Sabja Seeds Benefits, Uses| Basil Seeds

(Basil Seeds)Sabja Seeds Benefits: ముఖ్యంగా సబ్జా గింజలు తీసుకోవడం వలన ఒంట్లో వేడి తగ్గడం, డీహైడ్రేషన్ తగ్గించుకోవడం, జీర్ణ సమస్యలు తగ్గడానికి ఉపయోగిస్తూ ఉంటారు.ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే సబ్జా గింజలను బరువు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

What are Sabja Seeds In Telugu?

Sabja Seeds (Basil Seeds) ని తెలుగులో ‘తులసి గింజలు’ లేదా ‘సబ్జా గింజలు‘ అని పిలుస్తూ ఉంటారు. ఇవి మీకు తెలిసినటువంటి తులసి చెట్టు నుండి వచ్చే గింజలు.

ఈ తరం వారికి ఈ సబ్జా గింజలు తెలియకపోవచ్చు. కానీ ఈ గింజల వలన అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి.ఈ సబ్జా గింజలు తినడానికి ఉపయోగించే గింజలు(Edible seeds). చాలామంది ఈ సబ్జా గింజలు మరియు చియా గింజలు ఒకటే అని అనుకుంటారు కానీ కాదు.

Table of Contents

What are Sabja Seeds In Telugu?

10 Sabja Seeds Benefits in Telugu

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

ప్రతి 100 గ్రాముల సబ్జా గింజలలో దాదాపుగా 37 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది అంటే పీచు పదార్థంం అందువలన ఈ సబ్జా గింజలను తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తగ్గి మలబద్దకం సమస్య తగ్గుతుంది.

2. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తాయి

సబ్జా గింజలను సహజంగా శరీరాన్ని చల్లబరిచే పోషకాలు ఉన్నాయి వీటిని మనం ఎండాకాలం తీసుకున్నట్లయితే మనకి మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

3. బరువు తగ్గడంలో సహాయపడతాయి

సబ్జా గింజలు సహజంగా నీటిలో నానబెట్టినప్పుడు నీటిని గ్రహించి పెద్దగా ఉబ్బుతాయి. అందువలన కొన్ని సబ్జా గింజలను తీసుకున్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అందువలన ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గి మనం తక్కువగా తినేలాగా చేస్తుంది. అందువలన కొవ్వు కలిగి బరువు తగ్గుతాము.

10 Sabja Seeds Benefits in Telugu

4. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

సబ్జా గింజలు గింజలలో ఇంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువలన ఇవి తొందరగా వయసు మీద పడటానికి తగ్గిస్తారు శరీరంలో మలినాలను బయటికి పంపిస్తారు అందువల్ల మన చర్మ ఆరోగ్యం అనేది పెరిగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

5. రక్త చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి

సబ్జా గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఇది అరగడానికి కొంచెం సమయం పడుతుంది. చక్కెరలు తొందరగా విడుదల కాదు, దీని వలన మన రక్తంలోని చక్కర అనేది నియంత్రణలో ఉంటుంది.

6. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి

సబ్జా గింజలలో పుష్కలంగా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

7. ఇమ్యూనిటీని పెంచుతాయి

సబ్జా గింజలు అంటే యాక్సిడెంట్లు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అందువలన ఎక్కువగా వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి.

8. జుట్టు బలంగా పెరగడంలో సహాయపడతాయి

ఇందులో ఉన్న ప్రోటీన్, ఐరన్ జుట్టు మూలాలను బలపరచి, రాలడాన్ని తగ్గిస్తాయి.

9. ఎసిడిటీని తగ్గిస్తుంది

సబ్జా గింజలు తాగడం వలన మన శరీరంలో మన కడుపులో మంట చల్లారుతుంది.

10. చర్మంపై మొటిమలను తగ్గిస్తాయి

చర్మం ఆరోగ్యంగా మనం మంచి ఆహారం తీసుకోవాలి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లి చాలా కాంతివంతంగా మారుతుంది.

Sabja or Basil Seeds Uses

  1. సబ్జా గింజలను మంచినీళ్లలో కలిపి నానబెట్టుకుని తాగవచ్చు.
  2. ఒక గ్లాసు మంచినీళ్లలో నిమ్మరసం, తేనె ఒక స్పూన్ సబ్జా గింజలు కలిపి బాగా నానిన తర్వాత తీసుకోవచ్చు.
  3. వేసవికాలం మనం ఎక్కువగా మామిడిపండు రసాలు తాగుతూ ఉంటాము. వాటిలో ఈ సబ్జా గింజలను కలిపి తాగినట్లయితే చాలా బాగుంటాయి.
  4. భోజనం చేసే ముందు మనం ఈ సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లు కలుపుకొని తాగినట్లయితే భోజనం బాగా అరుగుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
  5. మనం ఐస్ క్రీమ్లు తినేటప్పుడు లేదా ఇంట్లో చేసుకునే స్వీట్స్ లో కూడా వీటిని వేసి ఉపయోగించుకోవచ్చు.

utrients per 100gms of Sabja Seeds

ఇది సబ్జా గింజల (బాసిల్ సీడ్స్) లో ఉన్న ముఖ్యమైన పోషకాలు (100 గ్రాములకు) పట్టిక రూపంలో ఉంది.

