Super Food Quinoa In Telugu

Meaning of Quinoa in Telugu:

క్వినోవా ని ‘కీన్వా’ లేదా ‘కినోవా’  అని అంటారు.

మనలో చాలామందికి క్వినోవా రైస్ (quinoa Rice)గురించి తెలియదు.

ఈ మధ్యకాలంలో అక్కడక్కడ క్వినోవా అని వినిపిస్తూ ఉంది.

ఈ క్వినోవా రైస్ గురించి అన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

What is the Meaning of Quinoa in Telugu ?

Meaning of Quinoa in Telugu : అసలు Quinoa rice అంటే వరి ధాన్యం లాంటిదా లేక చిరుధాన్యాలకి సంబంధించిందా అనేది చాలామందిలో వచ్చే సందేహం.

ఈ క్వినోవా రైస్ ఫ్యామిలీకి సంబంధించిన పదార్థం కాదు.

అలాగే మిల్లెట్స్ (Millets)కి సంబంధించినటువంటి పంట కూడా కాదు. ఇది ఒక రకమైన చిన్న గింజలు గా ఉండే విత్తనం లాంటిది. వీటిలో తెలుపు, ఎరుపు, ముదురు గోధుమ రంగు ఇలా చాలా రకాల రంగులలో ఉంటాయి.

ఇది మన దేశంలో పండించే పంట కాదు, ఇతర దేశాలలో పండుతుంది. కానీ ఇప్పుడు మనదేశంలో కూడా వినియోగిస్తున్నారు. ఈ క్వినోవా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Quinoa in telugu: what is quinoa?

ఈ క్వినోవాని తెలుగులో ఎటువంటి పేరు లేదు, తెలుగులో కూడా క్వినోవా అనే పిలుస్తారు.

ఈ పంట ముఖ్యంగా సౌత్ అమెరికాలోని బోలివియా ప్రాంతంలో పండుతుంది. దీనిలో అన్ని రకాల పోషకాలు ఉండి మన శరీరానికి ఒక అతి అరుదైన పోషకాలు నచ్చే బంగారంతో సమానం.

అందువల్ల దీనికి ‘బంగారు పంట‘ అనే పేరు వచ్చింది. క్వినోవాను కొన్ని భాషల్లో Kinwa (కిన్వా) లేదా Quinoa లేదా Quinua అని కూడా పిలుస్తారు.

కినోవా అనేది మన సంప్రదాయ ఆహార విధానంలో భాగం కాదు. ఇది మన దేశంలో సహజంగా లభించే ధాన్యం కాకపోయినా, ఇందులో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ప్రాముఖ్యత పొందాయి. ఈ కారణంగా, దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు లేదా చక్కెర వ్యాధిని నియంత్రించుకోవాలనుకునేవారు, కినోవాను తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. అధిక పరిమాణంలో తీసుకుంటే, ఇందులోని క్యాలరీలు ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, దీనిని పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఉదాహరణకు, కినోవాను కూరగాయలతో కలిపి ఉడకబెట్టి లేదా పులావ్‌లాగా తయారు చేసుకోవచ్చు.

ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కినోవా సాగు జరుగుతోంది. అంతర్జాతీయంగా దీని డిమాండ్ పెరుగుతుండటంతో, ఇప్పుడు మన దేశంలోనూ ఇది సులభంగా లభిస్తోంది. మార్కెట్‌లలో, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కూడా కినోవా రైస్‌ కొనుగోలు చేయడం సులభమైంది.

Quinoa Seeds Nutrients

ఒక 100 గ్రాములు Quinoa Seeds లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో కింద పట్టికలో చూపించబడింది.

పోషకాహారంవిలువ (100 గ్రాముల కోసం)
ఎనర్జీ120 కేలొరీలు
ప్రోటీన్8 గ్రాములు
కొవ్వు1.9 గ్రాములు
కార్బోహైడ్రేట్స్21.3 గ్రాములు
ఫైబర్7 గ్రాములు
షుగర్0.9 గ్రాములు
విటమిన్ B1 (థియామిన్)0.1 మిల్లిగ్రాములు
విటమిన్ B2 (రిబోఫ్లావిన్)0.2 మిల్లిగ్రాములు
విటమిన్ E0.6 మిల్లిగ్రాములు
ఖనిజాలు
కేల్షియం17 మిల్లిగ్రాములు
ఐరన్1.5 మిల్లిగ్రాములు
మెగ్నీషియం64 మిల్లిగ్రాములు
పొటాషియం172 మిల్లిగ్రాములు

మనకి సాధారణంగా తెల్లని అన్నంలో ఎక్కువ క్యాలరీలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది వరి బియ్యానికి బదులు ఇంకేం తినాలా అని అనేక రకాల ధాన్యాలు తింటున్నారు.

