Pine Nuts in Telugu | chilgoza seeds| Benefits

What are Pine nuts In Telugu?

పైన్ నట్స్ (Pine Nuts) తెలుగులో ‘చిల్గోజ గింజలు(chilgoza seeds in Telugu)’ అని పిలుస్తూ ఉంటారు. ఇవి తినే రకానికి చెందినటువంటి గింజలు(Edible seeds).

ఈ చిల్గోజ గింజలు జీడిపప్పు(Cashew), బాదంపప్పు(Almonds) కన్నా కూడా చాలా తియ్యగా, రుచిగా ఉంటాయి. వీటి రుచి ఎక్కువే, ఉపయోగాలు ఎక్కువే, ఖర్చు కూడా ఎక్కువే.

ఇవి పైన్స్ చెట్ల వచ్చేటువంటి గింజలు. పైన్స్ చెట్లకి పండ్లు వస్తాయి. ఆ పండ్లుల్లో ఉన్న గింజలను ఎండబెట్టి వాటిపైన పొట్టు రాలిపోయిన తర్వాత లోపల ఉన్న గింజలని పైన్ నట్స్ అంటాము. చెట్లు ముఖ్యంగా చాలా చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి.

Table of Contents

What are Pine nuts In Telugu: పైన్ నట్స్ (Pine Nuts) తెలుగులో 'చిల్గోజ గింజలు' అని పిలుస్తూ ఉంటారు

10 Benefits Of Pine Nuts in Telugu

1. చిల్గోజ గింజలు (Pine Nuts in Telugu ) హృదయ ఆరోగ్యానికి

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామందికి బయట ఆహారం తీసుకోవడం అలవాటైపోయింది. దాని వలన రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి .ముఖ్యంగా గుండె సంబంధమైన సమస్యలు పెరుగుతున్నాయి. చిన్నమయసులోనే గుండెపోటు వచ్చి చాలామంది చనిపోతున్నారు.

పైన్ నట్స్‌లో ఉన్న మంచి కొవ్వులు (Healthy Fats) ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ని బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి. అందువలన రక్తనాళాలలో చెడు కొవ్వు తగ్గి మంచి కొవ్వు పెరగడం వలన రక్తప్రసరణ బాగా జరిగి గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా చూస్తాయి. నిరంతరం ఈ చిల్బోజ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వలన గుండె ఆరోగ్యం పెరిగి గుండెపోటు మరియు రక్త పోటు వచ్చే సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతాయి.

Pine Nuts 10 Benefits in Telugu

2. చిల్గోజ గింజలు శక్తిని పెంచుతాయి

మనకి పని ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి వలన మన శరీరం బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. దీని వలన తొందరగా అలసిపోతూ ఉంటాము. అందువలన తొందరగా చక్కనిచ్చే మనం తీసుకోవడం మంచిది.

పైన్ నట్స్‌(చిల్గోజ గింజలు) లో తొందరగా శక్తినిచ్చే ప్రోటీన్, మాగ్నీషియం, ఐరన్ ఉన్నాయి అందువలన వీటిని తినడం వలన శరీరంలో శక్తి అనేది తొందరగా పెరుగుతుంది వీటిని తిన్న వెంటనే మనకేదో శక్తి వచ్చినట్లుగా ఉత్సాహంగా పని చేస్తారు.

3. Chilgoza seeds చర్మాన్ని కాంతివంతం చేస్తాయి

చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలని ఎఎవరు కోరుకోరు చెప్పండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాలుష్యం, ఎండ వలన చర్మం యొక్క ఆరోగ్యం దెబ్బతింటూ వస్తోంది.

Pine nuts లో విటమిన్ E ఉంటుంది. ఇది మన చర్మాన్ని లోపల నుండి కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది మరియు మృదువుగా ఉండేలాగా చేస్తుంది . ప్రతినిత్యం వీటిని తీసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా మారిపోతుంది.

4. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

వయసు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరులో తేడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వయస్సుతో సంబంధం లేకుండా మతిమరుపు సమస్య ఉంటుంది. కొంతమందిలో ఏకాగ్రత ఉండదు. అలాంటివారు ఈ చిల్కోజా గింజలు తినడం వలన చాలా ఉపయోగం ఉంటుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు సరిగ్గా పని చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మన పైన్ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, ఆలోచనలో స్పష్టతను ఇస్తాయి. మన మెదడులో కణాలకి బలాన్ని ఇచ్చి పునర్జీవం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతాయి మన ఆలోచనలు స్పష్టంగా ఉండేలాగా ఏకాగ్రతను పెంచుతాయి. వీటిని తినడం వలన మనకు ఏమైనా మానసిక ఒత్తిడి సమస్యలు ఉన్నట్లయితే తగ్గిపోయి ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి.

5. బరువు నియంత్రణలో సహాయపడతాయి

బరువు పెరగడం అనేది మనకి చాలా సాధారణమైన విషయం కానీ. ఇది చాలా పెద్ద సమస్య కూడా. బరువు తగ్గాలంటే మన ఆహారం, వ్యాయామం సరి అయిన పద్ధతిలో ఉండాలి.