పోషక పదార్థంపరిమాణం (100 గ్రాములకు)ప్రయోజనం
క్యాలరీలు480 kcalశక్తిని అందిస్తాయి
కార్బోహైడ్రేట్లు43 గ్రాములుశరీరానికి ఇంధనం ఇస్తాయి
ప్రోటీన్14 గ్రాములుకండరాల పెరుగుదలకు సహాయపడతాయి
కొవ్వు20 గ్రాములుఆరోగ్యకరమైన కొవ్వు అందిస్తుంది
ఫైబర్37 గ్రాములుజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
కాల్షియం400 mgఎముకలను బలపరుస్తుంది
ఐరన్5 mgరక్తహీనతను తగ్గిస్తుంది
మెగ్నీషియం300 mgనరాల పనితీరును మెరుగుపరుస్తుంది
పొటాషియం560 mgరక్తపోటును నియంత్రిస్తుంది
విటమిన్ A310 IUచూపును కాపాడుతుంది
విటమిన్ K350 µgరక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది

ఇవి తక్కువ పరిమాణంలో తిన్నా శరీరానికి చాలా మంచి పోషకాలను అందిస్తాయి.
సబ్జా గింజలు ప్రత్యేకంగా ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే సూపర్ ఫుడ్‌గా గుర్తించబడ్డాయి.

Common Names of Sabja seeds

భాషసాధారణ పేరు (సబ్జా గింజలు)
తెలుగుసబ్జా గింజలు
హిందీసబ్జా దానా / తుక్మరియా
తమిళంతుక్మరియా விதைகள்
కన్నడసబ్జా ಬೀಜಗಳು
మలయాళంసబ్జా വിത്തുകൾ
మరాఠీతుక్మరియా बिया
గుజరాతీતુકમરિયા બીજ
బెంగాళీসবজা বীজ
ఉర్దూتخم ریحان
పంజాబీਤੁਖਮ ਮਲੰਗਾ

సబ్జా గింజల లక్షణాలు

గుణంవివరణ
రుచితేలికపాటి, స్వల్ప తీపి రుచి
వాసనమామూలుగా గమనించరాని సువాసన
రంగునలుపు లేదా గోధుమ రంగు
ఆకారంచిన్న, అండాకార గింజలు

Side Effects of Sabja or Basil Seeds

  1. అధికంగా తింటే జీర్ణ సమస్యలు:
    ఈ సబ్జా గింజలను ఒకటి లేదా రెండు స్పూన్ల కి మంచి తినకూడదు ఎక్కువగా నట్లయితే వీటిలో ఉండే ఫైబర్ వలన కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది కడుపులో గ్యాస్ తయారై కడుపులో నొప్పి రావచ్చు.
  2. గర్భిణీలు జాగ్రత్త:
    ఈ సబ్జా గింజలను తినడం వలన హార్మోన్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీని వలన వీటిని గర్భంతో ఉన్నవారికి వైద్యుల సలహాలు లేకుండా తీసుకోకపోవడం మంచిది.
  3. రక్తం పలుచన చేసే మందులతో జాగ్రత్త:
    ఈ సబ్జా గింజలలో విటమిన్ కే అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది మన రక్తం అనేది గడ్డ కట్టడం ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందువలన రక్తం పల్చగా అవడానికి కొంతమంది మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సబ్జా గింజలు తినకపోవడం మంచిది.
  4. చిన్న పిల్లలకు ఇవ్వకూడదు:
    చిన్నపిల్లలకి సబ్జా గింజలను ఇవ్వకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఇవి గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.

Basil Seeds | Sabja Seeds Benefits For Weight Loss

సబ్జా గింజలతో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ కింది పద్ధతిని పాటించండి.