ముఖ్యంగా మనకి ధర తక్కువలో ఎక్కువ పోషకాలు అందించే మిల్లెట్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

మనకి రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. వీటిలో కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, రాగులు, అండు కొర్రలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మంచి పోషకాలు ఉన్నాయి.

కానీ వీటితో పోలిస్తే కూడా క్వినోవాలో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయి, కానీ దీని ధర ఎక్కువ.

What are the Types of Quinoa

Types of Quinoa: క్వినోవా ప్రధానంగా మూడు రకాలుగా లభిస్తుంది.

  1. White Quinoa-తెల్ల క్వినోవా : ఇది సాధారణంగా ఎక్కువగా లభిస్తుంది, స్వల్ప రుచితో, ఉడికించిన తర్వాత మెత్తగా ఉంటుంది.
  2. Red Quinoa-ఎర్ర క్వినోవా : కొంచెం గింజియైన నిర్మాణంతో, మామూలు క్వినోవా కంటే మరింత రుచికరంగా ఉంటుంది, ముఖ్యంగా సలాడ్‌లకు అనువుగా ఉంటుంది.
  3. Black Quinoa-నలుపు క్వినోవా : కొంచెం తీపి రుచితో, భూసారం లాంటి ప్రత్యేకమైన స్వాదుతో ఉంటుంది, మరియు ఉడికించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

ఇవి కాకుండా త్రివర్ణ క్వినోవా (Tricolor Quinoa or Rainbow Quinoa) అనే మిశ్రమం కూడా లభిస్తుంది, ఇందులో మూడు రకాల క్వినోవా కలిపి ఉంటాయి.

Quinoa Rice Benefits In Telugu

1. Quinoa Reduces Protien Deficiency

Quinoa Benefits as a protien source: ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది దీని వలన మన శరీర కండరాలు, కణాలు అభివృద్ధి చెందుతాయి. అన్ని పనులకి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అన్నీ కూడా ఈ ప్రోటీన్ నుంచి అందుతాయి.

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలన్న, హార్మోన్స్ సరిగ్గా పని చెయ్యాలన్న కూడా ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది తప్పకుండా ఉండాలి. ఒక మనిషి సగటున ప్రతిరోజు తను తీసుకునే ఆహారంలో 10 నుంచి 15% వరకు ప్రోటీన్ అనేది ఉండాలి.

అంటే దాదాపుగా 50 నుంచి 70 గ్రాముల వరకు ప్రతిరోజు ప్రోటీన్ మనం తీసుకోవాలి. ప్రోటీన్ తక్కువగా తీసుకోన్న వారిలో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. మనకి సాధారణంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర పప్పు ఇలాంటి వాటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

కానీ వీటిని తినడం వల్ల గ్యాస్ సమస్య వస్తుందని చాలామంది తినకుండా ఉంటారు. అలాంటివారికి ప్రత్యామ్నాయంగా క్వినోవా తినవచ్చు.

ఒక కప్పు క్వినోవా లో దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిది గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. మనం ఇతర చిరుధాన్యాలతో పోల్చినప్పుడు లేదా వరి ధాన్యం, వేటితో పోల్చి చూసిన కూడా దీనిలో ఉండే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ.

దీనిలో ఉన్నంత ప్రోటీన్ మరి దాంట్లో లేదని కూడా చెప్పవచ్చు. అందువల్ల క్వినోవా అనేది తినడం వలన మన శరీరానికి అవసరమైనటువంటి మొత్తం ప్రోటీన్ అనేది దొరుకుతుంది.

2. Immunity Boosting

క్వినోవాలో ఉన్నటువంటి ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇంకా దీనిలో ఉన్న జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషకాలు మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

క్వినోవాలో ఉన్న అంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించి, ఇమ్యూనిటీని మరింత బలపరుస్తాయి. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుంది. క్వినోవాలో ఉన్న ప్రోటీన్ కూడా ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎందుకంటే ఇది శరీరంలోని టిష్యూలను మరియు సెల్స్ ను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ శరీరంలోని మెటబాలిజం మరియు ఇమ్యూన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవచ్చు.

