Seeds Health Benefits| Types | Uses

Seeds Health Benefits:

మనం ప్రతిరోజు తినే తెల్లని అన్నం వలన మనకు కావలసినటువంటి పోషకాలు అందకపోగా వాటి వలన ఇంకా కొత్త రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి.

మన ఆరోగ్యాన్ని మెరుపు పరుచుకోవాలి అంటే కచ్చితంగా పీచు పదార్థం, ఇతరత్రా పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు మన డైట్ లో భాగం చేయడం వలన మన లోపల నుంచి ఆరోగ్యం బాగుపడడమే కాకుండా బాహ్య సౌందర్యం కూడా పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు గింజలు.

ఈ గింజలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను పాలిష్ పట్టకుండా అంటే పొట్టు తీయకుండా తినడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. ఈ ఆర్టికల్లో మనం చాలా ముఖ్యమైనటువంటి గింజలు వాటి యొక్క లాభాలను గురించి మనం తెలుసుకుందాం.

What is Seed? గింజ అంటే ఏమిటి?

Seeds health benefits in telugu: what is seed?

గింజ (Seed) అనేది మొక్క అభివృద్ధి చెందడానికి అవసరమైన జీవశక్తిని కలిగి ఉన్న చిన్న భాగం. దీనిలో పిండం, తోట్రం, మరియు ఎంబ్రియో అనే మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. గింజలను విత్తనాలుగా ఉపయోగించి కొత్త మొక్కలను పెంచుతారు. పచ్చిమొక్కలలోని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.

కొన్ని రకాల విత్తనాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిని ప్రతి రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును. చాలా చిన్న విత్తనాలు అయినప్పటికీని మన శరీరానికి అనేక లాభాలను అందిస్తాయి.

గింజల్లో ఆరోగ్యకరమైన పదార్థాలు దాగి ఉంటాయి. మీకు ఆరోగ్యం కావాలంటే విత్తనాలను తీసుకోవడం మరిచిపోవద్దు. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. పోషకాల విషయానికి వస్తే విత్తనాలు చాలా గొప్పవి. వీటిలో ప్రొటీన్లు, కాల్షియంఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి.

How to eat Seeds In Telugu

ఈ గింజలను లేదా విత్తనాలను అలాగే నేరుగా తినవచ్చు లేకపోతే వాటిని వేయించుకొని పొడిగా చేసి బాటిల్ పోసి నిల్వ ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు వంటలలో వాడుకోవచ్చు వీటిని ఈరోజు కూర చేసినప్పుడు ధన్యవాదాలు వేసినట్లుగా ధాన్య పౌడర్ ధనియా పౌడర్ వేసినట్లుగా ఈ పొడిని కూడా చల్లుకుంటే వంటకి రుచి కూడా వస్తుంది ఇలా కాకుండా విత్తనాలను రాత్రి నానబెట్టుకొని బాగా నానిన తర్వాత ఉదయం లేవగానే తీసుకోవడం వలన చాలా మంచి పోషకాలు మన శరీరానికి వెంట పడతాయి ఇలా నానబెట్టడం వలన అవి మెత్తబడి మనకి ఏమైనా అర్బుదొలలు సమస్యలు ఉన్నట్లయితే అవి కూడా రాకుండా ఉంటాయి.

Types of Seeds In Telugu

Telugu NameEnglish Name
అవిసె గింజలుFlax Seeds
చియా గింజలుChia Seeds
నిగెల్లాNigella Seeds
జనపనారHemp Seeds
నువ్వులు (Nuvvulu)Sesame Seeds
అలివ్Alive Seeds
పొద్దుతిరుగుడుSunflower Seeds
గుమ్మడికాయPumpkin Seeds
మెంతిFenugreek Seeds
Seeds Health Benefits In Telugu: Types of Seeds| List of seeds

Flax Seeds Uses:అవిసె గింజల ఆరోగ్య లాభాలు

ఈ మధ్యకాలంలో తరచూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య అనివార్యంగా పెరిగింది. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం మన గుండెలో ఉండే రక్తనాళాలలో అడ్డంకులు ఉండడం వలన రక్త ప్రసరణ జరగక హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ గుండె సమస్యలు హార్ట్ ఎటాక్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఆహారంలో ఈ అవిస గింజలను చేర్చుకోవాలి.