పైన్ నట్స్‌ తినడం వలన ఉన్న వీటిలో ఉండే “పినోలెనిక్ యాసిడ్” మన ఆకలిని తగ్గించి, తినే పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ఇవి మెటబాలిజం వేగాన్ని పెంచి కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. ఈ గింజలను తినడం వలన బరువు తగ్గడం సులభంగా జరుగుతుంది.

6. ఇమ్యూన్ సిస్టమ్ బలపరుస్తాయి

మన మన చుట్టూ ఉన్న వాతావరణం, ఇన్ఫెక్షన్లు మరియు మనం తినే ఆహారం, కాలుష్యం వీటి వలన మన రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది.

పైన్ నట్స్‌లో ఉన్న జింక్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిను బలపరుస్తాయి. ఇవి మన శరీరాన్ని వైరస్‌లు, బాక్టీరియా నుంచి రక్షిస్తాయి. వీటిని ప్రతి రోజు తప్పకుండా తినడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలా తక్కువగా వస్తాయి.

7. ఎముకల ఆరోగ్యానికి మేలు

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ప్రతి కణం క్షీణిస్తూ వస్తుంది. వాటి బలం తగ్గుతూ వస్తుంది ఎముకలు కూడా అంతే వయసు పైపడే కొద్ది ఎముకల పటుత్వం తగ్గుతూ వస్తుంది. బలహీనంగా మారుతూ ఉంటాయి. కానీ మన ఆహార నియమాలు తక్కువ వయసు ఉన్న వారి కూడా ఎముకలు బలహీనంగా అవుతున్నాయి.

పైన్ నట్స్‌(chilgoza seeds)లో ఉన్నటువంటి మెగ్నీషియం మరియు విటమిన్ K మన ఎముకలు బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. పైన్ నట్స్‌ తినడం వలన ఎక్కువ కాల్షియం గ్రహించడానికి ఉపయోగపడతాయి. అందువలన ఎముకలు చాలా దృఢంగా మారతాయి వీటిని మనం ప్రతిరోజు తింటే మాత్రం ఆస్టియోపొరోసిస్ నుంచి కూడా బయటపడవచ్చు.

8. రక్త చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

మధుమేహం (డయాబెటీస్) సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పైన్ నట్స్‌లో ఉన్న ఫైబర్ మరియు ప్రోటీన్ రక్త చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇవి చక్కెర శోషణ వేగాన్ని తగ్గించి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

9. జుట్టు ఆరోగ్యానికి మంచివి

జుట్టు ఆరోగ్యానికి మనం బయట నుంచి ఉపయోగించి నూనెలు మాత్రమే కారణం కాదు మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఐరన్ లోపం కాల్షియం లోపం వలన మన చుట్టూ అనేది సమస్యల బారిన పడి రాలుతూ వస్తుంది దీనికి తోడు బయట ఉన్న కాలుష్యం కూడా ముఖ్యమైన కారణం.

పైన్ నట్స్‌లో ఉన్న విటమిన్ E మరియు జింక్ జుట్టు కణజాలాన్ని బలంగా మార్చి కుదుళ్ల దగ్గర బలంగా పెరిగేలాగా చేస్తాయి. దీనివలన జుట్టులో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బలంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న జుట్టులో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడతాయి.

10. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి

మనలో ఎవరికైనా కూడా తొందరగా ముసలి వారు కావాలని ఉండదు కదా. మనం తినే ఆహారం, మానసిక ఒత్తిడి, కాలుష్యం వలన మన శరీరంలోని కణాలు తొందరగా దెబ్బతింటాయి, కొత్త కణాలు చాలా నెమ్మదిగా ఏర్పడతాయి. దీనివలన వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.

పైన్ నట్స్‌(chilgoza seeds)లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దృఢంగా చేసి, రోగాల బారిన పడకుండా చేయడం వలన వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది. ఇవి మన చర్మం యొక్క కాంతిని మెరుగుపరుస్తాయి మరియు కళ్ళలో చూపు తగ్గకుండా చేస్తాయి.

పైన్ నట్స్ ఎలా ఉంటాయి?

పైన్ నట్స్(chilgoza seeds) చాలా చిన్నగా సన్నగా పొడవుగా మరియు లేత గోధుమ రంగులో ఉంటాయి.ఇవి చూడటానికి చాలా నాజుకుగా కనిపిస్తాయి. వీటికి తియ్యటి మరియు వెన్నలాంటి రుచి ఉంటుంది. ఇవి వెన్నెలాగా మృదుత్వాన్ని కలిగి ఉంటాయి.

