Samalu Health Benefits for Weight Loss

Samalu Health Benefits For Weight loss:

సామల వలన మన ఆరోగ్యానికి అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ ఆర్టికల్ లో సామలు వాటి ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

What is samalu / Little Millet?

సామలు ( Little Millet ) చాలా చిన్న చిన్న గింజలు గా ఉండే సిరి ధాన్యం. ఇవి చూడడానికి బంగారపు పసుపు రంగులో ఉంటాయి.

సామలు అన్ని సిరి ధాన్యాలల్లో కెల్లా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. చూడటానికి పొట్టు తీసిన సామలు తెల్లగా ఉంటాయి మరియు పొట్టు తీయని సామలు శరీరానికి మంచివి.

సామలు ఆఫ్రికాలో ఒక గడ్డి లాగా మొత్తం పొలాల్లో పెరిగే పంట.

Samalu Health Benefits For Weight Loss

What is Samalu In English?

సామలు మిల్లెట్” ని ఇంగ్లీష్‌లో “Little Millet” అని అంటారు.

లిటిల్ మిల్లెట్ (Little Millet) కు సంబంధించిన పేర్లు:

భాషపేరు
తెలుగుసామలు
EnglishLittle Millet
హిందీकुटकी (Kutki)

What are the Benefits of Samalu?

  1. సామలలో విటమిన్ బి, మ్యాంగనీస్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయి.
  2. సామలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను తగ్గిస్తాయి. నరాలు డ్యామేజ్ అవ్వకుండా చూస్తాయి.
  3. వీటిలోని ఫైబర్ మన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి.
  4. అన్ని మిల్లెట్లో లాగే సామలలో కూడా గ్లైజామిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల సామలు సామలను చక్కర వ్యాధి ఉన్నవాళ్లు అనుమానం లేకుండా తీసుకోవచ్చు.
  5. సామలను కొద్ది మోతాదులో తీసుకున్న కూడా మన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దానివల్ల ఆకలి కూడా తగ్గుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఉపయోగం.
  6. ఇది తేలికగా జీర్ణం అవుతుంది మరియు మీ హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
  7. ఈ మిల్లెట్ మంచి న్యూట్రిషనల్ వాల్యూ కలిగి ఉంటుంది మరియు ఎక్కువ క్యాలరీలు లేవు.
  8. మీరు రోజువారీ ఆహారంలో ఈ మిల్లెట్ చేర్చితే అది కొవ్వు తగ్గించడంలో సహాయం చేయవచ్చు.

How many calories are in a Samalu / Little Millet ?

సామల లో ఉండే క్యాలరీస్ వాటిని వండే విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక కప్ (సుమారుగా 200 గ్రామ్స్) సామలలో 70 నుండి 100 క్యాలరీస్ ఉంటాయి. ఉడికించిన సామల(100 gm) లో సుమారుగా 200 క్యాలరీలు ఉంటాయి.

ఇప్పుడు సామల లో 100 గ్రాముల సాములలో ఎన్ని పోషకవిలువలు ఉన్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

పోషక పదార్థంపరిమాణం (100 గ్రా)వివరణ
క్యాలరీలు200సామలులో సగటున 200 క్యాలరీ ఉంటాయి.
ప్రోటీన్6.2 గ్రాములుదీనిలో మంచి bad కొవ్వు ఉండదు.
ఫైబర్6.2 గ్రాములుఅధిక ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు.
కార్బోహైడ్రేట్స్45 గ్రాములుఎక్కువ శక్తిని అందిస్తుంది.
విటమిన్ బి10.2 మిల్లిగ్రాములునరాలు, మెదడు సక్రమంగా పని చేయడంలో సహాయపడుతుంది.
విటమిన్ బి20.1 మిల్లిగ్రాములుశక్తి మరియు విటమిన్ కోసం అవసరం.
మాంగనీస్1.3 మిల్లిగ్రాములుఎముకల(Bones) కోసం మరియు మెటబాలిజం కోసం అవసరం.
పొటాషియం280 మిల్లిగ్రాములురక్తపోటు నియంత్రణ కోసం అవసరం.
ఆహార ఖనిజాలు4-5%నూనెలు మరియు ఖనిజాల జీర్ణశక్తిని అందిస్తుంది.
Little millets Nutrition

Little Millets Benefits For Diabetes Patients?

