజల పొడిని తీసుకుని పాకం లేదా బేకింగ్ చేయడంలో ఉపయోగించవచ్చు.
గుమ్మడి గింజలు ఎన్ని తినాలి?
ఈ గుమ్మడి గింజలను దాదాపుగా 10 నుండి 12 గింజలు వరకు మనం తినవచ్చు. అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావొచ్చు. గుమ్మడి గింజలలోని పీచు దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
Frequently Asked Questions
1. గుమ్మడి గింజలు ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
గుమ్మడి గింజలలోఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
2. గుమ్మడి గింజలు ఏ రోగాల నుంచి రక్షిస్తాయి?
మన శరీరంలో ఏ వ్యాధులు రాకుండా ఉండాలంటే మన రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ రక్షణ వ్యవస్థకు జింకు చాలా ముఖ్యమైన పోషక పదార్థం. గుమ్మడి గింజల్లో ఉంటుంది. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఇమ్యూనిటీ, క్యాన్సర్, గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
3. మహిళలు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఏమి లాభం?
ఈ గుమ్మడి గింజలు ముఖ్యంగా క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడతాయి. మహిళల్లో మనం తర్జుమా చూసే రొమ్ము క్యాన్సర్ తగ్గించడానికి ఈ గింజలు ఉపయోగపడతాయి.
4. ఈ గుమ్మడి గింజలను ఎలా తీసుకోవాలి?
వీటిని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ తిన్నట్లుగా తింటే చాలా బాగుంటుంది లేదా వీటిని వేయించుకొని మెత్తటి పొడి లాగా చేసుకుని ఎలా కావాలంటే అలా వంటల్లో వాడుకోవచ్చు.
5. పురుషులకు ఈ గుమ్మడి గింజలు ఎందుకు మంచివి?
మనకు పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ మధ్య తరచుగా కనిపిస్తుంది ఈ ప్రోస్ట్రేట్ గ్రంధి ఆరోగ్యానికి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.
6. గుమ్మడి గింజలను ఎంత తినాలి?
మనం ఒక రోజుకు ఒక గుప్పెడు గింజలను తీసుకుని నానబెట్టుకుని తింటే సరిపోతుంది. అంటే దాదాపుగా ఒక 10 నుండి 15 గింజల వరకు తినవచ్చు.
7. గుమ్మడి గింజలను ఎక్కడ నుండి కొనాలంటే?
ఈ గుమ్మడి గింజలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే అన్ని రకాల స్టోర్స్ లో, మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆర్గానిక్ స్టోర్స్ లో అయితే కచ్చితంగా దొరుకుతాయి.
8. గుమ్మడి గింజలను వంటలో ఉపయోగించరా?
గుమ్మడి గింజలను మంటలలో ఉపయోగించాలంటే వాటిని పొడి చేసి ఉపయోగిస్తే బాగుంటుంది. గుమ్మడి గింజల పొడిని రోజు కూరలలో వాడొచ్చు ఏమైనా చట్నీలో కానీ ఏవైనా జ్యూసులు చేసినప్పుడు వాటిలో కలుపుకోవచ్చు.
9. గుమ్మడి గింజలను ఎలా నిల్వ చేయాలి?
గుమ్మడి గింజలను బాగా వేయించుకొని చల్లారాక గ్రైండర్లో పొడి చేసి ఒక బాక్సులో నిల్వ చేసుకుని అవసరం ఉన్నప్పుడు వంటలలో వాడుకోవచ్చు.
10. గుమ్మడి గింజల వల్ల ఎలాంటి వైద్య సమస్యలు ఉంటాయా?
గుమ్మడి గింజలను ఎక్కువ మోతాదులో తీసుకుని వలన మనకి కడుపు ఉబ్బరంగా ఉండవచ్చు. సరిగ్గా అరగకుండా జీర్ణ వ్యవస్థలో గ్యాస్ సమస్యలు రావచ్చు.