ajwain seeds

Top 5 Benefits Of ajwain seeds | Carom | Meaning in telugu
Ajwain Seeds(carom)Meaning In Telugu

Ajwain seeds( (carom seeds) ని తెలుగులో ‘వాము గింజలు‘ లేదా ‘ఓము  గింజలు‘ లేదా ‘ఓమ  గింజలు‘ అంటారు. ఇవి జీలకర్ర గింజల ను పోలి ఉంటాయి. ఇవి చాలా చిన్నగా మరియు ఒక ఘాడమైనటువంటి వాసనని కలిగి ఉంటాయి.

వాముని దోరగా వేయించి పొడిగా చేసుకుని నిత్యం రాత్రి పడుకునే ముందు గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగవచ్చు. దీనివలన మలబద్ధక సమస్యలు తగ్గుతాయి.

Table of Contents

Ajwain Seeds(carom)Meaning In Telugu

How Ajwain Seeds Look

Nutrients of Ajwain seeds| Carom seeds

Common names of Vamu or Ajwain(carom) seeds

5 Ajwain(carom) Seeds Benefits

1. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి

2. దగ్గు మరియు జలుబు తగ్గిస్తుంది

3. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

4. వాంతులు రాకుండా

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

వాము గింజల దుష్ప్రభావాలు

వాము గింజలు ఎలా సేకరించాలి?

వాము గింజలు ఎలా తినాలి?

వాము గింజల ఔషధ గుణాలు

Ajwain and ginger Tea Recipe For Health

FAQ

1. వాము గింజలు అంటే ఏమిటి?

2. వామ గింజలను ఎలా తీసుకుంటే మంచిది?

3. వాము గింజల వలన ఎలాంటి లాభాలు ఉంటాయి?

4. వాము గింజల వలన ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?

5. వాము గింజలలో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

6. వాము గింజలు ఎక్కడినుండి లభిస్తాయి?

7. వాము బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?

8. వాము రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతుంది?

9. వాము గింజలు ఎలాంటి వంటల్లో ఉపయోగిస్తారు?

10. వాము గింజలను పిల్లలకు వామ గింజలకు తినిపించవచ్చా?

Conclusion

వాము(Ajwain Seeds) ని దోరగా వేయించి ఒక గ్లాసులో చుట్టి ముక్కు దగ్గర పెట్టి పీల్చినట్లయితే ఆ గాఢమైన కారం వాసన వలన మన జలుబు సమస్య తగ్గుతుంది.

వాము ముఖ్యంగా మన ఇళ్లలో వంటలలో మరియు చిన్న చిన్న ఔషధ చిట్కాలుగా ఉపయోగిస్తారు. ఈ వాము గింజలు ముఖ్యంగా కడుపు నొప్పికి, మలబద్ధక సమస్యకి, విరోచనాలకి, అజీర్తి సమస్యలకే, దగ్గు, జలుబు ఇలా ఇంటి చిట్కాలుగా ఉపయోగపడతాయి.

ఇంకా చెప్పాలంటే నిత్యం మనం ఈ వాముని తినడం వలన మూత్రశంలో ఏర్పడ్డ రాళ్లు కరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఆస్తమా సమస్యలు ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు, ఎసిడిటీకి సమస్యలు ఉన్న, మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా వాడవచ్చు.

మనకి కీళ్లలో నొప్పులు, వాపులు ఉన్నప్పుడు అధికంగా బరువు ఉన్నప్పుడు, శరీరంలో షుగర్ ఉన్నవాళ్లు తప్పకుండా వీటి వల్ల ప్రయోజనాలు పొందుతారు.

వాము(Ajwain Seeds) గింజలు ముఖ్యంగా మన శరీరంలో వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణ క్రియను పెంచుతాయి.

పూర్వకాలం వాము మొక్కలు అనేవి సర్వసాధారణంగా ఇంటి పెరటిలో ఉండేవి. వాము మొక్కల నుండి వచ్చిన గింజలను ఆకులను కూడా నిత్యం వాడుతూ ఉండేవారు.