  1. సామలలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది.
  2. వీటిలో ఉన్న ఫైబర్ గ్లూకోస్ తక్కువగా విడుదల అవడానికి సహాయపడుతుంది.
  3. ఫైబర్ మరియు ఇతర పోషకాలు శరీరానికి బలం అందించి ఆకలిని కంట్రోల్ చేస్తాయి.
  4. సామలలో ఉండే పోషకాలు ఇన్సులిన్ పనితీరు మెరుగుపరుస్తాయి.
  5. వీటివల్ల తగ్గిన గ్లూకోస్ మాత్రమే రక్తంలో విడుదల అవుతుంది. షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
  6. సామల వల్ల తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్, మరియు ఎక్కువ బలం శరీరానికి అందుతుంది.
  7. వీటిలో పొటాషియం, కాల్షియం బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తాయి.
  8. నిత్యం సామలను ఆహారంలో చేర్చడం ద్వారా డయాబెటిస్ ను తగ్గించవచ్చు లేదా కంట్రోల్ చేయవచ్చు.

Is little millet good for weight loss?

  1. Little మిల్లెట్ తక్కువ కాలరీలు కలిగి ఉంటుంది, కాబట్టి ఇది కొవ్వు తగ్గించడానికి అనువుగా ఉంటుంది.
  2. దీనిలో అధికమైన ఫైబర్ ఉంటుంది, ఇది మోస్తరు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
  3. దీనిలో సమృద్ధి అయిన పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

Weight Loss recipe

వెయిట్‌లాస్‌-సామల ఉప్మా

కావాల్సిన పదార్థాలు:

  • సామలు – 1 కప్పు
  • నీరు – 2 కప్పులు
  • ఉల్లిపాయ – 1, సన్నగా తరుగు
  • పచ్చిమిర్చి – 2-3, సన్నగా తరిగినవి
  • అల్లం – 1 టీస్పూన్, తురుము
  • కరివేపాకు – 1 కొమ్మ
  • వేరుశెనగ – 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర – 1/2 టీస్పూన్
  • మెంతులు – 1/4 టీస్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • కొత్తిమీర – సన్నగా తరుగు (గార్నిష్ కోసం)
Samalu Health Benefits For Weight loss- సామల ఉప్మా

తయారీ విధానం:

  • మొదటగా సామలను బాగా కడగాలి.
  • పది నిమిషాల పాటు నానబెట్టాలి.
  • ఒక పాన్ తీసుకొని పోపు గింజలు వేసి వేయించాలి.
  • తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి.
  • వాటిలో కొన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి.
  • మరిగిన నీటిలో కొంచెం ఉప్పు వేయాలి.
  • తర్వాత నానబెట్టిన సామలను వేసి బాగా కలపాలి.
  • సామలు ఉడికి నీరు మొత్తం ఆవిరయ్యేదాకా ఉడకనివ్వాలి.
  • వేడి వేడి సామలను చట్నీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Samalu Side Effects: దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?

  • సామలు మన ఆహారంలో కొత్తగా వాడేటప్పుడు వాటిని కొంచెం కొంచెంగా వాడటం అవసరం. ఎందుకంటే వాటి వల్ల ఏమైనా మన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది.
  • జీర్ణ సమస్యలు: సామలను ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన వాటిని తగ్గిన మోతాదులో తినడం అవసరం.
  • గ్లూటన్ సెన్సిటివిటీ: కొంతమందికి గ్లూటెన్స్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని తిన్నప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా లేదా చూసుకోవడం మంచిదే. అలాంటివారు దీన్ని తినకపోవడం బెటర్.
  • ఎవరైనా ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా నొప్పులు లేదా కొంచెం అసౌకర్యంగా ఉండవచ్చు.
  • హార్మోనల్ అసమానత: ఎక్కువ మోతాదులో సెలీనియం లాంటి ఖనిజాలు ఉన్నప్పుడు హార్మోన్ బాలన్స్ ని దెబ్బ తీయవచ్చు.
  • డయాబెటిస్ ఇంకా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ ని సంప్రదించిన తర్వాత సామలు ఆహారంలో చేర్చడం మంచిది.
  • ప్రాసెస్ చేసిన ఆరపదార్థాలను సామలను మిక్స్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది.
  • సామలు తో ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేసినప్పుడు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.