లక్షణంవివరణ
పేరు (Name)పైన్ నట్స్ / చిల్గోజ గింజలు
రంగు (Color)తెలుపు లేదా లేత గోధుమ
రుచి (Taste)తియ్యగా, వెన్నలాంటి రుచి
రూపం (Shape)పొడవుగా, చిన్న గింజలలా
ఉత్పత్తి దేశాలు (Origin)చైనా, అమెరికా, హిమాలయ ప్రాంతం

చిల్గోజ గింజలు_పోషక విలువలు

పోషక పదార్థంపరిమాణం (100 గ్రాములకి)
శక్తి (Energy)673 kcal
ప్రోటీన్ (Protein)13.7 g
కొవ్వు (Total Fat)68.4 g
– సాచ్యురేటెడ్ ఫ్యాట్ (Saturated Fat)4.9 g
– మోనోఅన్సాచ్యురేటెడ్ ఫ్యాట్18.8 g
– పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్34.0 g
కార్బోహైడ్రేట్లు (Carbohydrates)13.1 g
– ఫైబర్ (Dietary Fiber)3.7 g
– షుగర్ (Sugar)3.6 g
మాగ్నీషియం (Magnesium)251 mg
జింక్ (Zinc)6.4 mg
ఐరన్ (Iron)5.5 mg
కాల్షియం (Calcium)16 mg
పొటాషియం (Potassium)597 mg
ఫాస్ఫరస్ (Phosphorus)575 mg
విటమిన్ E9.3 mg

వంటల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు

  • పైన్ నట్స్‌ను సలాడ్లు సలహాలు చేసేటప్పుడు వాటిలో ఉపయోగించవచ్చు.
  • సూప్‌లు చేసేటప్పుడు వాటిలో వేసుకోవచ్చు.
  • స్వీట్ చేసేటప్పుడు వాటిలో గార్నిషింగ్ కోసం వాడవచ్చు
    కొంచెం దోరగా వేయించి తింటే కూడా చాలా బాగుంటాయి.

Side effects

కొంతమందికి పైన్ నట్స్ కొంతమందికి ఎలర్జీలు వచ్చి ఆకాశం ఉంది ఏవైనా అలర్జీలు వస్తే తినడం ఆపేసి డాక్టర్ని సంప్రదించడం మంచిది.

Conclusion

చిల్గోజ గింజలు( Pine Nuts In Telugu) చిన్నగా కనిపించినప్పటికీ ఇవి రుచికి ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజూ ఒక 10 నుంచి 15 గింజలను తినడం వలన కొద్దిగా తింటే మన హృదయం, మెదడు, చర్మం, ఎముకలు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి సహజ శక్తినిచ్చే, చర్మానికి కాంతినిచ్చే అద్భుతమైన గింజలు.

చిల్గోజ గింజలు ధనవంతులు మాత్రమే తినగలిగే గింజలుగా చెప్తూ ఉంటారు అని వీటి యొక్క రుచి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

FAQ

1. చిల్గోజ గింజలు అంటే ఏమిటి?

పైన్ లేదా చిల్కోజా గింజలు పైన్ చెట్ల పండ్ల నుండి వచ్చేటువంటి గింజలు .ఇవి డ్రై నట్స్ కిందికి వస్తాయి. ఇవి చాలా తీయగా మంచి పోషకాలతో నిండి ఉంటాయి.

2. పైన్ నట్లు ఎక్కడ లభిస్తాయి?

పైన్ నట్లు చాలా చల్లని ప్రదేశాల్లో విరివిగా పండుతాయి. ముఖ్యంగా చైనా, రష్యా, అమెరికా దేశాల్లో పైన్ చెట్ల పండ్ల నుండి సేకరిస్తారు.

3. పైన్ గింజలలో ఏమేమి పోషకాలు ఉంటాయి?

ముఖ్యంగా ప్రోటీన్, మాగ్నీషియం, ఐరన్, విటమిన్ E, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.

4. పైన్ గింజలు ఆరోగ్యానికి మంచివేనా?

అవును, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి మరియు శరీరానికి శక్తినిస్తాయి.

5. పైన్ గింజలు బరువు తగ్గించడంలో సహాయపడతాయా?

అవును, ఇవి ఆకలి తగ్గించి కొవ్వు కరుగుదలకు సహాయపడతాయి.

6. పైన్ గింజలు ఎలా తినాలి?

వేయించి స్నాక్‌లా తినవచ్చు లేదా సలాడ్‌లలో, పేస్టోలో, కేక్‌లలో కలపవచ్చు.

7. పైన్ గింజలతో ఏ వంటకాలు చేయవచ్చు?

మనం పైన్ గింజలు నానబెట్టుకొని నేరుగా తినవచ్చు. లేదా వాటిని బిస్కెట్లు చేసేటప్పుడు కేకులు చేసేటప్పుడు వాటిలో వాడితే చాలా బాగుంటుంది.

8. పైన్ గింజలు రోజూ తినవచ్చా?

అవును. పైన్ గింజలు రోజుకు కొద్దిగా మాత్రమే తినాలి. వీటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.

9. చిల్గోజ గింజలు తినడం వలన చర్మానికి ఉపయోగముందా?

అవును, చిల్గోజ గింజలలో ఉన్న విటమిన్ E చర్మాన్ని మెత్తగా, కాంతివంతంగా చేస్తుంది.

10. చిల్గోజ గింజలు దుష్ప్రభావాలు ఉన్నాయా?

అధికంగా తింటే కొందరికి అలెర్జీ లేదా కడుపు నొప్పి రావచ్చు. సరియైన పరిమాణంలో తీసుకోవాలి.

Scroll to Top