Quinoa Rice Benefits: బరువు తగ్గడానికి?

Quinoa Rice Benefits: క్వినోవా రైస్ బరువు తగ్గడానికి ఎంత ప్రయోజనకరమో తెలుసుకోండి. క్వినోవా అర్థం, పోషక విలువలు, బరువు తగ్గించే రిసిపీ, ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం ఈ వ్యాసంలో.

Table of Contents

Quinoa Name Meaning in Telugu

ఈ మధ్య అందరూ ఎక్కడ చూసినా కూడా క్వినోవా, క్వినోవారైస్ అని అంటున్నారు. దీనికి కారణం క్వినోవా యొక్క ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇక క్వినోవా అనేది ఒక ఎక్కువ కంప్లీట్ ప్రోటీన్ ఉండే ఆహారంగా చెప్తుంటారు. దీనిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. ఇది మన భారత దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో పండించే పంట కాదు. ఇది దక్షిణా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో బాగా పండుతుంది. మన దేశం కంటే ఇతర దేశాలలో దీని వాడకం చాలా ఎక్కువ. దీని పోషక విలువలు తెలుసుకొని ఇప్పుడిప్పుడే దీనిని మన ఆహారంలో చేర్చుకుంటున్నాము.

క్వినోవా అనే పదానికి అర్థం తెలుగులో “ఆహార ముత్యాలు“. కానీ క్వినోవాని తెలుగులో ఒక ప్రత్యేకమైన పేరుతో మాత్రం పిలవరు. దానిని క్వినోవా అనే అంటారు. ఇది నిజానికి ఒక “ప్స్యూడో grain, అంటే దీని అర్థం ఇది అసలు ధాన్యం కాకపోయినప్పటికీ మనం ధాన్యం లాగానే వండుకొని తింటాము. దీనిని ఇప్పుడిప్పుడే మన ఇండియాలో మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు.

Quinoa for Weight Loss: ఇలా బరువు తగ్గవచ్చు

Quinoa rice benefits for weight loss

1. తక్కువ క్యాలరీలు – అధిక పోషక విలువలు

మనం సాధారణంగా బరువు ఎందుకు బరువు పెరుగుతామంటే అదనపు క్యాలరీలు తీసుకోవడం వలన దాన్ని వాడుకో పోవడం వల్ల కొవ్వుగా మారి బరువు పెరుగుతుంటాము ఈక్వినోవాలో చాలా తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువగా ప్రోటీన్ మరియు ఎక్కువగా ఫైబర్ ఉంటాయి. దాని వలన బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఆహారం ఇది చాలా తక్కువ మొత్తంలో తిన్నా కూడా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా మన ఆకలిని అదుపులో ఉంచుతుంది.

2. హై ప్రోటీన్ – మాస్ లాస్, మస్సెల్ గెయిన్

ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా క్వినోవా లో శరీరానికి అవసరమైనటువంటి తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ శరీరంలోని కొవ్వు కణాలను కరిగేలా చేసి కండరాల పటుత్వాన్ని పెంచి మంచి కండర పుష్టిని పెంచుతుంది.

3. అధిక ఫైబర్ – మెరుగైన జీర్ణవ్యవస్థ

వీటిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థం వలన మన జీవ వ్యవస్థ లోని మన జీర్ణ వ్యవస్థను దాని పనితీరును పెంచుతుంది. దానివలన మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. ఇంకా కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి

4. గ్లైసెమిక్ ఇండెక్స్ – బ్లడ్ షుగర్ నియంత్రణ

మన రక్తంలో చక్కెర స్థాయి అనేది నియంత్రణ ఉండడం చాలా అవసరం. మనం తినే ఆహారం మన రక్తంలోనే చక్కర స్థాయిని నిర్ధారిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువ ఉన్న ఆహారాలు తినడం వలన మన చక్కెరయి ఒక్కసారిగా పెరగదు. క్వినోవాలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అందువల్ల దీనిని తీసుకోవడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. దీని కారణంగా అనవసరంగా ఆకలి వేయడం తగ్గుతుంది.

ఈ పైన చెప్పిన కారణాల వలన బరువు తగ్గడం అనేది ఒకటే కాదు ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది. బరువు తగ్గడంతో పాటు కండరాల దృఢత్వం డయాబెటిస్ కంట్రోల్ ఘట్ హెల్త్ ఇవన్నీ కూడా బరువు తగ్గడంలో భాగమవుతాయి

Quinoa Weight Loss Recipe

క్వినోవా వెజిటబుల్ పులావ్

Quinoa rice benefits: Recipe

Ingredients

  • 1 కప్పు క్వినోవా
  • 2 కప్పుల నీరు
  • 1 టీస్పూన్ ఆముదం లేదా ఒలివ్ ఆయిల్
  • ½ కప్పు తరిగిన క్యారెట్
  • ½ కప్పు బీన్స్
  • ½ కప్పు క్యాప్సికమ్
  • ½ టీస్పూన్ జీలకర్ర
  • ½ టీస్పూన్ మిరియాల పొడి
  • ఉప్పు రుచికి తగినంత
  • కొత్తిమీర, పుదీనా ఆకులు

How to Cook?