Frequently Asked Questions

1. సామలు (Little Millet) అంటే ఏమిటి?

లిటిల్ మిల్లెట్స్ ని తెలుగులో సామలు అంటారు. ఇవి సిరి ధాన్యానికి చెందిన ఒక రకమైన గడ్డి లాంటి పంట. వీటిని మన ఆహారంలో వరి బియ్యం లాగా చేర్చుకోవచ్చు.

2. సామలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?

సామలు డయాబెటిస్ ని తగ్గించడానికి మలబద్ధకాన్ని పోగొట్టడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బరువు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడతాయి.

3. సామలను ఎలా ఉండాలి?

మొదటగా సామలను నానబెట్టి తర్వాత ఉప్మా లేదా అన్నం వండుకోవచ్చు. వీటితో దోషాలు కూడా చేసుకోవచ్చు.

4. సామలు ( Little Millet) ఎవరైనా తినవచ్చా?

సామలు మితంగా తిన్నంతవరకు ఎవరైనా వాడవచ్చు.

5. సామల ను ఉపయోగించి ఎలాంటి వంటలు చేయవచ్చు?

సామలతో ఉప్మా, దోసే, సలాడ్స్ లాంటి వంటలు చేయవచ్చు.

6. సామలలు ఎలాంటి పోషక పదార్థాలు ఉన్నాయి?

సామలల ముఖ్యంగా ఫైబర్స్, క్యాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

7. సామలతో డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చా?

అవును. ఇవి రక్తంలోని షుగర్ ని కంట్రోల్ చేసే డయాబెటిస్ ని తగ్గిస్తాయి.

8. సామలను మన డైట్ ప్లాన్లు ఎలా వాడవచ్చు?

సామలను మొదట కొంచెం కొంచెంగా మన డైట్ లో చేర్చుకోవాలి. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని వాడకపోవడం మంచిది. నానబెట్టి వాడడం వలన తొందరగా కుక్ అవుతుంది. ఇంకా పోషకాలు కూడా పెరుగుతాయి.

9. సామలు ముఖ్యంగా ఏ అవయవాలను శుద్ధి చేస్తాయి?

సామలు యొక్క ముఖ్య లక్షణం మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని శుద్ధి చేసి మనకు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయ పడుతుంది. ఇంకా పురుషులలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండే సమస్యను తగ్గిస్తాయి పిల్లలు జన్యుపరమైన లోపాలు లేకుండా పుట్టడానికి సహకరిస్తుంది.

Conclusion

బరువు తగ్గడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. మన సిరి ధాన్యాలలో పీచు పదార్థం చాలా ఎక్కువ అందువల్ల ఏ ఏ సిరి ధాన్యాలు తగిన మోతాదులో తీసుకున్న కూడా బరువు అనేది నియంత్రణలో ఉంటుంది. కానీ బరువు తగ్గాలంటే మనం వండే విధానం చాలా ముఖ్యం. సామలు తింటే బరువు తగ్గుతారు అని చెప్పి ఎలా పడితే అలా ఉండి నూనె, మసాలాలు ఉప్పు అన్ని ఎక్కువగా వేసి పండుకొని తింటే బరువు తగ్గకపోగా ఇతర వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. అందువల్ల ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిందే ఏ ఆహార పదార్థాలు మనం తింటున్నామన్నది ఎంత ముఖ్యమో ఎలా వండుతున్నామన్నది కూడా అంతే ముఖ్యం.

సామలను (Little Millet) వారానికి రెండు లేదా మూడుసార్లు తక్కువ నూనెతో,ఉప్పు తో వండుకొని మితంగా తిన్నట్లయితే మన ఆకలి తగ్గుతుంది. బరువు కూడా నియంత్రణ ఉంటుంది.

Read Also

Other types of millets are

Scroll to Top