How Ajwain Seeds Look

అజ్వైన్ (వాము or carom) గింజలు చాలా చిన్నవిగా బూడిద రంగులో లేదా గోధుమ రంగులో ఉంటాయి వీటిని తిన్నప్పుడు కారంగా ఉంటాయి. వీటిని ముఖ్యంగా వీటి వాసన చాలా ఘాడంగా ఉంటుంది

లక్షణం

వివరణ

తెలుగు పేరు

వాము గింజలు

ఇంగ్లీష్ పేరు

Ajwain Seeds

రంగు

తేలికపాటి గోధుమ లేదా బూడిద-గోధుమ

పరిమాణం

చిన్నగా, పొడవుగా

రుచి

కారం మరియు తీపి మిశ్రమం

వాసన

బలంగా, తైమ్ మొక్క వాసనలాగా

Nutrients of Ajwain seeds| Carom seeds

పోషకాలు

పరిమాణం (100 గ్రా వాము గింజల్లో)

కేలొరీస్

305 kcal

ప్రోటీన్

16.5 g

కొవ్వు

15 g

కార్బోహైడ్రేట్స్

44 g

ఫైబర్

24 g

క్యాల్షియం

1,450 mg

ఫాస్ఫరస్

150 mg

ఫెర్రస్ (లొహం)

16 mg

పొటాషియం

1,200 mg

విటమిన్ C

50 mg

విటమిన్ A

29 IU

వాము(ajwain(carom) seeds) గింజల్లో ప్రధానంగా ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది.

Common names of Vamu or Ajwain(carom) seeds

భాష

సాధారణ పేరు

Telugu

వాము గింజలు

English

Ajwain Seeds / Carom Seeds

Hindi

अजवाइन (Ajwain)

Tamil

ஓமம் (Omam)

Kannada

ಓಮ ಕಾಳು (Oma Kaalu)

Malayalam

അയമോദകം (Ayamodakam)

Marathi

ओवा (Ova)

Gujarati

અજમો (Ajmo)

Bengali

জোয়ান (Jowan)

Urdu

اجوائن (Ajwain)

5 Ajwain(carom) Seeds Benefits

1. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి

వాము గింజలు ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థను చాలా మెరుగుపరుస్తాయి. మనకి చాతిలో గ్యాస్ పట్టేసినట్లు అనిపించినప్పుడు, మంటగా అనిపించినప్పుడు ఈ వాముని తినడం వలన మన గ్యాస్ సమస్య అనేది తగ్గిపోతుంది.ఆహారం తినడానికి కొంచెం సేపటి ముందు ఈ వాముని తినడం వలన మనకి కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు అజీర్తి సమస్య తగ్గిపోతుంది.

2. దగ్గు మరియు జలుబు తగ్గిస్తుంది

దగ్గు మరియు జలుబు వచ్చినప్పుడు మనం చాలా వరకు ఆసుపత్రికి వెళ్ళము. ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటాము. వీటిలో  వాము అనేది ఒక మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి గింజ.

వాములో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మనకి దగ్గు మరియు జలుబు సమస్యలు ఉన్నప్పుడు కొంచెం వాము తీసుకొని నమలడం లేదా నోట్లో పెట్టుకోవడం వలన, వాటి రసం అప్పుడప్పుడు మింగడం వలన గొంతులో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

3. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

వాము గింజలలో ఔషధ గుణాలు మనం తగ్గించే పోషకాలు కూడా చాలా ఉంది ఇది మన శరీరం యొక్క మెటమాలిజం ని పెంచుతుంది

వాము గింజల యొక్క నీటిని నిత్యం సేవించడం వలన శరీరంలోని కొవ్వును కరిగించి మెటబాలిజాన్ని పెంచుతుంది. దీన్ని తరచుగా తాగడం వల్ల పొట్ట కొవ్వు కరిగి మనం అనవసరమైన బరువు తగ్గుతాము.

ఉదయం లేవగానే మనం టీ, కాఫీలకు బదులుగా వాము వాటర్ ని తీసుకున్నట్లయితే ఇది మన యొక్క మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించి బరువు తగ్గే లాగా ఉపయోగపడుతుంది.

4. వాంతులు రాకుండా

మనం సరియైన ఆహారం తీసుకోవడం వలన లేదా కలుషిత ఆహారం తీసుకోవడం వలన ఏదైనా వేరే ఇతర ఏవైనా కారణాల వలన మనకి వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు వాడవచ్చు.