  1. నీటిలో నానబెట్టడం
    మొదటగా ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకొని వాటిలో ఒక టీ స్పూన్ సబ్జా గింజలను వేసి 30 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత అవి కొంచెం కొంచెం గా నీటిని పీల్చుకొని బాగా ఉబ్బి జల్లి లాగా తయారు అవుతాయి. ఇప్పుడు ఇవి మనం వాడడానికి సిద్ధంగా ఉన్నాయని అనుకోవచ్చు.
  2. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం
    ఉదయం బ్రష్ చేసుకున్నాక నాన పెట్టిన సబ్జా గింజల ఒక గ్లాసు నిధిలో కలిపి పరిగడుపున తాగాలి. ఇలా తాగడం వలన కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువలన బరువు తగ్గే అవకాశం ఉంది.
  3. జ్యూస్ లేదా లెమన్ వాటర్‌లో కలపడం
    లేకపోతే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని వాటికి కొంచెం నిమ్మరసం, తేనే మరియు నానబెట్టిన సబ్జా గింజలను వేసి కలిపి తాగాలి. ఇలా తాగడం వలన బరువు తగ్గడంతో పాటు ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది.
  4. స్మూతీలలో వాడడం
    ఏవైనా పండ్ల రసం తీసుకుని, ఉదాహరణకు మామిడి రసం తీసుకుని దాంట్లో ఈ సబ్జా గింజలను కలిపి తాగడం ఎండకాలం చల్లగా ఉంటుంది.
  5. రోజుకి ఒక్కసారి మాత్రమే తాగడం:
    రోజుకి ఒకసారి రెండుసార్లకు మించి తాగకూడదు ఎక్కువగా తగినట్లయితే ఏమైనా జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఈ సబ్జా గింజలను నానబెట్టిన తర్వాతనే మనం ఆహారంగా తీసుకోవాలి.

FAQ

1. సబ్జా గింజలు అంటే ఏమిటి

సబ్జా గింజలు తులసి మొక్క నుండి వచ్చే గింజలు. ఇవి నలుపు రంగులో చాలా చిన్నగా గుండ్రంగా ఉంటాయి. వీటిని బాసిల్ సీడ్స్ (basil seeds) అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా వేసవికాలంలో వేడిని తగ్గించడానికి ఆహారం చేసుకుంటారు.

2. సబ్జా గింజలు ఎలా కనిపిస్తాయి

ఈ సబ్జా గింజలు చాలా చిన్నగా నలుపు రంగులో లేదా కొంచెం గోధుమ రంగులో గుండెటి ఆకారంలో ఉంటాయి. వీటిని నానబెట్టిన కాసేపటి తరువాత ఇవి జెల్‌లా మారిపోతాయి.

3. సబ్జా గింజలు ఎప్పుడు తినాలి?

మనం సబ్జా గింజలను ఉదయం పరిగడుపున తీసుకున్నట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన మన జీర్ణ క్రియ సవ్యంగా జరిగి ఉన్న సమస్యలు తగ్గిపోతాయి.

4. సబ్జా గింజలు బరువు తగ్గించడంలో సహాయపడతాయా

అవును. ఇవి పొట్ట నిండిన భావన కలిగిస్తాయి కాబట్టి ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుందని చెప్పవచ్చు.

5. సబ్జా గింజలను ఎలా వాడాలి?

1 టీస్పూన్ గింజలను నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టి జెల్‌లా అయిన తర్వాత పాలు, జ్యూస్ లేదా నీటిలో కలిపి తాగాలి.

6. సబ్జా గింజలు మరియు చియా గింజలు ఒకటేనా?

కాదు. సబ్జా గింజలు మరియు చియా గింజలు రెండు చూడడానికి ఒకేలాగా కనిపించిన కూడా రెండు ఒకటి కావు. రెండు కూడా వేరే వేరే మొక్కలనుండి వచ్చే గింజలు. చియా గింజలతో పోలిస్తే సబ్జా గింజలు తొందరగా నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి.

7. సబ్జా గింజలు చర్మానికి ఉపయోగకరమా?

సబ్జా గింజలు చూడ్డానికి చాలా చిన్నగా వీటిలో మంచి ఆంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. వీటిని మనం తీసుకోవడం వలన చర్మం లో శరీరంలో ఉన్న చెడు పదార్థాలు బయటికి పంపించవేయబడతాయి. అందువలన చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.

8. సబ్జా గింజలు వేసవిలో ఎందుకు తింటారు?

ఎండాకాలం మనం ఎక్కువగా వేడి కావడం చూస్తూ ఉంటాం కొంతమందికి ఎండ దెబ్బ తగులుతూ ఉంటుంది అలాంటివారు నిత్యం ఈ సబ్జా గింజలను తీసుకోవడం వలన వడదెబ్బ కొట్టడం తగ్గుతుంది.

9. సబ్జా గింజలు పిల్లలు తినవచ్చా?

సబ్జా గింజలను ఐదు ఏళ్ళు లోపు ఉన్న పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిని తిన్నప్పుడు అవి గొంతులో తట్టుకునే అవకాశం ఉంది.

సబ్జా గింజలను ఒక టీ స్పూన్ సబ్జా గింజలను పిల్లలకు ఇవ్వడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు.

10. సబ్జా గింజలు దుష్ప్రభావాలు ఉంటాయా?

అవును సబ్జా గింజలను ఎక్కువగా తిన్నప్పుడు మన కడుపులో ఉబ్బరం రావచ్చు మన బద్ధక సమస్య తగ్గే బదులు ఎక్కువగా కావచ్చు.

Scroll to Top