Types of Quinoa: క్వినోవా లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

Types of Quinoa: ఈ ఆర్టికల్లో ఎన్ని రకాల క్వినోవా ఉన్నాయి, వాటి వల్ల ప్రయోజనాలు, వాటిని ఎలా వండుకోవాలి ఇలా అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం.

క్వినోవా (Quinoa) అనేటువంటిది ఒక ప్రాచీన మైనటువంటి ధాన్యం. ఇది కొత్తగా ఇప్పుడు పండిస్తున్నటువంటి దాన్యమేమీ కాదు. మన భారత దేశంలో క్వినోవా గురించి తెలియదనే చెప్పాలి. ఇది ఈ మధ్య వినిపిస్తుంది కానీ పాశ్చాత్య దేశాలలో దీనిని కొన్ని వేల సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. దీని పోషకాలను పొందుతున్నారు. దీనిలో ఉన్న మంచి పోషక విలువల వలన ఇది మన భారతదేశానికి కూడా వ్యాప్తి చెందింది. ఇది చాలా ముఖ్యంగా ప్రోటీన్ ధాన్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

క్వినోవా (Quinoa) ఒక మొక్క యొక్క విత్తనం. ఇది ధాన్యం రకానికి చెందిన కాదు. కానీ చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఆహారంగా చెప్తారు. శాకాహారులు ప్రోటీన్ కోసం వినోవాని తినడం వల్ల వాళ్లకు కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. మనకి క్వినోవాలో చాలా రకాల ఫినావాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

Types of Quinoa

1. తెలుపు క్వినోవా (White Quinoa)

Types of quinoa: white quinoa

తెలుపు క్వినోవా అనేది సాధారణంగా అందుబాటులో ఉండే రకం. ఈ తెలుపుకు వినోవా మృదువుగా తినడానికి వీలుగా ఉంటుంది. దీనితో అన్ని రకాలైనటువంటి వంటలను చేసుకోవచ్చు.ఈ క్వినోవా సలాడ్లు, సూపులు, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్ వంటి వాటికి సరిగ్గా సరిపోతుంది. దీనిని సులభంగా ఇతర పదార్థాలతో కలిపి వాడవచ్చు, ఇది మీ భోజనాన్ని మరింత పోషకాహారంగా మరియు రుచికరంగా మారుస్తుంది. ఇది చాలా తక్కువ ఖర్చుకి దొరుకుతుంది మధ్యతరగతి వారు ఎక్కువగా పెట్టలేని వాళ్ళు ఈ క్వినవాని తినడం అన్ని విధాలా అనుకూలం. ఇది సరిగా ఉడకడానికి 15 నిమిషాల సమయం పడుతుంది.

ప్రయోజనాలు:

  1. ఫైబర్ సమృద్ధి: తెలుపు క్వినోవా ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
  2. తక్కువ క్యాలరీలు: ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉండటం వల్ల, బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇది కడుపును నింపుతుంది, కానీ అదనపు క్యాలరీలను అందించదు.
  3. ప్రోటీన్ సమృద్ధి: తెలుపు క్వినోవా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇది మాంసకృత్తులు లేని వారికి ప్రోటీన్ యొక్క మంచి మూలంగా పనిచేస్తుంది. ప్రోటీన్ మాంసపుష్టిని పెంచడంలో మరియు శరీర కణాలను మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది.
  4. పోషకాల సమృద్ధి: ఇది మెగ్నీషియం, ఇనుము, జింక్ మరియు బి-విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరం యొక్క వివిధ విధులను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  5. గ్లూటెన్-రహితం: గ్లూటెన్ సున్నితత్వం ఉన్న వారికి కూడా తెలుపు క్వినోవా సురక్షితమైన ఎంపిక. ఇది సెలియాక్ వ్యాధి ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

తెలుపు క్వినోవాను మీ రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, మీ భోజనాన్ని రుచికరంగా మరియు పోషకాహారంతో నింపుతుంది.

2. ఎరుపు క్వినోవా (Red Quinoa)

Types of quinoa: red quinoa

ఈ రకమైన క్వినోవా ఎక్కడైనా దొరుకుతుంది. కాకపోతే తెలుపు క్వినోవా తో పోలిస్తే ఇది కొంచెం ఖర్చు ఎక్కువ. రుచి కూడా దానితో పోలిస్తే ఇది తక్కువ మంది తినగలుగుతారు. దీనిని ముఖ్యంగా సలాడ్స్, గ్రేన్ బౌల్స్ మరియు వేడి వంటకాలలో ఉపయోగించబడుతుంది.

ప్రయోజనాలు:

  1. అధిక ఫైబర్: ఎరుపు క్వినోవా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది పొట్టను నింపిన భావనను కలిగిస్తుంది మరియు జీర్ణవ్యవస్థకు మంచిది.
  2. హృదయ ఆరోగ్యం: ఇది కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు రక్తపోటు మరియు హృదయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
  3. యాంటీ ఆక్సిడెంట్లు: ఎరుపు క్వినోవా యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

3. నల్ల క్వినోవా (Black Quinoa)

Types of quinoa: black quinoa

నల్ల క్వినోవా అరుదుగా లభించే రకం. ఈ రకమైన క్వినోవా మనకి ఎక్కువగా కనిపించదు. దీన్ని రుచి కూడా ఎరుపు క్వినోవా లాగే ఉంటుంది. దీనితో మనం ఒకటి లేదా రెండు వంటలు మాత్రమే చేసుకోగలము. ఖర్చు కూడా ఎరుపు క్వినోవా లాగా ఎక్కువే.