  1. క్వినోవాను నీటితో బాగా కడిగి, రెండు కప్పుల నీటితో కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
  2. ఒక పెద్ద పాన్‌లో ఆయిల్ వేసి, జీలకర్ర వేయించాలి.
  3. తరిగిన కూరగాయలు వేసి, మృదువుగా అయ్యే వరకు వేయించాలి.
  4. ఉడికించిన క్వినోవాను, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు వేయించాలి.
  5. చివరగా కొత్తిమీర, పుదీనా చల్లుకుని వేడివేడి క్వినోవా పులావ్ సర్వ్ చేయండి.

Quinoa uses

1. గుండె ఆరోగ్యానికి మేలు

మనకి గుండె ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ఈమధ్య చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు వస్తున్నాయి పుట్టిన పిల్లలకు గుండెల్లో రంధ్రాలు ఏర్పడడం చిన్నపిల్లలకు గుండెపోటు రావడం గ్యాస్టిక్ సంవత్సరం వల్ల గుండె సడన్గా ఆగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవేగాక రక్తనాళాల్లో పేర్కొన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు అనేది చాలా ఎక్కువ అయిపోయింది మనం తినే ఆహారం వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగి గుండె సమస్యలు వస్తున్నాయి.

క్వినోవాలో ఉండే ఫైబర్, మాగ్నీషియం, పొటాషియం మన గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముందుగా ఇది రక్తనాళాల్లో పేర్కొన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగేలాగా చేసి దాన్ని బయటికి పంపిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు అడ్డంకులు ఉంటే తొలగిపోయి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.

2. ఎముకల ఆరోగ్యానికి ఉత్తమమైనది

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం. ఈ క్యాల్షియం ఎముకలని చిన్నచిన్న గాయాలకు విరిగిపోకుండా బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ క్వినోవా లో ఉండే క్యాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది.

3. శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది

క్వినోవాలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

మన శరీరంలోని అన్ని వ్యాధులకి కారణం శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు పదార్థాలు వీటిని టాక్సిన్స్ అంటారు. వీటిని బయటకి పంపించడం వలన మనలోని నూటికి 90% వ్యాధులు తగ్గిపోతాయి. మనం తినే ఆహారంలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ ఈ టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి. క్వినోవాలో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మనం శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాన్ని బయటికి పంపిస్తుంది. మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

క్వినోవా ను రోజువారీ ఆహారంలో ఎలా చేరుస్తారు?

  • క్వినోవా రైస్‌గా వండుకుని తినచ్చు.
  • క్వినోవా ఉప్మా, దోశ, ఇడ్లీ, ఖిచిడీ చేసుకోవచ్చు.
  • సలాడ్‌లలో, సూప్‌లలో, స్మూతీల్లో కలుపుకుని తినవచ్చు.

క్వినోవాఅన్ని ధాన్యాలు లాగానే వండుకోవచ్చు. వీటిలో చాలా రకాల క్వినోవా ఉంటాయి. ఒక్కొక్క రకమైన క్వినోవా ఒక్కొక్క రకమైన రంగును, రుచిని, ప్రయోజనాలను కలిగి ఉంటాయి. క్వినోవాని పిండిలాగా చేసి రొట్టెలుగా చేసుకుని వాడుకోవచ్చు. క్వినోవా ఫ్లెక్స్ లాగా కూడా చేసుకోవచ్చు.

ముగింపు

క్వినోవా రైస్ బరువు తగ్గాలనుకునేవారికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం. ఇది ప్రోటీన్, ఫైబర్, పోషకాలతో నిండిన ఈ ధాన్యం, బరువు తగ్గించడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్వినోవా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అందుకోవచ్చు.

FAQs

1. రోజుకి ఎంత క్వినోవా తినాలి?

రోజుకి సుమారు ½ కప్పు ఉడికించిన క్వినోవా తినడం ఆరోగ్యానికి మంచిది.

2. క్వినోవా రైస్ అన్నాన్ని భర్తీ చేయగలదా?

అవును, క్వినోవా సాధారణ బియ్యం కంటే ఎక్కువ పోషక విలువలతో ఉండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.

3. క్వినోవా తినడం వల్ల ఏదైనా దుష్ప్రభావాలున్నాయా?

కొంతమందికి గ్యాస్ లేదా కడుపునొప్పి కలిగించే అవకాశం ఉంది. ఎక్కువగా తినకుండా పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

4. క్వినోవా బరువు తగ్గించడంలో ఎంత సమయం పడుతుంది?

కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి క్వినోవా ఒక మంచి ఆహారం. క్వినోవాని ఆహారంలో చేర్చుకొని ప్రతినిత్యం వ్యాయామం చేయడం వలన బరువు కచ్చితంగా తగ్గుతారు.

5. క్వినోవా పిల్లలకు మంచిదా?

అవును తినవా పెరిగే పిల్లలకు చాలా మంచిది ఎందుకంటే దీనిలో ఉండే ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ పిల్లల ఆరోగ్యానికి ఎదిగే క్రమంలో ఒక మంచి ఆహారం అవుతుంది.

Scroll to Top