Flax seed health benefits

అవిసె గింజల్లో ఒమేగా త్రీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన గుండెలో రక్తనాళాలు గట్టిపడకుండా సాగే గుణాన్ని పెంచడానికి తోడ్పడుతాయి. అందువల్ల రక్తప్రసరణ జరిగేటప్పుడు రక్తనాళాలు సాగి ఒకవేళ ఏవైనా అడ్డంకులు ఉన్నా కూడా వాటిని అడ్డుకుంటూ రక్తనాళాల్లోని కొవ్వును కరిగిస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువలన ఈ గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి అద్భుతమైన ఆహారంగా అందరు పరిగణిస్తారు.

అవిస గింజలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇవి వీటిని పొడిగా చేసి వెయిట్ లో అయినా కలుపుకుని జ్యూస్లలో కలుపుకొని తాగవచ్చు, లేకపోతే వీటిని వేయించి పొడిగా చేసి మనం ప్రతి నిత్యం కూరలలో ఉపయోగించవచ్చు లేదా వీటితో కారంపొడి కూడా చేసుకోవచ్చు.

నువ్వుల గింజల ఆరోగ్య లాభాలు

Seeds health benefits: sesame seeds

నువ్వుల గింజలు కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం మరియు ఇనుము లాంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో లెగ్నాస్ అనబడేపధార్థం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నువ్వులు బ్లడ్ ప్రెజర్‌(BP)ను నియంత్రించడమే కాకుండా, ఆస్తమా మరియు మైగ్రేన్ వంటి సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయంలో నువ్వులను మితంగా తినడం మంచిది.

నువ్వులు ఏమైనా ఎముకల సమస్యలు ఉన్నవారు, సయాటికా పైన ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే ఐరన్ ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.

Chia Seeds:చియా గింజల ఆరోగ్య లాభాలు

చాలామంది చియా గింజల గురించి వినే ఉంటారు. ఎందుకంటే ఈ చియా విత్తనాలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యతను పొందాయి. చాలా వరకు వీటిని వాటర్ లో వేసి కాసేపు ఉంటే ఇవి మంచిగా ఉబ్బిపోయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి వేసిన వాటర్ ని తాగడం వలన బరువు తగ్గుతారు.

Chia seeds health benefits

చియా విత్తనాలు వీటిని ఎక్కువగా ఎండాకాలం తీసుకుంటారు. ఎందుకంటే ఎండాకాలం మన శరీర వేడిని తగ్గించడానికి వీటిని తీసుకుంటారు. ఇవి మన ఒంటికి చలువ చేస్తాయని చేస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో(Summer) ఇవి చాలా ఉపయోగకరమవుతాయి. ఈ విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. ఇంకా మన మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

Fenugreek Seeds:మెంతి గింజల ఆరోగ్య లాభాలు

Fenugreek seeds health benefits

మెంతులు చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటి వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అవి కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఒక చిటికెడు మెంతిపొడి వాటర్ లో కలుపుకుని తాగడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి నానబెట్టిన మెంతులు తీసుకోవడం ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. ఈ చిటికెడు మెంతులను మనము ఇడ్లీ చేసుకునేటప్పుడు కానీ దోస్త్ చేసుకునేటప్పుడు గాను బియ్యంతో కలిపి నానబెట్టి పిన్ని చేసుకున్నట్లయితే మనకి మంచిది.