3. Quinoa for Sugar Control

క్వినోవాలో అన్ని ధాన్యాల కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ మరియు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దీనిని తినడం వలన మనకి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు గ్లూకోజ్ అనేది చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదలై చక్కర వ్యాధి రాకుండా చూస్తుంది.

క్వినోవాలో ఉన్న లో గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) రక్తంలో చక్కర స్థాయిని నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది, ఇది షుగర్ స్పైక్స్ ను నివారిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది, ఇది చక్కర వ్యాధి నియంత్రణలో ముఖ్యమైనది.

క్వినోవాలో ఉన్న మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మరియు ఉపయోగాన్ని మెరుగుపరుస్తుంది, ఇది షుగర్ కంట్రోల్ కు మరింత సహాయకారిగా ఉంటుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న ఫైబర్ కంటెంట్ మన అన్నాశయంలో ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.

ఇది రక్తంలో చక్కర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి, క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు చక్కర వ్యాధిని సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.

4. Quinoa for Weight loss

Quinoa for Weight loss : ఒక 100 గ్రాముల క్వినోవాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏడు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ.

అందువలన ఈ దీనిని కొంచెం తిన్నప్పుడు కడుపునిండా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల చాలాసేపటి వరకు ఏం తినాలి అనిపించదు. దానివల్ల అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి బరువు కూడా తగ్గిపోతారు.

క్వినోవాలో ఉన్న ప్రోటీన్ కంటెంట్ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం ను పెంచి క్యాలరీలను ఎక్కువగా కరిగిస్తుంది. ఇది మీకు ఎక్కువ సేపు తృప్తిని ఇస్తుంది, ఇది అనవసరమైన స్నాకింగ్ ను తగ్గిస్తుంది.

క్వినోవాలో ఉన్న లో కెలరీ కంటెంట్ కూడా బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది మీరు తినే మొత్తం కెలరీలను తగ్గిస్తుంది. అదనంగా, క్వినోవాలో ఉన్న ఫైబర్ మరియు ప్రోటీన్ కలయిక శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడంలో సహాయపడుతుంది.

ఇది బరువు తగ్గడంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి, క్వినోవాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడం ద్వారా మీరు బరువు తగ్గడాన్ని సులభతరం చేసుకోవచ్చు.

Quinoa Comparison with other grains

FactorQuinoaWhite RiceBrown RiceMillets
Protein (g)13-156-77-97-12
Fiber (g)2.80.43.55-10
CarbsModerateHighModerate-HighModerate
Glycemic IndexLow (53)High (73-89)Medium (50-68)Low (45-55)
Gluten-FreeYesYes YesYes
NutrientsHigh in Iron, MagnesiumLowGood in Magnesium, SeleniumHigh in Calcium, Iron
AntioxidantsHighLowMediumHigh
Cooking Time15-20 min10-15 min30-40 min15-30 min
Best ForHigh-protein dietStaple foodHealthier rice optionDiabetes, Weight loss

Is Quinoa Better than Rice?

క్వినోవా సాధారణ బియ్యం కంటే మెరుగైన పోషక విలువలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా తెల్ల బియ్యంతో పోలిస్తే. క్వినోవా అధిక ప్రోటీన్, ఫైబర్ మరియు అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి, అదే సమయంలో, బ్రౌన్ రైస్ తెల్ల బియ్యం కంటే ఆరోగ్యకరమైనది, కానీ క్వినోవా కంటే తక్కువ ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది.

క్వినోవా బరువు తగ్గించడం, మధుమేహం నియంత్రణ మరియు ఆరోగ్యకర జీవనశైలికి మంచి ఎంపిక, అయితే బియ్యం కూడా సాధారణంగా సులభంగా లభించే మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారం.

మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు అవసరాలను బట్టి రెండూ మంచి ఎంపికలే, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషక ప్రయోజనాలను అందిస్తుంది(Quinoa Vs Rice).

Is Quinoa Better than Brown Rice?

క్వినోవా బ్రౌన్ రైస్ కంటే మెరుగైన ప్రోటీన్, ఫైబర్ మరియు పోషక విలువలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా బరువు తగ్గించడం మరియు ఆరోగ్యకర జీవనశైలికి. అయితే, బ్రౌన్ రైస్ కూడా ఆరోగ్యకరమైన ఎంపిక, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషకాలను అందిస్తుంది (Quinoa Vs Brown Rice).

Is Quinoa Better Than Millets?