వాములో కార్మినేటివ్ మరియు యాంటీఎమెటిక్ గుణాలు అనేటువంటి గుణాలు ఉంటాయి.  మనకి వాంతులు తగ్గడానికి వాంతులు వచ్చినట్లుగా అనిపించడం లాంటి సమస్యలను తగ్గిస్తాయి.

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మనకి మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. వ్యాధులు వచ్చిన తర్వాత దానికి చికిత్స చేయించుకోవడం కన్నా వ్యాధులు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మనం మన శరీరం యొక్క నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాలు తీసుకోవాలి. వాటిలో వాము గింజలు కూడా ఉన్నాయి. వాము గింజలలో అంటే యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం తీసుకోవడం వలన మన శరీరం వ్యాధుల బారిన పడటం తగ్గుతుంది.

వాము గింజల దుష్ప్రభావాలు

మనం ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకున్నప్పుడు వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటుంది.

వాము గింజలను మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి కడుపులో మంట తగ్గకపోగా ఎక్కువ అవకాశం ఉంది. అందువలన తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

గర్భంతో ఉన్న మహిళలు ఈ వామును ఎక్కువగా తీసుకున్నప్పుడు గర్భాశయంలో ఏవైనా సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గర్భాశ్య గోడలు సంకోచానికి గురి కావచ్చు. అందుకే వైద్యుడి సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ వాము గింజలను తీసుకోవడానికి వీల్లేదు.

కొంతమందికి వీటిని తినడం వలన లేదా వీటినీరు తాగడం వలన చర్మం మీద ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది అందువలన కొద్ది కొద్దిగా తీసుకోవడం ఉత్తమం.

వాము అనేది రక్త పోటుని ప్రభావితం చేస్తుంది. ఏది తినడం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అందువలన రక్తపోటుకి మందులు వాడేవారు దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ఎక్కువగా వాడితే నోరు పొడిబారడం, గొంతు ఎండిపోవడం, నాలుక కాలినట్లుగా అవడం జరుగవచ్చు.

వాము గింజలు ఎలా సేకరించాలి?

వాము గింజలు వాము మొక్క(Ajwain plant) యొక్క గింజలు. వాము చెట్టు యొక్క గింజలు మరియు ఆకులు కూడా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాము మొక్కలను మనం మన ఇంటి ఆవరణ లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కకి  చిన్న తెల్లటి లేదా లేత గులాబీ రంగులో పూలు పూస్తాయి.  ఈ  పూలు ఎండిపోయిన తర్వాత చిన్న చిన్న గింజలుగా మారుతాయి.ఆ ఎండిపోయిన గింజలను సేకరించి మనం వాడుకోవచ్చు.

వాము గింజలు ఎలా తినాలి?

ఒక గ్లాసు మంచి నీరు తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ వాము గింజలను వేసి రాత్రంతా నానబెట్టి ఆ నీటిని పరిగడుపున తాగవచ్చు దీనివల్ల మన జీర్ణ క్రియ సమస్యలు తగ్గిపోతాయి.

ఒక గ్లాసు నీటిని గిన్నెలో వేసి బాగా మరిగించి వాటిలో ఒక టీ స్పూన్ వాము గింజలను కొద్దిగా ఆకుపచ్చ రంగు వచ్చేదాకా మరగనివ్వాలి మరిగిన తర్వాత నీటిని వడపోసి చల్లారిన తర్వాత వాటిని తాగాలి.

వాముని దోరగా వేయించి బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక క్లాత్ లో చుట్టి ముక్కు దగ్గర పెట్టుకొని ఆ వాసనను గట్టిగా పీల్చాలి ఆ వాములో ఉన్నటువంటి ఘాడమైన వాసన మన ముక్కులోకి వెళ్లి మనం ఉన్న జలుబు దగ్గు ని తగ్గిస్తాయి.

వాముని నేరుగా మనం నోట్లో వేసుకొని నమిలి తినవచ్చు.

