Quinoa Vs Millets: ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?

Quinoa Vs Millets:

ఈ మధ్యకాలంలో మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఆరోగ్య గురించి శ్రద్ధ పెరుగుతూ వస్తుంది. ఆహారం మాత్రమే కాదు ఆహారంలో ఉండే పోషకాల గురించి కూడా అందరూ బాగా అవగాహన పెంచుకుంటున్నారు. దీనికి కారణం సమాచారం మాధ్యమాలు పెరగడమే. ఎలాంటి సమాచారం కావాలన్న ఒక్క సెకండ్ లో మన కళ్ళ ముందు ఉంటుంది.

మన ఆహారంలో మరియు ఆరోగ్యాన్ని పెంచడంలో ధాన్యాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇలాంటి ధాన్యాలలో క్వినోవా మరియు మిల్లెట్స్ వీటి గురించి మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్వినోవా ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య అందరూ గుర్తిస్తున్నారు. అలాగే మిల్లెట్స్ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందరికీ అవగాహన లోకి వస్తున్నాయి. కానీ ఈ రెండిటి మధ్యలో కూడా ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఏవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ ఆర్టికల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం.

క్వినోవా Vs మిల్లెట్స్-Quinoa vs millets: what is the difference between them?
Quinoa vs millets :

పోషకాల సూపర్ హీరో- క్వినోవా

క్వినోవా అనేది అందరూ అనుకున్నట్లు ధాన్యం కాదు, ఇది క్వినోవా అనే మొక్క యొక్క విత్తనాలు.ఈ విత్తనాలనే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్ని ధాన్యాలు లాగానే ఈ క్వినోవా విత్తనాలని మనం ఇంట్లో వాడుతూ ఉంటాము. ఈ మొక్క యొక్క మూలాలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. ఈ క్వినోవాలో మంచి ప్రోటీన్స్, ఫైబర్స్ అనేక రకాలైనటువంటి మైక్రో మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. మన శరీరానికి అవసరమైనటువంటి తొమ్మిది రకాలైనటువంటి అమినో ఆమ్లాలు ఉన్నాయి. అందుకే దీనిని ఒక పూర్తి ప్రోటీన్ ఆహారంగా పరిగణిస్తారు. ఇంకా ఇది గ్లూటెన్-ఫ్రీ కావడం వలన సెలియాక్ వ్యాధి బాధపడేవారు మరియు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది.

ప్రకృతిచ్చిన పోషకధాన్యాలు-మిల్లెట్స్

మిల్లెట్స్ అనేవి క్వినోవా లాగా విత్తనాలు కావు. ఇవి మొక్క నుండి వచ్చే ధాన్యాలు. ఇవి మన భారత దేశంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా తక్కువ నీటితో పండుతాయి. ఇవి చూడడానికి చాలా చిన్న చిన్న ధాన్యాలు. ఈ చిన్న గింజలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మెల్లెట్స్ లో ఉండే ఫైబర్ మన శరీరంలోని అనేక రకాల వ్యాధులను తగ్గిస్తాయి. మనకి చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి. చాలామందికి ఇన్ని రకాల మిల్లెట్స్ పేర్లు కూడా తెలీదు. ఒక 10 మిల్లెట్స్ మాత్రం అవగాహనలో ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి

మిల్లెట్స్ కూడా గ్లూటెన్-ఫ్రీ మరియు ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ మరియు విటమిన్స్ తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి భారతీయ ఆహారంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.

Key Differences:క్వినోవా Vs మిల్లెట్స్

1. పోషక విలువల విశేషాలు:Nutrients

  • క్వినోవా: ముఖ్యంగా చెప్పాలంటే వినోదం అనేది మంచి ప్రోటీన్ ఆహారంగా చెప్పబడుతుంది. దీనిలో ఇంత ముందు చెప్పుకున్నట్లుగా మొత్తం తొమ్మిది రకాలైనటువంటి అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల శాకాహార ఆహారం తినేవారు ఈ క్వినోవా తినడం వలన మంచి ప్రోటీన్ అందుతుంది. దీనిలో ఇంకా మెగ్నీషియం, జింక్, ఐరన్ మరియు పీచు పదార్థాలు కూడా బాగా ఉంటాయి.
  • మిల్లెట్స్: మిల్లెట్స్ అనేవి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైనటువంటి ధాన్యాలు. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీని వీటిలో మంచి పోషక విలువలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి పీచు పదార్థం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, ఫోలేట్, ఫాస్ఫరస్ అండ్ ఆంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది మంచి పీచు పదార్థం ఉన్న ధాన్యాలుగా చెప్పబడతాయి. వీటిలో క్వినోవా లాగా అన్ని రకాలైనటువంటి అమైనోఆమ్లాలు ఉండవు.