Pumpkin Seeds:గుమ్మడికాయ గింజల ఆరోగ్య లాభాలు

Seeds health benefits in telugu: pumpkin seeds

గుమ్మడి గింజల్లో ఫైబర్‌ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ బరువు(Weight)తో బాధపడుతున్న వారు గుమ్మడి గింజలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తినడం వలన పొట్ట నిండిన ఫీలింగ్‌ వస్తుంది. దీంతో ఫుడ్‌ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఎక్కువగా తినకుండా ఉండడం వలన బరువు కంట్రోల్‌లోనే ఉంటుంది. అలాగే, గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే జింక్‌ మన ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది.

Alive:అలివ్‌ గింజల ఆరోగ్య లాభాలు

Seeds health benefits in telugu: Alive seeds

అలివ్‌ విత్తనాల్లో ఫైబర్‌(Fiber) మరియు ప్రొటీన్‌(Protien) పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి లేకుండా కంట్రోల్‌లో ఉంచుతాయి. దీంతో అపరిమితంగా తినడాన్ని ఆపుతాయి. మీ డైట్‌లో అలివ్‌ గింజలను చేర్చుకుంటే బరువు కంట్రోల్‌లో ఉండడం చాలా సులభం అవుతుంది. అలివ్‌ విత్తనాల్లో ఉండే ప్రొటీన్‌ కండరాలను మెరుగుపరుస్తూ హెల్తీగా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

Sunflower Seeds:పొద్దుతిరుగుడు గింజల ఆరోగ్య లాభాలు

మనం సన్ ఫ్లవర్ ఆయిల్ ని వినే ఉంటాము. సన్ ఫ్లవర్ మొక్కల గింజల నుండి నూనె తీయడం మాత్రమే కాదు సన్ ఫ్లవర్ గింజలు కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Seeds health benefits in telugu: sunflower seeds

పొద్దుతిరుగుడు గింజలు గుండెకు చాలా మంచి చేసే విత్తనాలు. వీటిలో ఉన్న విటమిన్ C గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇంకా విటమిన్ E ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఈ విత్తనాలు ధమనుల్లో కొవ్వును పేరుకోకుండా అడ్డుకునే శక్తిని కలిగి ఉంటాయి. రోజూ ఒక పావు కప్పు గింజలు తింటే మాత్రం మనకు అవసరమైన విటమిన్ E 90 శాతం లభిస్తుంది.

ఈ విత్తనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. ఫైబర్ ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా సహకరిస్తాయి.

Nigella Seeds:కలోంజీ గింజల ఆరోగ్య లాభాలు

Seeds health benefits: Negella seeds benefits

కలోంజీ Seeds Seeds వంటలకు మంచి సువాసనను మరియు రుచిని ఇస్తుంది. వీటిని నల్ల గింజలు అని కూడా అంటారు. ఈ నల్లటి విత్తనాల్లో విటమిన్లు, ఫైబర్‌, అమైనో యాసిడ్, ప్రొటీన్ మరియు ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తాయి. కలోంజీ తీసుకుంటే, చర్మ సమస్యలు తగ్గిస్తాయి. ఇంకా థైరాయిడ్‌ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

Hemp Seeds:జనపనార గింజల ఆరోగ్య లాభాలు

Seeds health benefits: Hemp seed benefits

జనపనార గింజలు ఎక్కువ పోషకాలు మరియు ప్రొటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన విత్తనాలలో ఒక ముఖ్యమైన రకం. ఆరోగ్య నిపుణులు వీటిని చక్కటి పౌష్టిక ఆహారంగా సూచిస్తారు. ఈ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో పాటు, మినిరల్, ప్రోటీన్(Proteins), విటమిన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే 21 అమైనో ఆమ్లాలు ఆరోగ్యాన్ని కాపాడటానికి పని చేస్తాయి. జనపనార విత్తనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. ఇవి హార్మోన్ రెగ్యులేటర్ గా కూడా పనిచేస్తాయి. ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మొత్తంగా, ఈ విత్తనాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. వాటిని ప్రతిరోజూ మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది.

Read Also

Scroll to Top