వాము గింజల ఔషధ గుణాలు

ఔషధ గుణం

వివరణ

యాంటీబ్యాక్టీరియల్ & యాంటీఫంగల్

బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారించి శరీరాన్ని రక్షిస్తుంది

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

శరీరంలోని వాపు, నొప్పిని తగ్గిస్తుంది

యాంటీ ఆక్సిడెంట్

కణాలను రక్షించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

కార్మినేటివ్

గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది

ఎక్స్పెక్టోరెంట్

దగ్గు, జలుబు సమయంలో కఫాన్ని కరిగించి శ్వాసను సులభతరం చేస్తుంది

Ajwain and ginger Tea Recipe For Health

పదార్థాలు:

వాము గింజలు – 1 టీస్పూన్

అల్లం

తేనె – 1 టీ స్పూన్

నిమ్మరసం – ½ టీ స్పూన్

నీరు – 1 గ్లాసు

తయారీ విధానం:

ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా మరిగించుకోవాలి.

నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము గింజలు, అల్లం ముక్క వేసి బాగా మరగనివ్వాలి.

మరిగిన తర్వాత వడపోసి గ్లాస్ తో ఉంచుకోవాలి. ఆ నీటిలో తేనే, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు వాము టీ అనేది తయారయింది.

లాభాలు:

వాము టీ తాగడం వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.

మన జీర్ణక్రియలో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని తగ్గిస్తుంది.

వాంతులు మరియు కడుపు ఉబ్బరంగా ఉండటం లాంటి సమస్యలకు ఉపశమ ఉపశమనం ఇస్తుంది.

మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

దగ్గు, జలుబు ఉన్నప్పుడు తక్షణం ఇది ఉపశమనం కలిగిస్తుంది.

ఈ వాము టీ ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరం యొక్క ఆరోగ్యం తప్పకుండా బాగుపడుతుంది

FAQ

1. వాము గింజలు అంటే ఏమిటి?

వాము గింజలు (Ajwain Seeds) చిన్న బూడిద-గోధుమ రంగు గింజలు, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.

2. వామ గింజలను ఎలా తీసుకుంటే మంచిది?

వాము నీరు, వంటల్లో కలిపి, నేరుగా నమలడం లేదా టీలా తాగవచ్చు.

3. వాము గింజల వలన ఎలాంటి లాభాలు ఉంటాయి?

జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు తగ్గించడం, దగ్గు, జలుబు తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచడం, కడుపు నొప్పి తగ్గించడం.

4. వాము గింజల  వలన ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?

అధిక మోతాదు ఆమ్లత్వం, చర్మం మీద అలెర్జీ, గర్భిణీ స్త్రీలకు జాగ్రత్త, రక్తపోటు మందులు తీసుకునే వారు జాగ్రత్త.

5. వాము గింజలలో ఎలాంటి పోషకాలు ఉంటాయి?

ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, విటమిన్లు (C, A) ముఖ్యంగా ఉంటాయి.

6. వాము గింజలు ఎక్కడినుండి లభిస్తాయి?

వాము మొక్క యొక్క ఎండిన పూల నుండి  వాము గింజలు ఏర్పడతాయి.

7. వాము బరువు తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?

వాము  మన శరీరం యొక్క  మెటబాలిజాన్ని పెంచి, ఆకలిని తగ్గించి శరీరంలో కొవ్వు కరిగేలా చేస్తుంది.

8. వాము రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతుంది?

వాములో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ను బయటికి పంపించి మొత్తంగా శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

9. వాము గింజలు ఎలాంటి వంటల్లో ఉపయోగిస్తారు?

వాము గింజలతో టీ తయారు చేసుకొని తాగవచ్చు. మరియు వీటిని పకోడీలు, బజ్జీలు వేసినప్పుడు తక్కువ మోతాదులో వాము వేస్తే చాలా బాగుంటాయి.

10. వాము గింజలను పిల్లలకు వామ గింజలకు తినిపించవచ్చా?

పిల్లలకు ఇచ్చేముందు వాము గింజలను చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు.

Conclusion

వాము( ajwain seeds) గింజలు అనేవి పూర్వకాలంలో మన ఆహారంలో భాగమై ఉన్నాయి. మన అమ్మమ్మలు, తాతయ్యలు నిత్యం వీటిని తింటూ ఉండేవారు. అందువలన వారి ఆరోగ్యం చాలా బాగుండేది. వాము చెట్టు యొక్క గింజలే కాదు, ఆకులు కూడా ఆరోగ్యంలో బాగు చేయడంలో సహాయపడతాయి వాము వాము గింజలు మరియు ఆకులు నేరుగా నమిలి తినవచ్చు.