2. రుచి –ఉపయోగాలు & వంటకాలు!

  • క్వినోవా: ఈ క్వినోవా ఒక సాధారణమైనటువంటి నట్స్ రుచిని కలిగి ఉంటుంది. వీటిని మనం ఎలా అయినా వాడుకోవచ్చు ముఖ్యంగా వాడుతారు.
  • మిల్లెట్స్: ఈ మిల్లెట్స్ వాటిలో ఉండే రకాన్ని బట్టి రకరకాల రుచులను కలిగి ఉంటాయి. కొన్ని తీయగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా ఇలా చాలా రకాలుగా ఉంటాయి. వీటితో మనం సాధారణంగా చేసేటువంటి ఇడ్లీలను దోసెలను రొట్టెలుగా మరియు కిచిడీ లాగా అన్నం లాగా వండుకోవచ్చు.

3. ప్రకృతి-సాగు & పర్యావరణ ప్రభావం!

  • క్వినోవా: ఈ క్వినోవాని ముఖ్యంగా దక్షిణ అమెరికాలో పండిస్తున్నారు. ఇది పర్యావరణానికి అంత స్నేహ పూర్వకంగా ఉండకపోవచ్చు. వీటిని మనం చాలా దూర ప్రాంతం నుండి ఎగుమతి చేసుకుంటున్నాము. దీనికి ఉన్న డిమాండ్ వలన చెట్లను నరికి దీనిని పండిస్తున్నారు.
  • మిల్లెట్స్: ఈ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) అనేవి మన భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. వీటిని పండించడానికి చాలా తక్కువ నీరు, చాలా తక్కువ మందులు, ఫర్టిలైజర్స్ అవసరమవుతాయి. ఇవి పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటి వలన ఎలాంటి ప్రమాదం లేదు.

4. మార్కెట్ లో ధర

  • క్వినోవా: దూరప్రాంత నుంచి ఎగుమతి చేసుకోవడం వలన ధర చాలా ఎక్కువగా ఉంటుంది క్వినోవా యొక్క ధర చాలా ఎక్కువగా ఉంటుంది
  • మిల్లెట్స్: ఈ మిల్లెట్స్ మనం స్థానికంగా మన పరిసర ప్రాంతాల్లో పండిస్తారు కాబట్టి ఇవి చాలా తక్కువ ఖర్చుతో మనకి లభిస్తాయి ఫినోవాతో పోలిస్తే మిల్లెట్స్ అనేవి చాలా తక్కువ ధర.

5. Health Benefits: ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

క్వినోవా-vs-మిల్లెట్స్-Health benefits

క్వినోవా

  • క్వినోవా లో ఉండే మాంసకృతుల వలన మన కండరాల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • ఇంకా మన జీర్ణవ్యవస్థలోని సమస్యలను మొత్తంగా తొలగిస్తుంది.
  • ఇంకా మన ఎముకలు బలంగా ఉండాలంటే మాత్రం కచ్చితంగా ఫీల్ అవ్వ తినాల్సిందే .
  • శరీరంలో కావాల్సినటువంటి శక్తిని అందిస్తుంది .
  • మన శరీరంలో రక్తంలోని చక్కెరను సరిగ్గా సమన్వయం చేస్తుంది.

మిల్లెట్స్

  • ఈ చిరుధాన్యాలు బరువును నియంత్రించడానికి మంచి ఆహార ధాన్యాలు. వీటిలో ఉండే పీచు పదార్థం బరువుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • ఇంకా మన గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • మన శరీరంలో టైప్ టు డయాబెటిస్ ను చాలా బాగా నివారిస్తుంది.
  • మానసికఒత్తిడులును తగ్గిస్తుంది.
  • శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
  • రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ మిల్లెట్స్ తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు.