ప్రయోజనాలు:

  1. యాంటీ ఆక్సిడెంట్లు: నల్ల క్వినోవా అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
  2. మెదడు ఆరోగ్యం: ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మానసిక స్పష్టతను పెంచుతుంది.
  3. రక్తశర్కరా నియంత్రణ: నల్ల క్వినోవా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4. Rainbow క్వినోవా

Types of quinoa: rainbow quinoa

రెయిన్బో క్వినోవా అనేది మూడు రకాల ధాన్యాల విత్తనాల మిశ్రమం. ఇది తెలుగు, ఎరుపు మరియు నలుపు విత్తనాల కలయికగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండి వంటలకి మంచి లుక్ ని ఇస్తుంది.

5. క్వినోవా FLOUR

Types of quinoa: quinoa flour

క్వినోవా తీసుకొని దానిని గ్రైండర్ లో వేసి పిండిలా చేసుకుని వాడుతారు దీనితో మనం ఏ వంటలైనా చేసుకోవచ్చు దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

6. క్వినోవా FLAKES

Types of quinoa: quinoa flakes

తెలుపు క్వినోవా నీ ఫ్లెక్స్ లాగా చేస్తారు. ఇవి చూడడానికి ఓట్స్ లాగానే ఉంటాయి. దీనిని మనము చాలా సులభంగా వంటలో ఉపయోగించుకోవచ్చు. ఇవి తొందరగా ఉడుకుతాయి.

7. QINOA CRISPIES

Types of quinoa: quinoa crispies

క్వినోవా గింజలను కాల్చి, క్రిస్పీగా తయారు చేసినవి కినువా క్రిస్పీస్. ఇవి తేలికగా జీర్ణమయ్యేలా ఉండి, ఆరోగ్యకరమైన అల్పాహారం లేదా స్నాక్‌గా ఉపయోగిస్తారు.

క్వినోవా వాడకంలో ముఖ్యమైన సూచనలు:

  1. కడగడం: క్వినోవాను వండే ముందు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇది దాని ప్రకృతి రుచిని తొలగిస్తుంది.
  2. ఉడికించడం: తక్కువ వేడిలో మృదువుగా ఉడికించాలి. ఇది దాని పోషక విలువలను కాపాడుతుంది.
  3. వంటకాలు: క్వినోవాను సూప్స్, సలాడ్స్, ఖిచ్డీలు మరియు బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో ఉపయోగించవచ్చు.

ఏ రకమైన క్వినోవా మంచిది?

మీ అవసరాలను బట్టి ఏ రకమైన క్వినోవా మంచిదో మారుతుంది:

  • బరువు తగ్గించుకోవాలంటే: తెలుపు క్వినోవా (తక్కువ క్యాలరీలు మరియు మృదువైన నిర్మాణం).
  • హృదయ ఆరోగ్యానికి: ఎరుపు క్వినోవా (అధిక ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు).
  • మెదడు ఆరోగ్యం మరియు శక్తి కోసం: నల్ల క్వినోవా (అధిక యాంటీ ఆక్సిడెంట్లు మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్).

క్వినోవాను వండే విధానం:

  1. తెలుపు క్వినోవా: 1 కప్పు క్వినోవాకు 2 కప్పుల నీరు కలిపి 15 నిమిషాలు ఉడికించాలి.
  2. ఎరుపు క్వినోవా: 1 కప్పు క్వినోవాకు 2 కప్పుల నీరు కలిపి 20 నిమిషాలు ఉడికించాలి.
  3. నల్ల క్వినోవా: 1 కప్పు క్వినోవాకు 2.5 కప్పుల నీరు కలిపి 25-30 నిమిషాలు ఉడికించాలి.
Types of quinoa: Upma recipe

క్వినోవాను మరింత రుచికరంగా చేయడానికి, ఉడికించే సమయంలో ఉప్పు, మిరియాలు, తాజా పుదీనా లేదా నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది మీ వంటకానికి అదనపు సువాసన మరియు రుచిని ఇస్తుంది!

క్వినోవాను మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు రుచికరమైన వంటకాలను అనుభవించవచ్చు!

Conclusion

క్వినోవా ఆరోగ్యానికి మంచిది మరియు మీ ఆహారంలో చేర్చడానికి అత్యంత మంచి ఎంపిక. తెలుపు, ఎరుపు మరియు నల్ల క్వినోవా అన్నీ ప్రోటీన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. మీ అవసరాలను బట్టి మీరు ఏ రకమైన క్వినోవాను ఎంచుకోవచ్చు. మీ ఆహారంలో క్వినోవాను చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి! వరి బియ్యానికి బదులు క్వినోవా(Quinoa Vs rice) ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది

Scroll to Top