క్వినోవా మిల్లెట్స్ కంటే అధిక ప్రోటీన్ మరియు అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది ఒక పూర్తి ప్రోటీన్ మూలంగా పరిగణించబడుతుంది.

మిల్లెట్స్ కూడా ఆరోగ్యకరమైనవి మరియు ఫైబర్, ఖనిజాలు మరియు విటమిన్లను కలిగి ఉంటాయి, కానీ క్వినోవా పోషక సాంద్రతలో మించిపోతుంది. మీ ఆరోగ్య లక్ష్యాలు మరియు అవసరాలను బట్టి రెండూ మంచి ఎంపికలే, కానీ క్వినోవా మరింత సమగ్ర పోషక ప్రయోజనాలను అందిస్తుంది(Quinoa Vs Millet).

Quinoa Rice Weight Loss Recipe

క్వినోవాతో మనం రకరకాల రుచికరమైన వంటకాలను(Quinoa Recipes) తయారు చేసుకోవచ్చు!

Quinoa Rice

Ingredients

  • 1 కప్పు క్వినోవా
  • 2 కప్పుల నీరు
  • 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి
  • 1 చిన్న ఉల్లిపాయ
  • 1 చిన్న క్యారెట్
  • 1/2 కప్పు పచ్చి
  • 1 వెల్లుల్లి
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • ఉప్పు
  • కొత్తిమీర
Weight loss recipe of quinoa in telugu

తయారుచేసే విధానం:

  1. ఒక కప్పు క్వినోవా తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
  2. బాగా నానిన తర్వాత సరిపడాన్ని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి.
  3. ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుని ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించాలి .
  4. తర్వాత తగినంత నూనె వేసుకోవాలి.
  5. నూనె వేడెక్కాక దానిలో తాలింపు గింజలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కూరగాయల ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  6. తర్వాత ఉడకపెట్టినటువంటి క్వినోవా రైస్ వేసి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  7. మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి .
  8. తర్వాత స్టవ్ ఆపేసి ఏదైనా చట్నీతో క్వినోవా రైస్ ని సర్వ్ చేసుకోవాలి..

Side Effects Of Quinoa

క్వినోవాని ఎనిమిది గంటలసేపు తప్పకుండా నానబెట్టిన తర్వాతనే వంటలలో వాడుకోవాలి. లేకపోతే నానబెట్టని క్వినోవా తినడం వలన పైతిక్ ఆసిడ్ పెరిగి మనకి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Frequently Asked Questions

1. క్వినోవా అంటే ఏమిటి?

క్వినోవా ఒక విత్తనం. దీనిలో ఏ ధాన్యాలలో లేనటువంటి ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. క్వినోవా లో red, white, black, mixed రకాలు ఉన్నాయి.

2. క్వినోవా పిల్లలకి ఎలా ఇవ్వాలి?

దీనిని పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా తినవచ్చు కాకపోతే ఎవరు తిన్నా కూడా దీనిని కచ్చితంగా ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి నానబెట్టి తినడం వల్ల ఎలాంటి సమస్యలు చిన్నపిల్లలకు రావు.

3. Quinoa ఒక Millet or not?

కాదు. క్వినోవా అనేది మిల్లెట్ కాదు. అసలు ఇది ధాన్యమే కాదు. ఇది ఒక విత్తనం. ఇది Goosefoot ఫ్యామిలీకి చెందినటువంటి ఒక విత్తనం. చూడడానికి ఎరుపు, ముదురు గోధుమ రంగు, తెలుపు, నలుపు రకరకాల రంగులలో ఉంటాయి. దీనిని రైస్ లాగా వండుకోవచ్చు,

4. క్వినోవా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వినోవా వలన మన శరీరంలో బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ప్రోటీన్ లోపం తగ్గించడం, మంచి బలాన్ని ఇవ్వడం, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడం, కొలెస్ట్రాల్ ని తగ్గించడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

5. క్వినోవా ని తెలుగు లో కొర్రలు అని అంటారా?

Quinoa ని తెలుగు లో క్వినోవా అనే అంటారు. దానికి ఒక ప్రేత్యకమైన పేరు లేదు. Foxtail millet ని తెలుగు లో కొర్రలు అని అంటారు.

Conclusion

మన ఆహారంలో క్వినోవాను (Meaning of Quinoa in Telugu) చేర్చుకోవడం వల్ల, మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, పీచు పదార్థాలు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా, ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే, క్వినోవాలో ఉన్న ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక గొప్ప ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు.

Scroll to Top