ఆరోగ్యానికి సరైన ఎంపిక ఏది?

చెప్పాలంటే క్వినోవా మరియు మిల్లెట్స్ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆహారపు అలవాట్లు, ధర మరియు పర్యావరణ ప్రభావం ఇంకా మనకు ఉండే ఆరోగ్య సమస్యలు, వీటిని బట్టి మనకి, మన ఆరోగ్యానికి, మన రుచికి ఏది మంచిదో మనం నిర్ణయించుకోవాలి. మధ్యతరగతి వారికి ఎక్కువగా ఖర్చు చేయకుండా మంచి ఆహారం తినాలంటే మిల్లెట్స్ ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ప్రోటీన్ ఫుడ్స్ తినాలి అనుకునేవారు ఖర్చు ఎంతైనా పర్వాలేదు అనుకునేవారు క్వినోవా వారంలో ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వలన కండరాల అభివృద్ధి మరియు ఎముకల అభివృద్ధి జరుగుతుంది.

Conclusion

క్వినోవా మరియు మిల్లెట్స్ రెండు కూడా వాటి వాటి పోషకాలను బట్టి రెండు చాలా మంచి ఆహార పదార్థాలు. మిల్లెట్స్ ని మనం ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మనకి చౌకగా దొరుకుతుంది, వీటిని కొనే స్తోమత అందరికీ ఉంటుంది. క్వినోవా విషయానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వీటిని ఉపయోగించడం మంచిది. ఖర్చు గురించి భయపడిన వారు మరియు కండరాల సమస్యలు ఉన్నవారు దీనిని ఎంచుకోవడం మంచిది. వీటిని ఎలా ఉండాలో ఎలా ఆహారంలో చేర్చుకోవాలో తెలుసుకున్న తర్వాత వీటిని తినడం ఇంకా ముఖ్యం. మనం ప్రతిరోజు వరిఅన్నం కి బదులు క్వినోవా (Quinoa Vs rice) తినడం చాలా మంచిది.

FAQ

1. What is quinoa called in Telugu?

క్వినోవా ని తెలుగులో కూడా క్వినోవా అని పిలుస్తారు.క్వినోవా అనేది తెలుగు రాష్ట్రాలలో స్థానికంగా పండించే పంట కాదు. ఇది దక్షిణ అమెరికాలో పండుతుంది. అందువల్ల అక్కడి నుండి మన భారతదేశానికి దిగుబడి అవుతుంది. ఇక్కడ పండలేదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక పేరు ఏమి లేదు.

2. What is the meaning of quinoa in Telugu?

క్వినోవా కి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇది మన స్థానిక పంట కాదు. క్వినోవాకి అర్థం ఏమిటంటే ఇది ఒక మంచి పోషక విలువలు ఉన్నటువంటి ధాన్యం. కానీ ఇది ధాన్యం కాదు ఇది ఒక విత్తనం. దాన్యం లాగా ఆహారంలో వాడుతారు. క్వినోవా లో చాలా రకాలు (Types of Quinoa)ఉన్నాయి.

3. Which millet is quinoa?

క్వినోవా అనేది మిల్లెట్ కాదు. ఎప్పుడూ ఇది మిల్లెట్ అనుకుని చాలా మంది పొరబడుతుంటారు. ఎందుకంటే గ్లూటన్ ఫ్రీ మరియు మంచి పోషక విలువలు ఉన్నా ఆహార పదార్థాలు. క్వినోవా, ఇది ఒక రకమైనటువంటి విత్తనం, మిల్లెట్స్ లాగా దాన్యం కాదు.

4. Can I eat quinoa daily?

అవును క్వినోవాని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవచ్చు. కానీ పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. దీనిలో పీచు ఎక్కువగా ఉండటం వలన ఏమైనా అరగకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

5. క్వినోవా ఏ పండు?

క్వినోవా అనేది పండు కాదు, ఇది ఒక మొక్క యొక్క విత్తనం. దీనిని అన్ని ధాన్యాలు లాగానే ఆహారంలో చేర్చుకుంటారు. దీనిని మంచి ప్రోటీన్ ఆహారంగా చెప్పుకోవచ్చు.

Scroll to Top